Brahmamudi June 5th Episode: ఇందూని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య.. కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా వెంకీ

Photo Courtesy: JioHotstar

నీకు పెళ్లయి మొగుడు రాగానే కళ్లు నెత్తికెక్కాయి ఏ పని చేయడం లేదని ఇందూపై గొడవ పడుతుంది ఐశ్వర్య. నేను నీలాగా ఖాళీగా కూర్చొని జులాయిగా తిరగడం లేదని కౌంటర్ ఇస్తుంది ఇందూ. ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకుని నానమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్తుంది ఇందూ. ఇప్పుడు నీ జీవితం ఓ దారిలోకి వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది, రాజ్ నీకు తోడుగా ఉన్నాడని అంటుంది అపర్ణ. మీ నాన్న ఎంత బాగా చూసుకునేవాడో రాజు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటున్నాడని సుభాష్ చెబుతాడు. ఇంతలో రాజ్ వచ్చి ఇందూకి నేను అండగా ఉంటాను, మీరేం బాధపడొద్దని ధైర్యం చెబుతాడు.

ఆ రాజ్ గాడు సీఈవో అవ్వడానికి అన్ని రకాల ప్లాన్లు వేస్తున్నాడని రేఖతో అంటుంది భ్రమరాంబ. వాడేం చేసినా నా ప్లాన్లు నాకున్నాయి.. రేపు బోర్డ్ మీటింగ్‌కి ఇందూని తీసుకెళ్లబోతున్నాను, తననే సీఈవోని చేయబోతున్నానని రేఖ చెబుతుంది. ఆ మాటలు విన్న ఐశ్వర్య.. ఇందూ సీఈవో అయితే దాని ఓవరాక్షన్ తట్టుకోలేం, నా నెత్తిమీదకెక్కి ఆడుకుంటుందని రగిలిపోతుంది. వెంటనే ఇద్దరు రౌడీలకు ఫోన్ చేసి రెడీగా ఉండమని చెబుతుంది. ఆంటోనీ తన తల్లిని ఎంతకూ వెతక్కపోవడంతో కోపంగా ఇంటికొస్తాడు లక్కీ. వచ్చి చూసేసరికి ఆంటోనీ నిద్రపోతుండగా.. అతని జేబులో ఒక ఫోటో కనిపిస్తుంది. దాని చూస్తుండగా ఆంటోనీ నిద్రలేచి వెంటనే ఫోటో లాగేసుకుంటాడు. ఇది వాడి చేతిలో పడితే నా ఫుడ్, బెడ్ కట్ అని భయపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 5వ తేదీ ఎపిసోడ్ 1051లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 5th 2026 Episode 1051 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూని ఆఫీస్‌కి వెళ్లకుండా చేయడానికి ఐశ్వర్య కుట్ర చేస్తుంది. ప్లాన్‌లో భాగంగా ఇందూని పిలిచి.. నా లైఫ్ పెద్ద ప్రమాదంలో పడింది, నువ్వే సేవ్ చేయాలని అంటుంది. ఇందాక నీ మీద చిరాకులో అరిచేశానని చెబుతుంది. నీ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేయలేనని అంటుంది. నా ఫ్రెండ్ రాకేష్ గాడికి డబ్బులు ఇవ్వకపోతే నా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి .. ఇందూ మోసగత్తె, హనీట్రాపర్, డబ్బులు తీసుకుని మగాళ్లని మోసం చేస్తుందని పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని చెబుతుంది ఐశ్వర్య. ఇప్పుడు వాడు కనుక అన్నంత పని చేస్తే.. నా పరువు, మన దుగ్గిరాల ఇంటి పరువు మూసి నదీలో కలిసిపోతుంది. అదే కనుక జరిగితే నేను బతకనని చెబుతుంది ఐశ్వర్య.

అలాంటి పిచ్చి పనులు చేయొద్దు, వాడికి ఒకసారి ఫోన్ చేస్తే నేను మాట్లాడతానని అంటుంది ఇందూ. ఆ మాటలతో షాకైన ఐశ్వర్య.. వాడు నా ఫోన్ కట్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకుని ఒక ప్లేస్‌కి రమ్మన్నాడు, నాతో పాటు నువ్వు కూడా రమ్మని చెబుతుంది. నేను బోర్డ్ మీటింగ్‌కి వెళ్లాలి, మీటింగ్ అవ్వగానే వాడిని కలుస్తానని నేనే చెబుతా, నెంబర్ ఇవ్వమని అడగ్గా ఐశ్వర్య తడబడుతుంది. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తున్నానని చెబితే ఆ కోపంలో నా ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టేస్తాడని అబద్ధం చెబుతుంది. త్వరగా వెళ్లి వచ్చేద్దామని బతిమలాడుతుంది. దాంతో ఇందూ రావడానికి ఒప్పుకుంటుంది. అయితే రాజ్‌కి చెప్పి వస్తానని ఇందూ అనగా.. వాడొక వేస్ట్ గాడు, వాడు అందరికీ చెప్పి నా పరువు తీసేస్తాడని మండిపడుతుంది. మాయమాటలు చెప్పి ఇందూని లాక్కెళ్తుంది ఐశ్వర్య.

