Brahmamudi March 20th Episode: ఇందూ జాబ్ పొగొట్టిన స్వరాజ్.. సుభాష్‌కు పాయిజిన్ ఎక్కించిన రేఖ
Photo Courtesy: JioHotstar
ఆస్తికి అసలు హక్కుదారు, వారసురాలు ఇందూయే. ఇప్పటి వరకు రేఖ పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీని ఇందూ పేరు మీదకి మార్చాలని అనుకుంటుంది అపర్ణ. ఈ విషయం చెప్పగానే సుభాష్ షాక్ అవుతాడు. మన మనవరాలి కోసం ఏం చేసినా నాకు ఇష్టమేనని చెప్పడంతో అపర్ణ వెంటనే లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఇంటర్వ్యూ కోసం సర్టిఫికెట్లు పెట్టుకుని బయల్దేరుతున్న ఇందూని భ్రమరాంబ అడ్డుకుని బ్యాగ్ చెక్ చేస్తుంది. ఇంతలో శేషం అన్న మాటలకు కోపంతో బ్యాగ్ విసిరేస్తుంది భ్రమరాంబ.
శివరామ్ గారింటికి వెళ్లిన ఇందూ.. ఆయనకు థ్యాంక్స్ చెబుతుంది. నువ్వు మా ఇంట్లో వంట చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో తాను ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానని చెబుతుంది ఇందూ. రేఖ అడిగితే నేను చూసుకుంటానని ధైర్యం చెబుతాడు శివరామ్. ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న ఇందూని స్వరాజ్ మరోసారి బైక్‌తో ఢీకొడతాడు. దాంతో ఇందూ ఫోన్ పగిలిపోతుంది. స్వరాజ్‌తో గొడవపడ్డ ఇందూ.. తన ఫోన్ తనకు కావాలని గొడవ చేయడంతో రాజ్ ఆమెకు కొత్త ఫోన్ తీసిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 20వ తేదీ ఎపిసోడ్ 985లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
లాయర్‌ను కలిసిన అపర్ణ.. ఇందూకి రావాల్సిన ఆస్తి గురించి చెబుతుంది. నా కొడుకు, కోడలు యాక్సిడెంట్‌లో చనిపోవడం వల్ల ఆస్తికి హక్కుదారు చిన్న పిల్లగా ఉన్న ఇందూ అయ్యింది. దాంతో పవరాఫ్ అటార్నీ మొత్తం నా పేరు మీద ఉండేది. కానీ బలవంతంగా నా నుంచి ఆ రేఖ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకుందని చెబుతుంది. అది పూర్తిగా ఇల్లీగల్ ఇన్నాళ్లు మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారని అడుగుతాడు లాయర్. అప్పుడు నాకున్న పరిస్థితులు వేరు.. నా వాళ్లని కాపాడుకోవడానికి అలా చేశాను, 22 ఏళ్లుగా మా ఖర్చుల కోసం కంపెనీ నుంచి ప్రతి నెలా వస్తున్న డబ్బు మొత్తం ఆ రేఖే తీసుకుంటోంది. దాని వల్ల నా మనవరాళ్లకి అన్యాయం జరుగుతోందని చెబుతుంది అపర్ణ.
ఇది ఇంకా పెద్ద తప్పు మేడం.. మీరు గనుక కోర్టుకు వెళితే ఇన్నేళ్లుగా మీరు రాకుండా వాళ్లు దోచుకున్న డబ్బు మొత్తం తిరిగి మీకే కట్టాలని కోర్టు ఆర్డర్ ఇస్తుందని చెబుతాడు లాయర్. వాళ్లు ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి రాకపోయినా పర్లేదు.. ఇప్పుడు నా మనవరాలు మేజర్ కాబట్టి, తన పేరు మీదకి ఆస్తి మొత్తం ట్రాన్స్‌ఫర్ అయ్యే వరకు పవరాఫ్ అటార్నీ కూడా నా మనవరాలికి వచ్చేలా కోర్టులో కేసు వేయమని అడుగుతుంది అపర్ణ. ఇది చాలా చిన్న కేసు.. రేఖ గారు ఎంత ప్రయత్నించినా ఈ కేసులో నిలబడలేరు, వాళ్లు చేసిన తప్పుకు శిక్ష కూడా పడొచ్చు. ఇందులో మీరే గెలుస్తారని చెబుతాడు లాయర్. కోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చే వరకు ఈ విషయం రేఖకి తెలియకూడదని చెబుతుంది అపర్ణ. కేసు పూర్తయ్యే వరకు విషయం ఎవరికీ పూర్తి చేయనని చెబుతాడు లాయర్. మీకు ఫీజు ఇవ్వలేను.. నా దగ్గర ఉన్నది బంగారం మాత్రమేనని అతనికి ఇస్తుంది అపర్ఱ.
ఇందూ వెళ్లేసరికి ఇంటర్వ్యూలు పూర్తయి పోవడంతో ఆమె కంగారుపడుతుంది. అక్కడ ప్యూన్ ఆమెను చూసి లోపలికి పంపించడం కుదరదని చెబుతాడు. అయితే ఇందూ రిక్వెస్ట్ చేయడంతో హెచ్ఆర్ రూమ్‌లోకి పంపిస్తాడు. లేట్ కావడంతో ఇంటర్వ్యూ చేయడానికి హెచ్ఆర్ ఒప్పుకోడు. తాను టైంకి ఇంటర్వ్యూకి బయల్దేరాను, కానీ దారిలో ఒక వెధవ వల్ల ఇలా జరిగిందని చెబుతుంది ఇందూ. నేను టాలెంట్‌ని నమ్మను, టైమింగ్‌నే నమ్ముతానని కసురుకుంటాడు హెచ్ఆర్. దాంతో ఇందూ బాధపడుతూ బయటకు వస్తుంది. అనవసరంగా ఆ వెధవ వల్ల జాబ్ పోయిందని రగిలిపోతుంది.
