Brahmamudi March 22nd Episode: యామిని గుట్టు తేల్చే పనిలో కావ్య.. కళావతిపై రగిలిపోతోన్న రుద్రాణి
ఇంకోసారి నా భర్త ఫోటో ముందు దీపం వెలిగిస్తే చంపేస్తానని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. చనిపోయిన వ్యక్తిని బతికున్నాడని చెబుతున్నావ్, మీ చెల్లెలు స్వయంగా రాజ్ మరణించినట్లు కన్ఫర్మ్ చేసిందని చెబుతుంది రుద్రాణి. నేను వెళ్తున్నాను మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతానని సవాల్ చేసి ఆసుపత్రికి వెళ్తుంది కావ్య. అప్పూకి ఏదో ఫోన్ రావడంతో తను కారు దిగేయడంతో కావ్య ఒక్కటే వెళ్తుంది.
రాజ్- యామినిలు ఆసుపత్రికి వస్తారు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరోకరు కావ్య వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇంతలో కావ్య ఆ ఆసుపత్రికి వస్తుంది. ఆమె రాజ్ గురించి అడగ్గా.. వాళ్లు కూడా మీ గురించి అడిగారని హాస్పిటల్ స్టాఫ్ చెబుతారు. దీంతో రాజ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా యామిని పక్కన కనిపిస్తాడు. దొంగచాటుగా డాక్టర్ ఏం చెబుతున్నాడో వింటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 22వ తేదీ ఎపిసోడ్ 676లో ఏం జరిగిందంటే?

గతం గుర్తు చేసి మళ్లీ ఆయనను ప్రమాదంలో పడేయలేనని అనుకుంటుంది కావ్య. గతానికి సంబంధించిన విషయాలను ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేయాలని డాక్టర్ .. యామినితో చెబుతాడు. అంతే తప్పించి దాని గురించి డీప్‌గా డిస్కష్ చేసే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరిస్తాడు. తనే ఎక్కువ ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడని చెబుతుంది యామిని. మీరు మీ బ్రెయిన్‌కి అస్సలు స్ట్రెస్ ఇవ్వొద్దని డాక్టర్ చెబుతాడు.
కావాలని ఏది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించనని చెబుతాడు. నన్నెవరో గుర్తుపట్టని స్థితికి చేరుకున్నారంటూ బాధపడుతుంది కావ్య. ఆసుప్రతి నుంచి బయటికొస్తూ నిన్ను ఓ స్పెషల్ ప్లేస్‌కి తీసుకెళ్తానని రాజ్‌తో అంటుంది యామిని. ఎక్కడికి అని రాజ్ ప్రశ్నించగా.. నీ గతాన్ని నీకు పరిచయం చేయబోతున్నానని అంటుంది. వీరి మాటలను కావ్య వింటుంది. నాకు తెలియని ఆయన గతమెంటీ అని ఆలోచించి .. యామిని - రాజ్‌లను ఫాలో చేస్తుంది.
మరోవైపు అపర్ణ అనారోగ్యంతో మంచమెక్కుతుంది. ఇందిర పాలు తీసుకొచ్చేసరికి మంచంపై పడుకుని ఉంటుంది. ఎంత లేపినా లేవకపోయేసరికి కంగారుపడి సుభాష్‌ను పిలుస్తుంది. దాంతో ఇంట్లో వాళ్లంతా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇలాంటిది జరుగుతుందని నేను ముందే అనుకున్నానని.. అందుకే రాజ్ కర్మకాండలు చేద్దామని చెప్పానని అంటుంది రుద్రాణి. ఆమె మాటలకు ప్రకాశం మండిపడతాడు. అక్క భోజనం చేసి రెండు రోజులు అవుతోందని అందుకే నీరసంతో ఇలా అయిపోయిందని ధాన్యలక్ష్మీ అంటుంది. కాసేపటికీ అపర్ణ లేవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు.
పస్తులుండి ప్రాణాల మీదకి తెచ్చుకుందాం అనుకుంటున్నావా? అంటూ ఇందిర మండిపడుతుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కళ్ల ముందు లేనప్పుడు ఆ తల్లి ప్రాణాలతో ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అంటుంది అపర్ణ. రాజ్ దూరమయ్యాక నాకు కూడా బతకాలని లేదని అంటాడు సుభాష్. కానీ నాన్న అమ్మా , వీళ్లంతా మనల్ని నమ్ముకుని ఉన్నారని , మన కోడలు కూడా ఉందని వాళ్లందరినీ వదిలేసి మనం కూడా వెళ్లిపోతే అది అన్యాయం కదా అని చెబుతాడు.
దీనింతటికి కారణం ఆ పిచ్చి ముదిరిన కావ్య అని అంటుంది రుద్రాణి. రాజ్ లేడనే బాధలో మనమంతా ఉంటే, ఉన్నాడనే ఒక పిచ్చి భ్రమలో ఇంటో వాళ్లని పిచ్చోళ్లని చేయాలని కంకణం కట్టుకుందని అంటుంది రుద్రాణి. మెళ్లగా రాజ్‌ని మరిచిపోదాం.. కొత్త జీవితం మొదలుపెడతామనే ప్రతిసారి పిచ్చి చేష్టలతో మళ్లీ మళ్లీ రాజ్‌ను గుర్తుచేసి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోందని అంటుంది. రాజ్ బతికున్నాడని కావ్య నోరు కుట్టేస్తే తప్ప ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండదని చెబుతుంది రుద్రాణి.
చావు బతుకులు మన చేతుల్లో ఉండవని, చేయాల్సిన కార్యాలు చేయ్యాలని అంటుంది రుద్రాణి. ఎప్పుడు చూసినా కావ్య మీద పడిపోతావేంటీ అంటూ సుభాష్, ప్రకాశంలు రుద్రాణిపై మండిపడతారు. నేను మాత్రం కావ్యని వదిలిపెట్టనని అంటుంది రుద్రాణి. పస్తులు ఉండొద్దని అందరూ కలిసి అపర్ణతో పాలు తాగిస్తారు. రాజ్ - యామినిలను ఫాలో చేస్తూ ఓ స్కూల్ దగ్గరికి వస్తుంది కావ్య. కానీ సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలికి వెళ్లనివ్వడు. ఆ యామిని మా ఆయనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసుకోవాలని కావ్య అనుకుంటుంది.
లోపలికి ఎలా వెళ్లాలో తెలియక ఆలోచిస్తున్న కావ్య.. వాచ్‌మెన్‌ని బుట్టలో పడేశాలా మాట్లాడుతుంది. నీకు పెళ్లి చూపులు చూస్తున్న అమ్మాయికి అక్కని అని అంటుంది. మీ చెల్లెలి ఫోటోను చూపించమని వాచ్ మెన్ అడిగేసరికి అప్పూ ఫోటోని చూపిస్తుంది కావ్య. పోలీస్ ఆఫీసర్ అయిన మీ చెల్లెలు నన్నెందుకు పెళ్లి చేసుకుంటుందని వాచ్‌మెన్ అడుగుతాడు. నీ నిజాయితీ నచ్చి మా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని అంటుంది.
నీ జాబ్ గురించి తెలియకుండా మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేయలేను కదా అందుకే ఎంక్వైరీ చేద్దామని వచ్చానని చెబుతుంది కావ్య. ఆ ముక్క ముందే చెబితే లోపలికి పంపించేవాడినని వాచ్‌మెన్ అంటాడు. నాకు కాబోయే భార్య పోలీస్ ఆఫీసర్ అని వాచ్‌మెన్ తెగ సిగ్గుపడతాడు. ఇప్పటి వరకు అందరికీ నేను సెల్యూట్ కొట్టానని.. ఇకపై అందరూ నాకు సెల్యూట్ కొడతారని కలలు కంటాడు. మీ చెల్లెలి ఫోటో నాకు పంపిస్తారా అని కావ్యని అడగ్గా.. నీ గురించి ఎంక్వైరీ పూర్తయ్యాక పంపిస్తానని అంటుంది.
స్కూల్‌లో రాజ్‌కి ప్రతి గదిని చూపిస్తుంది యామిని. ఈ లోపు ప్రిన్సిపాల్ యామినిని లోపలికి పిలుస్తుంది. వాళ్లను వెతుక్కుంటూ కావ్య కూడా లోపలికి వస్తుంది. రాజ్ - యామినిలు తన ఓల్డ్ స్టూడెంట్స్ అన్నట్లుగా మాట్లాడుతుంది ప్రిన్సిపాల్. రామ్ తెలివైన స్టూడెంట్ అని, యామిని అల్లరి పిల్ల అని అంటుంది ప్రిన్సిపాల్. నిన్ను కంట్రోల్ చేయలేక మీ బావ చాలా ఇబ్బందిపడేవాడని అంటుంది ప్రిన్సిపాల్. మా ఆయన చుట్టూ ఇన్ని కట్టుకథల్ని అల్లుతున్నారేంటీ అనుకుంటుంది కావ్య.
రామ్‌కి యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే నేను చాలా బాధపడ్డానని ప్రిన్సిపాల్ అంటుంది. ఇంతకీ ఎలా ఉంది అని ప్రశ్నిస్తుంది. తను ఎప్పుడూ ఇంట్లో ఉంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడని ఇక్కడికి తీసుకొచ్చానని అంటుంది యామిని. తన చిన్ననాటి జ్ఞాపకాలను తనకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ప్రిన్సిపాల్‌తో చెబుతుంది. యామినికి చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టమని, నిన్నెప్పుడూ కేరింగ్‌గా చూసుకుంటుందని, తను నీ మరదలిగా దొరకడం నీ అదృష్టమని అంటుంది ప్రిన్సిపాల్. మా బావంటే నాకు ప్రాణమని, తనకేమైనా జరిగితే అస్సలు తట్టుకోలేనని చెబుతుంది యామిని. ప్రిన్సిపాల్ లోపలికి వెళ్లి రాజ్- యామినిల చిన్నప్పటి ఫోటోను తీసుకొచ్చి చూపిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