రేఖ ఆఫీస్‌కి వెళ్తుండగా హారతి ఇచ్చి నువ్వే ఆ ఛైర్‌లో కూర్చోవాలని చెబుతుంది భ్రమరాంబ. ఇంతలో రాజ్ వచ్చి నేను లాక్కుంటానని అంటాడు. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా మా రేఖే సీఈవో అని చెబుతుంది భ్రమరాంబ. కన్నింగ్ నేనే, డీసెంట్ నేనే.. నన్ను తట్టుకుని నిలబడే దమ్ము ఎవరికి ఉందని అంటాడు రాజ్. మా రేఖ పిన్ని ముఖ చిత్రం ఎలా ఉందో చెప్పమని శేషంను అడుగుతాడు రాజ్. మా రేఖ తనే సీఈవో అవుతుందని చాలా నమ్మకంగా ఉందని అంటాడు శేషం. ఆ మాటలతో రాజ్ నవ్వేస్తాడు. మా రేఖ పిన్నికి నా కామెడీ వెర్షన్ నచ్చలేదు.. మరి నా సీరియస్ వెర్షన్ చూపించమంటావా అని అడుగుతాడు.

ఎవరు ఏంటీ అనేది ఆఫీసులో తేల్చుకుందాం.. ముందు ఇందూ ఎక్కడ అని అడుగుతుంది రేఖ. నాకు తెలియదని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నీ పెళ్లాం ఎక్కడుందో నీకు తెలియదా అని అడగ్గా.. నా పెళ్లామా ఎవత్తది అని రాజ్ అనడంతో అపర్ణ రగిలిపోతుంది. అక్క హాల్‌లోకి రాలేదు నేను ఇందాకటి నుంచి హాల్‌లోనే ఉన్నానని అంటుంది స్వాతి. ఇందూ లేకపోతే నేను సీఈవో అవ్వడం కుదరదని టెన్షన్ పడుతుంది రేఖ. నన్ను ఎదిరించడం చేతకాక ఇలాంటి నాటకాలు ఆడుతున్నావా? ఇందూని నువ్వే కిడ్నాప్ చేసుంటావు అని మండిపడుతుంది రేఖ.

అప్పుడు డబ్బు కోసం కిడ్నాప్ చేశాను.. ప్రతిసారి కిడ్నాప్ చేస్తానా? ఇందూకి ఫోన్ చేయడంతో బయట చిన్న పని ఉండి వెళ్తున్నానని అంటుంది ఇందూ. ఆఫీస్‌లో బోర్డ్ మీటింగ్ ఉంది కదా.. ఇప్పుడు పని ఉంది వెళ్తున్నానని అంటున్నావని మండిపడతాడు రాజ్. నీ మొగుడు సీఈవో అవుతుంటే నువ్వు పక్కన ఉండాలి కదా అంటాడు రాజ్. బోర్డ్ మీటింగ్‌ మొదలవ్వడానికి ముందే వచ్చేస్తానని చెబుతుంది ఇందూ. నన్ను దొంగని, కిడ్నాపర్‌ని అన్నావు కదా ఇప్పుడేం మాట్లాడవు అంటూ రేఖపై మండిపడతాడు రాజ్. నువ్వు సీఈవోగానే తిరిగి రావాలని కోరుకుంటున్నానని అంటాడు సుభాష్. నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను, ఈరోజు సాయంత్రం వరకు లాక్ చేస్తున్నానని మనసులో అనుకుంటుంది ఐశ్వర్య.

నా జీవితంలో ఉన్న కష్టాలు, బాధలతో పోలిస్తే నీకున్న బాధలు, కష్టాలు వన్ పర్సెంట్ కూడా ఉండవు. మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకోవచ్చు.. మనం వాటిని నిజం చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఆశలు తీర్చలేకపోయామని డిప్రెషన్‌లోకి వెళ్లకూడడు, నీకు అమ్మానాన్న ఉన్నారు. నేను వాళ్లకి భారంగా ఉన్నాను.. కళ్లలో నీళ్లు ఆగడం లేదని నందూని పట్టుకుని వెంకీ ఏడుస్తాడు. గడ్డు పరిస్ధితుల్ని ఎదుర్కొనే సామర్ధ్యం నా దగ్గర లేదనిపిస్తోంది. ఏ కంపెనీకి వెళ్లినా సరే నీకు ఏఐ టెక్నాలజీ మీద పట్టుందా అని అడుగుతున్నారు. నేను చదువుకునే రోజుల్లో ఆ టెక్నాలజీ లేదు. ఏదో ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయి ఆ టెక్నాలజీ నేర్చుకోమని చెబుతుంది. కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వడానికి, ఇంట్లో వాళ్లకి సాయం చేయడానికి డబ్బులు కావాలని చెబుతాడు వెంకీ. డే టైం ఏదో ఒక పనిచేయి.. నైట్ టైం కోచింగ్ తీసుకోమని చెబుతుంది నందూ. అయితే డెలివరీ బాయ్‌గా జాయిన్ అవ్వమని సలహా ఇస్తుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X