Brahmamudi June 7th Episode: కావ్య గుండెల్లో కత్తి.. రౌడీలను చితకబాదిన అప్పూ, రాజ్‌కి సూపర్ షాకిచ్చిన యామిని
Photo Courtesy: JioHotstar
అడవిలో చిక్కుకుపోయి రాజ్- కావ్యలు బయటికి వెళ్లే దారి కోసం వెతుకుతూ ఉంటారు. అడవిలో మీకు భయం వేయడం లేదా? అని కావ్య అడగ్గా.. నాది భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అంటాడు రాజ్. ఇంతలో తనకు దాహం వేస్తుందని కావ్య చెప్పడంతో ఆమె కోసం ఆకుల్లో మంచి నీళ్లు తీసుకొచ్చి తాగిపిస్తాడు. కావ్యని చంపడానికి వచ్చిన కిల్లర్‌కి యామిని ఫోన్ చేసి పని త్వరగా పూర్తి చేయాలని వార్నింగ్ ఇస్తుంది. కావ్య- రాజ్‌లను వెతుక్కుంటూ అప్పూ తన సిబ్బందితో అడవికి వస్తుంది.
పరిగెత్తడం ఇక నా వల్ల కాదని బాగా ఆకలి వేస్తోందని చెబుతుంది కావ్య. రాజ్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది కావ్య. అతను తిరిగి రాగానే రాజ్‌తో దెబ్బలాడుతుంది. ఆడపిల్లను చీకటిలో అడవిలో వదిలేసి వెళ్తారా? అంటూ మండిపడుతుంది. అడవిలో కొన్ని పండ్లు తీసుకొచ్చి తినమని ఇస్తాడు రాజ్. వాటిని తినగానే ఇద్దరికీ తల తిరుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 7వ తేదీ ఎపిసోడ్ 742లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అడవిలో పిచ్చి పండ్లు తినడంతో కావ్య- రాజ్‌లకు తల తిరుగుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. తల తిరగడం కాదని అడవే తిరుగుతుందని అంటాడు రాజ్. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఆదమరిచి పడుకుంటారు. ఇంతలో కిల్లర్ కావ్య- రాజ్‌లను చూస్తాడు. కత్తి తీసుకుని కావ్యని పొడుస్తాడు. ఉదయమైనా కావ్య - రాజ్ ఇంటికి రాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంటుంది. కావ్య, రాజ్‌ల ఫోన్‌కి కంటిన్యూగా ఫోన్ చేస్తుంటుంది ఇందిర. మీరెంత ట్రై చేసినా వాళ్లిద్దరూ మీకు దొరకరు. ఆ యామిని చెప్పినదానిని బట్టి కావ్యని ఆ రౌడీలు ఫినిష్ చేసి ఉంటారని మనసులో అనుకుంటూ సంబరపడుతుంది కావ్య.
కావ్య ఫోన్ కలవడం లేదని ఇందిర బాధపడుతూ ఉంటుంది. అసలు వాళ్లు అడవిలో తప్పిపోవడమేంటీ? అప్పూ వెతుక్కుంటూ వెళ్లడమేంటీ? అడవిలో రాత్రంతా ఉన్నారంటే నాకు భయంగా ఉందని అంటుంది ధాన్యలక్ష్మీ. అసలే వదిన కంగారు పడుతుంటే నువ్వింకా కంగారు పెట్టోద్దని మండిపడతాడు ప్రకాశం. అయినా వాళ్లని కాపాడటానికి అప్పూ వెళ్లింది కాబట్టి తప్పకుండా వాళ్లని కాపాడి తీసుకుని వస్తుందని చెబుతారు ప్రకాశం, సుభాష్. వెళ్లిందేమైనా రాణి రుద్రమ దేవి కాదని నిన్నగాక మొన్న డ్యూటీలో జాయిన్ అయిన అప్పూ అని సెటైర్లు వేస్తుంది రుద్రాణి.
