Brahmamudi June 4th Episode: మనవరాలిపై అపర్ణలో అనుమానం.. ఇందూ సీఈవో కాకుండా ఐశ్వర్య కుట్ర
Photo Courtesy: JioHotstar
శోభనం గది నుంచి నలిగిన బట్టలు, చెదిరిన జుట్టుతో ఇందూ బయటికి రావడం చూసిన రేఖ షాక్ అవ్వగా.. భ్రమరాంబ సంబరపడిపోతుంది. బాగా ఒళ్లు నొప్పులుగా ఉన్నాయి.. బాడీ మసాజ్ చేయమని రాజ్ చెప్పడంతో శేషం షాక్ అవుతాడు. ఇందూని పక్కకి తీసుకెళ్లిన రేఖ.. శోభనం జరిగిందా? లేదా? అని అడుగుతుంది. మీరిచ్చిన పాలు తాగి వాడు మత్తుగా పడుకున్నాడు.. మాకు శోభనం జరగలేదని చెబుతుంది ఇందూ. ముందు వాడిని ఇంట్లో నుంచి గెంటేయమని అంటుంది.
బెడ్‌రూమ్‌లో రాజ్‌పై ఫైర్ అవుతుంది ఇందూ. మనిద్దరికీ శోభనం జరగకపోయినా జరిగిందని ఓవరాక్షన్ చేస్తున్నావని అంటుంది. అలా చెప్పకపోతే మన సీక్రెట్ బయటపడుతుంది. అలాగే నేను పెళ్లి కావాల్సిన కుర్రోడిని, ఓవరాక్షన్ చేయకపోతే నాకే మేటర్ లేదని అనుకుంటారని అంటాడు రాజ్. నాకు కనుక అమౌంట్ కట్ చేస్తే మనిద్దరికీ పెళ్లి జరగలేదని.. నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావో మొత్తం చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు రాజ్. దాంతో ఇందూ సైలెంట్ అయిపోతుంది. తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలుసుకున్న రాజ్ పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు. వెంకీకి క్లాస్ పీకి చిన్న చిన్న ఇబ్బందులను చూసి ప్రాణాలను తీసుకోవద్దని మండిపడతాడు. అయినా నువ్వు కూడా బిజినెస్ కాకుండా నేను చూసిన ఉద్యోగం చేయమని చెబుతాడు చలపతి. ఒకరి కింద నేను పనిచేయను.. మిమ్మల్ని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 4వ తేదీ ఎపిసోడ్ 1050లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నువ్వు ఇదివరకటిలా మా పనులు చేయడం లేదని ఇందూపై మండిపడుతుంది ఐశ్వర్య. నేనేం తప్పు చేశాను, అన్నీ నెగిటివ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నావని నిలదీస్తుంది ఇందూ. ఈ మధ్యన నీ మాట తీరు, నీ పనితనం, నీ ప్రవర్తన అన్నీ తేడాగా కనిపిస్తున్నాయి. నీ మొగుడిని చూసి రెచ్చిపోతున్నావా? వాడు ఎందుకు పనికిరాని ఇడియట్, వాడిని నమ్ముకుని తల ఎగరేద్దామని అనుకుంటున్నావా అని మండిపడుతుంది ఐశ్వర్య. రాజ్‌ని అలా పిలవొద్దని వార్నింగ్ ఇస్తుంది ఇందూ.
వాడిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను అన్నావు కదా? వాడు వీడు అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు అని ప్రశ్నిస్తుంది ఐశ్వర్య. నువ్వు నా బెడ్ మీద పడుకున్నంత మాత్రాన ఈ ఇంటికి మహారాణివి కాదని అంటుంది. నేను పనిమనిషినే, కానీ స్టేటస్ ఏంటీ? ఖాళీ స్టేటస్ అని నిలదీస్తుంది ఇందూ. అప్పులు చేసి విచ్చలవిడిగా తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని మండిపడుతుంది ఇందూ. ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోమని, ప్రతిసారి ఇలా నీతులే కాదు అర్ధమయ్యేలా బుద్ధి కూడా చెబుతానని వార్నింగ్ ఇస్తుంది.
తన తల్లి జాడ కనుక్కోవడానికి వచ్చిన లక్కీకి ఆంటోనీ నిద్రపోతూ కనిపించడంతో మండిపడతాడు. ఇంతలో అక్కడున్న ఫోటోను చూడబోతుండగా ఆంటోనీ ఉలిక్కిపడి దానిని లాక్కుంటాడు. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నాకు మా అమ్మ కావాలి, తన ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు, నాకు ఊహా తెలిసిన రోజు నుంచి మా అమ్మ కోసమే ఎదురుచూస్తున్నానని అంటాడు లక్కీ. నువ్వెళ్లి ఉప్మా పెసరట్టు తీసుకురా.. నేను వెళ్లి స్నానం చేస్తానని చెబుతాడు ఆంటోనీ. అయితే ఆ ఫోటోని ఎందుకు లాక్కున్నాడు? ఈ ఫోటోలో ఎవరున్నారు? అని ఆలోచిస్తుంటాడు లక్కీ. నీ కొడుక్కి నీ ఫోటోనే కాదు.. నీ ఆనవాలు కూడా తెలియనివ్వనని అనుకుంటాడు ఆంటోనీ.
