Brahmamudi March 18th Episode: ఐశ్వర్య మాటలతో ఇందూ మనసు ముక్కలు.. అపర్ణకి రేఖ వార్నింగ్

Photo Courtesy: JioHotstar

పోలీస్ స్టేషన్‌లో ఉన్న లక్కీని స్వరాజ్ విడిపించడానికి వస్తాడు. వీడిని వదిలేసినా బండిని మాత్రం వదిలేది లేదని ఎస్ఐ చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. మరోవైపు.. ఐశ్వర్యని తన ఇంట్లోకి వాళ్లకి ఫోన్ చేయమని ఫోన్ ఇవ్వగా ఆమె గాలిలో నెంబర్లు నొక్కుతుంది. దాంతో ఎస్ఐ సీరియస్ అవుతాడు. ఇంతలో స్వాతి, ఇందూలు వచ్చి ఐశ్వర్యను తీసుకుని వెళ్తారు. తనను పట్టుకున్న ఇందూపై ఐశ్వర్య సీరియస్ అవుతూ.. మత్తులో ఉండి ఇందూని తోసేస్తుంది. కిందపడిపోతున్న ఇందూని నందూ పట్టుకుంటుంది.

చీకటిలో ఎవ్వరూ చూడకుండా ఐశ్వర్యని ఇంట్లోకి తీసుకెళ్తారు స్వాతి, ఇందూ. ఇంతలో లైట్స్ వెలిగి ఎదురుగా రేఖ ప్రత్యక్షమవుతుంది. రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్లావని రేఖ నిలదీయడంతో ఇందూ షాక్ అవుతుంది. చెడు తిరుగుళ్లు తిరుగుతోంది నీ మేనకోడలు.. నా మనవరాలు కాదంటూ అపర్ణ మండిపడుతుంది. నీకు నేనంటే భయం పోయింది.. నేనేం చేయగలనో మరిచిపోయావంటూ ఇందూపై సీరియస్ అవుతుంది రేఖ. దాంతో ఐశ్వర్యని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఇందూ అక్కని తీసుకుని వెళ్లానని చెబుతుంది స్వాతి. కావాలంటే పబ్‌కి, పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేయమని స్వాతి చెప్పడంతో రేఖ సైలెంట్ అయిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 18వ తేదీ ఎపిసోడ్ 983లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 18th 2026 Episode 983 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేఖని బోల్తా కొట్టించడంతో ఇందూ, స్వాతిలు నవ్వుకుంటారు. నీ పర్ఫార్మెన్స్‌కి ఏకంగా మీ అమ్మ కన్నీళ్లు కూడా పెట్టుకుందని అంటుంది ఇందూ. ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడగ్గా.. ఆల్‌మోస్ట్ సెలెక్ట్ అయ్యేదానిని చివరిలో ఒక వెధవ వచ్చి చెడగొట్టాడని మండిపడుతుంది. నీ లాప్‌టాప్‌లో ఇంటర్వ్యూలకి అప్లయ్ చేద్దామని చెబుతుంది ఇందూ. దాంతో సరేనని అంటుంది స్వాతి. నీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్లు మూడు కంపెనీలకు నేనే నీ రెజ్యూమ్‌ని ఫార్వార్డ్ చేశానని చెబుతుంది స్వాతి. రేపటి నుంచి శివరామ్ గారింట్లో వంట చేయడానికి వెళ్తున్నాను.. ఈ మూడు కంపెనీల్లో ఏదో ఒక దాని నుంచి ఇంటర్వ్యూ వస్తే బాగుండు అనుకుంటుంది ఇందూ.