అప్పుడు కూడా రాజ్- కావ్యలు శ్రీశైలం వెళ్లినప్పుడు యాక్సిడెంట్ అయ్యింది రాజ్ కనిపించకుండాపోయాడు.. ఇప్పుడేమో ఇద్దరూ కనిపించకుండాపోయారని అంటుంది రుద్రాణి. నిన్న సాయంత్రం ఫోన్ చేశారు, ఇప్పటి వరకు వాళ్ల నుంచి ఎటువంటి న్యూస్ లేదంటే నాకు అనుమానంగా ఉందని చెబుతుంది. వాళ్ల వెంటపడ్డవాళ్లు ఏదో చేసుంటారని రుద్రాణి అనడంతో అంతా టెన్షన్ పడతారు. అప్పూకి ఆ విషయం తెలిసిపోయి ఉంటుందని, కానీ అది మనకు ఎలా చెప్పాలో అర్ధం కాక బయటే తిరుగుతుంటుందని చెబుతుంది.
ఆ మాటలతో రుద్రాణిపై కోప్పడుతుంది ఇందిర. మేం టెన్షన్ పడుతుంటే అంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావని ఫైర్ అవుతుంది. నేను నిజం చెబితే మీరెప్పుడు విన్నారని ప్రశ్నిస్తుంది. కాసేపట్లో అప్పూ బాధగా నడుచుకుంటూ వస్తుంది.. ఆపరేషన్ ఫెయిల్ అయ్యాక, బయటికొచ్చిన డాక్టర్ చెప్పినట్లు ఏదో ఒకటి చెబుతుందని అంటుంది రుద్రాణి. ఇంకో మాట మాట్లాడితే నోట్లో పాయిజిన్ పోస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇందిర. రుద్రాణి మాటలు వింటుంటే నాక్కూడా కంగారుగా ఉందని అపర్ణ అనడంతో ఇందిర షాకవుతుంది. నిన్న సాయంత్రం ఎప్పుడో ఫోన్ చేశారు? ఇప్పటి వరకు వాళ్ల ఆచూకీ తెలియలేదు? వాళ్ల కోసం వెళ్లిన అప్పూ ఏం చేస్తుందో? అంటూ అపర్ణ అడుగుతుంది.
కావ్యని చంపారా? లేదా? అని తనకు ఫోన్ రాకపోవడంతో యామిని టెన్షన్ పడుతుంటుంది. ఇంతలో వైదేహి వచ్చి కాఫీ ఇవ్వడంతో తల్లిపై విసుక్కుంటుంది యామిని. కావ్యను ఏదో చేయబోతున్నానని చెప్పావు? ఏం చేస్తున్నావ్? అని అడుగుతుంది వైదేహి. దానిని చంపమని రౌడీలకు సుపారీ ఇచ్చానని యామిని చెప్పడంతో వైదేహి షాక్ అవుతుంది. నేను బావని నా సొంతం చేసుకోవాలని రిసార్ట్స్‌కి తీసుకెళ్తే అక్కడికి కావ్య వచ్చి నా ప్లాన్ చెడగొట్టిందని చెబుతుంది. రాజ్ నా సొంతం కాకుండా ప్రతిసారి అడ్డుపడుతూనే ఉందని, అందుకే శాశ్వతంగా దాని అడ్డు తొలగించుకోవడానికి ఇలా చేశానని అంటుంది యామిని. కావ్యని ఈపాటికి చంపేసి ఉంటారని ఆ గుడ్‌న్యూస్ విందామంటే వాళ్ల నుంచి ఫోన్ రాలేదని చెబుతుంది.
