Brahmamudi March 24th Episode: ఇందూతో రేఖ వెట్టి చాకిరి.. భ్రమరాంబకి షాకిచ్చిన రేఖ, రాజ్‌కి పీడకల

Photo Courtesy: JioHotstar

ఆ రేఖ నన్ను ఏమన్నా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, ఆ రేఖని ఏమీ అనకూడదని మాట ఇవ్వమని అపర్ణని అడుగుతుంది ఇందూ. మనవరాలి కోసం మాట ఇస్తుంది అపర్ణ. అయితే ఈ దుగ్గిరాల వంశానికి వారసురాలివి నువ్వు.. ఈ కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ల జీవితాల్ని నిలబెడతానని, ఆస్తిని దక్కించుకుంటానని మాట ఇవ్వమని అడుగుతుంది అపర్ణ. అది నా చేతిలో లేదని కాలమే సమాధానం చెబుతుందని వెళ్లిపోతుంది ఇందూ.

లాప్‌టాప్‌లు అమ్మి కోట్లు సంపాదించాలనుకున్న స్వరాజ్ ప్లాన్ బెడిసి కొడుతుంది. దాంతో లక్కీని చితకబాదుతుంటాడు స్వరాజ్. ఇంతలో వాళ్ల ఫ్రెండ్ కారులో వచ్చి డబ్బున్న ఆంటీని పెళ్లి చేసుకున్నానని, నా లైఫే మారిపోయిందని చెబుతాడు. ఆ మాటలతో తాము కూడా బాగా డబ్బున్న అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు లక్కీ, స్వరాజ్. అమ్మాయిల కోసం వెతుకుండగా అక్కడికి వచ్చిన ఐశ్వర్యని ఫాలో అవుతూ వెళ్లి బకరా అవుతాడు లక్కీ. మనం ఇచ్చిన డోస్ సరిగ్గా పనిచేసిందా లేదా అని రేఖని భ్రమరాంబ అడుగుతుంది. దాంతో ఇందూ చేసిన వంట బాలేదంటూ కావాలని వంకలు పెడతారు. ఆ మాటలు విన్న అపర్ణ.. మనవరాలి కోసం మౌనంగా ఉండిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 24వ తేదీ ఎపిసోడ్ 988లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 24th 2026 Episode 988 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆ ముసలోడిని కాస్త ఇబ్బంది పెట్టేసరికి ఆవిడగారు మన మీద పగ తీర్చుకుంటున్నారు అని ఇందూపై లేనిపోనివి చెబుతుంది భ్రమరాంబ. పగ తీర్చుకునేంత ధైర్యం ఉందా అని రేఖ అడగ్గా.. ఒకవేళ ఉన్నా దానిని మనసులోనే చంపేయడానికి వాళ్ల ముందు నువ్వు ఉన్నావుగా అంటాడు భూషణ్. ఇందూ సాంబార్ పోస్తుండగా కాలు అడ్డుపెడుతుంది భ్రమరాంబ. దాంతో వెళ్లి రేఖపై సాంబారు పడుతుంది. ఆ సాంబార్ మొత్తం క్లీన్ చేయమని రేఖ ఆర్డర్ వేయడంతో మొత్తం తుడిచేస్తుంది ఇందూ. ఇదంతా చూసినా మనవరాలికి ఇచ్చిన మాట ప్రకారం మౌనంగా ఉండిపోతుంది అపర్ణ. క్లీన్ చేస్తున్న ఇందూ ముఖం మీద తన కాలు అడ్డుపెడుతుంది రేఖ. నువ్వు పెట్టిన భయం బాగానే పనిచేస్తుందని అంటుంది భ్రమరాంబ.

