Brahmamudi June 5th Episode: కావ్యని వెంటాడుతోన్న మృత్యువు.. రాజ్ సాహసం, కోడలి కోసం అపర్ణ కన్నీరు
Photo Courtesy: JioHotstar
గదిలో ఏకాంతంగా రాజ్- కావ్యలను చూసిన సర్వర్ పండు షాక్ అవుతాడు. పండుకి డబ్బులిచ్చిన రాజ్ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని అంటాడు. అయితే యామినిని వెతుక్కుంటూ వచ్చిన పండు నిజం చెప్పబోతుండగా రాజ్ అడ్డుపడతాడు. మా బావ గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మనని రాజ్‌తో కలిసి యామిని గదిలోకి వెళ్తుంది. రాజ్‌ను మరోసారి టెంప్ట్ చేసి లోబరచుకునేందుకు ప్రయత్నిస్తుండగా కావ్య ఫోన్ చేస్తుంది. దాంతో యామిని నుంచి తప్పించుకుని కిందకి వచ్చేస్తాడు రాజ్.
రాజ్ కోసం వెతుకుతూ వచ్చిన యామినికి కావ్య పక్కన తన బావ కనిపించడంతో రగిలిపోతుంది. మాటలతో చెబితే కావ్య వినిపించుకునేలా లేదని ఆమెను చంపేయమని కిల్లర్‌కి ఫోన్ చేస్తుంది యామిని. నువ్వు గన్నులు, యాక్సిడెంట్ కాకుండా ఈసారి నేను చెప్పినట్లు చేయమని అతడితో చెబుతుంది. మరోవైపు స్వప్న బొడ్డులో ఉన్న తాళాలను కొట్టేసిన రాహుల్ డూప్లికేట్ నగల్ని మారుస్తుండగా స్వప్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. రాహుల్ ఇంత దిగజారిపోతాడని అనుకోలేదని దుగ్గిరాల ఫ్యామిలీతో చెబుతుంది. అయితే రాహుల్‌కు ఏం శిక్ష వేస్తావో అది నీ ఇష్టమని అంటుంది ఇందిర. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 5వ తేదీ ఎపిసోడ్ 740లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాహుల్ తప్పు చేశాడు కానీ ఇప్పుడు గొడవ చేసి ప్రయోజనం లేదు కదా అని అంటుంది ఇందిర. అయితే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా అని స్వప్న అంటుంది. శిక్ష పడాల్సిందే.. కానీ ఏ శిక్ష వేయాలో భార్యగా నువ్వే డిసైడ్ చేయమంటుంది ఇందిర. ఈ విషయాన్ని నలుగురిలో పెట్టి ఇంటి పరువు తీసుకోవడం వల్ల నష్టమే తప్ప, నీ సమస్యకు పరిష్కారం ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంది పెద్దావిడ. కొడుకు తప్పుచేస్తే సరిదిద్దడం తల్లి బాధ్యత, ఆ విషయంలో రుద్రాణి ఫెయిల్ అయ్యిందని భార్యగా ఆ బాధ్యత నువ్వు తీసుకోమని చెబుతుంది ఇందిర. వాడి తప్పు వాడు తెలుసుకుని తిరిగి సరైన దారిలో నడిచేలా నువ్వు చేయమంటుంది. ఈ విషయంలో మా అందరి సపోర్ట్ నీకుంటుందని చెబుతుంది ఇందిర. రాహుల్‌ని మార్చడానికి నువ్వేం చేస్తావో చేయ్, దానికి రుద్రాణి అడ్డుపడినా మేం ఒప్పుకోమని అంటుంది.
ఆ మాటలతో స్వప్న ఆలోచనలో పడుతుంది. తర్వాత నగలన్నీ స్వప్నకి ఇచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకోమంటుంది అపర్ణ. వీళ్లంతా కలిసి ఆ గిల్ట్ నగల్నీ ఎక్కడ కనిపెట్టేస్తారోనని కంగారుపడ్డా? ఈ విషయం బయటికి వచ్చుంటే నా స్వీటీ విషయం కూడా బయటికి వచ్చేదని టెన్షన్ పడతాడు రాహుల్. అప్పుడు అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసే వాళ్లని ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత కొడుకుని బయటికి తీసుకెళ్లి లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి. నిన్ను రాజును చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు బంటుగానే మిగిలిపోతున్నావని మండిపడుతుంది.
పెళ్లాం నగల్ని దొంగిలించాలన్న దరిద్రపు గొట్టు ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నిస్తుంది. ఇకపై స్వప్న నిన్ను పెంపుడు కుక్కలా ఆడిస్తుందని, తను ఏం చేసినా నేను కూడా చూస్తుండాల్సిందేనని అంటుంది రుద్రాణి. దానికి అంత సీన్ లేదని, నువ్వేం టెన్షన్ పడొద్దని అంటాడు రాహుల్. అసలు ఇంట్లోవాళ్లకి దొరికిపోయాడన్న బాధ కొంచెం కూడా లేదేంటీ అని నిలదీస్తుంది రుద్రాణి. ఆ రాజ్ స్థానంలో నిన్ను కూర్చోపెట్టే వరకు ఇలాంటి పనికిరాని పనులు చేయొద్దని బతిమలాడుతుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే స్వప్న కంటే ముందు నేనే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.
