Brahmamudi March 21st Episode: రుద్రాణికి కావ్య వార్నింగ్ .. రాజ్ పక్కన యామినిని చూసిన కళావతి
రాజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి తాను క్రియేట్ చేసిన గతాన్ని అతని బుర్రలోకి ఎక్కిస్తానని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. నేను సృష్టించిన జ్ఞాపకాలే అతని గతంగా మారుతుందని అంటుంది. ఇంతలో రాజ్ ఆ మాటలు వినడంతో మనం ఆ ఆసుపత్రికి వెళ్తున్నామని యామిని చెబుతుంది. తనకు పదే పదే ఆ అమ్మాయి ఎందుకు గుర్తొస్తుందా నేను కనుక్కుంటానని అనుకుంటాడు రాజ్.
రాజ్ యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తానని కావ్యతో అప్పూ చెబుతుంది. నీ దర్యాప్తు పూర్తి చేసేలోగా నేనే ఆయనను తీసుకుని మీ ముందు నిలబెడతానని కావ్య సవాల్ చేస్తుంది. రాజ్ చనిపోయాడు కాబట్టి కావ్యను కూడా అడ్డు తొలగించుకుంటే కంపెనీకి నువ్వే సీఈవో అని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. కావ్యని పూర్తిగా పిచ్చిదానిలా మార్చేసి మూలన కూర్చోబెడతానని అంటుంది . ఉదయాన్నే రాజ్ ఫోటోకి దండేసి, దీపం వెలిగించబోతున్న రుద్రాణిని కావ్య అడ్డుకుని ఆమె గొంతు పట్టుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 21వ తేదీ ఎపిసోడ్ 675లో ఏం జరిగిందంటే?

ఇంకోసారి ఆయన ఫోటో ముందు దీపం వెలిగించేలా చేస్తే ఊరుకోనని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇలాగే పీక పిసికి చంపేస్తావా అంటూ రుద్రాణి ప్రశ్నించగా.. మా వారి కోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటుంది కావ్య. రాజ్ బతికే ఉంటే .. యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు అని కావ్యని ప్రశ్నిస్తుంది రుద్రాణి. మా ఆయన చనిపోవడం అనేది నిజమైతే ఆయన బాడీ ఎక్కడ అని కావ్య ఎదురు ప్రశ్నిస్తుంది. రాజ్ బాడీ అడవిలో దొరికిందని.. ఏ సింహమో, పులో తినేసి ఉంటుందని నీ చెల్లెలే కన్ఫర్మ్ చేసింది కదా అని అంటుంది రుద్రాణి.
ఆయన చనిపోవడం ఎవ్వరూ చూడలేదు.. కానీ ఆయన బతికుండటం నేను చూశానని చెబుతుంది కావ్య. ఈ ఇంట్లో ఎవరూ నమ్మకపోయినా నేను చెప్పేది నిజం.. ఆయన బతికే ఉన్నారని అరుస్తుంది కళావతి. త్వరలోనే మీ అందరి ముందుకు ఆయనను తీసుకొని వస్తానని చెబుతుంది. యామిని - రాజ్ ఆసుపత్రికి వస్తారు.. అయితే యామిని తెలియకుండా తాను ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటాడు రాజ్. రాజ్‌ని డైవర్ట్ చేసి ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవాలని యామిని కూడా అనుకుంటుంది.
