Brahmamudi June 9th Episode: పెళ్లికి రాజ్ నో.. యామినిలో బయటికొచ్చిన సైకో, కావ్యకి షాకిచ్చిన రుద్రాణి
Photo Courtesy: JioHotstar
అడవిలో ఆకలి వేసి పిచ్చి కాయలు తిన్న రాజ్-కావ్యలకు తల తిరుగుతూ మత్తుగా అనిపిస్తుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడుకుని నిద్రపోతుండగా వారిని చూసిన యామిని మనుషులు కత్తితో కావ్యని చంపడానికి వస్తారు. ఉదయాన్నే రాజ్ లేచి చూసేసరికి ఎదురుగా రౌడీలు చెట్టుకు కట్టేసి ఉంటారు. కావ్యను నిద్రలేపి మీలో ఒక రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి ఉన్నారని మెచ్చుకుంటాడు. రాత్రి ఫైట్ చేసి దొంగల్ని కట్టేశారా? అని అడుగుతుండగా వాళ్లని కట్టేసింది నేను అని అప్పూ వాయిస్ వినిపిస్తుంది.
మా అక్కాబావ మీద అటాక్ చేయమని మిమ్మల్ని పంపింది ఎవరు? అని రౌడీలను అడుగుతుంది అప్పూ. రాజ్- కావ్యల గురించి దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుండగా కావ్యను తీసుకుని అప్పూ ఇంటికి రావడంతో వాళ్లంతా సంతోషిస్తారు. మిమ్మల్ని ఆ రౌడీలు ఎందుకు వెంటాడారు? వాళ్లని పంపింది ఎవరు అనేది నేను తేలుస్తానని అప్పూ చెబుతుంది. కావ్యని చంపినట్లుగా ఫోన్ రాకపోవడంతో యామిని ఇంట్లో టెన్షన్ పడుతుంది. ఏం జరిగిందని వైదేహి అడగటంతో కావ్యని చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ని పంపానని తల్లికి జరిగినదంతా చెబుతుంది. తాను వెళ్లే సరికి ఇంటిని అందంగా ముస్తాబు చేస్తుండటంతో రాజ్ ఎందుకని వైదేహిని అడుగుతాడు. ఎల్లుండే మీ పెళ్లి అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 9వ తేదీ ఎపిసోడ్ 743లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తనకు, యామినికి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుసుకున్న రాజ్ షాక్‌లో ఉండిపోతాడు. ఇంతలో యామిని వచ్చి రిసార్ట్‌లో నన్ను మరిచిపోయావ్, రేపు మన పెళ్లి జరుగుతుందన్న విషయం మరిచిపోయావని అంటుంది. నిన్న రాత్రి నుంచి నువ్వు రాకపోయేసరికి మేమంతా కంగారు పడ్డామని చెబుతుంది యామిని. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుంది. నీకోసం వెయిట్ చేస్తూ రిసార్ట్‌లో ఒక పిచ్చిది ఉంటుంది, దానికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా అనిపించలేదా అని ఫైర్ అవుతుంది యామిని. నీకు చెప్పకుండా వెళ్లిపోవడం తప్పేనని, కానీ తప్పలేదని.. నా ఫ్రెండ్ బయటికి వెళ్లొద్దామని అడగటంతో వెళ్లాల్సి వచ్చిందని చెబుతాడు రాజ్.
బయట కొంతమంది రౌడీలతో గొడవ జరిగి ఒక ఫారెస్ట్‌లో ఇరుక్కుపోయామని, రాత్రంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని అంటాడు. ఆ మాటలతో యామిని ఏం తెలియనట్లు షాక్ అవుతుంది. కరెక్ట్ టైంకి పోలీసులు వచ్చి ఆ రౌడీలను అరెస్ట్ చేశారని రాజ్ చెప్పడంతో యామిని ఉలిక్కిపడుతుంది. నువ్వు ఫ్రెష్ అయి వస్తే పెళ్లి పనులు చేసుకుందామని రాజ్‌తో అంటుంది. దాంతో నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, కొద్దిరోజులు వాయిదా వేద్దామని చెబుతాడు రాజ్. ఆ మాటలతో యామిని ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీరు అనుకుంటే సరిపోదని, దానికి మేం కూడా ఒప్పుకోవాలి కదా అని అంటుంది వైదేహి.
