Brahmamudi March 19th Episode: రేఖకి అపర్ణ సూపర్ షాక్.. ఆస్తిని ఇందూకి దక్కించేలా స్కెచ్

Photo Courtesy: JioHotstar

రేఖని తెలివిగా బోల్తా కొట్టించడంతో స్వాతి, ఇందూలు నవ్వుకుంటూ ఉంటారు. ఒక వెధవ వల్ల నా ఉద్యోగం పోయిందని ఇందూ బాధపడుతుంది. దాంతో లాప్‌టాప్‌లో ఆన్‌లైన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తారు ఇందూ, స్వాతి. ఉదయాన్నే బైక్ కనిపించకపోవడంతో స్వరాజ్‌ను నిద్రలేపి నిలదీస్తాడు తండ్రి. ఏం చెప్పాలో తెలియక.. తమ్ముడి వల్ల ఇదంతా జరిగిందని, వాడి ఫ్రెండ్‌కి నా బైక్ ఇచ్చానని చెబుతాడు స్వరాజ్. వాడు పీకలదాకా తాగేసి పోలీసులుకు దొరికిపోవడంతో బైక్‌ను సీజ్ చేశారని అంటాడు. వెంకీ దగ్గరి నుంచి 1000 రూపాయలు తీసుకుని కోర్టులో ఫైన్ కట్టడానికి లక్కీతో కలిసి వెళ్తాడు స్వరాజ్. ఇందూ రెజ్యూమ్ చూసిన కంపెనీ వాళ్లు ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేయడంతో ఆమె సంతోషిస్తుంది.

సాయంత్రం పార్టీకి వస్తానని, అన్ని ఏర్పాట్లు చేయమని ఫ్రెండ్‌తో చెబుతున్న ఐశ్వర్యపై మండిపడుతుంది స్వాతి. రాత్రి నువ్వు చేసిన రచ్చ అంతా ఇంతా కాదని, నీ కోసం ఇందూ అక్కా నేను రిస్క్ చేశామని ఇకనైనా ఇలాంటివి మానేయాలని చెబుతుంది స్వాతి. ఆ మాటలతో కోప్పడిన ఐశ్వర్య ఆవేశంలో స్వాతిని కొట్టబోతుండగా ఇందూ ఆపుతుంది. నీకు మంచి చెప్పడం తప్పించి స్వాతి ఏ తప్పు చేయలేదని ఇందూ చెబుతుంది. మా నానమ్మ, నాన్నలని మీ అమ్మనాన్నలే చంపేశారు.. అందుకే నువ్వంటే నాకు అసహ్యమని మండిపడుతుంది ఐశ్వర్య. ఇదంతా చూసిన అపర్ణ.. ఐశ్వర్యపై ఫైర్ అవుతుంది. మీలాంటి వాళ్లను ఈ ఇంట్లో ఉండనివ్వడం తప్పని నానామాటలు అంటుంది. ఆ మాటలతో బాధపడిన అపర్ణ.. భర్త దగ్గర ఏడుస్తుంది. స్వప్న, కావ్య, అప్పూలు ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు. వాళ్ల పిల్లలు మాత్రం ఇలా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 19వ తేదీ ఎపిసోడ్ 984లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 19th 2026 Episode 984 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఐశ్వర్య, నందూ, ఇందూల గురించి సుభాష్ దగ్గర బాధపడుతుంది అపర్ణ. ఇందూ పరిస్ధితి రోజురోజుకు దారుణంగా మారిపోతోంది.. రేఖ, రుద్రాణి కంటే ఘోరంగా తయారైంది. స్వప్న కూతురిని తనలాగే పెంచుతోంది. ఈ వయసులోనే ఐశ్వర్య మనసులో విషాన్ని నాటుతోందని చెబుతుంది. ఇది ఇలాగే కొనసాగితే.. రేఖ, భ్రమరాంబతో పాటు ఐశ్వర్య కూడా ఇందూకి కొత్త శత్రువులా మారుతుంది. ఈరోజు మనం ఉన్నాం.. రేపు ఏమైనా జరగొచ్చు, అప్పుడు ఇందూ ఒక్కటే అయిపోతుందని బాధపడుతుంది. మనం ఏం చేయగలం.. లేవలేని పరిస్ధితుల్లో నేను ఉన్నాను, ఎదిరించలేని పరిస్ధితుల్లో నువ్వు ఉన్నావని చెబుతాడు సుభాష్. మనతో పనిలేకుండా ఇందూకి వాళ్లని ఎదిరించే శక్తి వస్తే అని ప్రశ్నిస్తుంది అపర్ణ.

ఈ ఆస్తి, కంపెనీ, ఫ్యాక్టరీలు ఎలాగూ ఇందూ పేరు మీదే ఉన్నాయి.. కొన్నిరోజుల్లో అవి తనకు సొంతం అవుతాయి. ఇన్నేళ్లుగా మన ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న రేఖని తప్పించాలని చెబుతుంది అపర్ణ. ఆ బాధ్యతల్ని ఇందూకి అప్పగించాలి, ఇందూ ఇప్పుడు చిన్నపిల్ల కాదని అంటుంది. ఆస్తి వచ్చే రోజు.. ఆ రేఖ ఎటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండాలంటే ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇందూ చేతుల్లోనే ఉండాలని చెబుతుంది అపర్ణ. ధైర్యం చేసి కోర్టులో కేసు వేశామంటే పవర్ మొత్తం ఇందూ చేతికి వచ్చేస్తుందని అంటుంది. వెంటనే లాయర్‌ని కలుస్తానని చెబుతుంది అపర్ణ.

