Brahmamudi June 6th Episode: మత్తులో కావ్యతో ఏకాంతంగా రాజ్.. కిల్లర్‌కి కొత్త ఐడియా ఇచ్చిన యామిని

Photo Courtesy: JioHotstar

నగలు దొంగతనం చేసిన రాహుల్‌కు ఏ శిక్ష వేసినా మేమంతా నీకు అండగా ఉంటామని స్వప్నతో ఇందిర అంటుంది. తన డూప్లికేట్ బంగారం గురించి బయటకు రాకపోవడంతో రాహుల్ ఊపిరి పీల్చుకుంటాడు. కొడుకుని బయటికి తీసుకెళ్లిన రుద్రాణి లాగిపెట్టి కొడుతుంది. నిన్ను ఆ రాజ్యానికి రాజుని చేద్దామనుకుంటుంటే నువ్వు భటుడిలా మారిపోతున్నావని మండిపడుతుంది. కావ్య-రాజ్‌లు కారులో వెళ్తూ టీ తాగేందుకు ఓ దుకాణం ముందుకు వచ్చి ఆగి టీ తాగుతుంటారు.

ఇంతలో యామిని ఏర్పాటు చేసిన కిల్లర్ తన మనుషులతో కలిసి ఆ ప్లేస్‌కి వస్తారు. కావ్యని అసభ్యంగా కామెంట్ చేసి గొడవ పెట్టుకోవాలని, ఈ గొడవలో ఆమెను చంపేయాలని ముందే ప్లాన్ చేస్తారు. పథకం ప్రకారం కావ్యని టీజ్ చేయడంతో రాజ్ వాళ్లతో గొడవ పడతాడు. అతనికి నచ్చజెప్పి పక్కకి తీసుకెళ్తుంది కావ్య. తమ ప్లాన్ సక్సెస్ అవ్వడంతో రాజ్‌‌ కారును వెంటాడతారు. కారు ఆగిపోవడంతో రాజ్- కావ్యలు అడవిలో ఇరుక్కుపోతారు. ఈ విషయాన్ని అపర్ణకి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె కంగారుగా అప్పూకి తెలియజేయడంతో ఆమె ఫారెస్ట్‌కి బయల్దేరుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 6వ తేదీ ఎపిసోడ్ 741లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 6th 2025 Episode 741 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రౌడీల బారి నుంచి తప్పించుకోవడానికి అడవిలో తిరుగుతుంటారు రాజ్- కావ్య. వారిని యామిని మనుషులు వెంబడిస్తూనే ఉంటారు. అక్కాబావల ఆచూకీ తెలుసుకోవడానికి అప్పూ తన సిబ్బందితో కలిసి అడవికి వస్తుంది. బయటికి వెళ్లే దారి ఎలాగొలా కనుక్కోవచ్చు కదా అని రాజ్‌తో అంటుంది కావ్య. బయటికి వెళ్లడం చాలా సింపుల్‌ అని స్ట్రైట్‌గా వెళ్లిపోవడమే అని సెటైర్లు వేస్తాడు రాజ్. ఇంతలో తొండని చూసి రాజ్ భయపడిపోవడంతో కావ్య నవ్వుకుంటుంది. నాది భయానికి మీనింగే తెలియని బ్లడ్డ్ అని అంటాడు రాజ్. నా ధైర్యాన్ని టెస్ట్ చేయడానికి నా ఫ్రెండ్స్ నాతో పందెం కట్టారని .. అర్ధరాత్రి 12 గంటలకి స్మశానానికి వెళ్లి బిర్యానీ తిని రావాలని చెప్పారని అంటాడు. చివరికి మా ఫ్రెండ్సే వద్దు అన్నారని చెబుతాడు.

ఇక తిరగడం నా వల్ల కాదని అంటుంది కావ్య. మనం అటు ఇటూ తిరిగే కంటే ఇక్కడే ఉండిపోతే బెటరని చెబుతాడు రాజ్. ఆ సిటీలో పొల్యూషన్‌లో ఉండేకంటే ఇలా ప్రకృతి మధ్యలో బతకడం మంచిదని అంటాడు. ఆ సీతారాముల్లాగా మనం కూడా ఓ గుడిసె వేసుకుని సెటిలైపోదామని చెబుతాడు. కావ్య ఓ చోట కూర్చొని దాహంగా ఉందని మంచినీళ్లు కావాలని అడుగుతుంది. ఈ అడవిలో ఏది ఎక్కడుందో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అని అంటాడు. ఓ అమ్మాయికి దాహంగా ఉందంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేరా? అని మండిపడుతుంది కావ్య. రాజ్ మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తూ భయం వేసి కావ్యను తోడు రమ్మంటాడు. నీళ్లు తీసుకొచ్చి కావ్య నోట్లో పోయడంతో ఆమె ఎమోషనల్ అవుతుంది.

