Brahmamudi March 10th Episode: రేఖ ప్లాన్‌ని తిప్పికొట్టిన ఇందూ.. అనారోగ్యంతో సుభాష్, అపర్ణకి అగ్నిపరీక్ష

Photo Courtesy: JioHotstar

పరీక్ష హాల్‌లో స్లిప్స్ పెట్టి దొరికిపోతుంది ఐశ్వర్య. దాంతో ఆమెను, ఆమె ఫ్రెండ్స్‌ని డిబార్ చేస్తారు. ఇదంతా చూసిన ఇందూ.. ఫాస్ట్‌గా ఎగ్జామ్ రాస్తుంది. భూషణ్ చేసిన అప్పుకి బదులుగా అతని కంపెనీని క్యాప్చర్ చేయాలని అనుకుంటాడు చక్రీ. దాంతో తన చేతికి త్వరలోనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వస్తుందని.. ఆ కంపెనీ కాంట్రాక్ట్స్ అన్నీ నీకే ఇస్తానని ఆఫర్ చేస్తుంది రేఖ. ఆలోచనలో పడ్డ చక్రీ చివరికి డీల్‌కి ఓకే అంటాడు. నాకు మరో 2 కోట్ల రూపాయలు కావాలని రేఖ అడగటంతో సరేనని చెక్ రాసి ఇచ్చేస్తాడు చక్రీ. ఎగ్జామ్ రాసి తిరిగొస్తున్న ఇందూని రేఖ- భూషణ్‌లు చూస్తారు.

పనికిరాని లాప్‌లాప్‌ని చీటింగ్ చేసి ఓ వ్యక్తికి అమ్మేస్తాడు స్వరాజ్. అది 5 నిమిషాలకు మించి వర్క్ కాదని తెలిసి వెంటనే హోటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ విషయాన్ని కస్టమర్ అడగ్గా.. మేం నీకు పనికిరాని లాప్‌లాప్ అమ్మానని స్వరాజ్ చెప్పడంతో ఆ వ్యక్తి షాక్ అవుతాడు. ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చిన ఇందూపై సీరియస్ అవుతుంది రేఖ. నేను ఇల్లు దాటి బయటకు వెళ్లొద్దని చెప్పాను కదా? ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది. స్వాతి డ్రెస్ కుట్టించమని భ్రమరాంబ పిన్ని పంపిస్తేనే వెళ్లానని అంటుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 10వ తేదీ ఎపిసోడ్ 976లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 10th 2026 Episode 976 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూని నా కూతురే బయటకు పంపించింది.. ఇందులో అనుమానం లేదని రేఖతో భ్రమరాంబ చెబుతుంది. అనుమానించాలి ఎందుకంటే దీనిలో ప్రవహిస్తున్న రక్తం మామూలు రక్తం కాదు.. అణువంత అవకాశమున్నా, ఆకాశాన్ని కూడా సొంతం చేసుకునే తెలివితేటలున్న రక్తం. నేను నిజంగానే బట్టలు కుట్టించడానికి వెళ్తానని ఇందూ అంటుంది. అయితే ఆ టైలర్ షాప్ పేరు ఏంటీ? అని అడుగుతుంది రేఖ. సత్యం బాబు టైలర్స్.. వాడి పేరు సత్యం బాబు అని చెబుతుంది ఇందూ. అయితే ఫోన్ నెంబర్ చెప్పమని అడుగుతుంది రేఖ. నా దగ్గర అతని ఫోన్ నెంబర్ లేదని చెబుతుంది ఇందూ. బట్టలు కుట్టించడానికి వెళ్లిన నువ్వు వాడి ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకుంటావని.. స్వాతిని ఫోన్ నెంబర్ చెప్పమని అడగటంతో ఆమె టెన్షన్ పడుతుంది.

