Brahmamudi June 6th Episode: ఇందూని బంధించిన ఐశ్వర్య.. రాజ్ కన్నింగ్ ప్లాన్ పసిగట్టిన పరంధామయ్య
Photo Courtesy: JioHotstar
ఇందూ సీఈవో కావడం ఇష్టం లేని ఐశ్వర్య.. ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలని కుట్ర చేస్తుంది. తన ప్లాన్‌లో భాగంగా ఇందూని పిలిచి రాకేశ్ గాడు టార్చర్ చేస్తున్నాడు, నా ఫోటోలు, నా గురించి సోషల్ మీడియాలో పెడతానని చెబుతున్నాడని అంటుంది ఐశ్వర్య. నువ్వు వచ్చి వాడితో మాట్లాడమని అడుగుతుంది. ఇదేం తెలియని ఇందూ.. సరేనని ఒప్పుకుంటుంది. ఇందూ కనిపించకపోవడంతో రాజ్‌ని నిలదీస్తుంది రేఖ. నాకేం తెలియదని చెప్పిన రాజ్.. ఇందూకి ఫోన్ చేయగా నేను ఓ పని నిమిత్తం బయటికి వచ్చానని చెబుతుంది.
ఉద్యోగం పోయిందన్న బాధలో చేయి కోసుకున్న వెంకీతో మాట్లాడి అతనికి ధైర్యం చెబుతుంది నందూ. నువ్వు ఆ ఏఐ టెక్నాలజీ నేర్చుకుని తిరిగి ఉద్యోగం సంపాదించమని అంటుంది నందూ. ఇందుకు డబ్బు కావాలి, మా ఇంట్లో కూడా ఎంతో కొంత డబ్బు కావాలని చెబుతాడు వెంకీ. అయితే పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్‌గా పనిచేయమని సలహా ఇస్తుంది నందూ. దానికి వెంకీ సరేనని అంటాడు. ఇందూని తీసుకుని దూరంగా కారులో వెళ్తుంది ఐశ్వర్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 6వ తేదీ ఎపిసోడ్ 1052లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూని చాలా దూరం తీసుకుని వచ్చేస్తుంది ఐశ్వర్య. మనం ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది ఇందూ. ఆ రాకేష్ గాడి దగ్గరికి వెళ్తున్నామని అబద్ధం చెబుతుంది. వీరిద్దరి కారు నారాయణ అనే ఒక వ్యక్తి అడ్డుపడగా .. అతనితో గొడవ పడుతుంది ఐశ్వర్య. నా ఇగో హార్ట్ అయ్యింది.. నేను అస్సలు సైడ్ ఇవ్వనని ఆ వ్యక్తి తేల్చి చెప్పడంతో .. అతనిని గుద్దుకుంటూ వెళ్లిపోతుంది ఐశ్వర్య. నీకు బుద్ధి చెప్పనిదే వదిలిపెట్టనని మండిపడతాడు నారాయణ. ఇందూని తీసుకుని ఒక ఇంటికి వస్తుంది ఐశ్వర్య. వీళ్లంతా ఎవరు? రాకేష్ ఎక్కడున్నాడు? అని అడుగుతుంది ఇందూ.
నేను నిన్ను కిడ్నాప్ చేశాను.. బోర్డ్ మీటింగ్‌కి పంపిస్తే నువ్వు సీఈవో అవుతావు కదా? అందుకే ఇలా ప్లాన్ చేశాను.. నువ్వు సీఈవో అవ్వడం నాకు ఇష్టం లేదు. మా రేఖ ఆంటీనే ఎప్పటికీ సీఈవోగా ఉండాలని చెబుతుంది ఐశ్వర్య. ఈ విషయం రాజుకి చెబుతానని ఇందూ ఫోన్ చేస్తుండగా ఫోన్ లాక్కుంటుంది ఐశ్వర్య. నిన్ను ఎవరూ కాపాడలేరని చెబుతుంది ఇందూ. నీ ప్రాబ్లమ్ క్లియర్ చేద్దామని వస్తే నన్ను ఇలా కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదని మండిపడుతుంది. నోరు మూసుకుని సాయంత్రం వరకు ఇక్కడే ఉండు.. ఆ తర్వాత నేనే ఇంటికి తీసుకెళ్తానని అంటుంది ఐశ్వర్య. నారాయణ మాత్రం ఐశ్వర్య కారు వెతుకుతూనే ఉంటాడు.
ఆఫీస్‌లో రేఖపై సెటైర్లు వేస్తాడు రాజ్. కాసేపట్లో వీడి సంగతి చెబుతానని అంటుంది భూషణ్. కాసేపట్లో మీ సీఈవో పోస్ట్ ఊస్ట్ అవ్వబోతోందని వార్నింగ్ ఇస్తాడు రాజ్. బోర్డ్ మీటింగ్‌లో తనకి చైర్ లేకపోవడంతో తనే వెళ్లి తెచ్చుకుంటాడు రాజ్. ఈరోజు నాతో పాటు సీఈవోగా పోటీ చేస్తోంది ఇతనే అని చెబుతుంది రేఖ. మీ అందరి సపోర్ట్ నాకే చేసి నన్ను సీఈవోగా చేయమని రాజ్ అందరినీ అడుగుతాడు. ఇతను ఎవరు అని బోర్డ్ మెంబర్స్ అడగ్గా.. ఇందూ భర్త రాజ్ అని చెబుతుంది రేఖ. నేనే ఆమె మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచానని అంటాడు రాజ్. బోర్డ్ మీటింగ్ జరిగేలోపు.. నువ్వు వీళ్లని ఆడుక్కుంటావో? బతిమలాడుకుంటావో నీ ఇష్టమని చెప్పి రేఖ వెళ్లిపోతుంది.
మేం నీకు సపోర్ట్ చేయం.. రేఖ మేడంకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఇద్దరు బోర్డ్ మెంబర్స్ వెళ్లిపోతారు. పరంధామయ్య మనుషులు మాత్రం నీకే చేస్తామని రాజ్‌తో చెబుతారు. ఇందూ కనిపించకపోవడంతో ఆమె ఎక్కడ అని అడుగుతాడు పరంధామయ్య. దారిలో ఉందని కొద్దిసేపటిలో వచ్చేస్తుందని చెబుతాడు రాజ్. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు.. తను 12 గంటల లోపు బోర్డ్ మీటింగ్‌లో ఉండాలని పెద్దాయన చెప్పడంతో వెంటనే ఇందూకి కాల్ చేస్తాడు రాజ్. కానీ ఐశ్వర్య ఆ ఫోన్‌ని స్విచ్చాఫ్ చేసేస్తుంది.
నేను ఇందూ కోసం టెన్షన్ పడటం దేనికీ.. 12 గంటల లోపు ఇందూ కనుక రాకపోతే పరంధామయ్య సపోర్ట్‌తో నేనే సీఈవో అవుతాను, చెక్కుల మీద సంతకాలు పెట్టేసి లక్షలు నొక్కేసి హాస్పిటల్ బిల్లు కట్టేయొచ్చని అనుకుంటాడు రాజ్. ఇందూ గురించి అడగటానికి వచ్చిన పరంధామయ్యతో.. ఇందూ రాకపోతే నాకే సపోర్ట్ చేయాలని రాజ్ చెప్పడంతో నీ చేతికి కంపెనీని ఇస్తే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లే, ఇందూ రాకపోతే ఆ రేఖకైనా సపోర్ట్ చేస్తాను కానీ నీకు మాత్రం చేయనని పరంధామయ్య తేల్చేయడంతో రాజ్ షాక్ అవుతాడు.
కారును వెతుక్కుంటూ ఓ ఇంట్లోకి వచ్చిన నారాయణకి ఇందూని ఐశ్వర్య కట్టేసి ఉంచడం చూస్తాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధమవుతుందా అని మండిపడుతుంది ఇందూ. అర్ధం కాకపోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? నీకన్నా చిన్నదానిని అంటుంది ఐశ్వర్య. ఇదేనా నా తెలివి అని మండిపడుతుంది ఇందూ. అసలు అక్షరం ముక్క రాని నువ్వు.. సీఈవో అవ్వడం ఏంటీ? ఇప్పటికే నువ్వు నన్ను ఆడుకుంటున్నావు, నా గది లాక్కున్నావు, నాకు వాల్యూ లేకుండా చేస్తున్నావు. ఇక నువ్వు సీఈవో అయితే ఊరుకుంటావా? నన్ను చాలా చీప్‌గా చూస్తావని అంటుంది ఐశ్వర్య. అలాంటిదేం లేదు.. పరిస్ధితిని అర్ధం చేసుకో, నా అక్కవి అయ్యుండి కూడా నన్ను ఇలా మోసం చేయాలని ఎలా అనిపిస్తోంది. ఏదో ఆవేశంలో చేశావని అనుకుంటాను, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నన్ను వదిలిపెట్టు.. నేను బోర్డ్ మీటింగ్‌కి వెళ్తాను, నేను ఇప్పుడు వెళ్లికపోతే మన లైఫ్, మనల్ని నమ్ముకున్న వాళ్ల లైఫ్ నాశనం అయిపోతుందని చెబుతుంది ఇందూ.
నేను ఇప్పుడు వెళ్లకపోతే రేఖ ఆంటీ సీఈవో అవుతుందని చెబుతుంది ఇందూ. తను సీఈవో అవ్వాలనే కదా నిన్ను బంధించింది అని చెబుతుంది ఐశ్వర్య. తను సీఈవో అయితే మన కంపెనీ ఇంకా డౌన్‌ఫాల్ అవుతుంది, అందుకే నేను సీఈవోగా బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నా, నీకున్న అప్పుల్ని తీర్చేయాలని అనుకుంటున్నా, మన కష్టాలన్నీ తీర్చాలని అనుకుంటున్నాను. నేనేమీ నా కోసం సీఈవో అవ్వాలని అనుకోవడం లేదు.. మనందరీ కోసం అలా చేస్తున్నానని చెబుతుంది ఇందూ. నీ యాక్టింగ్ సూపర్.. మనం మన కోసం అని మీ అమ్మ కూడా అందరినీ ఇలాగే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేదట అంటుంది ఐశ్వర్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications