Brahmamudi March 17th Episode: ఐశ్వర్యని విడిపించిన ఇందూ.. రేఖకి దొరికిపోయిన అక్కాచెల్లెళ్లు

Photo Courtesy: JioHotstar

ఇందూని అనుభవించాలని కుట్ర చేసిన రాఖీ ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇవ్వబోతుండగా స్వరాజ్- లక్కీలు పరిగెత్తుకురావడంతో ఆ గ్లాస్ కిందపడిపోతుంది. దాంతో స్వరాజ్‌పై ఇందూ మండిపడుతుంది. బస్తీలో ఉండేవాళ్లు.. ఇలాంటి ఏరియాలకు రాకూడదని రాఖీ నోరు పారేసుకోవడంతో స్వరాజ్ లాగి పీకుతాడు. దాంతో సీరియస్ అయిన రాఖీ.. నీకు ఉద్యోగం ఇవ్వనని ఇందూకి చెప్పి వెళ్లిపోతాడు. తన ఉద్యోగం పోగొట్టావంటూ స్వరాజ్‌పై ఇందూ మండిపడుతుంది. పబ్‌లో ఇంటర్వ్యూ పెట్టాడంటే వాడు ఎలాంటి వాడో అర్ధం చేసుకోవాలని చెబుతాడు రాజ్. ఇంటికి వెళ్తుండగా ఐశ్వర్య కనిపించడంతో పక్కన దాక్కొంటుంది ఇందూ.

పీకలదాకా తాగిన ఐశ్వర్యకు లక్కీ లిఫ్టి ఇస్తానని స్వరాజ్ దగ్గర బండి తీసుకుంటాడు. అయితే వాళ్లిద్దరినీ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. మరోవైపు.. ఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న దొంగని నందూ పట్టుకుని అదే పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తుంది. ఐశ్వర్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న ఇందూ టెన్షన్ పడుతుంది. వెంటనే విషయం స్వాతికి ఫోన్ చేసి చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 17వ తేదీ ఎపిసోడ్ 982లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 17th 2026 Episode 982 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మీ తల్లిదండ్రులు ఎవరు? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికే బైక్ ఎక్కించుకున్నాడు కదా అని ఎస్ఐ అడగటంతో మద్యం మత్తులో ఉన్న ఐశ్వర్య అదే నిజమని అంటుంది. దాంతో లక్కీని లాగిపెట్టి కొడతాడు ఎస్ఐ. ఇంతలో రాజ్ వచ్చి ఐడీ ప్రూఫ్స్ అన్ని చూపించడంతో లక్కీని వదిలేస్తాడు ఎస్ఐ. కానీ బైక్ ఇవ్వడం మాత్రం కుదరదు.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాబట్టి కోర్టులో ఫైన్ కట్టి బైక్ తీసుకోమని చెబుతాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. అసలే మా నాన్నకి అంతంత మాత్రం నమ్మకం.. ఇప్పుడు బైక్‌తో ఇంటికెళ్లకపోతే ఇంట్లో నాకు కష్టమే అంటాడు. ఎస్ఐ మాత్రం కోర్టులో ఫైన్ కట్టి తీసుకోమని వార్నింగ్ ఇవ్వడంతో స్వరాజ్ వెళ్లిపోతాడు.

ఐశ్వర్య ఫోన్ తీసుకుని లాక్ ఓపెన్ చేయమని ఎస్ఐ చెప్పగా.. మద్యం మత్తులో ఉన్న ఆమె గాల్లోనే నెంబర్లు నొక్కడంతో ఎస్ఐ షాక్ అవుతాడు. మత్తు తిగగానే తనే చెబుతుందని వెళ్లిపోతాడు. ఐశ్వర్య మాత్రం నన్ను కిడ్నాప్ చేయండి అంటూ గోల గోల చేస్తుంది. ఇంతలో స్వాతి, ఇందూలు పోలీస్ స్టేషన్‌కి వస్తారు. ఈరోజు ఎగ్జామ్ పూర్తయిందని ఏదో పార్టీకి వెళ్లి, అక్కడ డ్రింక్ చేసినట్లుగా ఉందని చెబుతుంది ఇందూ. పోలీసులకు, రౌడీలకు తేడా తెలియనంతగా తాగేసిందని మండిపడతాడు ఎస్ఐ. బయటకు పంపిద్దామని అనుకుంటే ఏదైనా జరిగితే తిరిగి మాకే చుట్టుకుంటుందని ఇప్పటి వరకు ఆమె అల్లరి భరించామని చెబుతాడు ఎస్ఐ.

ఫోన్ అన్‌లాక్ చేయమని నెంబర్లు గాల్లోనే నొక్కుతోందని చెబుతాడు ఎస్ఐ. ఎంతోమంది డబ్బున్న వాళ్లని చూశాను కానీ, ఈ రేంజ్‌లో మమ్మల్ని ఎవరూ ఆడుకోలేదని మండిపడతాడు. ఇందాక నేను పబ్‌లోకి వెళ్లినప్పుడు కూడా చాలా ఓవరాక్షన్ చేసిందని బాబాయ్‌తో చెబుతుంది నందూ. అక్కడే నాలుగు పీకుదామని అనుకున్నా.. పని మీద ఉన్నాను కాబట్టి వదిలేశా, అమ్మాబాబులు సంపాదిస్తే ఇలాగే తయారవుతారని మండిపడుతుంది నందూ. వాళ్లతో పోలిస్తే నీ కూతురు బంగారమని చెబుతుంది.

