Brahmamudi March 16th Episode: ఇందూ జాబ్ పొగొట్టిన స్వరాజ్.. పోలీసులకు దొరికిపోయిన లక్కీ- ఐశ్వర్య

Photo Courtesy: JioHotstar

పబ్‌లో ఇందూని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా నటించి ఆమెను ఎలాగైనా తన ట్రాప్‌లోకి తీసుకురావాలని అనుకుంటాడు రాఖీ. మరోవైపు.. ఇందూ సంతకం పెడితే తనకు రాబోయే ఆస్తుల గురించి రేఖ, భ్రమరాంబలు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇంత ఆస్తి కోసమే మా అమ్మ తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిందని చెబుతుంది రేఖ. ఇంత ఆస్తి వస్తున్నప్పుడు ఎన్నేళ్లయినా వెయిట్ చేయడంలో తప్పే లేదని అంటుంది భ్రమరాంబ. ఆస్తి మన సొంతం అయ్యాక ఇందూని నా కాళ్ల కింద చెప్పులా పెట్టుకుంటానని చెబుతుంది రేఖ.

ఇంతలో రేఖకు ఎక్కిళ్లు రావడంతో మంచినీళ్లు తీసుకుని రమ్మని ఇందూని పిలుస్తారు. ఇందూ లేకపోవడంతో అపర్ణ, స్వాతిలు టెన్షన్ పడతారు. ఇందూకి బదులుగా రేఖ వెళ్లి వాటర్ ఇస్తుంది. దాంతో ఇందూ ఎక్కడ? అసలు ఇంట్లోనే ఉందా? లేదా అని రేఖ, భ్రమరాంబలకు అనుమానం వస్తుంది. భ్రమరాంబ వెళ్లి గదిలో చూడగా ఇందూ ప్లేస్‌లో స్వాతి పడుకుని ఉండటంతో అపర్ణ ఊపిరి పీల్చుకుంటుంది. పబ్‌లో ఐశ్వర్యని పడేస్తానని వెళ్లి చీవాట్లు తింటాడు లక్కీ. దాంతో స్వరాజ్ తన ఫ్రెండ్‌తో పందెం కాసి వెళ్లి ఐశ్వర్యతో పులిహోర కలిపి ఆమె దగ్గరి నుంచి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. దాంతో ఫ్రెండ్స్ ఇద్దరూ గొడవపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 16వ తేదీ ఎపిసోడ్ 981లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 16th 2026 Episode 981 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూని అనుభవించడానికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలుపుతాడు రాఖీ. దానిని ఇందూ తాగబోతుండగా.. స్వరాజ్- లక్కీలు అనుకోకుండా దానికి తగలడంతో గ్లాస్ కిందపడి పగిలిపోతుంది. స్వరాజ్‌ను చూసి గుర్తుపట్టిన ఇందూ అతనిపై సీరియస్ అవుతుంది. దేన్నో ఒకదానిని గుద్ధడం తప్పించి నీకు వేరే పని లేదా అని నానామాటలు అంటుంది ఇందూ. నిజాలు తెలియకుండా మాట్లాడటం నీకు కూడా అలవాటే అంటాడు స్వరాజ్. జరిగినదానికి సారీ చెప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నావని రాఖీ అడగ్గా.. పగిలింది గాజు గ్లాసే కదా? కావాలంటే రెండు కొనిస్తానని అంటాడు స్వరాజ్.

ఎంతసేపు వస్తువులు, డబ్బు గురించేనా? ఎదుటివారి ఫీలింగ్స్ పట్టించుకోవా అని మండిపడుతుంది ఇందూ. ఎవడు వీడు.. ఇంత చీప్‌గా మాట్లాడుతున్నాడని అంటాడు రాఖీ. ఇతనెవరో నాకు తెలియదని అంటుంది ఇందూ. వీడి వాలకం చూశావా? పక్కా ఏదో బస్తీ నుంచే వచ్చినట్లుగా ఉన్నాడని అంటాడు రాఖీ. మా వాడిని ఏ మాటైతే అనకూడదో .. ఆ మాటే అనేశావు.. నువ్వు అయిపోయావని అంటాడు లక్కీ. మార్కెట్‌లో కొన్న బట్టలు వేసుకొస్తే నువ్వు, నేను సమానం అయిపోతామా అని అడుగుతాడు రాఖీ. దాంతో లాగిపెట్టి కొడతాడు స్వరాజ్. నేను కష్టపడి జీవితంలో ఎదగాలని అనుకుంటే ఇలా అవమానించి తొక్కేయాలని చూస్తావా? బస్తీలో పుట్టడం నా తప్పు కాదు.. కానీ అదే బస్తీలో చస్తే మాత్రం నాదే తప్పని అంటాడు రాజ్. మీ ఇద్దరికీ ఏదైనా గొడవ ఉంటే మీరు మీరు చూసుకోవాలి.. అంతేకానీ నన్ను కొట్టిస్తావా అని మండిపడతాడు రాఖీ. నీకు జీవితంలో నా కంపెనీలో ఎలాంటి ఉద్యోగం దొరకదని వెళ్లిపోతాడు.