సంక్రాంతికి వాడి దగ్గరే నువ్వు బట్టలు కుట్టించుకున్నావు.. గంటకు ఒకసారి వాడికి ఫోన్ చేసేదానివి కదా అని అంటుంది రేఖ. ఆ మాటలో స్వాతి కంగారుపడుతుంది. దాంతో స్వాతి ఫోన్ నెంబర్ ఇస్తుంది. రేఖ ఆ టైలర్‌కు ఫోన్ చేయడంతో ఇందూ మేడం వచ్చారని చెబుతాడు టైలర్. దాంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. అయితే అంతకుముందే టైలర్‌ని కలిసిన ఇందూ.. నేను కూడా మీ దగ్గరే బట్టలు కుట్టించుకుంటాను. మీ రెగ్యులర్ కస్టమర్ పేరు తెలుసుకోమని నా పేరు ఇందూ అని చెబుతుంది. నాది స్ట్రాంగ్ మెమొరి.. నీ పేరు గుర్తు పెట్టుకుంటానని అంటాడు. ఇదంతా గుర్తొచ్చి ఇందూ నవ్వుకుంటుంది.

నేను గడప దాటి కాలు బయటపెడితే మీరెందుకు అంతలా భయపడిపోతున్నారని రేఖని ప్రశ్నిస్తుంది ఇందూ. ఆ మాటలతో రేఖ, భూషణ్, భ్రమరాంబ షాక్ అవుతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పడానికి భయపడే నువ్వు.. మొదటిసారి నన్ను ప్రశ్నిస్తున్నావేంటీ అని రేఖ సీరియస్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యం? ఎవరు నేర్పిస్తున్నారు? నేను చెప్పిన పని చేయడం వరకే నీ పని సీరియస్ అవుతుంది రేఖ. చిన్న విషయానికే అంత గొడవ ఎందుకు చేశావని భ్రమరాంబ అడుగుతుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆస్తి మొత్తం మన సొంతం కాబోతోంది.. అది జరగాలి అంటే మనం చెప్పిన చోట ఇందూ సంతకం పెట్టాలి. అప్పటి వరకు ఇది చేజారిపోకుండా మన గుప్పిట్లో ఉండాలని చెబుతుంది రేఖ. పాతికేళ్ల నిరీక్షణ.. వృథా కాకూడదని అంటుంది.

ఎగ్జామ్ ఎలా రాశావని అడుగుతుంది అపర్ణ. నీ మనవరాలు రాశాక కూడా నీకు అనుమానంగా ఉందా? ట్రైనింగ్ ఎవరిది? పాస్ అవ్వడం ఏంటీ.. డిస్టింక్షన్ తెచ్చుకుంటానని చెబుతుంది ఇందూ. ఇంతలో స్వాతి వచ్చి ఆ రేఖ ఆంటీ పెట్టిన టెన్షన్‌కి చెమటలు పట్టేశాయని చెబుతుంది. ఎగ్జామ్ రాయడానికి వెళ్లిన నువ్వు టైలర్ షాప్‌కి ఎప్పుడు వెళ్లావని ప్రశ్నిస్తుంది స్వాతి. మా అపర్ణా దేవి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా నన్ను చదివిస్తుంటే ఆ మాత్రం జాగ్రత్త నేను తీసుకోనా అని అంటుంది ఇందూ. రేఖ ఆంటీకి అనుమానం వస్తుందని ముందే గెస్ చేశా.. నా ఎగ్జామ్‌ని గంట ముందే రాసేసి టైలర్ షాప్‌‌కి వెళ్లి ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకున్నానని చెబుతుంది ఇందూ.

ఈరోజు నాకు, ఐశ్వర్యకి ఒకటే ఎగ్జామ్ హాల్ అని ఇందూ చెప్పడంతో అపర్ణ, స్వాతి షాక్ అవుతారు. నీ కలని, ఆశయాల్ని నిజం చేస్తానని ఇందూ చెప్పడంతో .. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, కానీ నీ చెల్లెలు నందూని తలచుకుంటే బాధగా ఉందని అపర్ణ ఏడుస్తుంది. ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయి చాలా తప్పు చేసిందని ఇందూ బాధపడుతుంది. మన అందరికీ దూరమై అది ఎలా బతుకుతుందోనని ఏడుస్తుంది అపర్ణ.