ఐశ్వర్యని స్వాతి, ఇందూ కలిసి కారు ఎక్కించబోతుండగా.. నువ్వంటే నాకు చీరాకు, ఐ హేట్ యూ అంటూ ఇందూని తోసేస్తుంది ఐశ్వర్య. అది చూసిన నందూ కిందపడిపోతున్న ఇందూని పట్టుకుంటుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్‌గా కనిపిస్తున్నారు.. ఇలాంటి దానితో మీకు ఫ్రెండ్‌షిప్ ఏంటీ? అని నిలదీస్తుంది నందూ. మిమ్మల్ని చూడగానే చాలా ఇంటెలిజెంట్ అని అర్ధమవుతోంది.. చూడగానే చాలా కరెక్ట్‌గా చెప్పారని అంటుంది స్వాతి. తెలియనివారి గురించి ఇలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని చెబుతుంది ఇందూ. ఇప్పుడున్న సొసైటీలో మంచితనం, మానవత్వం రెండూ పనికిరావని అంటుంది నందూ.

ఐశ్వర్యని చీకట్లోనే లోపలికి తీసుకెళ్తారు ఇందూ- స్వాతి. ఇంతలో లైట్స్ ఆన్ అవుతాయి. మన కళ్లుగప్పి బయటకు వెళ్లారు.. అంటే మన అనుమానం నిజమే, ఈ ఇందూ అసలు ఇంట్లోనే లేదని చెబుతుంది భ్రమరాంబ. దానిని కప్పిపుచ్చడానికి దీని ముసలి నాయనమ్మ మన ముందు నాటకాలు ఆడిందని అంటుంది. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్లావు? ఎవరిని కలవడానికి వెళ్లావు? అని రేఖ నిలదీస్తుంది. ఐశ్వర్య నన్ను అడిగే పబ్‌కి వెళ్లింది.. నేను డబ్బులిస్తేనే వెళ్లింది, అది పబ్‌కి వెళ్లడానికి నువ్వు బయటికి వెళ్లడానికి కారణం ఏంటీ? నువ్వు బయటికి వెళ్లకూడదని నేను పెట్టిన కండీషన్‌ని బ్రేక్ చేసి, నా కళ్లుగప్పి మరి బయటికి వెళ్లావన్న మాట అని మండిపడుతుంది రేఖ.

అర్థరాత్రుళ్లు చెడు తిరుగుళ్లు తిరుగుతోంది నీ మేనకోడలు.. చేతనైతే దానిని దారిలో పెట్టుకోమని రేఖకి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. అర్థరాత్రి నీ మనవరాలు బయటికి ఎందుకు వెళ్లింది? నా మనవరాలు అలిసిపోయింది, పడుకుంది? అని చెప్పావు కదా? మరి ఇప్పుడు బయటి నుంచి ఎలా వచ్చిందని అడుగుతుంది రేఖ. నేనంటే భయం పోయిందా? నేనేం చేయగలనో మరిచిపోయావా? ఎవరి వల్ల తప్పు జరిగినా బాధ్యత తీసుకుంటానని చెప్పావు కదా అని ఇందూతో అంటుంది రేఖ. దానికి నువ్వు ఈరోజు శిక్ష అనుభవించాల్సిందే అని రేఖ అనడంతో ఇందూ వణికిపోతుంది. శిక్ష కంటే ముందు నీ మైండ్‌లో ఉన్న ప్లాన్ ఏంటో నాకు తెలియాలని అంటుంది రేఖ.

నేను ఇందూని బయటికి తీసుకెళ్లానని స్వాతి చెబుతుంది. ఐశ్వర్య అక్క పబ్‌ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎవరో బైకో ఎక్కిందట, పోలీసులు అరెస్ట్ చేయడం ఆ పబ్‌కి వెళ్లి నా ఫ్రెండ్ చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నా ఫ్రెండ్ సంతోష్ ఈ విషయం చెప్పాడు.. కావాలంటే మీరే కనుక్కోండి అంటుంది స్వాతి. ఐశ్వర్య అక్క ఎవరి బైక్ ఎక్కిందో ఏంటో? పోలీసులు అక్కకి, వాడికి ఏం సంబంధం ఉందని మీడియాకు చెప్పేస్తారేమోనని భయమేసింది. మనింటి పరువు పోకూడదని ఇందూ అక్కని నాతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఐశ్వర్య అక్కని తీసుకొచ్చామని చెబుతుంది స్వాతి. ఈరోజు నేను, ఇందూ అక్క ఈ రిస్క్ తీసుకోకపోయుంటే ఐశ్వర్య అక్క జీవితం నాశనమైపోతుందని అంటుంది స్వాతి. ఈ విషయం నాతో చెప్పే చేయొచ్చుగా , ఇంత సీక్రెట్‌గా ఎందుకు చేశారని అడుగుతుంది రేఖ.

నీకు చెప్పడానికి భయమేసింది.. నువ్వెప్పుడూ సీరియస్‌గా ఉంటావు, నీకేం చెప్పలేనని అంటుంది స్వాతి. మాతో ప్రేమగా ఉంటేనే కదా ఏదైనా ధైర్యంగా చెప్పగలనని చెబుతుంది. నా కూతురు ప్రేమ కోసం ఇంతగా తపిస్తోందని ఇప్పుడే తెలుసుకున్నానని ఏడుస్తుంది భ్రమరాంబ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X