Brahmamudi June 8th Episode: ఇందూని రక్షించిన నారాయణ.. సీఈవో పోస్ట్‌పై పరంధామయ్య మెలిక, షాక్‌లో రేఖ
Photo Courtesy: JioHotstar
ఇందూని తీసుకుని ఊరి చివరికి వచ్చేస్తుంది ఐశ్వర్య. ఎక్కడికి వెళ్తున్నామని ఇందూ అడగ్గా.. ఆ రాకేష్ గాడి దగ్గరికేనని అబద్ధం చెబుతుంది ఐశ్వర్య. ఓ చోటికి వెళ్తుండగా కారుకు నారాయణ అనే తాగుబోతు అడ్డొస్తాడు. అతనితో ఐశ్వర్య గొడవ పడటంతో నీకు బుద్ధి చెబుతానంటూ కారును వెంటాడుతూ వెళ్తాడు నారాయణ. ఇందూని ఓ ఇంట్లోకి తీసుకొచ్చిన ఐశ్వర్య.. నువ్వు సీఈవో కావడం నాకిష్టం లేదు. ఇప్పుడే నన్ను ఆడుకుంటున్నావ్.. రేపు సీఈవో అయితే నన్ను చులకనగా చూస్తావు. అందుకే నిన్ను కిడ్నాప్ చేశానని చెబుతుంది. ఆ మాటలతో ఇందూ షాక్ అవుతుంది. నేను మన కుటుంబం కోసం, నీ కోసం, మనల్ని నమ్ముకున్న వారి కోసం సీఈవో అవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది ఇందూ. అయినప్పటికీ ఐశ్వర్య వినిపించుకోదు.
బోర్డ్ మీటింగ్‌కి ఇందూ రాకపోవడంతో రాజ్‌పై పరంధామయ్య మండిపడతాడు. ఇందూ రాకపోతే మనమే సీఈవో అయిపోదామని ప్లాన్ చేసిన రాజ్.. ఈ విషయం గురించి పరంధామయ్యని అడగ్గా ఆ రేఖకైనా సపోర్ట్ చేస్తాను కానీ, కంపెనీని నీ చేతుల్లో పెట్టనని అంటాడు. ఐశ్వర్య కారుని ఫాలో అవుతూ వచ్చిన నారాయణ.. ఇందూని కట్టేయడం చూస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 8వ తేదీ ఎపిసోడ్ 1053లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను మనందరి కోసం సీఈవో అవ్వాలని అనుకుంటున్నానని ఐశ్వర్యతో చెబుతుంది ఇందూ. మీ అమ్మ కూడా ఇలాగే అందరినీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేది, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, బుద్ధులు ఏమైపోతాయని అంటుంది ఐశ్వర్య. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. నువ్వేం చేయలేవు.. నోరుమూసుకుని సైలెంట్‌గా ఉండు, నువ్వు ఏడ్చినా కోప్పడినా నేను నిన్ను వదిలిపెట్టను. నా నుంచి కాపాడటానికి ఎవ్వరూ రారు.. సైలెంట్‌గా ఉండమని అంటుంది ఐశ్వర్య. ఇదంతా చూసిన నారాయణ నేను కాపాడతానని అనుకుంటాడు.
ఇందూ రాకపోవడంతో ఆమె గురించి టెన్షన్ పడుతుంది రేఖ. కావ్య- రాజ్‌లు సృష్టించిన సామ్రాజ్యాన్ని ఇన్నేళ్లుగా చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నాను, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి తగ్గట్లుగా వర్క్ చేసి గ్రోత్ లెవెల్స్ పెంచుకోవాలి. కొన్ని సమస్యల వల్ల ఎంప్లాయిస్, మీరు ఇబ్బందిపడ్డారు. కానీ ఈసారి కూడా నాకు సీఈవో పోస్ట్ అప్పగిస్తే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కంపెనీని ముందుకు తీసుకెళ్తానని చెబుతుంది రేఖ. నేను ఇన్నేళ్లుగా కంపెనీని నడిపించిన విధానం చూశారు, నా అనుభవం చూశారు. మరి ఈ రాజ్‌కి ఈ కంపెనీ వ్యవహారాలు ఏంటో ఏం తెలియదు. ఎక్కడా పనిచేయలేదని అంటుంది.
సీనియారిటీది ఏముంది? రోజు ఆఫీస్‌కొచ్చి అటెంటెన్స్ వేసుకుంటే వచ్చేస్తుంది. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చామా? లేదా అన్నదే ముఖ్యం. కనీసం ఎంప్లాయిస్‌కి శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నామంటేనే అర్ధమవుతోంది కంపెనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో? ఎక్స్‌పీరియన్స్ పక్కనపెట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అని అంటాడు రాజ్. కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్లకపోయినా పర్లేదు.. చతికిలపడకుండా చూసుకుంటే చాలని అంటుంది రేఖ. మాటలు చెప్పినంత ఈజీ కాదు.. కోటి నుంచి 50 లక్షలు, 50 లక్షల నుంచి 20 లక్షలకు వచ్చినప్పుడు నీ సంగతి అర్ధమైందని సెటైర్లు వేస్తుంది రేఖ.