కావ్య రాజ్ కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీ వెనుక తిరగడం వల్ల నా వాల్యూ తెలియడం లేదని, నాక్కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెబుతాడు రాజ్. మరి ఆ ఫ్యాన్స్‌తో తిరగకుండా నా వెనుక ఎందుకు వస్తున్నారని నిలదీస్తుంది కావ్య. ఇద్దరూ రోడ్డు పక్కన టీ తాగేందుకు దిగుతారు. ఇంతలో యామిని ఏర్పాటు చేసిన సుపారీ కిల్లర్ తన మనుషుల్ని తీసుకుని అదే ప్లేస్‌కి వస్తాడు. మనం ఆమెను కామెంట్ చేసి కావాలని రెచ్చగొట్టి వాళ్లతో గొడవ పెట్టుకోవాలని తన మనుషులకు చెబుతాడు కిల్లర్. ఆ అమ్మాయిని ఇక్కడే ఫినిష్ చేయాలని, రాజ్‌కు ఏ అనుమానం రాకూడదని అంటాడు.
ఇంటికి దూరంగా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ప్రకృతికి దూరంగా ప్రశాంతంగా టీ తాగితే ఆ ఆనందమే వేరని అంటాడు రాజ్. ప్రతి ఒక్కరూ ప్రకృతికి దగ్గరగా ఉండాలని ఆశపడతారని, వ్యవసాయం చేయమంటే మాత్రం పారిపోయి సిటీలో ఊడిగం చేస్తారని సెటైర్లు వేస్తుంది కావ్య. మీరు డైరెక్ట్‌గా నా మీద సెటైర్ వేసినా ఈ నిజాన్ని ఒప్పుకోకతప్పదని అంటాడు రాజ్. ఇంతలో కిల్లర్ టీ తీసుకుని టీ అమ్మే వ్యక్తి మీద విసిరి కొడతాడు. పాలు పెట్టావా? నీళ్లు పోశావా? టీ పెట్టడం కూడా చేత కాదా అని మండిపడతాడు. టీ బాలేదంటే బాలేదని చెప్పాలి? అంతేకానీ ముఖం మీద కొడతాడా? అని రాజ్ కోప్పడగా కావ్య కూల్ చేస్తుంది.
నువ్వు వాడి ముఖాన టీ కొట్టగానే.. సార్‌కి కోపం వచ్చిందని, మనల్ని కొడతాడేమోనని భయం వేస్తుందంటూ కిల్లర్ మనుషులు కామెంట్ చేస్తారు. మనం నలుగురం ఉన్నాం.. వాడొక్కడే ఉన్నాడు, ఆడపిల్ల ముందు దెబ్బలు తింటే బాగొదు అంటారు. కావ్య రాజ్‌ని కూల్ చేసి డబ్బులు ఇవ్వబోతుండగా మేడం చూస్తే కత్తిలా ఉందని, ఇలాంటి పిరికివాడికి ఎలా పడిందని కామెంట్ చేస్తారు. వీడు ఇక్కడ మాత్రమే సైలెంట్‌గా ఉంటాడా? ఇంట్లో కూడా సైలెంట్‌గా ఉంటాడా? ఏదైనా సాయం కావాలంటే చెప్పండి మేడం మా అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడని అంటారు. ఆ మాటలతో రాజ్ కోపంగా వెళ్లి కిల్లర్‌ని కొడతాడు. తమ ప్లాన్ వర్కవుట్ అయినట్లు కిల్లర్ సంతోషపడి రాజ్ కారును ఫాలో చేస్తాడు.
నాకు గొడవలంటే చాలా భయమని కారు ఫాస్ట్‌గా పోనివ్వమని అంటుంది కావ్య. ఇంతలో కారు ఆగిపోవడంతో రాజ్- కావ్యలు అడవిలోకి పరిగెడతారు. వాళ్లిద్దరిని ఫాలో చేస్తూ కిల్లర్ మనుషులు వెంటాడతారు. మనమేం తప్పు చేశాం, వాళ్లని చూసి ఎందుకు పారిపోవాలని అడుగుతాడు రాజ్. మీరు ఒక్కరు ఉన్నారు, అంతమందిని అలా హ్యాండిల్ చేయలేరని అంటుంది కావ్య. మీరున్న పరిస్ధితుల్లో వాళ్లతో గొడవ పడటం ప్రమాదమని అంటుంది కావ్య. నాకేం జరిగిందని రాజ్ అడగ్గా.. యాక్సిడెంట్, లోయ అని చెప్పబోతూ ఆగిపోతుంది కావ్య. అపర్ణకి ఫోన్ చేసి మేం అడవిలో ఇరుక్కుపోయామని చెబుతుంది. కానీ సిగ్నల్ లేకపోవడంతో ఆమె ఏం చెబుతుందో అపర్ణకి వినిపించదు.
రాజ్- కావ్యలను తరుముకుంటూ కిల్లర్ మనుషులు వచ్చేస్తారు. రిసార్ట్ దగ్గర గొడవ జరిగిందని వాళ్లని తప్పించుకుంటూ అడవిలోకి వచ్చేశామని, మా కారు కూడా పాడైపోయిందని అపర్ణకి చెబుతుంది కావ్య. ఆ మాటలతో అపర్ణ- ఇందిరలు టెన్షన్ పడుతూ అప్పూ దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పగా నేను వాళ్లని సేఫ్‌గా తీసుకుని వస్తానని అంటుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