నందూ బొకే షాప్ దగ్గరికి వచ్చి కోపంతో ఊగిపోతాడు వెంకీ. మీ గర్ల్‌ఫ్రెండ్ పబ్‌కి వచ్చిందా లేదా? అని అడుగుతుంది నందూ. చేసినదంతా చేసి, ఏం జరగనట్లు నన్ను ఆటపట్టిస్తున్నారని మండిపడతాడు వెంకీ. మీరు పబ్‌లో నాతో డ్యాన్స్ చేయడం నా గర్ల్‌ఫ్రెండ్ చూసినట్లుగా ఉంది.. అందుకే హర్ట్ అయి నన్ను కలవకుండా వెళ్లిపోయిందని అంటాడు వెంకీ. అసలు నీ గర్ల్‌ఫ్రెండ్ పబ్‌కి వచ్చిందా? లేదా? అని అడుగుతుంది నందూ. దాంతో జరిగినదంతా చెబుతాడు వెంకీ. నువ్వు అమాయకుడివి కాదు, వెర్రీ వెంగలప్పవి.. మీ అన్నయ్య నిన్ను పబ్‌కి పిలిచి నీతో బిల్లు కట్టించాడని చెబుతుంది ఇందూ. మీ అన్నయ్యలిద్దరూ కలిసి నిన్ను కమెడియన్‌ను చేశారు అంటుంది.

అసలు నీ గర్ల్‌ఫ్రెండ్ నిన్ను లవ్ చేస్తుందా అని నిలదీస్తుంది ఇందూ. నీ గర్ల్‌ఫ్రెండ్ తప్పక నిన్ను ఫాలో అవుతోంది తప్పించి నీ మీద ప్రేమతో కాదని వెంకీకి ఇందూ క్లాస్ పీకుతుంది. అసలు ఆ ఆఫీస్‌లో నువ్వు ఒకడివి ఉన్నావని కూడా నీ గర్ల్‌ఫ్రెండ్‌కి తెలియదని అంటుంది. నేను మీకు పబ్‌లో హెల్ప్ చేశాను కాబట్టి.. నన్ను, రోజాని మీరే కలపాలని అడుగుతాడు వెంకీ. దానికి ఇందూ సరేనని అంటుంది. ఇందూ దగ్గరికి వచ్చిన స్వాతి.. నిన్ను అంతలా అవమానిస్తుంటే నేనే తట్టుకోలేకపోయాను, కానీ నువ్వు మాత్రం ఏం జరగనట్లు ఇలా ఎలా ఉంటున్నావని అడుగుతుంది స్వాతి. నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నదేనని .. నాకు ఊహా తెలియని వయసులో బాగా కోపం వచ్చేది, కానీ పరిస్ధితులు అర్ధం చేసుకున్నాక బాధపడినా, కోప్పడినా ఉపయోగం లేదని అర్ధమైందని అంటుంది. నేను మాత్రం ఆ రేఖ ఆంటీని వదిలిపెట్టనని కోపంతో ఊగిపోతుంది స్వాతి.

నాకు సాయం చేస్తున్నావు కదా.. ఇంతకుమించి చేస్తే నీకే ప్రమాదమని హెచ్చరిస్తుంది ఇందూ. తాతయ్య, నానమ్మలకి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసేవరకు అన్నీ భరిస్తానని చెబుతుంది. ఇంతలో ఇందూకి ఒక ఇంటర్వ్యూ ఉందని మెసేజ్ వస్తుంది. ఆ రేఖని ఎదిరించి నిలబడాలంటే ముందు నా కాళ్ల మీద నేను నిలబడాలి. నానమ్మ, తాతయ్యలని ఏ కష్టం లేకుండా చూసుకోవాలంటే నేను సంపాదించాలి, తాతయ్యకి ఆపరేషన్ చేయించి ఒక్కసారి తను లేచి నడిస్తే చూడాలని ఉందని అంటుంది ఇందూ. ఆ మంచం మీద తాతయ్య పడుతున్న బాధ చూడలేకపోతున్నానని చెబుతుంది. అయినా నీకొక సపోర్ట్ కావాలి.. అది ఎవరి రూపంలో వస్తుందో? ఎలా వస్తుందో? నీ కృష్ణయ్యే డిసైడ్ చేయాలని అంటుంది స్వాతి.