రాజ్ స్పృహలోకి వచ్చి చూడగా అడవిలో కాకుండా ఎక్కడో కనిపిస్తాడు. ఎదురుగా రౌడీలను చెట్టుకు కట్టేసి ఉండటంతో సంతోషంగా కావ్యని నిద్రలేపుతాడు. మీరు మామూలు కళావతి కాదు సింగం కళావతి అంటాడు రాజ్. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్ధం కావడం లేదు.. ఆ రౌడీలను నేను కట్టేయడం ఏంటీ అని అడుగుతుంది కావ్య. మరి ఆ రౌడీలను కట్టేసిందెవరు? అని రాజ్ అడగ్గా నేను అంటూ అప్పూ ఆన్సర్ ఇస్తుంది. మిమ్మల్ని వెతుకుతూ వస్తుండగా ఆ రౌడీలు మీ చుట్టూ కనిపించారు.. మీరేమో స్పృహ లేకుండా పడి ఉన్నారని చెబుతుంది అప్పూ. కరెక్ట్‌గా ఆ రౌడీలు మీ మీద అటాక్ చేసే టైంలో వచ్చి మిమ్మల్ని కాపాడి, వాళ్లని కాపాడానని చెబుతుంది అప్పూ.
దీంతో అప్పూకి థ్యాంక్స్ చెబుతుంది కావ్య. నిన్ను కాపాడుకోవడం నా రెస్పాన్సిబులిటీ కదా? అని అంటుంది అప్పూ. ఈ రౌడీ వెధవలు మీ వెంట ఎందుకు పడ్డారని అప్పూ అడగటంతో కావ్య జరిగినదంతా చెబుతుంది. ఇంత జరిగితే నాకొక ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది అప్పూ. నేను కళావతిని కాపాడలేనా? దానికి మీకు ఫోన్ చేయాలా? అని అంటాడు రాజ్. వాళ్లిద్దరూ వెళ్లిపోగానే.. మా అక్క బావ మీద ఎవరు అటాక్ చేయమని చెప్పారని రౌడీలను అడుగుతుంది అప్పూ. వాళ్లు నోరు విప్పకపోవడంతో మన స్టైల్‌లో ట్రీట్‌మెంట్ చేయమని ఆర్డర్ వేస్తుంది.
కావ్య- రాజ్‌ల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుండగా కావ్యని తీసుకుని ఇంటికొస్తుంది అప్పూ. దాంతో ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషిస్తారు. నా మనవడు రౌడీలను మట్టి కరిపించేశాడా? అని అంటుంది ఇందిర. మీ మనవడు పిచ్చికాయలు తెచ్చి తినిపించాడని అప్పూ ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే మేం రౌడీల చేతుల్లో అయిపోయేవాళ్లమని అంటుంది కావ్య. రాజ్ ఐ లవ్ యూ చెప్పలేదా? అని ఇందిర అడగ్గా.. కనీసం ఐ లైక్ యూ అని కూడా చెప్పలేదని అంటుంది కావ్య. దాంతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. అడవిలో నుంచి ఎలా బయటపడాలో తెలియక మేం కంగారుపడితే మీకు ఐ లవ్ యూ కావాలా? అని మండిపడుతుంది కావ్య.
అసలు ఆ రౌడీలు మీ వెంట ఎందుకు పడ్డారని సుభాష్ అడుగుతాడు. ఆ చిన్న గొడవకి రాత్రంతా మిమ్మల్ని వెతకాల్సిన పనిలేదని అంటాడు. దీని వెనుక ఇంకేదో కారణం ఉందని డౌట్ పడతాడు. ఆ సంగతి నేను తేలుస్తానని అప్పూ చెబుతుంది. ఆ వెంటనే కళ్యాణ్ వచ్చి అప్పూకి కంగ్రాట్స్ చెబుతాడు. మీరంతా ఇలాగే నవ్వుకోండి.. రేపు ఆ యామిని ఇచ్చే సర్‌ప్రైజ్‌కి మీ గుండెలు పగిలిపోతాయని అనుకుంటుంది రుద్రాణి. రాజ్ ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంటిని మామిడి తోరణాలు, పూలతో అలంకరిస్తూ ఉంటారు. ఎల్లుండే మీ పెళ్లి అని వైదేహి- రఘునాథ్‌లు చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