ఈ మాటలన్నీ వద్దు.. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఓపెన్‌గా చెబితే సరిపోతుంది కదా అంటారు బోర్డ్ మెంబర్స్. మేము రేఖ మేడంకి సపోర్ట్ చేస్తున్నామని ఇద్దరు బోర్డ్ మెంబర్స్ చెబుతారు. మీ పర్ఫార్మెన్స్ మాకు నచ్చలేదు.. చాలా రోజుల నుంచి మీరు కంపెనీ విషయాలు పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి డౌన్‌ఫాల్ అవుతుంది.. అందుకే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా రాజ్‌కే సపోర్ట్ చేస్తున్నామని ఇద్దరు బోర్డ్ మెంబర్స్ చెబుతారు. రేఖకి, రాజ్‌కి సమానంగా ఓట్లు రావడంతో పరంధామయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారని అడుగుతుంది రేఖ. మీరు ఎప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తారు.. అలాంటిది బయటి వ్యక్తికి సపోర్ట్ చేసి మాట తప్పుతారా అని ప్రశ్నిస్తుంది రేఖ.
కంపెనీలో జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, రోజురోజుకి బిజినెస్ పడిపోయినా పర్లేదు. ఈ సొసైటీలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రెప్యుటేషన్ పడిపోయినా పర్లేదు, మీరు మాత్రం రేఖ పిన్నికే ఓటు వేయండని రాజ్ సెటైర్లు వేస్తాడు. మొదటి నుంచి ఇప్పటి వరకు నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు.. అయినప్పటికీ దుగ్గిరాల కుటుంబం మీద రెస్పెక్ట్‌తో ఇన్నేళ్లుగా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చానని అంటాడు పరంధామయ్య. అలాగే నీకు కూడా నేను సపోర్ట్ చేయనని అంటాడు పెద్దాయన. మీ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో అర్ధం కావడం లేదు.. ఆలోచించుకుని చెబుతానని మెలిక పెడతాడు పరంధామయ్య. ఇందూ ఉంటే ఇబ్బంది ఉండేది కాదని రగిలిపోతుంటుంది రేఖ. ఇందూ రాకపోతే ఈ రాజ్‌గాడే సీఈవో అవుతాడని భయపడుతుంది.
ఇందూకి కాపలా కాయకుండా మందు తాగుతున్న రౌడీలపై కోప్పడుతుంది ఐశ్వర్య. వాళ్ల దగ్గరికి వెళ్లి తనకు కూడా మందు పోయమని గ్లాస్ పెడతాడు నారాయణ. వాళ్ల మందు మొత్తం తాగేసి వాళ్లనే చితక్కొడతాడు. ఒక్క మూత మందు కోసం మమ్మల్ని కొడతావా అని రౌడీలు అడుగుతారు. ఈ ఒక్క మూత మందు కోసమే దసరా పండక్కి మా ఫ్రెండ్స్‌ని చితకబాదా.. ఈ ఒక్క మూత మందు కోసమే నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో రచ్చ చేశా. ఒక్క మూత మందు అని తీసిపారేయొద్దని ఫైర్ అవుతాడు.
లోపలికి వెళ్లి ఐశ్వర్యతో గొడవపడతాడు నారాయణ. నీ బండితో నా బండికి సైడ్ కొట్టావు.. బండి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. నేను పడలేదు, నీ పొగరు నాకు నచ్చలేదు. ఈ తాగుబోతు నారాయణకి ఈగో హార్ట్ అయ్యింది. నీకు బుద్ధి చెప్పాలని వెతుక్కుంటూ వచ్చాను.. తీరా ఇక్కడికొచ్చి చూస్తే ఈ అక్కని కట్టేసి ఏదేదో వాగుతున్నావు. అప్పుడు డిసైడ్ అయ్యా.. ఈ అక్కని కాపాడితే నీకు బుద్ధి చెప్పినట్లేనని అంటాడు నారాయణ. నువ్వు దీనిని కాపాడతావా? అంటూ ఐశ్వర్య ఫైర్ అవుతుంది.
అక్కకి చదువు రాదని చెప్పావు కదా? అక్కా వేలిముద్రే, మనము వేలిముద్రే. అక్కడ కనెక్ట్ అయ్యానని అంటాడు నారాయణ. నిజంగానే నువ్వు నన్ను కాపాడతావా అని అడుగుతుంది ఇందూ. ఈ తాగుబోతు నారాయణ తాగకముందు ఏమో కానీ, తాగినది తర్వాత అబద్ధం చెప్పడని అంటాడు. అర్జెంట్‌గా వచ్చి కట్లు విప్పేయ్ నేను ఆఫీస్‌కి వెళ్లాలని అంటుంది ఇందూ. ఇందాక అంతా విన్నాను, నువ్వేం కంగారు పడకు.. నిన్ను నేను తీసుకెళ్తానని అంటాడు నారాయణ. నువ్వు తనని తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఉంటానా అంటుంది ఐశ్వర్య. చూడకుండా ఏం చేస్తావు ఆంటీ అంటూ సెటైర్లు వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications