Brahmamudi March 24th Episode: కళావతిని పిచ్చిదానిలా మార్చే కుట్ర .. రుద్రాణితో కావ్య డీల్
రాజ్‌కి గతం గుర్తుచేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని యామినికి డాక్టర్ చెబుతున్న మాటలను కావ్య దొంగచాటుగా విని షాక్ అవుతుంది. ఆసుపత్రి నుంచి బయటికి వస్తూ ఓ స్పెషల్ ప్లేస్‌కి తీసుకెళ్తానని రాజ్‌తో యామిని అంటుంది. వీరి మాటలను కావ్య విని .. యామిని - రాజ్‌లను ఫాలో చేస్తుంది. అపర్ణ అనారోగ్యంతో మంచం ఎక్కుతుంది. ఇందిర ఎంత పిలిచినా పలకకపోయేసరికి ఇంట్లో వాళ్లంతా పరిగెత్తుకుంటూ వస్తారు.
దీనంతటికి కారణం పిచ్చి ముదిరిన కావ్య అని అంటుంది రుద్రాణి. రాజ్ లేడనే బాధలో మనమంతా ఉంటే మనల్ని కూడా పిచ్చోళ్లని చేయాలని చూస్తోందని మండిపడుతుంది. రాజ్‌ని యామిని ఓ స్కూల్ దగ్గరికి తీసుకెళ్లి మనం ఇక్కడే చదువుకున్నామని చెప్పి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది. వాచ్‌మెన్‌కు మస్కా కొట్టి కావ్య కూడా లోపలికి వచ్చి వాళ్ల మాటలను వింటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 24వ తేదీ ఎపిసోడ్ 677లో ఏం జరిగిందంటే?

స్కూల్ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫోటో చూసిన రాజ్.. నాకు వీళ్లంతా కొత్తగానే కనిపిస్తున్నారని చెబుతాడు. యామిని ఏవేవో పేర్లు చెప్పి రాజ్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఇది చూసిన కావ్య.. ఆయనకు గతం లేదని ఆడుకుంటున్నావని నిన్ను వదిలిపెట్టనని మనసులో అనుకుంటుంది. నాకు ఎవ్వరూ గుర్తుకు రావడం లేదని రాజ్ చెప్పగా.. పర్లేదని నువ్వు రోజూ గతం గుర్తుకు రావడం లేదని బాధపడుతున్నావని ఇక్కడికి తీసుకొచ్చానని చెబుతుంది.
నువ్వు నీ లైఫ్‌లో ఏం జరిగిందని నువ్వు రోజూ అడుగుతుంటావు కదా మన మెమొరీ తీసుకురావాలని ఇక్కడికి తీసుకొచ్చానని అంటుంది యామిని. బయటికొచ్చిన తర్వాత నీకు ఇంకో సర్‌ప్రైజ్ ఉందని చెప్పి ఫ్రెండ్స్‌ని పరిచయం తీసుకొస్తుంది. కానీ రాజ్‌కు ఏం గుర్తుకురాదు.. మన మెమొరీస్ అన్ని అలా ఎలా మరిచిపోతావంటూ ఫ్రెండ్స్ బాధపడతారు. ఇంతలో ఓ వ్యక్తి ఫోన్ తీసి రాజ్‌కు మొబైల్‌లో కొన్ని ఫోటోలు చూపిస్తాడు. అయినప్పటికీ రాజ్‌కి ఏమీ గుర్తుకురాదు. ఇప్పుడు రామ్ ఉన్న కండీషన్‌లో తనకి ఇలాంటివన్నీ చూపించి టెన్షన్ పెట్టొద్దని , నిదానంగా ఆయనకి అన్ని గుర్తొస్తాయని అంటుంది యామిని.
నీకు వాళ్లు పాత విషయాలు గుర్తుచేయడానికి ట్రై చేశారని అంటుంది యామిని. నీకు ఇంకో పెద్ద సర్‌ప్రైజ్ ఉందని చెప్పి రాజ్ అమ్మానాన్నల సమాధుల వద్దకి తీసుకెళ్లగా కావ్య వారిని ఫాలో చేస్తూ వెనకాలే వస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చావ్ ఏంటీ అని రాజ్ అడగ్గా.. ఇది మన ఫాంహౌస్ అని చెప్పి రెండు సమాధుల్ని చూపెడుతుంది. దానిపై కైలాష్, భానుమతి అని రాసి ఉంటుంది. మీ అమ్మానాన్నలని పరిచయం చేస్తానని చెప్పాను కదా.. వీళ్లనని అంటుంది. మనం చిన్నప్పుడే వాళ్లు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది.
మా అమ్మ స్వయానా మీ నాన్నగారి సొంత చెల్లెలని రాజ్‌తో అంటుంది యామిని. అందుకే నిన్ను ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక నిన్ను సొంత చెల్లెలుగా పెంచుకుందని చెబుతుంది. మా అమ్మనాన్న చనిపోయారన్న జ్ఞాపకాలు కానీ , ఆలోచనలు కానీ నాకు ఏది గుర్తుకు రావడం లేదని అంటుంది. నీతో కలిసి పెరిగిన నేనే నీకు గుర్తుకురాలేదు.. అలాంటిది ఎప్పుడో చనిపోయినవాళ్లు నీకేం గుర్తుంటుంది అని చెబుతుంది. మనిద్దరికి ఒకరిపై మరొకరికి చాలా ఇష్టమని, ఆ ఇష్టంతోనే ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అనేసరికి ఆ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది. కానీ ఆరు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు అన్ని కొత్తగా పరిచయం చేయాల్సి వస్తోందని చెబుతుంది యామిని. తర్వాత సమాధులపై రాజ్ చేత దండలు వేయిస్తుంది.