ఇంతలో రాజ్-కావ్యలు రౌడీలకు కనిపించడంతో వారిని వెంబడిస్తారు. దీంతో రాయి విసిరి వాళ్లని డైవర్ట్ చేస్తాడు రాజ్. నేను పెట్టిన లొకేషన్ అప్పూకి చేరిందో లేదోనని కావ్య టెన్షన్ పడుతుంది. ఈసారి రౌడీలు ఎదురుపడితే నన్ను ఆపొద్దని కావ్యతో అంటాడు రాజ్. మీరు వాళ్లతో గొడవ పడితే ప్రమాదమని తెలిసే ఇటు వైపు తీసుకొచ్చానని చెబుతుంది కావ్య. సమస్యలు వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కానీ భయపడి పారిపోకూడదని అంటాడు రాజ్. తెగింపు అన్ని సార్లు పనికిరాదని, కొన్నిసార్లు తగ్గాలని చెబుతుంది. అయినా మీరెప్పుడూ ఇలా భయపడటం చూడలేదని మీకేం జరిగిందని అంటాడు రాజ్. గతంలో జరిగినట్లు మీకెమైనా జరిగితే నేను తట్టుకోలేనని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

గతంలో నాకేం జరిగిందని కావ్యని నిలదీస్తాడు. మీరు యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్లారు కదా అని చెబుతుంది కళావతి. మీ అమ్మాయిలు ఒకేసారి కోపం, ఒకేసారి కేరింగ్ చూపిస్తారని అస్సలు అర్ధం కారని అంటాడు రాజ్. వాళ్లిద్దరి కోసం వెతుకుతుండగా కిల్లర్‌కు యామిని ఫోన్ చేస్తుంది. కావ్యని ఫినిష్ చేశావా? లేదా? అని మండిపడుతుంది. మనం అనుకున్నట్లు ఇక్కడ ఏం జరగలేదని.. రాజ్‌తో గొడవ పెట్టుకున్నామని, కానీ కావ్య సార్‌ని తీసుకుని వెళ్లిపోయిందని చెబుతాడు కిల్లర్. కారు చేజ్ చేసుకుంటూ వచ్చామని వాళ్లు అడవిలోకి పారిపోయారని వాళ్లని వెతుకుతూ వెళ్తున్నామని అంటాడు. ఆ కావ్య ప్రాణాలతో ఆ అడవిని దాటితే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవని యామిని వార్నింగ్ ఇస్తుంది. మనం అనుకున్నట్లుగానే జరుగుతుందని.. ఈ అడవి నాకు బాగా తెలుసని, కానీ ఈ అడవిలో ఎటు వెళ్తే ఎటు వస్తామో వాళ్లకి తెలియదని అంటాడు కిల్లర్. చీకటి పడేలా ఉందని, ఎక్కువసేపు దాక్కోలేరని చెబుతాడు. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటానని పని అవ్వగానే ఫోన్ చేయమని చెబుతుంది యామిని.

చీకటి పడటంతో దారి వెతుక్కుంటూ వెళ్తారు రాజ్- కావ్య. ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందని, ఎప్పుడు స్విచ్చాఫ్ అయిపోతుందో తెలియదని అంటాడు రాజ్. అయితే సినిమాల్లో చూపించినట్లు కాగడా వెలిగించమని అంటుంది కావ్య. ఇప్పటికిప్పుడు అడవిలో అగ్గిపెట్టే దొరకదని రాజ్ సెటైర్లు వేస్తాడు. నాకు ఆకలిగా ఉందని చెప్పడంతో ఫుడ్ కోసం రాజ్ ఎక్కడికో వెళ్లిపోవడంతో కావ్య ఒంటరిగా ఉండిపోయి భయపడుతుంది. నాకు భయంగా ఉందని, మర్యాదగా బయటికి రమ్మని కేకలు పెడుతుంది. ఇంతలో అప్పూకి రాజ్ కారు కనిపించడంతో వారిని వెతుక్కుంటూ వెళ్తుంది. మనం నలుగురం ఉన్నామని, ఇంకొంచెం బ్యాకప్ కావాలని అప్పూని అడుగుతాడు కానిస్టేబుల్. ఆ పని నేనెప్పుడో చేశానని, కానీ వాళ్లు వచ్చేలోపు అక్కాబావకి ఏమైనా జరగొచ్చని అప్పూ అంటుంది.

రాజ్ కనిపించడంతో కావ్య కోపం వెళ్లి అతనిని కొడుతుంది. ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారా అని అంటుంది. ఆకలి వేస్తోంది అన్నారు కదా ఏమైనా తినడానికి తీసుకొద్దామని వెళ్లానని చెబుతాడు. అలాగే మీ కోసం మంట వేశానని అంటాడు. అది చూసి కావ్య ఎమోషనల్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్లు మిమ్మల్ని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారని మీరు ఆకలి అనే సరికి తట్టుకోలేకపోయానని అంటాడు రాజ్. అడవిలో మీకేం తెలియదు కదా?.. మరి ఇక్కడ ఏ ఫ్రూట్స్ తినొచ్చో మీకెలా తెలుసని అడుతుంది కావ్య. అడవిలో ఎలా జీవించాలో వీడియోలు చూసి నేర్చుకున్నానని చెబుతాడు రాజ్. అతని తెలివితేటలు చూసి మెచ్చుకుంటుంది. అయితే ఆ పళ్లు తినడంతో రాజ్- కావ్యలకు తల తిరుగుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X