పూజ చేసి తాతయ్య, నానమ్మలకి హారతి ఇస్తుంది ఇందూ. మేం చాలా సంతోషంగా ఉన్నాం.. ఒకప్పుడు ఇదే ఇంట్లో ఇంటరిగా ఎన్నో బాధలు పడ్డాం. ఇప్పుడు నీకు పెళ్లయ్యింది, నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు, నీకు కొత్త జీవితం మొదలైందని అంటుంది అపర్ణ. రాజు రూపంలోనే కాదు, గుణంలోనూ అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు. మీ పెళ్లి ఎలా జరిగిందో ఏంటో మాకు తెలియదు కానీ, రాజు ఈ ఇంట్లో అడుగుపెట్టాక ధైర్యం వచ్చింది. మమ్మల్ని మీ నాన్న ఎంత ప్రేమగా చూసుకునేవాడో, తను కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడని అంటాడు సుభాష్. నాకు తెలిసి నువ్వంటే నిజంగానే ప్రాణం. అసలు మనకళ్లలో నీరు చూస్తుంటే తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని అంటాడు సుభాష్.
నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అపర్ణ అడగ్గా.. నాకు నిజంగానే పెళ్లయ్యిందని, మేం సంతోషంగా ఉండాలని ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. కానీ మా పెళ్లి అబద్ధమని అనుకుంటుంది ఇందూ. నేను ఇందూ జీవితంలోకి వచ్చాక సంతోషం కాక ఇంకేం ఉంటుంది, తను చాలా హ్యాపీగా ఉందని చెబుతాడు రాజ్. ఈరోజు నేను సీఈవోని కాబోతున్నాను.. కంపెనీకి, ఇంటికి పట్టిన దరిద్య్రాన్ని దులిపేస్తా. ఇదే కోటలో తనని మహారాణిలా చూసుకుంటానని చెబుతాడు రాజ్. ఆ మాటలతో సుభాష్, అపర్ణలు సంతోషిస్తారు. నువ్వు ఇందూ జీవితంలోకి వచ్చి చాలా మంచి చేశావు, ఈ ఇంటిని, నా కంపెనీని నా మనవడు చూసుకోవాలి. ఇప్పుడు వాడి స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తున్నావు.. మన మధ్య ఏదో రక్త సంబంధం ఉందని అనిపిస్తుందని అంటుంది అపర్ణ. నువ్వు ఎప్పుడూ ఇందూకి అండగా ఉంటావా అని అడుగుతుంది. వీళ్లతో మనం అస్సలు కనెక్ట్ అవ్వకూడదని అనుకుంటాడు రాజ్.
సీఈవో పోస్ట్ గురించి రేఖను నిలదీస్తుంది భ్రమరాంబ. కానీ ఆ రాజ్ గాడు తనే సీఈవో అవుతానని నీకంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆ రాజు గాడు సీఈవో అయితే కొంపలు అంటుకుంటాయని భయపడుతుంది భ్రమరాంబ. వాడు కనుక సీఈవో అయితే మన నెత్తి మీదకెక్కి డ్యాన్స్ చేస్తాడని అంటుంది. అన్ని లెక్కలు కరెక్ట్‌గా వేసుకున్నాను కాబట్టే రాజుగాడు సీఈవో కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అంటుంది రేఖ. మన కంపెనీలో ఐదుగురు బోర్డ్ మెంబర్స్‌లో ఇద్దరు నాకు పక్కగా సపోర్ట్ చేస్తారు.. ఇంకో ఇద్దరు నాకు సపోర్ట్ చేయరు. పరంధామయ్య అనే బోర్డ్ మెంబర్ మాత్రం ఆ రాజ్ గాడికే సపోర్ట్ చేస్తాడు. అందుకే చివరి నిమిషంలో ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను.. నేను ఇప్పుడు ఆఫీస్‌లో జరగబోయే బోర్డ్ మీటింగ్‌కి ఇందూని తీసుకెళ్తాను. ఆ రాజ్ గాడు సీఈవో అవ్వకుండా చేసేది ఇందూనే అంటుంది రేఖ. ఇందూనే సీఈవోగా కూర్చోబెట్టబోతున్నానని చెబుతుంది.
వేలిముద్రలు వేసే దానిని తీసుకెళ్లి సీఈవోని చేస్తానంటున్నావు.. అసలు దానికేం తెలుసని భూషణ్ అడగ్గా.. దానికేం తెలియదు, దాని వల్లే నేను సీఈవో అవుతానని చెబుతుంది రేఖ. ఇందూ నాకు సపోర్ట్ చేస్తుందని పరంధామయ్యకి తెలిస్తే.. తను కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. అప్పుడు నేను సీఈవో అవుతానని అంటుంది రేఖ. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా అని భ్రమరాంబ ప్రశ్నిస్తుంది. ఈ మాటలు విన్న ఐశ్వర్య.. ఇందూని సీఈవో కాకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేసి ఇద్దరు రౌడీలను మాట్లాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications