Brahmamudi March 21st Episode: ఇందూని పరిగెత్తించిన రేఖ.. సుభాష్ కోసం ఆస్తిని వదులుకున్న అపర్ణ
Photo Courtesy: JioHotstar
రేఖ పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీని ఇందూ పేరు మీదకి వచ్చేలా చేయమని లాయర్‌కి చెబుతుంది అపర్ణ. ఫీజు కింద తన నగల్ని ఇస్తుంది. ఆలస్యంగా ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందూని అక్కడ హెచ్ఆర్ అవమానిస్తాడు. ఒక వెధవ వల్ల ఇలా జరిగిందని చెబుతుంది. ఇందూ ఎంత బతిమలాడినా సరే ఉద్యోగం మాత్రం ఇవ్వడు. దాంతో బాధగా బయటకు వచ్చేస్తుంది ఇందూ. స్వరాజ్‌కు పెద్ద లాప్‌లాప్‌ల బేరం తగులుతుంది. తన వద్ద 25 పనికిరాని లాప్‌టాప్‌లు ఉన్నాయని.. వాటిని అమ్మమని చెబుతాడు ఓ వ్యక్తి. దాంతో జనాన్ని చీట్ చేయడానికి రాజ్ ఓ ప్లాన్ గీస్తాడు. ఇంటి దగ్గర పనిచేసే అవకాశం అని చెప్పి 25 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 20 వేల రూపాయలు వసూలు చేద్దామని చెబుతాడు.
ఇంటర్వ్యూ నుంచి నందూ, గుడి నుంచి అపర్ణలు ఒకేసారి ఇంటి దగ్గరికి వస్తారు. ఒకడి వల్ల ఇంటర్వ్యూ పోయిందని చెబుతుంది ఇందూ. వారిద్దరూ వచ్చేసరికి సుభాష్ గదిలో నుంచి డాక్టర్‌తో బయటకు వస్తుంది రేఖ. మీరు వెళ్లాకా అంకుల్‌కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందని, అందుకే డాక్టర్‌తో ఇంజెక్షన్ ఇప్పించానని చెబుతుంది రేఖ. లోపలికి వెళ్లి చూస్తే సుభాష్ బాగానే ఉన్నాడు. అయితే కాసేపటికే బ్రీతింగ్ అందకపోవడంతో రేఖని ఆసుపత్రికి వెళ్దామని బతిమలాడతారు ఇందూ, అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 21వ తేదీ ఎపిసోడ్ 986లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీ పొగరు వల్లే నీ మొగుడు చావు బతుకుల్లో ఉన్నాడు. నన్ను ఎదిరించాలన్న ఈ ధైర్యమే వాడికి ఈరోజు మృత్యువుగా మారిందని అపర్ణతో అంటుంది రేఖ. మా నానమ్మ మాట్లాడింది తప్పే.. దానికి నేను క్షమాపణలు చెబుతాను, ముందే తాతయ్యకి ఇవ్వాల్సిన యాంటి డోస్ చెప్పమని అడుగుతుంది. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, అది నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ నేను ఇవ్వాలని అనుకోవడం లేదని రేఖ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. మీరు ఏం చెబితే అది చేస్తాను, ఆ ఇంజెక్షన్ ఇవ్వమని అడుగుతుంది ఇందూ. నాకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలనే ఉంది.. నా బెడ్‌రూంలోనే ఉంది వెళ్లి తెచ్చుకోమని చెబుతుంది రేఖ. దాంతో మొత్తం వెతికినా ఆ ఇంజెక్షన్ కనిపించదు.
ఆ ఇంజెక్షన్ నా బెడ్‌రూంలో కాదు, మీ తాతయ్య బెడ్‌రూంలో ఉందని చెబుతుంది రేఖ. దాంతో ఆ గది మొత్తం వెతికినా కనిపించదు. ఆ తర్వాత భ్రమరాంబ గదిలో ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లి వెతికినా కనిపించదు. ఐశ్వర్య గదిలో ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లి వెతికినా కనిపించదు. వెతికి వెతికి ఇందూ అలిసిపోతుంది. ఆ ఇంజెక్షన్ ఇంట్లో ఎక్కడా లేదు.. ఈ రేఖ దగ్గరే ఉందని చెబుతుంది అపర్ణ. నా గురించి ఇంత బాగా అర్ధం చేసుకున్నావు కదా? మరి నువ్వు ఎప్పుడు.. ఎవరిని కలుస్తున్నావో నేను తెలుసుకోలేనా అని లాయర్‌కి ఇచ్చిన డాక్యుమెంట్స్ చూపిస్తుంది రేఖ. అది చూడగానే అపర్ణ షాక్ అవుతుంది.
ఎంత ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా, నా మీద కోర్టులో కేసు వేయాలని అనుకుంటావని రేఖ నిలదీయడంతో అంతా షాక్ అవుతారు. నా పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీని నీ మనవరాలి పేరు మీదకి మార్చేద్దామని అనుకున్నావు కదా అంటుంది అపర్ణ. నువ్వు పైకి అమాయకురాలిగా కనిపిస్తావు కానీ వెనుక నుంచి బాగానే నడిపిస్తున్నావని మండిపడుతుంది భ్రమరాంబ. నడిపించడమే కాదు, తన మనవరాలికి ఈ ఆస్తి మొత్తం ఇచ్చేయాలని చూస్తోందని అంటుంది రేఖ. ఆ మాటలతో ఇందూ షాక్ అవుతుంది. నువ్వు లాయర్‌ని కలిశావా అని నిలదీయగా రేఖ మండిపడుతుంది.
నీకు తెలియకుండా మీ నానమ్మ ఇంత నడిపించిందా? నీకు తెలియకుండానే మీ నానమ్మ లాయర్‌ని కలిసిందా అని అడుగుతుంది రేఖ. అమ్మ మీద ఒట్టు.. ఈ విషయాలేవీ నాకు తెలియవు, తాతయ్య పరిస్ధితి బాలేదు, ఆ ఇంజెక్షన్ ఇవ్వమని బతిమలాడుతుంది ఇందూ. మీరు నాకు వెనుక నుంచి ఇంత వెన్నుపోటు పొడుస్తున్నా, నేను మిమ్మల్ని క్షమించాలా? అని మండిపడుతుంది రేఖ. నువ్వేమో నా మాట కాదని గడప దాటి బయటికి వెళ్లిపోతావు, మీ నానమ్మ ఏకంగా రేఖ అంటూ నోరు జారుతుంది, నన్నే భయపెట్టాలని చూస్తోంది. మీ నానమ్మ అలా నోరు వేసుకుని పడిపోవడం నాకు అస్సలు నచ్చలేదని అంటుంది రేఖ. వీటన్నింటికీ శిక్ష పడాలి కదా అని చెబుతుంది.
ఇంకెప్పుడూ అలా చేయదు, కేసు కూడా వాపస్ తీసుకుంటామని చెబుతుంది ఇందూ. కానీ మీ నానమ్మ కళ్లలో అదేమీ కనిపించడం లేదు, ఇంకోసారి అలా జరగదని మాట వరసకు కూడా చెప్పడం లేదు. ఆ ముసలోడిని ఎందుకు కాపాడాలని అంటుంది రేఖ. తాతయ్య ప్రాణం పోతుంది, ముందు రేఖ ఆంటీ చెప్పినట్లు చేయమని అంటుంది ఇందూ. దాంతో సరేనని రేఖ కళ్ల ముందు కూర్చొని బతిమలాడుతుంది అపర్ణ. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడూ నీ మాటకు ఎదురు చెప్పనని అంటుంది ఇందూ. ఇప్పుడు నీ కళ్లలో భయం కనిపిస్తోంది, ఆ భయం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. అది దూరమైన రోజు మళ్లీ ఇలాగే జరుగుతుంది, కానీ అప్పుడు మాత్రం జాలి చూపించనని అంటుంది రేఖ. భూషణ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో వెంటనే సుభాష్‌కి ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. నువ్వు డాక్టర్‌ని పిలిపించడంతో కంగారుపడ్డాను, కానీ ఆ అపర్ణలో ఉన్న పొగరు మొత్తం దించడానికి డాక్టర్‌ని పిలిచావని అర్ధమైందని అంటుంది భ్రమరాంబ. ఇప్పుడు ఆ అపర్ణ కుక్కిన పేనులా పడి ఉంటుంది.. ఆ ఇందూ నేను చెప్పిన చోట సంతకం పెడుతుందని అంటుంది రేఖ.
ఇంజెక్షన్ చేసి సుభాష్‌ని కాపాడుతుంది ఇందూ. నేను బయటకు వెళ్లడం వల్లే ఆ రేఖ ఇంత పని చేసిందని అపర్ణ బాధపడుతుంది. ఇదంతా ఎందుకు చేశావు? తాతయ్యని ఒంటరిగా ఎందుకు వదిలివెళ్లావు అని ప్రశ్నిస్తుంది ఇందూ. నీ కోసమే ఇదంతా చేశానని చెబుతుంది అపర్ణ. నా కోసం తాతయ్య ప్రాణాల్ని పణంగా పెట్టేస్తావా అని ఇందూ నిలదీస్తుంది. అవసరమైతే నా ప్రాణాల్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకప్పుడు నువ్వు చిన్నదానివి, ఆ రాక్షసి నుంచి నిన్ను కాపాడటం కోసం అది ఏం చెబితే అది చేశాను, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాను. కానీ ఈరోజు ఆ ఆస్తి మొత్తానికి అది గార్డియన్‌లా కూర్చొని నిన్ను బానిసలా చూస్తుంటే భరించలేను. నువ్వు ఇప్పుడు మేజర్‌వి, నీకు ఏ గార్డియన్ అవసరం లేదు, ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి తీసుకోవచ్చు అని చెబుతుంది అపర్ణ.
నాకు కావాల్సింది న్యాయం, ధర్మం కాదు.. నాకు ఆస్తి కూడా అక్కర్లేదు.. మిమ్మల్ని కాపాడుకోవడం ఒక్కటే నా లక్ష్యం. ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు.. ఇప్పుడు కూడా మీరు దూరమైపోతే, నేను ఏమైపోతానో నాకు కూడా తెలియదు. అమ్మానాన్న లేకపోయినా మీరిద్దరూ నా ముందు నిలబడి నడిపించారు. మీరే లేకపోతే, నేనొక్క దానినే బతికుండే ప్రయోజనం ఏంటీ? మీరిద్దరూ లేకపోతే ఆ కోట్ల రూపాయలు నాకు అక్కర్లేదు. ఆ ఆస్తి నా ఒంటరితనాన్ని దూరం చేయగలదా అని ప్రశ్నిస్తుంది ఇందూ.
ఆ రేఖకు కనిపించే ఆస్తి ఈ ఖరీదైన బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లలోనూ ఉంటుంది. కానీ నాకు మాత్రం మీరు లేని ఈ ఇల్లు సమాధి లాంటిది. మీ అమ్మనాన్న కలలు, ఆశయాలు నెరవేర్చాలని చెబుతుంది అపర్ణ. ఇక నుంచి రేఖని ఎదిరించొద్దు, నన్ను ఎంత తిట్టినా, ఎంత అవమానించినా నువ్వేం మాట్లాడొద్దని అంటుంది ఇందూ. నిన్ను అవమానిస్తుంటే చూస్తూ ఉండలేనని చెబుతుంది అపర్ణ. నాకు మూడో కంటికి తెలియకుండానే చదువు నేర్పించావు, నాలో ధైర్యాన్ని నింపావు, ఈ యుద్ధం నాది, పోరాడాల్సింది నేను అని చెబుతుంది ఇందూ. ఈ ఆస్తి తన సొంతం అయ్యే వరకు ఆ రేఖ నన్ను ఏం చేయలేదు అని అంటుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