దాంతో రాజ్‌పై అరుస్తుంది ఇందూ. వాడు నన్ను బస్తీ గాడు, చీప్ ఫెలో అంటే నేను భరించాలా? తలవంచుకుని బతకడం ఈ రాజ్‌కి అస్సలు ఇష్టం ఉండదని అంటాడు స్వరాజ్. నేను ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నా ఇంటర్వ్యూ మొత్తాన్ని నాశనం చేశావని అంటుంది ఇందూ. పబ్‌లో ఇంటర్వ్యూ పెట్టాడంటేనే వాడు ఎలాంటి వాడో అర్ధం చేసుకోమ్మని చెబుతాడు స్వరాజ్. ఏదో ఒక లాగా బెదిరించి నాటకం ఆడి డబ్బులు గుంజడమే నీ పని అని అంటుంది ఇందూ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో? మళ్లీ మళ్లీ నిన్నే కలుస్తున్నానని అంటుంది. బుద్డి ఉన్నాడు ఎవరైనా నీతో మళ్లీ మాట్లాడాలని అనుకుంటాడా అని కోపంగా ఇందూ వెళ్తూ గ్లాస్ మీద కాలు వేసి జారిపడబోతుండా స్వరాజ్ ఆమెను పట్టుకుంటాడు.

స్మగ్లర్‌ను వెంటాడుతూ వెళ్తుంది నందూ. తన వెంట వెంకీని కూడా తీసుకెళ్తుంది. వెంటనే ఆ స్మగ్లర్‌ను పట్టుకుంటుంది నందూ. 5 నెలల్లో 1000కి పైగా ఫోన్లను దొంగతనం చేసి అమ్మేశావు. నీలాంటి వాడి కోసం పోలీసులు కాకుండా పిల్లనిచ్చే మావయ్య వస్తాడా అని మండిపడుతుంది నందూ. మిడిల్ క్లాస్ వాళ్లు కష్టపడి ఫోన్లు కొనుక్కుంటుంటే, నువ్వు చిటికె వేసినట్లుగా అమ్మేస్తావా? నీ వల్ల ఎంతోమంది ఏడ్చుంటారు. నీలాంటోళ్లు సొసైటీలో ఉండకూడదని అంటుంది నందూ. మరోవైపు.. పబ్‌లో పీకలదాకా తాగి వస్తున్న ఐశ్వర్యను చూసి ఇందూ షాకై పక్కన దాక్కొంటుంది.

ఇంతలో ఐశ్వర్య మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయలేకపోతుంది. అది చూసిన లక్కీ.. స్వరాజ్ బైక్ తీసుకుని ఐశ్వర్యకి లిఫ్ట్ ఇస్తానని చెబుతాడు. కానీ రాజ్ వద్దని చెబుతాడు. అయినప్పటికీ లక్కీ బైక్ తీసుకుని వెళ్తాడు. లిఫ్ట్ ఇస్తావా? లేదా? అంటూ లక్కీని దబాయిస్తుంది ఐశ్వర్య. కూర్చోవడానికి సీటు కనిపించడం లేదని ఐశ్వర్య చెబుతుండగా దీనికి బాగా ఎక్కువైందని మండిపడతాడు లక్కీ. బైక్ మీద వెళ్తున్న లక్కీ- ఐశ్వర్యలని ఇందూ చూసి షాక్ అవుతుంది. ఇంతలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులకు లక్కీ- ఐశ్వర్య దొరికిపోతారు. ఆ అమ్మాయి ఎవరు? తన పేరు ఏంటీ? ఏం చేస్తుంటుంది? ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? అని పోలీసులు అడగ్గా.. లక్కీ అన్నీ మరిచిపోతాడు. నువ్వు కిడ్నాపర్‌వి అని మాకు అర్ధమైపోయింది. పబ్‌లో అమ్మాయిలని మాటలతో మాయ చేసి ఇలా బైక్ ఎక్కించుకుని కిడ్నాప్ చేస్తున్నావా? అని పోలీసులు అడగటంతో లక్కీ కంగారు పడతాడు.

ఈ అమ్మాయి కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నానని చెబుతాడు లక్కీ. వీడిని అరెస్ట్ చేసి, బైక్‌ని సీజ్ చేయమని ఎస్ఐ చెప్పడంతో ఇదంతా చూస్తున్న ఐశ్వర్య, స్వరాజ్‌లు షాక్ అవుతారు. దాంతో వెంటనే ఈ విషయాన్ని స్వాతికి ఫోన్ చేసి చెబుతుంది ఇందూ. ఐశ్వర్యని పోలీసులు అరెస్ట్ చేశారని...మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని అంటుంది. సెల్‌ఫోన్ స్మగ్లర్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంది నందూ. ఇది చూసిన పోలీస్ బాబాయ్.. అర్ధరాత్రి పూట ఇలాంటి రిస్క్ చేయొద్దని మండిపడతాడు. రేపు డ్యూటీలో జాయిన్ అయితే అర్ధరాత్రి డ్యూటీలు ఉంటాయి కదా అని అంటుంది నందూ. ఇంతలో ఐశ్వర్య, లక్కీలను తీసుకుని ఎస్ఐ అక్కడికి వస్తాడు. నాకు ఇలాంటి చిన్నా చితకా కేసులొద్దు.. పేరున్న కేసుల్ని ఇవ్వమని అడుగుతుంది నందూ.

ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేసే బిజినెస్ ఎంతకాలంగా చేస్తున్నావు? అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నావా? లేక ఆర్గాన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నావా అని లక్కీని అడుగుతాడు ఎస్ఐ. మీ గ్యాంగ్‌లో ఎంతమంది ఉన్నారు? అని నిలదీస్తాడు. నా సర్వీసులో నీలాంటి వాళ్లని ఎంతోమందిని చూశానని అంటాడు. ఆ వెంటనే నీ పేరు ఏంటీ? అని ఐశ్వర్యని అడగ్గా.. గుర్తురావడం లేదని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X