ఇంతలో నందూని వెతుక్కుంటూ పోలీస్ బాబాయ్ వస్తాడు. బొకే షాప్ పెట్టుకుని నడుపుతూ ఉంటుంది నందూ. డిగ్రీ పూర్తి చేసేస్తే పోలీస్ ఆఫీసర్ అవుతావు కదా అని అతను అడగ్గా.. చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నావు.. మళ్లీ ఇప్పుడు నా ఖర్చులు కూడా నీకు భారం కాకూడదని చెబుతుంది ఇందూ. నేను పోలీస్ అవ్వాలి.. మా అక్కని కలవాలి, ఆ రేఖ ఆంటీ అంతు చూడాలని చెబుతుంది ఇందూ. మీ అక్కంటే ఇంత ప్రేమ పెంచుకున్నావు కదా.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనని చూడాలని అనిపించలేదా? అని బాబాయ్ ప్రశ్నిస్తాడు. మా అక్క మీద ప్రేమ కంటే ఆ రేఖ మీద కోపం ఎక్కువగా ఉందని చెబుతుంది నందూ.

ఇంతలో స్వరాజ్ తమ్ముడు వెంకట్ ఆమె దగ్గరికి వస్తాడు. ఎవరో అమ్మాయికి సైట్ కొడుతుండగా నందూ గమనిస్తుంది. నీ పారు వెళ్లిపోయింది కానీ నీకు ఏం కావాలని అడుగుతుంది నందూ. అక్కడ నందూ రాసిన కొటేషన్స్ చూసి ఆశ్చర్యపోతాడు. నీలో మంచి రైటర్ ఉందని మెచ్చుకుంటాడు వెంకట్. నీ లవర్ కోసం నేను హెల్ప్ చేయనా అని నందూ అడగ్గా.. నాకు అవసరం లేదు, నేనే చూసుకుంటానని అంటాడు. నీలాంటి వాళ్లు మళ్లీ నా దగ్గరికి వస్తారని చెబుతుంది నందూ. అనంతరం తన లవర్‌ను ఫాలో అవుతూ వెళ్లి.. నందూ రాసిన కొటేషన్స్ చెబుతూ తన గర్ల్‌ఫ్రెండ్‌కి బొకే ఇవ్వడంతో ఆమె సిగ్గుపడుతూ పారిపోతుంది. తన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని వెంకట్ సంతోషిస్తుండగా.. వెనకగా వచ్చిన నందూ అతనిని పట్టుకుంటుంది. నా కొటేషన్ వాడుకున్నందుకు డబ్బులు కట్టమని బెదిరిస్తుంది. దాంతో వెయి రూపాయలు ఇచ్చేస్తాడు వెంకట్. నా కొటేషన్స్ మార్నింగ్ కాఫీ లాంటివి, మళ్లీ నువ్వే వెతుక్కుంటూ వస్తావని అనుకుంటుంది నందూ.

సుభాష్‌కి అనారోగ్యంగా ఉండటంతో డాక్టర్‌ను పిలిపించి చూపిస్తుంది ఇందూ. ఇన్నేళ్లుగా మందులు వాడుతూనే ఉన్నాం.. కానీ రిజల్ట్ మాత్రం కనిపించడం లేదని బాధపడుతుంది ఇందూ. ఇది మందులతో తగ్గదు, నేను ఇస్తున్న టాబ్లెట్స్.. కేవలం నొప్పి తగ్గించడానికి తప్పించి ప్రాబ్లమ్‌ని క్యూర్ చేయదు. మీ తాతగారు ఉన్న కండీషన్‌కి ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ చేస్తే తప్పకుండా లేచి నడవగలరని చెబుతాడు డాక్టర్. ఆపరేషన్‌కి ఎంత ఖర్చు అవుతుందని అపర్ణ అడగ్గా.. 10 లక్షల రూపాయలు అవుతుందని చెబుతాడు డాక్టర్. ఆ మాటలతో ఇందూ, అపర్ణ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X