నాకేం గుర్తుకు రావడం లేదని వెళ్లిపోదామని యామినితో అంటాడు రాజ్. నీ నుంచి ఆయనని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసని అనుకుంటుంది కావ్య. దండలు పక్కన పడేసి రాజ్ వెళ్లిపోతాడు. ఇంతలో కావ్యకి అప్పూ ఫోన్ చేస్తుంది. బావని కలిశావా? అని అప్పూ అడగ్గా.. చాలా విషయాలు తెలుసుకున్నానని, ఇంటి దగ్గర మాట్లాడుకుందామని అంటుంది కావ్య. ఇక్కడొక పెద్ద డ్రామానే నడుస్తోందని, అన్ని చెబుతాను నువ్వు ఇంటికి వచ్చేయ్ అని చెబుతుంది.
దుగ్గిరాల కుటుంబ సభ్యులు ఇంట్లో బాధపడుతుండగా డాక్టర్ తన సిబ్బందితో వచ్చి ఎక్కడ పేషెంట్ ఎక్కడ? ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని అన్నారు? వెంటనే రమ్మని ఫోన్ చేశారు? అంటాడు . ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకొచ్చారు అని అడుగుతాడు ప్రకాశం. మానసిక సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ మీ ఇంట్లో గొడవ చేస్తున్నారని , వెంటనే రమ్మని మాకు ఫోన్ చేశారని చెబుతాడు డాక్టర్. మీకు ఫోన్ చేసిందెవరు? అని సుభాష్ అడగ్గా.. నేనే అన్నయ్య అంటూ రుద్రాణి వస్తుంది.
ఈ ఇంటి పరువు తీస్తుంది నేను కాదు.. ఈ ఇంటి ముద్దుల కోడలు అంటుండగా కావ్య లోపలికి వస్తుంది. రాజ్‌ను తీసుకొస్తా? నిజాలు బయటికి తీసుకొస్తా? అన్నావు కదా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ కనిపించడే, కారులో కూర్చొన్నాడా అంటూ సెటైర్లు వేస్తుంది. కనీసం నువ్వైనా చూశావా? అని రుద్రాణి ప్రశ్నించగా.. చూశాను అంటుంది కావ్య. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నీ కళ్లకి మాత్రమే కనిపిస్తాడు.. మాకెవ్వరికీ కనిపించడేంటీ అని అంటుంది, ఎక్కడ చూశావని రుద్రాణి అడగ్గా కావ్య మౌనం వహిస్తుంది.
రాజ్ రాను అన్నాడా? నీ మీద అలిగాడా? పోని ఎక్కడున్నా చెబితే మేం వెళ్లి తీసుకొస్తామని అంటుంది రుద్రాణి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో నేనేమీ చెప్పలేనని అంటుంది కావ్య. రాజ్ బతికిలేడని , ఇంకా తన మాటల్ని నమ్మితే మనల్ని పిచ్చివాళ్లని చేస్తుందని మండిపడుతుంది రుద్రాణి. నేను చెప్పిన పేషెంట్ తనేనని , జాగ్రత్తగా తీసుకెళ్లి మంచిగా ట్రీట్‌మెంట్ చేయమని డాక్టర్‌తో చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. సుభాష్ డాక్టర్‌కి సారీ చెప్పి ఆయనను పంపించేస్తాడు.
నీ గురించి, నీ కొడుకు గురించి, నీ కోడలి గురించి మాట్లాడుకో.. కావ్య గురించి మాట్లాడే హక్కు నీకు లేదని ఇందిర మండిపడుతుంది. తన ఆరోగ్యం చూసుకోవడానికి మేమంతా ఉన్నామని అంటుంది. వదినకి అండగా నిలవాల్సిందిపోయి, రాజ్ బతికే ఉన్నాడంటూ అనుక్షణం తనకి నరకం చూపిస్తున్నాడని చెబుతుంది రుద్రాణి. మనమంతా ఏదో ఒక రోజు చనిపోతామని.. కాకపోతే రాజ్ మనకంటే ముందుగానే వెళ్లిపోయాడని అంటుంది. అసలు మాకు అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేస్తున్నావని కావ్యని నిలదీస్తుంది రుద్రాణి.
నేనెవ్వరినీ మోసం చేయడం లేదని, ఆయన బతికే ఉన్నారని తేల్చిచెబుతుంది కావ్య. మరి మా ముందుకు రాజ్ ఎందుకు రావడం లేదని రుద్రాణి ప్రశ్నిస్తుంది. తప్పకుండా ఒకరోజు ఆయన ఇంటికి వస్తారని, అదే ఎప్పుడు వస్తారని రుద్రాణి అడుగుతుంది. నీలాగా పిచ్చిదానిలా సంవత్సరాల తరబడి ఎదురుచూడటం మావల్ల కాదని మండిపడుతుంది. సరిగ్గా నెల తిరిగేలోపు ఆయన్ను మీ అందరి ముందు నిలబెడతానని కావ్య ధీమాగా చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఒకవేళ తీసుకురాకపోతే అని రుద్రాణి అడగ్గా.. ఆయన ఫోటోకి దండ వేసి, దీపం పెట్టి నన్ను ఆసుపత్రికి పంపి మీరే ఈ రాజ్యం ఏలండి అని సవాల్ విసురుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