అసలు ఆయన ఎక్కడున్నారు? కారులో ఆయనతో చూసిన అమ్మాయి ఎవరు? తనతో ఆయన ఎందుకున్నారు? యాక్సిడెంట్ నుంచి బయటిపడినప్పుడు ఇంటికి ఎందుకు రాలేదు? అని అప్పూని ప్రశ్నిస్తుంది. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా సమాధానం చెప్పాల్సింది బావేనని, ఆయన దొరికితే అన్ని ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుందని అంటుంది అప్పూ. మధ్యలో ఫోన్ రావడంతో అప్పూ దిగిపోతుంది. వాష్ రూమ్ కోసం రాజ్ వెళ్లగానే కావ్య గురించిన వివరాలను అడుగుతుంది యామిని. అది చూసిన రాజ్ రిసెప్షన్ దగ్గరికి ఎలా వెళ్లాలి అనుకుంటూ బాధపడతాడు. ఇంతలో కావ్యకి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి అడగ్గా ట్రీట్‌మెంట్ అవ్వగానే తను వెళ్లిపోయిందని చెబుతుంది. రాజ్‌ను వెతుక్కుంటూ యామిని వచ్చి ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
మరోవైపు.. కావ్య కూడా వచ్చి ఇదే వివరాలు అడగటంతో మీ గురించి ఒకరు అడిగారని రిసెప్షన్‌లో చెప్పడంతో ఆమె లోపలికి పరుగులు తీస్తుంది. రాజ్ - యామినిలు డాక్టర్‌తో మాట్లాడుతుండగా కావ్య వాళ్లని చూస్తుంది. మా బావకి టైమ్‌కి నేనే మెడిసిన్స్ వేస్తున్నానని డాక్టర్‌తో చెబుతుంది యామిని. అది విన్న కావ్య.. ఆయనను బావ అని అంటుంది ఎవరు ఈమె అని మనసులో అనుకుంటుంది కావ్య. మీరు 6 నెలలుగా కోమాలో ఉండటం వల్ల మీ జీర్ణ వ్యవస్ధ, మీ బాడీ నార్మల్ కావడానికి సమయం పడుతుంది రామ్ అంటాడు డాక్టర్. మొన్ననే కదా యాక్సిడెంట్ అయ్యింది 6 నెలలు కోమాలో ఉన్నారా? వీళ్లు ఆయనను మోసం చేయాలని చూస్తున్నారా? అని అనుకుంటుంది కావ్య.
నేను ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదని, ప్రతిదానికి ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారని, తన కండీషన్ తనకు తెలియడం లేదని డాక్టర్‌తో చెబుతుంది కావ్య. 6 నెలల క్రితం మీకు యాక్సిడెంట్ జరిగి మీ తల వెనుక భాగం బాగా దెబ్బతిందని రాజ్‌తో డాక్టర్ చెబుతాడు. చిన్న మెదడుకి తీవ్రమైన గాయం కావడంతో మీరు గతం మరిచిపోయారని డాక్టర్ అంటాడు. ఈ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది. నేనెవరో తెలుసుకోవాలి? నా గతం తెలుసుకోవాలి? ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రావడం లేదని బాధపడతాడు రాజ్.
ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పిగా ఉంటుందని.. నాకు గతం గుర్తుకు రావాలి, ఏదో ఒకటి చేయమని అడుగుతాడు రాజ్. ప్రతిరోజూ బావ ఇలాగే బాధపడుతున్నాడని చెబుతుంది డాక్టర్. మళ్లీ తనకు ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందని అంటుంది యామిని. గతం గుర్తుచేసుకోవడానికి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అని డాక్టర్ కోప్పడతాడు. అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ నుంచి మీరు ప్రాణాలతో బయటపడటమే చాలా అదృష్టమని చెబుతాడు. మళ్లీ మీరు మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని .. అలా చేస్తే నేనిచ్చే మెడిసిన్ ఎందుకూ పనికిరాకుండా పోతుందని వార్నింగ్ ఇస్తాడు డాక్టర్.
మీరు ఏ రకమైన ప్రెజర్ మీ మైండ్ మీదకి తీసుకురాకూడదని అంటాడు డాక్టర్. అప్పుడే పుట్టిన బాబుని ఎలా చూసుకుంటామో, మీ బ్రెయిన్‌ని అంతే సున్నితంగా చూసుకోవాలని చెబుతాడు. మీ బావ మీతో సరిగా ఉండటం లేదని తనకు గతం గుర్తుచేయాలని ప్రయత్నించొద్దు అని యామినికి కూడా వార్నింగ్ ఇస్తాడు. నేచురల్‌గా తనకు గుర్తుకు రాకపోతే మళ్లీ కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతాడు. ఆ మాటలతో కావ్య- రాజ్‌లు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










