Brahmamudi March 12th Episode: ఇందూ ట్రాప్‌లో రేఖ, భ్రమరాంబ... మనవరాలి ఎత్తులకి అపర్ణలో సంతోషం

Photo Courtesy: JioHotstar

సుభాష్‌కి మందుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆపరేషన్ ఒక్కటే మార్గమని, లేదంటే ఇలా జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి వస్తుందని డాక్టర్ చెబుతాడు. అలాగే ఆపరేషన్‌కి 15 లక్షల రూపాయలు అవుతుందని చెప్పడంతో అపర్ణ, ఇందూలు షాక్ అవుతారు. దాంతో ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు కోసం రేఖని అడగటానికి వెళ్తుంది ఇందూ. ఇదే సమయంలో ఐశ్వర్య వచ్చి పార్టీ కోసం లక్ష రూపాయలు కావాలని అడగటంతో వెంటనే ఇచ్చేస్తుంది రేఖ. కానీ సుభాష్ ఆపరేషన్‌ని మాత్రం పట్టించుకోకుండా అవమానిస్తుంది. రాత్రికి మనింటికి శివరామ్ అని పెద్ద బిజినెస్‌మెన్ వస్తున్నాడని.. ఆయనకి మంచి వెరైటీలు వండాలని ఆర్డర్ వేయడంతో ఇందూ ఏడుస్తూ వెళ్లిపోతుంది.

ఈ ఆస్తి నా చేతికి వచ్చాక.. ఆ శివరామ్ ద్వారా మరింత ఎదగొచ్చని భ్రమరాంబతో చెబుతుంది రేఖ. టీ షాప్‌లో టీ తాగుతున్న ఓ రౌడీని గుర్తుపట్టిన నందూ.. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంది. ఇంతలో శివరామ్ దుగ్గిరాల వారింటికి వస్తాడు. ఆయనను లోపలికి పిలిచి ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది. ఇందూని మాత్రం పనిమనిషి అని చెబుతుంది. ఆ మాటలతో స్వాతి, అపర్ణ రగిలిపోతారు. ఫుడ్ చాలా టేస్ట్‌గా ఉండటంతో ఇందూని మెచ్చుకున్న శివరామ్.. తన ఇంట్లో వంట చేయడానికి పంపించమని అడుగుతాడు. ఖచ్చితంగా వస్తుందని రేఖ చెప్పగా.. ఇందూ కూడా సరేనని అంటుంది. ఇదంతా చూసిన రేఖ, స్వాతిలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 12వ తేదీ ఎపిసోడ్ 978లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 12th 2026 Episode 978 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

శివరామ్ ఇంట్లో ఇందూని వంట చేయడానికి పంపిస్తానన్న రేఖపై మండిపడుతుంది అపర్ణ. ఆ మాటిచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు? ఇది నా మనవరాలు.. దుగ్గిరాల ఇంటికి వారసురాలని చెబుతుంది. ఆయన దృష్టిలో మంచిగా ఉంటే కోట్లు కలిసొస్తాయని భ్రమరాంబ చెప్పడంతో.. అలాంటప్పుడు నువ్వే వెళ్లి వంట పని చేసుకో, అది కూడా చాలదు అంటే బూట్లు కూడా పాలిష్ చయమని చెబుతుంది అపర్ణ. నా మనవరాలిని ఎక్కడికి పంపించనని తేల్చేస్తుంది. వాళ్లింటికి వెళ్లి పనిచేయడానికి నీ మనవరాలికి అభ్యంతరం లేనప్పుడు నీకొచ్చిన అభ్యంతరం ఏంటీ అని రేఖ ప్రశ్నిస్తుంది. ఇంటికొచ్చిన అతిథి ముందు నీ పరువు తీయడం ఎందుకు అని అలా అని ఉంటుందని అపర్ణ చెబుతుంది.

ఆ పనిచేయడం నాకు ఇష్టం లేదని.. చెప్పుతో కొట్టినట్లు చెప్పమని ఇందూతో అంటుంది అపర్ణ. రేఖ మాటకు విలువిచ్చి ఒప్పుకున్నానని సమాధానం చెప్పామని రెచ్చగొడుతుంది భ్రమరాంబ. ఎవరికి భయపడొద్దు.. ఎవరి ఇంటికి పనిచేయాల్సిన అవసరం లేదని అంటుంది అపర్ణ. ఆ ఇంట్లో వంట పనిచేయడానికి వెళ్లడం నాకు ఇష్టమేనని ఇందూ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. దానికే నొప్పి లేనప్పుడు.. నువ్వెందుకు ఇంత ఆవేశపడుతున్నావని సీరియస్ అవుతుంది రేఖ. శివరామ్ గారింటికి ఇందూని పంపిస్తానని చెప్పావు.. ఆయన కూడా బిజినెస్‌లో హెల్ప్ చేస్తానని చెప్పాడు. ఇంకా ఎందుకు నీ ముఖం అంత డల్‌గా ఉందని అడుగుతుంది భ్రమరాంబ. అంతా బాగానే ఉంది కానీ ఈ ఇందూ అంత సులభంగా ఎలా ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నానని అంటుంది రేఖ. ఇందులో ఆలోచించడానికి ఏముంది.. మనల్ని ఎదిరించి బతకలేనని అర్ధం చేసుకుని ఉంటుందని చెబుతుంది భ్రమరాంబ. అంతే అంటావా అని రేఖ అడగ్గా.. ముమ్మాటికీ అంతే అంటుంది భ్రమరాంబ.

