Brahmamudi March 23rd Episode: డబ్బున్న అమ్మాయిల వేటలో స్వరాజ్.. ఇందూని అవమానించిన రేఖ, భ్రమరాంబ

Photo Courtesy: JioHotstar

సుభాష్‌కి ఊపిరి అందకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని రేఖని అడుగుతాడు ఇందూ, అపర్ణ. ఆసుపత్రికి స్వయంగా నా కారులోనే పంపిస్తాను.. కానీ అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఎందుకు ఈ ముసలోడు ఊపిరి తీసుకోలేకపోతున్నాడని అడిగితే ఏం చెబుతావని రేఖ ప్రశ్నిస్తుంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.. యాంటీ డోస్ ఇస్తే సరిపోతుందని చెబుతుంది రేఖ. ఆ ఇంజెక్షన్ కోసం ఇందూని అన్ని రూమ్‌లు పరిగెత్తించి అలిసిపోయేలా చేస్తుంది రేఖ. ఇదంతా చూసిన అపర్ణ.. ఆ ఇంజెక్షన్ రేఖ దగ్గరే ఉందని మండిపడుతుంది. దాంతో రేఖ కాళ్లపై పడి యాంటీ డోస్ ఇవ్వమని బతిమలాడుతుంది ఇందూ.

నువ్వు కాదు.. మీ నానమ్మ పడాలి.. ఎంత ధైర్యముంటే నాకు వ్యతిరేకంగా లాయర్‌ని కలుస్తుంది, ఈ ఆస్తిని నీకు దక్కేలా చేస్తుందని మండిపడుతుంది. దాంతో ఇందూ షాక్ అవుతుంది. తాతయ్యని బతికించుకోవాలని.. కేసు వాపసు తీసుకుంటున్నట్లు చెప్పమని నానమ్మపై కోప్పడుతుంది ఇందూ. దాంతో వేరే దారిలేక రేఖ కాళ్లపై పడి క్షమాపణలు చెబుతుంది రేఖ. ఆ వెంటనే భూషణ్ యాంటీ డోస్ ఇవ్వడంతో సుభాష్‌ని కాపాడుతుంది ఇందూ. లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? నిన్ను ఎవరు వెళ్లమన్నారు? అంటూ అపర్ణపై మండిపడుతుంది ఇందూ. మీరిద్దరూ లేనప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు అంటూ నానమ్మకి క్లాస్ పీకుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 23వ తేదీ ఎపిసోడ్ 987లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 23rd 2026 Episode 987 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆస్తి తన చేతికి వచ్చే వరకు ఆ రేఖ నన్ను ఏం చేయదు.. కానీ నన్ను బెదిరించడానికి మిమ్మల్ని ఏమైనా చేయొచ్చని అంటుంది ఇందూ. ఆ అవకాశం ఆ రేఖకి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను, నా కోసం అమ్మానాన్నలు చేసిన త్యాగాలు చాలు. నా వల్ల మీకు ఏదైనా జరిగితే నేను జీవితాంతం నా గుండెల్లో మోయాలి, ఆ శిక్ష చావడం కంటే చాలా పెద్దదని కంటతడి పెడుతుంది ఇందూ. మన వంశానికి.. మా ఆశలకు ఒక్కగానొక్క వారసురాలివి నువ్వు. ఈ కుటుంబాన్ని నమ్ముకుని ఎన్నో వేలమంది బతుకుతున్నారు.. వాళ్లందరి భవిష్యత్తు నువ్వు, వాళ్లందరికీ నువ్వు ఆసరా కావాలని చెబుతుంది అపర్ణ. అలా జరగాలంటే.. నువ్వు నాకు మాటివ్వు అని అడుగుతుంది ఇందూ.

లాప్‌టాప్స్ పనిచేయకపోవడంతో లక్కీపై రంకెలు వేస్తాడు స్వరాజ్. ఎలాగైనా వీడి కోపాన్ని తగ్గించాలి, లేదంటే నన్ను చంపేస్తాడని అనుకుంటాడు లక్కీ. నాలుగు మోటివేషనల్ డైలాగ్స్ చెబుతుండగా లక్కీని స్వరాజ్ లాగిపెట్టి కొడతాడు. నీ ఫ్రెండ్‌గాడి వల్ల బైక్‌లో పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేనంతగా మోసపోయామని అంటాడు స్వరాజ్. ఇంతలో అక్కడికి వాళ్ల ఫ్రెండ్ రాంబాబు పెద్ద కారులో రావడంతో స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఇంత డబ్బు ఎలా సంపాదించానో అని మీకు డౌట్ అంతేకదా అని రాంబాబు అడుగుతాడు. పెళ్లి చేసుకుంటేనే నాకు ఇంత అదృష్టం పట్టిందని చెబుతాడు. రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. లైఫ్‌లో సెటిల్ అయిపోయానని చెప్పి వాళ్ల ఆవిడను పిలుస్తాడు.

ఒక ఆంటీని పెళ్లి చేసుకున్నా.. ఈరోజుల్లో వయసుతో పనేముంది, డబ్బే ముఖ్యమని రాంబాబు చెప్పడంతో స్వరాజ్, లక్కీలు షాక్ అవుతారు. ఇన్నిరోజులు డిన్నర్‌కి కూడా ఆలోచించాను, ఎవరైనా టీ ఇప్పిస్తాడేమోనని రోజంతా వెయిట్ చేసేవాడిని. కానీ ఇప్పుడు తిన్నది ఎలా అరిగించుకోవాలో ఆలోచిస్తున్నాను అంటాడు రాంబాబు. మళ్లీ మనం కలవలేం.. ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయమని చెప్పడంతో స్వరాజ్, లక్కీలు షాక్ అవుతారు. ఇకపై ఏ ఐడియాలు వద్దు.. ఆ రాంబాబు గాడిని చూసిన తర్వాత కష్టపడటం వేస్ట్ అనిపిస్తోంది అంటాడు లక్కీ.

అలాంటప్పుడు మనం కూడా వాడిని ఫాలో అయిపోతే పోలా? మనం కూడా ఒక రిచ్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే మనం కూడా ఇలాగే సెటిల్ అయిపోవచ్చని చెబుతాడు స్వరాజ్. మనం కూడా ఆంటీల్ని పెళ్లి చేసుకోవాలా అని లక్కీ అడుగుతాడు. వాడి ఫేస్ వాల్యూకి వాడు ఆంటీని పెళ్లి చేసుకున్నాడు, మన ఫేస్ వాల్యూకి ఒక అందమైన రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం కూడా సెటిల్ అయిపోతామని అంటాడు స్వరాజ్. రిచ్ అమ్మాయి వేటలో పడదామని చెబుతాడు.

ఏం జరిగినా సరే నువ్వు లాయర్‌ని కలవనని మాటివ్వమని అపర్ణని అడుగుతుంది ఇందూ. ఆ రేఖని ఎదిరించనని నాకు మాటివ్వమని అడుగుతుంది. దాంతో మనవరాలి కోసం మాటిస్తుంది అపర్ణ. ఈరోజు నుంచి నా గుండెని రాయి చేసుకుని మౌనంగా భరిస్తాను, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. నువ్వు కూడా నాకు మాటివ్వు, నువ్వు ఈ ఆస్తిని వదులుకోవడానికి వీల్లేదు. ఆ రేఖ చేతిలో ఓడిపోవడానికి వీల్లేదు, ఏం జరిగినా సరే మీ అమ్మనాన్నలు అనుకున్నది జరిగి తీరాలని చెబుతుంది అపర్ణ. అది నా చేతిలో లేదు, దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటుంది ఇందూ.

స్వరాజ్, లక్కీలు అమ్మాయిల వేటలో ఉండగా ఐశ్వర్య కనిపించడంతో నేను ఏ అమ్మాయిని వెతకాల్సిన పనిలేదని అంటాడు లక్కీ. నేను ఆ అమ్మాయిని సెట్ చేసుకుంటాను, నువ్వు మాత్రం రావొద్దని స్వరాజ్‌తో చెబుతాడు లక్కీ. ఇంతలో ఐశ్వర్యతో మరో కుర్రాడు కనిపించడంతో లక్కీ షాక్ అవుతాడు. నువ్వు నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని తిప్పుకుంటున్నావని ఐశ్వర్యపై రాకేష్ అనే వ్యక్తి మండిపడతాడు. డబ్బు విషయంలో నాకు ఎవరైనా ఒకటే, నేను డబ్బులు ఇచ్చింది మీ ఆంటీని చూసి... నువ్వు ఇవ్వకపోతే నేను నేరుగా వెళ్లి మీ ఆంటీతో మాట్లాడతానని వార్నింగ్ ఇస్తుంది. నేను ఇంత అప్పు చేశానంటే మా ఆంటీకి నా మీద ఉన్న నమ్మకం పోతుందని చెబుతుంది ఐశ్వర్య. నాకు 10 రోజులు టైం ఇవ్వమని ఐశ్వర్య అడగ్గా.. రెండు రోజులే ఇస్తానని చెప్పి వెళ్లిపోతాడు రాకేష్. ఇదే రైట్ టైం.. వెళ్లి ఓదారుద్దామని అనుకుంటాడు లక్కీ. పబ్‌లో నీ కారు పాడైతే లిఫ్ట్ ఇచ్చాను, ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లామని గుర్తుచేస్తాడు లక్కీ. నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు.. నేను సాల్వ్ చేస్తానని చెప్పగా బిల్ కట్టేసి వెళ్లమని చెబుతుంది ఐశ్వర్య. బిల్లు చూసి లక్కీ షాక్ అవుతాడు.

పొద్దున్న నువ్వు ఇచ్చిన డోస్ సరిపోయిందా? ఆ అపర్ణ తగ్గుతుందా? అని రేఖని భ్రమరాంబ అడగ్గా ఆ అపర్ణ ఎలా నోరుమూసుకుని ఉంటుందో చూపిస్తానని అంటుంది రేఖ. డిన్నర్ లేట్‌గా ఎందుకు ప్రిపేర్ చేశావని ఇందూని కావాలని నిలదీస్తుంది రేఖ. ఆ ముసలోడికి ప్రాణం పోయినట్లుగా ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు.. బాగానే ఉన్నాడు కదా అని అంటుంది భ్రమరాంబ. ఆ మాటలు విన్న అపర్ణ కోపంతో రగిలిపోతుండగా ఇందూని చూసి ఆగిపోతుంది. వంట రుచిలేదు.. పచి లేదు, స్ట్రీట్ ఫుడ్ దీని కంటే బాగుంటుందని అంటుంది ఐశ్వర్య.

మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నావా? అని రేఖ మండిపడుతుంది. రోజూ ఎలా వండుతానో? ఈరోజు కూడా అలాగే వంట చేశానని చెబుతుంది ఇందూ. సవాలక్ష టెన్షన్‌లతో మేం ఇంటికొస్తాం.. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే మేం ఎక్కడికి వెళ్లాలని అంటుంది ఐశ్వర్య. ఆ మాటలు విన్న రేఖ.. ఏం జరిగింది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. ఐశ్వర్య కోపంగా లేచి వెళ్లిపోతుంది. పొగరు వల్ల ఇలా చేసిందో? పగ వల్ల ఇలా చేసిందో అంటుంది భ్రమరాంబ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X