శివరామ్ గారింటిలో వంట చేయడానికి వెళ్తున్నట్లు వెళ్లి.. ఇంటర్వ్యూకి వెళ్తానని స్వాతికి చెబుతుంది ఇందూ. వాళ్లిద్దరూ బయటకు వెళ్తుండగా భ్రమరాంబ గుమ్మం దగ్గరే కూర్చోవడంతో షాక్ అవుతుంది ఇందూ. అయితే శివరామ్ గారింటికి వెళ్లడానికి రేఖ పర్మిషన్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి ఊపిరి పీల్చుకుంటుంది. వంట చేయడానికి వెళ్తున్నానని భ్రమరాంబకు చెప్పి వెళ్తుండగా.. ఇందూని ఆపిన భ్రమరాంబ ఆ బ్యాగ్‌లో ఏమున్నాయో చూపించమని అడుగుతుంది. ఇందూ బ్యాగ్ తీసుకుని చెక్ చేస్తుండగా.. పాత బుద్ధులన్నీ చూపిస్తున్నావా అని భ్రమరాంబని అంటాడు శేషం. రకరకాల ఇళ్లలో వంటకి వెళ్లి అక్కడి చెంబులు, ఇతర వస్తువులు బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చావు కదా అని అంటాడు. ఆ మాటలతో భ్రమరాంబ సీరియస్ అవుతుంది.

కిందపడిపోయిన సర్టిఫికెట్స్‌ని ఇందూ సర్దుకుంటూ ఉండగా.. ఆ సర్టిఫికెట్స్ ఎవరివి అని రేఖ గొంతుతో ఇమిటేట్ చేస్తుంది స్వాతి. ఆ మాటలతో భయపడుతుంది ఇందూ. నీ పని వచ్చిన తర్వాత చెబుతానని చెల్లితో గొడవ పడుతుంది ఇందూ. శివరామ్ ఇంటికి వెళ్లిన ఇందూ ఆయనకి థ్యాంక్స్ చెబుతుంది. నా మాటకి విలువచ్చి, రేఖ ఆంటీని ఒప్పించి నేను ఇలా బయటకు వచ్చేలా చేశారని అంటుంది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు.. నీ రుణం ఎలా తీర్చుకోవాలని అడుగుతాడు. మీకు ఏమేం వంటలు కావాలో చెబితే చేసి పెడతానని అంటుంది ఇందూ. నా దగ్గర పనిచేయడానికి ఎంతో మంది ఉన్నారు.. నాకు కష్టమొస్తే నా భార్య ఉంది. నువ్వే నీ ఇంట్లో సరిగా మాట్లాడలేకపోతున్నావని అంటాడు శివరామ్.

అసలు బయటకు ఎందుకు రావాలని అనుకున్నావని శివరామ్ అడగ్గా.. నా కాళ్ల మీద నిలబడాలని, జాబ్ చేయాలని అనుకున్నానని చెబుతుంది ఇందూ. నీ జాబ్ విషయంలో ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు శివరామ్. ఇప్పటికే నా కోసం రిస్క్ తీసుకున్నారు.. ఇంకా ఇబ్బంది పెట్టనని చెబుతుంది ఇందూ. కానీ నీకు ఏ సాయం కావాలన్నా మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెబుతాడు శివరామ్. ఇంటర్వ్యూకి వెళ్తున్న ఇందూని స్వరాజ్ బైక్‌తో గుద్ధడంతో ఆమె ఫోన్ పగిలిపోతుంది. లాస్ట్ టైం కారుకి సొట్ట పెట్టావు, నిన్న రాత్రి నా జాబ్ పొగొట్టావు, ఈరోజు నా ఫోన్ పగలగొట్టావని మండిపడుతుంది ఇందూ. మర్యాదగా నా ఫోన్ రిపేర్ చేసి ఇవ్వమని గొడవ పడుతుంది. లక్కీ బతిమలాడటంతో స్వరాజ్‌ను కూల్ అవుతాడు.

రాజ్ సారీ చెప్పగా.. నాకు సారీ వద్దు, మర్యాదగా ఫోన్ రిపేర్ చేసి ఇవ్వమని అడుగుతుంది ఇందూ. లక్కీ మాట విని ఫోన్ రిపేర్ చేయించడానికి ఒప్పుకుంటాడు స్వరాజ్. సెల్‌ఫోన్‌ని చెక్ చేసిన మెకానిక్.. దీనిని రిపేర్ చేయాలంటే 7 వేల రూపాయలు అవుతుందని చెప్పడంతో స్వరాజ్, లక్కీలు షాక్ అవుతారు. దీని బదులు కొత్త ఫోన్ వస్తుందని రాజ్ చెప్పగా.. నాకు నా ఫోనే కావాలని అడుగుతుంది ఇందూ. అయితే మీ సిమ్ కొత్త ఫోన్‌లో వేయగానే ఆ మెసేజ్ ఇందులోకి వస్తుందని మెకానిక్ చెప్పడంతో ఇందూ సంతోషిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X