బైక్ కనిపించకపోవడంతో ఏం చేశావని రాజ్‌‌ని నిలదీస్తాడు తండ్రి. సరిగ్గా ఇదే సమయంలో లక్కీ వచ్చి.. భయపడి అక్కడే ఆగిపోతాడు. బైక్‌ని తాకట్టు పెట్టావా? అమ్మేశావా? అని తండ్రి అడగటంతో రాజ్ కంగారుపడతాడు. ఈ విషయం నీ చిన్న కొడుకుని అడగమని ఇరికించేస్తాడు స్వరాజ్. పబ్‌లో దిగిన ఫోటోని చూపించి వెంకీని బ్లాక్‌మెయిల్ చేస్తాడు స్వరాజ్. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు? నీ నోటితోనే చెప్పు అంటాడు స్వరాజ్. చిన్నోడు చాలా మంచోడు, ఎవరైనా సాయం అడిగితే చేయకుండా ఉండలేడు. పాపం ఫ్రెండ్‌‌కి బైక్ ఇస్తే.. వాడు పీకలదాకా తాగేసి రోడ్డెక్కాడు. పోలీసులు పట్టుకుని బైక్‌ని సీజ్ చేశారని స్వరాజ్ జరిగినదంతా చెబుతాడు.

తాగుబోతు వెధవలతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చేయొద్దని వెంకీకి తండ్రి వార్నింగ్ ఇస్తాడు. వీడికి ఎవరు తాగుబోతో ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తాడు స్వరాజ్. చిన్నోడు తప్పు చేస్తే అనవసరంగా పెద్దోడి మీద పడ్డారు.. బంగారం లాంటి నిద్ర చెడగొట్టారని భర్తపై మండిపడుతుంది లక్ష్మీ. నాన్నకి చిన్నోడు అంటేనే ఇష్టమంటూ ఏడుపు నటిస్తాడు. బైక్ విడిపించడానికి వెంకీ దగ్గరే 1000 రూపాయలు కొట్టేస్తాడు స్వరాజ్. ఇంతలో లక్కీ వచ్చి నా ఫ్రెండ్ దగ్గర మంచి డీల్ ఉంది.. నీతోనే చెబుతానని అన్నాడని చెబుతాడు.

ఇందూ వంట చేస్తుండగా.. ఫోన్ రింగ్ వినిపించి కంగారుపడుతుంది. అటుగా వెళ్తున్న శేషానికి కూడా ఈ సౌండ్ వినిపించి అనుమానిస్తాడు. ఇందూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా.. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యింది, ఈరోజు ఇంటర్వ్యూ ఉందని రమ్మని పిలవడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఇంతలో వెనుక నుంచి ఎవరో చేయి వేసినట్లుగా అనిపించడంతో ఇందూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా అపర్ణ కనిపిస్తుంది. నిన్న ఒక కంపెనీకి అప్లయ్ చేశాను, ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తున్నారని అపర్ణకి చెబుతుంది ఇందూ. ఈసారి పబ్‌లో కాదు.. ఆఫీస్‌లో అని చెబుతుంది. నీ జీవితం నిమిషానికో గండం, క్షణానికో నరకం అన్నట్లు తయారైందని కంగారుపడుతుంది అపర్ణ. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని ఆశీర్వదించమని అడుగుతుంది ఇందూ. నీ ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుందని చెబుతుంది అపర్ణ.

పబ్‌లో ఈరోజు ఎంజాయ్ చేద్దామని ఐశ్వర్య తన ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా స్వాతి వచ్చి మండిపడుతుంది. నిన్న రాత్రి నువ్వు చేసింది చాల్లేదా? మళ్లీ పార్టీకి వెళ్లడానికి రెడీ అయిపోయావు అని నిలదీస్తుంది. నేను ఎక్కడికైనా వెళ్తాను.. అడగటానికి నీకు ఎలాంటి అధికారం లేదు, చిన్నపిల్లవి చిన్నదానిలా ఉండమని మండిపడుతుంది ఐశ్వర్య. నువ్వు పెద్దదానివే కదా? మరి నువ్వు బాధ్యతగా నడుచుకుంటున్నావా అని అడుగుతుంది స్వాతి. నిన్నరాత్రి ఎవడో ముక్కు ముఖం తెలియనివాడి బైక్ ఎక్కావు.. పోలీసులు పట్టుకుంటే పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్లావు. అక్కడ ఎంత గొడవ చేశావో కనీసం నీకు గుర్తుందా? అసలు పోలీసులు నిన్ను చూడలేదే అనుకో.. ఆ బైక్ ఎక్కించుకున్న వాడు నిన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్లి ఏమైనా చేసుంటే నీ పరిస్థితి ఏంటీ అని నిలదీస్తుంది స్వాతి.

నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు.. నీ హద్దుల్లో నువ్వు ఉండమని స్వాతికి వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. నేను నా హద్దుల్లోనే ఉంటున్నాను, కానీ నువ్వే హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావని సీరియస్ అవుతుంది. ఆ మాటలతో కోప్పడిన ఐశ్వర్య.. నందూని కొట్టబోతుండగా ఇందూ అడ్డుకుంటుంది. చిన్న పిల్లని కొడతావా అంటూ మండిపడుతుంది. దానిని కూడా నీతో తిప్పుకుంటూ నీలాగే తయారు చేశావు.. నోరు తెరిస్తే చాలు అది తప్పు, ఇది తప్పు అని వాగుతుంది, నాలుగు పీకితే దారిలోకి వస్తుందని ఫైర్ అవుతుంది ఐశ్వర్య. దారి తప్పుతున్నది నువ్వు.. ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకోమని చెబుతుంది ఇందూ. ఒక తల్లికి పుట్టకపోయినా మనం తోడబుట్టిన వాళ్లమని ఇందూ చెప్పగా ఐశ్వర్య సీరియస్ అవుతుంది. మా నాన్నని, మా నానమ్మని మీ అమ్మనాన్నే చంపారు.. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. నువ్వంటే నాకు అసహ్యమని ఐశ్వర్య ఫైర్ అవుతుంది.

నువ్వు ఈ ఇంటికి మహారాణివి, నువ్వు ఈ ఇంటికి పనిమనిషివి అని అంటుంది. ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది. అది నీ చెల్లెలు.. ఎలా మాట్లాడాలో తెలుసుకోమని వార్నింగ్ ఇస్తుంది. నేను ఇలాగే మాట్లాడతాను ఏం చేస్తావని ఐశ్వర్య అడగ్గా.. ఇందూ సీరియస్ అవుతుంది. ఇంకోసారి అక్కాచెల్లి అని వరసలు కలిపితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. రాత్రి ఇందూ అక్క హెల్ప్ చేయకపోతే ఏం జరిగేదో కూడా తెలియదని స్వాతి అంటుండగా భ్రమరాంబ మండిపడుతుంది. అసలు వీళ్లని ఈ ఇంట్లో పెట్టుకోవడం కూడా తప్పేనని అంటుంది ఐశ్వర్య. బతకమని వదిలేసినా బుద్ధి మాత్రం రాలేదని రేఖ ఫైర్ అవుతుంది. మా అందరికీ టిఫిన్లు, భోజనాలు పూర్తి చేసి శివరామ్ గారింట్లో వంట చేయడానికి వెళ్లమని చెబుతుంది రేఖ.

ఇందూని సొంత అక్కే తిడుతుంటే చూడలేకపోతున్నావా? ముందు ముందు చాలా చూడాలి.. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఐశ్వర్య మనసు మారదు.. ఎందుకంటే అది నా పెంపకమని అపర్ణతో అంటుంది రేఖ. మిమ్మల్ని నేనే కాదు.. నా మేనకోడలు కూడా ఎప్పటికీ క్షమించదని చెబుతుంది. రేఖ మాటలతో అపర్ణ బాధపడుతూ.. తన ముగ్గురు కోడళ్లు ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటుంది. ఇదంతా చూసిన సుభాష్.. ఏం జరిగిందని అడుగుతాడు. కావ్య, అప్పూ, స్వప్నలు ఎలా ఉండేవారు.. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు. అలాంటి వాళ్ల పిల్లలు ఎలా అయిపోయారోనని బాధపడుతుంది. నందూ ఎక్కడుందో తెలియదు, అసలు బతికుందో లేదో తెలియదని కంటతడి పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X