Brahmamudi June 4th Episode: రాజ్‌తో కావ్య.. రగిలిపోయిన యామిని, కళావతి హత్యకు కుట్ర.. నగలతో దొరికిన రాహుల్

Photo Courtesy: JioHotstar

కారులో వెళ్తుండగా తనతో రాజ్ ఏం మాట్లాడకపోవడంతో యామిని హర్ట్ అవుతుంది. మనసుకు నచ్చిన వాళ్లతో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని రాజ్ అనుకుంటాడు. ఇద్దరూ కలిసి రిసార్ట్స్‌లో దిగగా వాళ్లకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే చేసి పెడతారు. కొట్టేసిన నగల స్థానంలో డూప్లికేట్‌వి తీసుకొచ్చిన రాహుల్ వాటిని మార్చేందుకు ప్రయత్నించగా కబోర్డ్‌కి లాక్ వేసి ఉంటుంది. ఇంతలో స్వప్న వచ్చి రాహుల్‌పై అనుమానం వ్యక్తం చేస్తుంది.

ఆపై రుద్రాణి వచ్చి ఈ ఇంటికి వారసుడిని చేయాలన్న నా ప్లాన్ నాశనం చేస్తే చంపేస్తానని కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది. రాజ్‌- యామినిలు రూమ్‌లో ఏకాంతంగా ఉండగా అతనిని టెంప్ట్ చేసి లొంగదీసుకోవాలని చూస్తుంది యామిని. దాంతో రాజ్ ఆమెకి దూరం జరిగి మీ పేరెంట్స్ నన్ను నమ్మి పంపించారని మండిపడతాడు. ఇంతలో రిసార్ట్‌లో కావ్యని చూసి కిందకి వెళ్లిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 4వ తేదీ ఎపిసోడ్ 739లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 4th 2025 Episode 739 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యతో ఉన్న రాజ్‌ని చూసి ఆఫీస్ బాయ్ పండు గుర్తుపడతాడు. తన గుట్టు బయటపడకుండా అతనికి డబ్బులు ఇస్తాడు రాజ్. నేను వెళ్లి ఎవరికి చెప్పాలో? ఏం చెప్పాలో అదే చెబుతానని రాజ్‌ని బెదిరిస్తాడు పండు. దాంతో కంగారుపడిన రాజ్.. నేను ఇప్పుడే వచ్చేస్తానని కావ్యతో అంటాడు. రాజ్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని కావ్య కూడా అనుకుంటుంది. రాజ్‌ గురించి యామినికి చెప్పబోతుండగా రాజ్ వచ్చి పండును అడ్డుకుంటాడు. మీరు చేస్తున్న చీటింగ్‌ని మేడమ్‌కి చెప్పేస్తున్నానని అంటాడు. నా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నానని చెప్పాను కదా వాడి దగ్గరకి వెళ్లబోతుండగా మరో రూమ్‌కి వెళ్తే అక్కడెవరో అమ్మాయి ఉందని అంటాడు రాజ్. ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం ఉందని పండు పరిగెత్తుకుంటూ వచ్చేశాడని చెబుతాడు.

పెళ్లి చేసుకునే అమ్మాయిని పక్కన పెట్టుకుని వేరే అమ్మాయితో నేనెందుకు తిరుగుతానని యామిని భుజంపై చేయి వేస్తాడు. దాంతో యామిని సంబరపడిపోతుంది. నేను మా బావ మాయలో ఎప్పుడో పడిపోయానని యామిని చెప్పగా.. మీకు తెలియని రెండో ప్రపంచాన్ని ఈయన దాచిపెట్టాడని పండు అంటాడు. యామిని పూర్తిగా ఈయన మాయలో పడిపోయిందని పండు బాధపడతాడు. యామినిని తీసుకుని పైకి వెళ్తూ పండుకి కన్ను కొడతాడు రాజ్. ఇంతలో కావ్య కనిపించడంతో రాజ్ గురించి నిజం చెప్పాలని అనుకుంటాడు పండు. ఇందాక మీతో ఉన్న అతను వేరే అమ్మాయితో వేరే రూమ్‌లో ఉన్నాడని చెప్పడంతో ఆ విషయం నాకు తెలుసని అంటుంది కావ్య. ఆ మాటలతో పండు షాక్ అవుతాడు. రాజ్ మా శ్రీవారు.. యామిని ఆయనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని కావ్య చెప్పడంతో పండుకి మైండ్ బ్లాక్ అవుతుంది.

గదిలోకి వచ్చిన రాజ్‌ని మరోసారి టెంప్ట్ చేస్తూ లొంగదీసుకోవాలని అనుకుంటుంది యామిని. ఆమె తీరుతో రాజ్ మండిపడతాడు. యామినికి అస్సలు అవకాశం ఇవ్వకూడదని భావించిన కావ్య వెంటనే రాజ్‌కి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన రాజ్.. యామినికి డౌట్ రాకుండా మగాడితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. పక్కన ఎవరైనా ఉన్నారా? అని రాజ్‌ను ప్రశ్నిస్తుంది. చాలా ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నానని రాజ్ చెప్పడంతో మీరు నాతో ఆఫీస్‌కి వస్తానని చెప్పారు కదా మీకోసం వెయిట్ చేస్తున్నానిన అంటుంది కావ్య. మీతో గడుపుదామని అనుకున్నానని.. నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్లిపోతానని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. అలా వెళ్లిపోవద్దని, మన ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చిన వాల్యూ ఇదేనా అంటాడు. నేను 10 లెక్కపెడుతున్నా.. ఆ లోపు మీరు వస్తే ఓకే లేదంటే నేను వెళ్లిపోతానని అంటుంది కావ్య. మా ఫ్రెండ్‌కి సెండాఫ్ ఇచ్చి వచ్చేస్తానని యామినికి చెబుతాడు రాజ్.