స్వరాజ్‌కి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ప్రమాదంలో మంటల్లో కాలిపోతున్నట్లుగా కల వస్తుంది. దాంతో స్వరాజ్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. కాళ్లు తెరిచినా సరే కళ్లముందే జరిగినట్లుగా అనిపిస్తోందని అంటాడు. ఇంకా ఎవరైనా కనిపించారా? అని లక్ష్మీ అడగ్గా.. నా చుట్టూ అంతా మంటలేనని చెబుతాడు స్వరాజ్. ఇది వింతా కాదు విచిత్రం కాదు.. ఇంకా చెప్పాలంటే కొత్త కూడా కాదు. ఇలాంటి కలలు నీ చిన్నతనం నుంచే చాలాసార్లు కన్నావు అంటాడు తండ్రి. వాడు దొరికినప్పటి నుంచి ఈ కల పదేపదే వచ్చి నిద్రలేచి ఏడ్చేవాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వాడికి ఆ పీడకల ఎందుకు గుర్తొస్తుందని అడుగుతుంది లక్ష్మీ. వాడి తరపు వాళ్లు ఎవరైనా దగ్గరవుతున్నారా? అందుకే వాడికి చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుస్తున్నాయా అని అడుగుతుంది. నువ్వు అనవసరంగా కంగారుపడొద్దని చెబుతాడు భర్త.

ఇంటర్వ్యూకి ఇందూ వెళ్తుండగా అందరూ అక్కడే ఉండటంతో కంగారుపడుతుంది ఇందూ. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఐశ్వర్య గారికి స్పెషల్‌గా నెక్లెస్ చేయమని చెప్పారు కదా అని తీసుకొచ్చి చూపిస్తాడు. అది చూసిన ఐశ్వర్య చాలా సింపుల్‌గా వెళ్లిపోతుంది. అంతా నా మేనకోడలికేనా, నా కూతురికేం లేదా అని అడుగుతుంది భ్రమరాంబ. ఐశ్వర్యకి త్వరలో పెళ్లి చేద్దామని ఈ నగలన్నీ కొంటున్నాని చెబుతుంది రేఖ. నీకు కూడా నగలు కావాలా? అని ఇందూని అడుగుతుంది రేఖ. నాకు అలాంటి కోరికలు కానీ, ఆశలు కానీ లేవని చెబుతుంది ఇందూ. శివరామ్ గారి ఇంటికి వెళ్లాలి కదా బయల్దేరమని అంటుంది రేఖ. మీకు చెప్పి వెళ్దామని ఆగానని చెబుతుంది ఇందూ. ప్రతిరోజూ చెప్పాల్సిన అవసరం లేదని భ్రమరాంబ చెప్పగా.. చెప్పాల్సిందేనని సీరియస్ అవుతుంది రేఖ.

ఆ ఇందూని చూస్తూంటే నీకు అనుమానంగా లేదా? షాపింగ్‌లకి వెళ్లే వాళ్లు ఉత్సాహంగా వెళ్తారు.. కానీ ఇలా వంట పనికి, ఇంటి పనికి వెళ్లేటప్పుడు ఇంత ఆనందంగా వెళ్తారా అని అనుమానిస్తుంది. నేను ప్రతిరోజూ శివరామ్ గారితో మాట్లాడుతూనే ఉన్నాను.. అది అక్కడికే వెళ్తోందని చెబుతుంది రేఖ. నీ కూతురికి కూడా నెక్లెస్ చేయించలేదని బాధపడుతున్నావా అని భ్రమరాంబని అడుగుతాడు శేషం. ఏదో ఒకరోజు ఆస్తి విషయంలోనూ ఒట్టి చేతులతో మిగిలిపోతావని శేషం చెప్పడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. డబ్బు కోసం రాకేష్ ఫోన్ చేయడంతో ఐశ్వర్య కంగారుపడుతుంది. నా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేనే నేరుగా వచ్చి మీ ఆంటీతో మాట్లాడతానని వార్నింగ్ ఇవ్వడంతో ఐశ్వర్య కంగారుపడుతుంది. బాకీ ఎలా కట్టాలో అర్ధంకాక ఆలోచిస్తుండగా.. రేఖ చేయించిన నెక్లెస్ గుర్తొస్తుంది. దానిని అమ్మేసి నా అప్పు తీర్చుకోవడంలో ఏ తప్పు లేదని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X