Brahmamudi June 9th Episode: ఇందూ రాజకీయంతో ఇరుక్కున్న రేఖ.. స్వరాజ్ కంపెనీ సీఈవోగా ఇందూ

Photo Courtesy: JioHotstar

నేను మనందరి కోసం సీఈవో అవ్వాలని అనుకుంటున్నాను.. అర్ధం చేసుకోమని ఇందూ చెబుతుంది. మీ అమ్మ కూడా అందరి కోసం అని చెప్పి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేదని ఐశ్వర్య అనడంతో మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. నువ్వు ఎంత ఏడ్చినా, అరిచినా నిన్ను మాత్రం వదిలిపెట్టను.. నా నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరని అంటుంది ఐశ్వర్య. ఈ మాటలన్నీ విన్న తాగుబోతు నారాయణ.. నేను కాపాడతానని అనుకుంటాడు.

ఎంతసేపటికీ ఇందూ రాకపోవడంతో రేఖ టెన్షన్ పడుతుంది. తనకు సపోర్ట్ చేస్తే కంపెనీకి లాభాలు తీసుకొస్తానని చెబుతుంది. దాంతో ఇద్దరు బోర్డ్ మెంబర్స్ రేఖకి సపోర్ట్ చేస్తారు. ఈ రాజ్‌కి కంపెనీ గురించి, బిజినెస్ గురించి ఏం తెలియదని అంటుంది. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మొత్తం తెలుసుకుని నేను కూడా ప్రాఫిట్స్‌లోకి తీసుకురాగలనని చెప్పడంతో ఇద్దరు బోర్డ్ మెంబర్స్ రాజ్‌కి సపోర్ట్ చేస్తాడు. సమానంగా ఓట్లు రావడంతో పరంధామయ్య మద్ధతు ఎవరికీ అనేది ఉత్కంఠగా మారుతుంది. నా నిర్ణయం తర్వాత చెబుతానని సస్పెన్స్‌లో పెడతాడు పెద్దాయన. రౌడీల దగ్గర మందు తాగి వాళ్లని చితక్కొట్టి ఇందూ, ఐశ్వర్యల దగ్గరికి వెళ్తాడు తాగుబోతు నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 9వ తేదీ ఎపిసోడ్ 1054లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June th 2026 Episode 1054 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నువ్వు తనని తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఉంటానా అని తాగుబోతు నారాయణతో గొడవ పడుతుంది ఐశ్వర్య. చూడకుండా ఏం చేస్తావు ఆంటీ.. ఈ రౌడీలతో కొట్టిస్తావా? బయట మన దెబ్బకి ఇద్దరు పడిపోయారని చెప్పడంతో ఓ రౌడీ వచ్చి నారాయణని కొట్టబోతాడు. వాడి జోలికి వెళ్లొద్దని రౌడీ చెప్పడంతో అతను కూడా పారిపోతాడు. ఆడదానిని కొట్టానన్న ట్రాక్ రికార్డ్ నాకొద్దు.. మళ్లీ నా కోడలి దగ్గర మాట వచ్చేస్తుందని నారాయణ వార్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే ఇందూకి కట్లు విప్పేస్తాడు నారాయణ. సమయానికి దేవుడిలా వచ్చి నన్ను కాపాడావని నారాయణకి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. మీరే నన్ను ఆఫీస్‌కి తీసుకెళ్లాలని చెబుతుంది ఇందూ. తను నిన్ను తీసుకెళ్లినా ఏ ప్రయోజనం ఉండదు ఇంకో పది నిమిషాల్లో సీఈవోని ఎన్నుకుంటారు, ఆ 10 నిమిషాలు కాదు కదా 20 నిమిషాల్లో కూడా నువ్వు వెళ్లలేవని అంటుంది ఐశ్వర్య.

దాంతో అక్కా నువ్వు ఏం కంగారుపడొద్దు.. నా సైకిల్ మీద చాలా స్పీడ్‌గా తీసుకెళ్తానని అంటాడు నారాయణ. ఇక్కడి నుంచి కారులో వెళ్తేనే గంట పడుతుందని సెటైర్లు వేస్తుంది. బయట బైక్ కనిపించడంతో దాని మీద తీసుకెళ్తానని చెబుతాడు నారాయణ. నాకు కూడా ఒక చెల్లెలు ఉంది.. నేను అర్ధమయ్యేలా చెబుదామని అనుకున్నాను, కానీ వినలేదు నన్ను ఇంకా అపార్ధం చేసుకుంది. ఇప్పుడు బద్ధ శత్రువులం అయిపోయాం, మనం ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మనమే ఇబ్బందుల్లో పడతామని వార్నింగ్ ఇస్తాడు నారాయణ. ఇందూని తీసుకుని రాకెట్ స్పీడ్‌తో ఆఫీస్‌కి వెళ్తాడు. దాంతో స్లోగా వెళ్లమని చెబుతుంది ఇందూ.

ఇందూ ఎంతకీ రాకపోవడంతో రాజ్ టెన్షన్ పడతాడు. మీ సపోర్ట్ ఎవరికీ? నాకా? ఆ రాజ్‌కా అని పరంధామయ్యని అడుగుతుంది రేఖ. పరంధామయ్య గారి ఓటుతో మొత్తం డిసైడ్ అయిపోయినట్లే.. వాళ్లే సీఈవో అవుతారని చెబుతుంది రేఖ. ఎంత ఆలోచించినా నాకు ఒకటే అనిపిస్తోంది.. బయటివాళ్లకు సపోర్ట్ చేయలేనని అంటాడు పరంధామయ్య. అయితే మీ ఓటు నాకే.. నేనే సీఈవోని అని రేఖ సంబరపడిపోతుంది. పరంధామయ్య గారు బయటివాళ్లకు సపోర్ట్ చేయనని చెప్పారు.. నీకు సపోర్ట్ చేస్తానని చెప్పలేదు కదా? ముందే ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని ఫైర్ అవుతాడు రాజ్.

సమయానికి ఇందూని ఆఫీస్ దగ్గర దించుతాడు నారాయణ. ఆఫీస్‌లో ఎవరినైనా రిపేర్ చేయాలన్నా.. నీకు ఏ సాయం కావాలన్నా నేనున్నానని ఇందూకి చెబుతాడు నారాయణ. పరంధామయ్య తన నిర్ణయం చెప్పబోతుండగా ఇందూ ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడికి వెళ్లిపోయావు? నీ కోసం వెయిట్ చేస్తున్నామని రాజ్ చెప్పడంతో అందరికీ క్షమాపణలు చెబుతుంది ఇందూ. ఆ అమ్మాయి అచ్చం మన కావ్యలా ఉందని నటిస్తాడు పరంధామయ్య. తను 365 రోజులూ నా కళ్లముందే ఉంటుంది.. మీరు ఫస్ట్ టైం చూశారు కాబట్టి మీకు ఆశ్చర్యంగా ఉంటుందని అంటుంది రేఖ. ఇందూని నేనే చిన్నప్పటి నుంచి కన్నతల్లిలా పెంచాను, కంటికి రెప్పలా కాపాడుకున్నాను. తను నాకు సపోర్ట్ చేయడానికి ఆఫీస్‌కి వచ్చింది.. ఈ కంపెనీ మీద ఇందూకి కూడా హక్కు ఉంటుంది. ఇది వాళ్ల అమ్మనాన్న కలిసి నిర్మించిన కంపెనీ.. ఇది సరైన దిశలో నడిపించడానికి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిందని రేఖ చెబుతుంది.

నా కళ్ల ముందే కావ్య రూపంలో ఇందూ కనిపిస్తుండగా మరొకరికి ఎందుకు సపోర్ట్ చేస్తాను. నా ఓటు ఇందూకే వేస్తానని చెబుతాడు పరంధామయ్య. ఆ మాటలు వినగానే రేఖ షాక్ అవుతుంది. రాజ్ సీఈవో కాకుండా ఆపడానికి ఇందూకే మద్ధతుగా ఉంటానని చెబుతుంది రేఖ. తన పథకం వర్కవుట్ కావడంతో ఇందూ సంతోషిస్తుంది. నేను సీఈవోగా ఉండటం ఏంటీ? మీరు ఉండగా నేను సీఈవోగా ఉండటం కరెక్ట్ కాదు. ఆ బాధ్యతలన్నీ నేను చూడలేనని ఇందూ చెప్పగా.. నేను చూసుకుంటానని అంటుంది రేఖ. ఎక్కువ మంది బోర్డ్ మెంబర్స్ సపోర్ట్ వల్ల ఈ ఏడాది ఇందూనే సీఈవోగా ఉంటుందని పరంధామయ్య ప్రకటించడంతో ఇందూ సంతోషిస్తుంది.

నేను కాకపోతే నా భార్య అయినా సీఈవో అయింది, నేను కూడా హ్యాపీ అంటాడు రాజ్. వెంటనే రేఖని సీఈవో ఛైర్ నుంచి లేపి ఇందూని కూర్చోబెడతాడు. నిన్ను సీఈవో కాకుండా ఆపడానికి ఇందూని నేనే సీఈవో అయ్యేలా చేశానని అనుకుంటుంది రేఖ. ఇదంతా ఇందూ ప్లాన్ అని తెలిస్తే నీ గుండె ఆగిపోతుందని అనుకుంటాడు రాజ్. టైంకి నువ్వు రాకపోతే భయపడ్డాను, ఎక్కడికి వెళ్లావని ఇందూని అడుగుతాడు రాజ్. నేను రాకపోయుంటే నువ్వే సీఈవో అవ్వాలని ప్లాన్ చేశావట అని ఇందూ అడగటంతో రాజ్ ఉలిక్కిపడతాడు.

ఆ రేఖని ఆపడానికి ఏదో చిన్న ప్లాన్ చేశానని చెబుతాడు రాజ్. నువ్వు పక్కా కమర్షియల్, డబ్బు కోసం ఏదైనా చేస్తావు, సీఈవో అయిపోయి లక్షలు కొట్టేద్దామని ప్లాన్ చేశావని మండిపడుతుంది ఇందూ. నువ్వు చచ్చినట్లు నా దగ్గర అద్దె మొగుడిగా నటించాల్సిందే, నువ్వు పని మానేస్తే నీకు ఒక్క రూపాయి కూడా ఎక్కడా దొరకదని అంటుంది. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెబుతానని ఫైర్ అవుతాడు రాజ్. వెంకీని తీసుకుని డెలివరీ బాయ్ ఉద్యోగం ఇప్పించేందుకు ఓ చోటికి తీసుకెళ్తుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X