లాస్ట్ టైం నేను ఇచ్చిన లాప్‌టాప్‌ని 50 వేలకు అమ్మావని లక్కీ చెప్పాడు.. దేనికీ పనికిరాని ఆ లాప్‌టాప్‌ని 50 వేలకు అమ్మడం నాకు బాగా నచ్చింది. నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ సపోర్ట్‌గా పనిచేస్తున్నాను. అక్కడ ఏమైనా లాప్‌టాప్స్ ప్రాబ్లమ్ వస్తే నేనే వాటిని సర్వీస్ చేయిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ సాప్ట్‌వేర్ కంపెనీలో పనికిరాని లాప్‌టాప్‌లోని నేనే స్క్రాప్ కింద కొన్నాను. వాటిని కష్టపడి 48 గంటలు పనిచేసేలా చేస్తానని, ఆ తర్వాత అవి ఎప్పటికీ పనిచేయవని చెబుతాడు ఓ వ్యక్తి.
దాంతో 25 లాప్‌టాప్‌లను కొనేస్తాడు రాజ్. వాటిని ఎలా అమ్ముతావని లక్కీ అడుగుతాడు. ఒక్కొక్క లాప్‌లాప్‌ని పోస్ట్ చేసి అమ్మడానికి ఐదు రోజులు పడుతుంది.. 25 లాప్‌టాప్‌లు ఎలా అమ్ముతావని ప్రశ్నిస్తాడు లక్కీ. 25 లాప్‌టాప్‌లను అమ్మాలంటే స్కామ్ చేయాల్సిందేనని చెబుతాడు రాజ్. ఇంటి దగ్గరి నుంచి పనిచేసుకునే సువర్ణ అవకాశమని, లాప్‌టాప్స్ మనమే ఇస్తామని చెప్పి వాళ్ల దగ్గరి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి నుంచి 20 వేల రూపాయలు వసూలు చేస్తామని, దీని వల్ల 5 లక్షల రూపాయలు వస్తుందని చెబుతాడు స్వరాజ్. ఈ ప్లాన్ వినగానే లక్కీ సర్‌ప్రైజ్ అవుతాడు.
ఇంటికొస్తున్న అపర్ణ, ఇందూలు ఎదురవుతారు. ఉద్యోగం ఏమైందని అపర్ణ అడగ్గా.. ఒక వెధవ వల్ల అంతా నాశనమైపోయిందని చెబుతుంది ఇందూ. ఇంతలో సుభాష్ గదిలో నుంచి డాక్టర్ బయటకు రావడంతో ఏం జరిగిందని రేఖని అడుగుతుంది ఇందూ. నువ్వంటే శివరామ్ గారింటికి వెళ్లావు, మరి నువ్వు ఎక్కడికి వెళ్లావని అపర్ణని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో అపర్ణ షాక్ అవుతుంది. మీరిద్దరూ బయటకు వెళితే అంకుల్‌ని ఎవరు చూసుకుంటారు. ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది.. టైంకి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా ప్రాబ్లమ్ అయ్యేదని రేఖ చెప్పడంతో ఏం జరిగిందోనని ఇందూ, అపర్ణలు కంగారుగా లోపలికి వెళ్తారు.
ఇప్పుడు ఎలా ఉంది? బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందని సుభాష్‌ని అడుగుతుంది ఇందూ. నాకు ఏం కాలేదు.. బీపీ, షుగర్ చెక్ చేసి విటమిన్ డీ తక్కువగా ఉందని ఇంజెక్షన్ చేసి వెళ్లిపోయాడని చెబుతాడు సుభాష్. ఆ మాటలతో ఇందూ, అపర్ణలు షాక్ అవుతారు. వాళ్లని చూస్తేనే నీకు పడదు.. ఆ ముసలోడి కోసం నువ్వు డాక్టర్‌ని పిలిపించావా? అని రేఖని అడుగుతుంది భ్రమరాంబ. ఇంతలో సుభాష్‌కి నిజంగానే బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడంతో ఇందూ, అపర్ణలు కంగారుపడుతూ ఈ విషయాన్ని రేఖకి చెబుతారు. కారుతో పాటు డ్రైవర్‌ని కూడా ఇస్తాను.. జాగ్రత్తగా తీసుకెళ్లండి అని చెబుతుంది రేఖ.
డాక్టర్ గారు అక్కడ అంకుల్ పరిస్ధితి చూసి బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటీ? అని అడిగితే ఏం చెబుతారు అని ప్రశ్నిస్తుంది. నువ్వే ఏదో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తనకి ఇలా జరిగిందని చెబుతానని అంటుంది అపర్ఱ. చాలా బాగ్ గెస్ చేశావు.. ఆ ఇంజెక్షన్ వల్లే ఇలా జరిగింది. నేను ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటో? దానికి వాడాల్సిన ఏంటీ డోస్ ఏంటో చెప్పకపోతే డాక్టర్లు కూడా అంకుల్‌ని కాపాడలేరని చెబుతుంది రేఖ. మీరు హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికి అసలు ఉంటాడా? ఊపిరి ఆగి పైకి పోతాడా కూడా గ్యారెంటీ లేదని చెబుతుంది రేఖ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