మీ ఇద్దరికి పెళ్లని ఊరంతా చెప్పేశామని, చుట్టాలందరికీ కార్డ్స్ కూడా పంచేశామని చెబుతుంది. తీరా ముహూర్తం సమయానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే యామిని జీవితం ఏమవుతుందో ఆలోచించారా అని రాజ్‌ను నిలదీస్తుంది వైదేహి. దాంతో యామినిలోని సైకో బయటికి వచ్చి డెకరేషన్ చేసిన పూలు, తోరణాలు అన్నింటిని పీకిపడేస్తుంది. నీకు ఇష్టం లేని పని నేను ఏది చేయనని, ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టమని చెబుతుంది యామిని. మనం ఇష్టపడిన వారు, మనల్ని ప్రేమిస్తే అది అదృష్టం.. వాళ్లే వద్దు అనుకుంటే అది దురదృష్టమని అంటుంది యామిని. నీతో జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నానని, కానీ ఇలా నీ జ్ఞాపకాల్లో మిగిలిపోతానని అనుకోలేదని చెబుతుంది.
నా జీవితంలో ఏదైనా సంతోషం ఉందంటే అది నువ్వే .. ఇకపై నువ్వు నా జీవితంలో ఉండవని తెలిశాక తట్టుకోవడం కష్టమని అంటుంది. ఆ వెంటనే కత్తి తీసుకుని చేతి నరం కట్ చేసుకుంటుంది. బావ లేని జీవితం నాకొద్దని గోల చేస్తుండగా రాజ్ ఆమెను ఆపి చెంపదెబ్బ కొడతాడు. వెంటనే ఆమె చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి మందు రాస్తాడు. పెళ్లి వద్దంటే చచ్చిపోతావా అని రాజ్ ప్రశ్నించగా.. మరి దానిని ఇంకేం చేయమంటావని నిలదీస్తుంది వైదేహి. మనందరం ఉన్నాం కాబట్టి తనను కాపాడుకోగలిగామని.. రోజూ దగ్గరుండి కాపాడుకోలేం కదా అని అంటుంది. ప్రాణంగా ప్రేమించిన వారికి ఈ సమాజంలో దొరికే అదృష్టం చావే కదా అని చెబుతుంది వైదేహి.
నేను పెళ్లిని కొద్దిరోజులు వాయిదా వేద్దామని మాత్రమే అన్నానని రాజ్ చెప్పగా.. రేపు మా అమ్మాయిని వద్దంటే దాని పరిస్థితి ఏంటని అడుగుతుంది వైదేహి. అసలు మీ మనసులో ఏముంది? యామిని అంటే ఇష్టమో కాదో ఇప్పుడే చెప్పండి అని రాజ్‌ను నిలదీస్తుంది. మీరు ఊ అంటే తాళి కట్టించుకుంటుంది, లేదంటే ఉరేసుకుంటుందని చెబుతుంది. నా కారణంగా ఎవరూ చావాల్సిన అవసరం లేదని, నేను పెళ్లి చేసుకుంటానని అంటాడు రాజ్. నువ్వు ఈ మాట మనస్పూర్తిగా చెప్పడం లేదని యామిని అడగటంతో నేను మనస్పూర్తిగానే చెబుతున్నానని, పెళ్లి పనులు మొదలుపెట్టండి అని చెబుతాడు రాజ్. ఆ మాటలతో యామిని ఫ్యామిలీ సంతోషిస్తుంది.
ఇందిర ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజ్ ఫోన్ ఎత్తడు. వాళ్లు టెన్షన్ పడుతుండగా రుద్రాణి వచ్చి రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడని చెబుతుంది. బుధవారమే రాజ్‌కి, యామినికి పెళ్లని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ పెళ్లి జరగదని వాళ్లంతా చెబుతారు. ఆ యామిని మేజర్ కాదు మైనర్ అని అంటారా? రాజ్‌కి గతం గుర్తుచేస్తారా? అని నిలదీస్తుంది రుద్రాణి. యామిని ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని అనుకోని రాజ్ టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు.. ఇందిర ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయడు. రుద్రాణి చెప్పినట్లు యామినిని పెళ్లి చేసుకోవడానికి రాజ్ ఒప్పుకుని ఉంటాడేమోనని ఇందిర, అపర్ణ బాధపడతారు. కావ్యతో ఫోన్ చేయిద్దామని లోపలికి వెళ్లగా కళావతి ఐస్‌క్రీం తింటూ ఉండటంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. రాజ్‌కి ఫోన్ చేయమని అపర్ణ, ఇందిర చెప్పగా.. నేను చేయమని మొండిగా మాట్లాడుతుంది కావ్య. నీ మొగుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని హెచ్చరిస్తుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











