Brahmamudi March 13th Episode: అక్కాచెల్లెళ్లని ఒకే చోటికి చేర్చిన విధి.. ఇందూని అనుభవించాలని రాఖీ ప్లాన్
Photo Courtesy: JioHotstar
ఇందూని శివరామ్ గారింటికి పనిమనిషిగా పంపడానికి నీకెంత ధైర్యమని రేఖపై మండిపడుతుంది అపర్ణ. ఇందూ ఈ ఇంటి వారసురాలు.. దుగ్గిరాల వారి రక్తమని చెబుతుంది. అయినా ఇందూకి లేని ఇబ్బంది నీకెంటీ అని ప్రశ్నిస్తుంది రేఖ. దాంతో నేను శివరామ్ గారింటికి వెళ్లనని చెప్పమని అపర్ణ చెప్పగా.. నాకు ఇష్టమేనని ఇందూ చెప్పడంతో అపర్ణ, స్వాతిలు షాక్ అవుతారు. ఇందూ అంత తేలికగా పనిమనిషిగా వెళ్లడానికి ఒప్పుకోవడంపై రేఖకి అనుమానం వస్తుంది. లోపల ఇందూకి అపర్ణ, స్వాతిలు క్లాస్ పీకుతారు.
వాళ్లిద్దరినీ కూల్ చేసిన ఇందూ.. నాకు శివరామ్ గారు ముందే తెలుసు, నేను చెప్పడం వల్లే ఆయన అలా అడిగారని చెప్పడంతో అపర్ణ, స్వాతిలు షాక్ అవుతారు. తాతయ్యకి ఆపరేషన్ చేయించాలి... మీ ఇద్దరినీ బాగా చూసుకోవాలని ఇందూ చెప్పడంతో ఆమె తెలివితేటలకి స్వాతి ఆశ్చర్యపోతుంది. లాప్‌టాప్ అమ్మి సంపాదించిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఫ్రెండ్‌తో చెబుతాడు స్వరాజ్. అయితే పబ్‌లో బిల్లు ఎలా కట్టాలో అర్ధం కాక తన తమ్ముడు వెంకట్‌ని అక్కడికి రప్పిస్తారు. మా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్యని అడిగి నీకు మంచి ఉద్యోగం చూస్తానని ఇందూతో స్వాతి చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 13వ తేదీ ఎపిసోడ్ 979లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తమ్ముడిని మోసం చేసి పబ్‌లో ఎంజాయ్ చేస్తాడు స్వరాజ్. ఆ 50 వేల రూపాయలతో పది లక్షలు సంపాదించే ప్లాన్ ఆలోచించావా అని అడుగుతాడు ఫ్రెండ్. ఇంతలో స్వాతి వాళ్ల ఫ్రెండ్‌తో మాట్లాడి ఇందూతో ఉద్యోగం గురించి చెబుతుంది. దాంతో ఇందూని వాళ్ల ఫ్రెండ్ దగ్గరకి వెళ్లమని చెబుతుంది స్వాతి. ఇంత రాత్రిపూట వెళ్లడం మంచిది కాదని ఇందూ అంటుంది. ఇంతలో అపర్ణ వచ్చి దానిని ఉదయం పూట పంపించడానికి రేఖ ఒప్పుకుంది.. రాత్రి వెళితే రేఖకి అనుమానం వస్తుందని అపర్ణ భయపడుతుంది. రిస్క్ అనేది మనకు ఉపయోగపడాలని చెబుతుంది స్వాతి. దాంతో అపర్ణ వెంటనే ఒప్పుకుంటుంది.
నేను ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అని స్వాతిని అడుగుతుంది. దాంతో ఇందూకి స్వాతి తన పాత ఫోన్, అడ్రస్ ఇచ్చి పంపిస్తుంది. తన జీవితంలో మొదటిసారి సొంతంగా నిర్ణయం తీసుకుని వెళ్తుందని దానిని జాగ్రత్తగా నడిపించమని భగవంతుడికి దండం పెట్టుకుంటుంది అపర్ణ. ఇంతలో ఓ స్మగ్లర్‌ను పట్టుకోవడానికి నందూ పబ్‌కి వస్తుంది. పబ్‌లో పార్టీని ఎంజాయ్ చేయడానికి వచ్చిన నందూని చూసుకోకుండా ఢీకొడుతుంది ఐశ్వర్య. చూసుకునే పనిలేదా? అయినా ఇలాంటి చీప్ మనుషుల్ని పబ్‌లోకి ఎందుకు రాణిస్తున్నారని ఐశ్వర్య మండిపడుతుంది. అమ్మనాన్నలు బాగా సంపాదించి నిన్ను గాలికి వదిలేసినట్లుగా ఉన్నారని నానామాటలు అంటుంది నందూ. ఇంపార్టెంట్ పని మీద వచ్చాను కాబట్టి సరిపోయింది.. ఈసారి నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది నందూ. దారినపోయే వాళ్లతో మనకెందుకు అని ఫ్రెండ్స్ చెప్పడంతో ఐశ్వర్య సరేనని అంటుంది.
ఇంతలో అదే పబ్‌కి ఇందూ కూడా వచ్చి.. స్వాతి చెప్పిన అతనికి ఫోన్ చేస్తుంది. వెంటనే తన బాస్‌కి ఇందూని పరిచయం చేస్తాడు సంతోష్. తను ఎలా పనిచేస్తుందో తనతో మాట్లాడి తెలుసుకుంటానని వెళ్లి తనని తీసుకురమ్మని చెబుతాడు. కొత్త పిట్టను పరిచయం చేస్తానని చెప్పావు.. అది ఇదేనా బాస్‌తో అంటాడు ఫ్రెండ్. తన బాస్ పేరు రాఖీ అని, తను ఓకే అంటేనే మీకు జాబ్ వస్తుందని పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు సంతోష్. నేను కష్టపడి పనిచేస్తానని నాకు అవకాశం ఇవ్వమని రాఖీని అడుగుతుంది ఇందూ. నా పాత పీఏకి మ్యారేజ్ అయి ఆ అమ్మాయి వెళ్లిపోయింది.. చాలామందిని ఇంటర్వ్యూ చేసినా ఎవ్వరూ నా అంచనాలను అందుకోలేదని చెబుతాడు రాఖీ. ఈ 30 నిమిషాలు నీకు టెస్ట్.. నేను అబ్జర్వ్ చేస్తానని అంటాడు రాఖీ. తనకు అడ్డుగా ఉన్న సంతోష్‌ని క్రెడిట్ కార్డ్ తీసుకురమ్మని బయటికి పంపిస్తాడు రాఖీ.
స్వరాజ్, అతని ఫ్రెండ్ లక్కీ పబ్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. స్వరాజ్ మందుని కూడా లక్కీ తాగేస్తుంటాడు. అయితే మందు ఎక్కకపోవడంతో బేరర్‌పై మండిపతాడు లక్కీ. అది స్కాచ్ అని ఆ మందు స్మూత్‌గా ఎక్కుతుందని బేరర్ చెబుతాడు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో బేరర్‌ని చితకబాదుతాడు లక్కీ. ఇందులో స్వరాజ్ వచ్చి అతనిని కాపాడతాడు. ఈ వెదవకి కల్తీకి, స్కాచ్‌కి తేడా తెలియడం లేదని మండిపడతాడు స్వరాజ్. నీకు కావాల్సిన స్కాచ్‌ని నేను తెప్పిస్తానని లక్కీని కూల్ చేస్తాడు. వెంటనే సర్వర్‌కి చెప్పి చీప్ లీక్కర్ తెప్పిస్తాడు స్వరాజ్. ఆ మందు తాగతానే లక్కీకి స్కాచ్‌లా అనిపిస్తుంది.
స్మగ్లర్ కోసం నందూ పబ్ మొత్తం గాలిస్తుండగా ఆ స్మగ్లర్ అక్కడికి వస్తాడు. ఇంతలో నందూకి వెంకీ కనిపించి బలవంతంగా డ్యాన్స్ చేయిస్తుంది. నేను నా గర్ల్‌ఫ్రెండ్ కోసం వచ్చానని చెబుతాడు వెంకీ. నేను మాత్రం నా గర్ల్ ఫ్రెండ్‌తోనే డ్యాన్స్ చేస్తానని అంటాడు. పార్ట్‌నర్ లేకుండా పబ్‌కి ఎందుకొచ్చావని అడుగుతాడు నందూ. నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్ధం కావడం లేదు, నువ్వు నా ప్రేమను నాశనం చేయడానికి వచ్చావని మండిపడతాడు వెంకీ. నందూ మాత్రం వెంకీని వెళ్లకుండా పట్టుకుంటుంది.
పబ్‌లో పరిస్ధితులు చూసి ఇందూకి అనుమానం వస్తుంది. ఇలాంటి చోట ఇంటర్వ్యూ చేయడం ఏంటీ అని అనుకుంటుంది. నేను ఎప్పుడూ ఇలాంటి ప్లేస్‌కి రాలేదని రాఖీతో చెబుతుంది ఇందూ. నువ్వు టెన్షన్ పడొద్దు.. మీ ఫ్రెండ్‌ని అనుకుని నాతో ఫ్రీగా మాట్లాడమని అంటాడు రాఖీ. ఇందూకి మందు పోస్తుండగా నాకు వద్దని తిరస్కరిస్తుంది. దాంతో నీ ప్లాన్ ఫెయిల్ అని రాఖీని అతని ఫ్రెండ్ వెక్కిరిస్తాడు. రోజూ నాకు ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉంటాయి.. నేను తాగుతూనే ఉంటాను, నా పీఏ మాత్రం తాగకూడదు అలర్ట్‌గా ఉండాలి. నేను నీకు పెట్టిన టెస్ట్‌లో పాస్ అయ్యావని చెబుతాడు రాఖీ. దాంతో ఇందూ ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