కావ్యతో రాజ్‌ లిఫ్ట్‌లో వెళ్తుండగా యామిని చూసి షాక్ అవుతుంది. నన్నే చీట్ చేస్తావా? ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి నాకే అబద్ధం చెబుతావా? అని మండిపడుతుంది. నా ప్లాన్‌నే చెడగొడతావా? నువ్వు చేసిన తప్పుకి భారీ మూల్యం చెల్లించుకుంటావని మనసులో రగిలిపోతుంది యామిని. వెంటనే సుపారీ కిల్లర్‌కి ఫోన్ చేసి కావ్యని చంపమని చెబుతుంది. మా బావని బాధపెట్టుకుండా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కానీ నిన్ను చంపితేనే తప్ప మా పెళ్లి జరిగేలా లేదని అనుకుంటుంది యామిని.

కిచెన్‌లో వంట చేస్తున్న అప్పూని వెనుక నుంచి నడుం గిల్లుతాడు కళ్యాణ్. దాంతో కంగారుపడ్డ అప్పూ వెనక్కి తిరిగేసరికి వేడి వేడి గరిట కళ్యాణ్ చేతికి తగులుతుంది. సమయం ఏదైనా సరసానికి సంసిద్ధంగా ఉండాలని అంటాడు కళ్యాణ్. రాత్రంతా ముచ్చట్లు పెట్టింది చాల్లేదా? వంటింట్లోకి కూడా వచ్చేశావ్ అని మండిపడుతుంది అప్పూ. పెళ్లయి ఏడాది కాకుండానే, పెళ్లాం పక్కనే ఉన్నా సైలెంట్‌గా పడుకున్నాను ఆ ఆకలి మొత్తం తీర్చేసుకోవాలి కదా అంటాడు కళ్యాణ్. ఇంతలో స్వప్న రావడంతో కళ్యాణ్- అప్పూలు కంగారుపడతారు. ఈ బాధలన్నీ ఎందుకు ఎక్కడికైనా హనీమూన్ ప్లాన్ చేసుకుంటే ఎవరి డిస్ట్రబెన్స్ ఉండదని అంటాడు రాహుల్. పెళ్లికి ముందు పారిస్, యూరప్ ట్రిప్ అని పెళ్లికి ముందు నాకు కబుర్లు చెప్పావ్ అదేనా అని సెటైర్లు వేస్తుంది స్వప్న. కాశ్మీర్‌కి వెళితే చాలా బాగుంటుందని కళ్యాణ్‌తో అంటాడు రాహుల్. నాకు అదేం తెలియదని అప్పూ సిగ్గుపడి వెళ్లిపోతుండగా స్వప్న ఆపి మాట్లాడుతుండగా .. భార్య బొడ్డులో ఉన్న తాళాల గుత్తిని కొట్టేస్తాడు రాహుల్.

రాహుల్ కబోర్డ్‌లో గిల్ట్ నగల్ని పెడుతుండగా స్వప్న చూసి షాక్ అవుతుంది. కట్టుకున్న భార్యవి అయ్యుండి సొంత భార్య నగలు కొట్టేయాలని చూస్తావా అని మండిపడతాడు. ఆ మాటలతో తన గిల్ట్ నగల విషయం బయటకు రానందుకు ఊపిరి పీల్చుకుంటాడు రాహుల్. నీ విషయం అందరి ముందు తేలుస్తానని ఆవేశంగా కిందకి వెళ్లి నగల్ని కింద పెడుతుంది. నగల్ని ఎందుకు విసిరి కొట్టావని రుద్రాణి మండిపడుతుంది. మీరు నగల్ని జాగ్రత్త చేయాలనుకుంటే మీ అబ్బాయేమో కొట్టేయాలని అనుకుంటున్నాడని ఫైర్ అవుతుంది స్వప్న. నేను చూడటం ఐదు నిమిషాలు లేట్ అయ్యుంటే ఈపాటికి వీటిని తీసుకెళ్లి అమ్మేసేవాడని చెబుతుంది.

నా కొడుక్కి అంత ఖర్మ పట్టలేదని రుద్రాణి మండిపడుతుంది. ఏం జరిగిందో చెప్పమని రాహుల్‌ని స్వప్న నిలదీస్తుంది. ఇంట్లో వాళ్లంతా కూడా నిలదీయడంతో రుద్రాణి ఫైర్ అవుతుంది. స్వప్న చెప్పింది నిజమేనని అందరి ముందు ఒప్పుకుంటాడు రాహుల్. దొంగే దొంగతనపం ఒప్పుకున్నాడు కాబట్టి ఏం చేస్తారో మీ ఇష్టమని అంటుంది స్వప్న. నీ కొడుకు నీతిమంతుడు, హరిశ్చంద్రుడు అన్నావ్ కదా? ఇప్పుడు చెప్పు అని నిలదీస్తుంది స్వప్న. రాజ్- కావ్యలని ఒక్కటి చేయాలని అనుకుంటున్నామని ఈ సమయంలో రుద్రాణి మనసు బాధపెట్టామంటే అది మనకి చాలా ప్రమాదమని ఇందిరతో అంటుంది అపర్ణ. జీవితంలో మీ అబ్బాయి ఒక్క మంచి పని కూడా చేయలేదని, కోట్లు ఉన్నాయని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని బాధపడుతుంది స్వప్న. ఆఫీస్ నడిపిస్తాడని చేతిలో పెడితే అక్కడ కోట్లు నొక్కేయాలని చూశాడని, అసలు ఏం చేయకుండా ఇంట్లో బుద్ధిగా ఉండమంటే సొంత భార్య నగలే దొంగిలించాలని అనుకున్నాడని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X