పనిమనిషిగా వెళ్తానన్న ఇందూని లోపలికి తీసుకెళ్లి స్వాతి, అపర్ణ నిలదీస్తారు. అంతా తెలిసే ఒప్పుకున్నానని ఇందూ చెబుతుంది. ఈరోజు పనిమనిషిగా వెళ్లమంది, రేపు బానిసగా బతకమంటుంది అని ఫైర్ అవుతుంది. ఆ రేఖ ఏం చెప్పినా చేయడానికి నేనేం గంగిరెద్దుని కాదు.. నీ మనవరాలిని అని చెబుతుంది. ఆ శివరామ్ గారికి నిజంగానే నా వంట నచ్చి పిలిచారు అనుకుంటున్నారా? అలా పిలవమని చెప్పిందే నేను అని అంటుంది ఇందూ. ఆ మాటలతో అపర్ణ, స్వాతిలు షాక్ అవుతారు. శివరామ్ గారికి నేనెవరో తెలియదు అనుకుని.. నేను వేసిన ప్లాన్ ప్రకారం రేఖ ఆంటీ వాళ్లింట్లో వంట చేయడానికి నన్ను పంపిస్తోందని ఆయనతో తనకు ఎలా పరిచయమో చెబుతుంది ఇందూ.

ఒకరోజు ఇందూ కూరగాయలు తీసుకుని వస్తుండగా కారు అడ్డదిడ్డంగా వచ్చి ఓ చెట్టును ఢీకొట్టి ఆగిపోతుంది. ఇందూ అతి కష్టం మీద కారు డోర్లు ఓపెన్ చేసి చూడగా శివరామ్ ఉంటాడు. ఏం జరిగిందని అడగ్గా.. ఆయన గుండె పట్టుకుని టాబ్లెట్ అని అరుస్తాడు. దాంతో ఇందూ టాబ్లెట్ ఇచ్చి శివరామ్‌ని కాపాడుతుంది ఇందూ. ఇలాంటి కండీషన్‌లో డ్రైవ్ చేసుకుంటూ ఎందుకు వచ్చారని అడుగుతుంది. ఈరోజు నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు.. నన్ను నమ్ముకుని ఉన్న కొన్ని వందల కుటుంబాలని అని చెబుతాడు శివరామ్. నువ్వు చేసిన సాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో అర్ధం కావడం లేదని అంటాడు. నాకు ఏ సాయం అవసరం లేదు.. మీరు హాస్పిటల్‌కి వెళ్లండి చాలు అంటుంది ఇందూ. అలా జరిగినదంతా అపర్ణ, స్వాతిలకు చెప్పడంతో వారిద్దరూ షాక్ అవుతారు. సాయంత్రం ఇంటికొచ్చే ముందు శివరామ్ గారిని కలిశానని.. ఆయనతో నన్ను తన ఇంటికి పనిమనిషిగా పంపించమని రేఖతో చెప్పమని ముందే చెప్పానని అంటుంది ఇందూ.

బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తాను.. తాతయ్యని కాపాడుకుంటానని చెబుతుంది ఇందూ. నేను బయటకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని చెబుతుంది. నీ డిగ్రీ ఇంకా పూర్తి కాలేదు కదా జాబ్ ఎలా చేస్తావని అడుగుతుంది స్వాతి. నా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని.. అతనిని అడుగుతానని చెబుతుంది స్వాతి. మరోవైపు.. లాప్‌టాప్ అమ్మిన డబ్బుతో పార్టీ చేసుకోవాలని అనుకుంటాడు స్వరాజ్. పబ్‌లో బిల్లు కట్టే బకరా ఎక్కడున్నాడా అని వెతుకుతాడు. నీ తమ్ముడు అని వాళ్ల ఫ్రెండ్ అని చెబుతాడు. నీ తమ్ముడి వీక్‌నెస్ మీద కొడితే వాడే బిల్లు కడతాడని చెబుతాడు. వెంటనే వెంకీకి ఫోన్ చేసి నీ లవర్ పబ్‌లో ఉందని చెప్పి ఆశపెట్టి పిలిపిస్తాడు ఫ్రెండ్.

వెంకీ పబ్‌కి రాగానే.. నిన్ను చూసి నాన్న ఎంతో మంచివాడని ఫీల్ అవుతున్నాడని చెప్పి సెల్ఫీ దిగి ఆ ఫోటోతో స్వరాజ్, అతని ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. చివరికి చేసేదేం లేక పర్స్ అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్లిపోతాడు వెంకీ. వెంటనే బేరర్‌ని పిలిచి ఆర్డర్ పెడతాడు. ఆ 50 వేలతో 10 లక్షలు సంపాదించే ప్లాన్ ఏంటో ఆలోచించావా అని రాజ్‌ని అడుగుతాడు ఫ్రెండ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X