Brahmamudi March 25th Episode: నెక్లెస్ కొట్టేస్తూ భ్రమరాంబకి దొరికిన ఐశ్వర్య.. నందూని కాపాడిన ఇందూ
Photo Courtesy: JioHotstar
తాతని ఇబ్బంది పెట్టామని ఇందూ మన మీద ప్రతీకారం తీర్చుకుంటోందని రేఖను రెచ్చగొడుతుంది భ్రమరాంబ. దాంతో సాంబారు తీసుకొస్తున్న ఇందూకి కావాలని కాలు అడ్డుపెడుతుంది భ్రమరాంబ. దాంతో రేఖ మీద సాంబారు పడుతుంది. మొత్తం క్లీన్ చేయాల్సిందిగా రేఖ ఆర్డర్ వేయడంతో ఇందూ క్లీన్ చేస్తుండగా ఆమె ముఖం వైపు కాలు అడ్డుపెడుతుంది రేఖ. అది చూసిన అపర్ణ, స్వాతిలు రగిలిపోతారు. రేఖ ఆంటి అంత టార్చర్ చేస్తున్నా నువ్వెందుకు కోప్పడటం లేదని స్వాతి అడగ్గా.. నానమ్మ, తాతయ్యల కోసమని చెబుతుంది ఇందూ. ఇంతలో ఆమెను ఇంటర్వ్యూలో పాల్గొనాల్సిందిగా మెయిల్ రావడంతో ఇందూ సంతోషిస్తుంది. నానమ్మ, తాతయ్యలను బాగా చూసుకోవాలి.. తాతయ్యకి ఆపరేషన్ చేయించాలని చెబుతుంది ఇందూ.
స్వరాజ్ నిద్రపోతుండగా.. తన కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయిన ప్రమాదం పీడకలగా రావడంతో ఉలిక్కిపడి లేస్తాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వాడికి ఆ కల ఎందుకొచ్చింది? వాడి కుటుంబ సభ్యులు ఎవరైనా దగ్గరవుతున్నారా? అని భయపడుతుంది లక్ష్మీ. ఐశ్వర్య కోసం రేఖ చేయించిన నెక్లెస్‌ని చూసి అవాక్కవుతుంది భ్రమరాంబ. స్వాతికి కూడా ఇలాంటిది చేయించమని అడగ్గా.. స్వాతి చిన్నపిల్ల అప్పుడే ఎందుకు అని అంటుంది రేఖ. నెక్లెస్‌ను చూసిన ఐశ్వర్య డల్‌గా ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది రేఖ. నువ్వు ఇలాగే వదిలేస్తే రేపు ఆస్తి విషయంలోనూ నిన్ను రేఖ.. బొమ్మలా ఆడుకుంటుందని భ్రమరాంబకు శేషం వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 25వ తేదీ ఎపిసోడ్ 989లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాకేష్ అప్పు తీర్చడానికి రేఖ చేయించిన నెక్లెస్‌ని కొట్టేయాలని అనుకుంటుంది ఐశ్వర్య. రేఖని ఫాలో అవుతూ వెళ్లి నెక్లెస్ ఎక్కడ పెడుతుందో చూస్తుంది. రేఖ వెళ్లిపోగానే ఐశ్వర్య నెక్లెస్ కొట్టేస్తుంది. ఇదంతా భ్రమరాంబ చూసి షాక్ అవుతుంది. సొంత మేనకోడలే చేతివాటం చూపించినప్పుడు.. చిన్నప్పటి నుంచి అలవాటుపడ్డ ప్రాణం, మరి నా చేతివాటం కూడా చూపించాలి కదా అనుకుంటుంది భ్రమరాంబ. వెంటనే రేఖ గదిలోకి వెళ్లి నెక్లెస్ కొట్టేస్తుంది.
ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందూని అక్కడి హెచ్ఆర్ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగిస్తాడు. ఈ జాబ్ ఎందుకివ్వాలి? ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు. అవసరం ఉంది కాబట్టే ఇంటర్వ్యూకి వచ్చాను.. మీరు జాబిస్తే సీన్సియర్‌గా వర్క్ చేస్తానని చెబుతుంది ఇందూ. మీరు బాగా చేస్తారని ప్రూఫ్ ఏంటీ? ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్ ఇవ్వనని తేల్చేస్తాడు హెచ్ఆర్. ఎంత కష్టమైనా? ఎలాగైనా జాబ్ వచ్చేలా చూసుకోవాలని అనుకుంటుంది ఇందూ. మీరు ఈ కంపెనీకి హెచ్ఆరే కదా? ప్రూఫ్ ఏంటీ? అని ఇందూ అడగ్గా అతను షాక్ అవుతాడు. ఈ చైర్‌లో కూర్చోగానే సరిపోదు సార్.. మీరు ఇప్పటి వరకు సెలెక్ట్ చేసిన ఎంప్లాయిస్ అంతా కరెక్ట్‌గా పనిచేస్తున్నారని మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని ఇందూ అడగటంతో హెచ్ఆర్ అవాక్కవుతాడు.
మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మీ మాటల్లో నమ్మకం కనిపిస్తోంది.. ఇచ్చిన వర్క్‌ని టైంకి పూర్తి చేస్తారన్న నమ్మకం కనిపిస్తోంది, మీకు జాబ్ ఇవ్వాలని కూడా ఉంది. కానీ ప్రూఫ్స్ ముఖ్యం.. మీ సర్టిఫికెట్స్ అన్నీ చూశాకే జాబ్ ఇస్తానని చెబుతాడు హెచ్ఆర్. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్స్ ఉండగా.. డిగ్రీ సర్టిఫికెట్ లేకపోవడంతో హెచ్ఆర్ మండిపడతాడు. డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా జాబ్ ఇవ్వలేనని తేల్చిచెప్పడంతో.. మొన్ననే డిగ్రీ ఎగ్జామ్ రాశాను, త్వరలోనే రిజల్ట్స్ వచ్చేస్తాయని చెబుతుంది ఇందూ. నాకు ఈ జాబ్ చాలా అవసరమని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా.. నీ డిగ్రీ సర్టిఫికెట్ వచ్చాక ప్రూఫ్‌తో కనిపించమని చెబుతాడు హెచ్ఆర్. దాంతో ఇందూ బాధతో బయటకు వచ్చేస్తుంది.
డబ్బున్న అమ్మాయిల్ని వెతికే పనిలో స్వరాజ్, లక్కీలు బిజీగా ఉంటారు. ఫ్రెండ్ కారులో సిటీ మొత్తం తిరుగుతుంటారు. ఇంతలో ఐశ్వర్య కారు రిపేర్ రావడంతో రోడ్ పక్కన నిలబడి ఉంటుంది. ఆమెను చూసిన లక్కీ కారు ఆపి ఐశ్వర్య గురించి చెబుతాడు. తనకి లిఫ్ట్ ఇస్తే.. తన ఫ్రెండ్స్ కూడా మనకి క్లోజ్ అవుతారు, వాళ్లలో ఎవరో ఒకరిని నువ్వు సెట్ చేసుకోమని స్వరాజ్‌కి చెబుతాడు లక్కీ. వెంటనే ఐశ్వర్య దగ్గరికి వెళ్లి నేను లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కిస్తుండగా ఇందూ చూస్తుంది. ఈ వెధవ ఆరోజు పబ్‌లో ఐశ్వర్యని ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లాడు.. మళ్లీ ఇప్పుడు కారెక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడోనని కంగారు పడుతుంది ఇందూ. వెంటనే స్వరాజ్ కారును ఆటోలో ఫాలో అవుతుంది.
ఇంతలో ఇద్దరు రౌడీలు వెంటాడుతూ నందూ అక్కడికి వస్తూ ఇందూ వెళ్తున్న ఆటోని గుద్ధుకుంటుంది. రౌడీలు నందూని రౌండప్ చేసి కొట్టబోతుండగా ఇందూ కాపాడుతుంది. ఆరోజు పోలీస్ స్టేషన్‌లో క్లాస్ పీకింది మీరే కదా అంటుంది. వీళ్లు నా వెంట పడలేదు, నేనే వీళ్ల వెంట పడ్డానని చెబుతుంది ఇందూ. అమ్మవారి నగలు దొంగతనం చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు.. ఈరోజు నా కంట్లో పడ్డారని చెబుతుంది నందూ. ఆరోజు మీరు పోలీస్ స్టేషన్‌లో చేసిన సాయానికి, ఈరోజు మీకు సాయం చేసేలా ఆ దేవుడు చేశాడని అంటుంది ఇందూ. తను బయల్దేరి వెళ్లిపోతుండగా.. వీళ్లిద్దరినీ పోలీసులకు అప్పగించే వరకు మీరు నాతోనే ఉండాలని నందూ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. నాకు పోలీసులు, గొడవలు అంటే చాలా భయమని అంటుంది.
అంత భయం ఉన్నప్పుడు నాకెందుకు సాయం చేశారని అడుగుతుంది నందూ. మీకు ఏమైనా అవుతుందని హెల్ప్ చేశానని చెబుతుంది ఇందూ. ఇప్పుడు కూడా అలాగే చేయమని అడుగుతుంది నందూ. దాంతో ఇందూ సరేనని అంటుంది. అమ్మవారి నగలు ఎవరికి అమ్మారని నందూ రౌడీలను ఇంటరాగేషన్ చేస్తుంది. ఒక గోల్డ్ షాప్‌లో అమ్మానని వాళ్లు చెప్పడంతో ఆటోలో ఇందూతో కలిసి వెళ్తుంది నందూ. మరోవైపు.. కారులో వెళ్తుండగా నువ్వు ఎక్కడ ఉంటావు జూబ్లీహిల్సా? బంజారాహిల్సా? అని అడుగుతాడు లక్కీ. లిఫ్ట్ ఇస్తే అడ్రెస్ చెబుతారా అని ఐశ్వర్య కౌంటర్ వేస్తుంది. కారు దిగి వెళ్లబోతుండగా.. నేను కూడా వస్తానని ఐశ్వర్య వెంటపడతాడు లక్కీ. ఆమె చీవాట్లు పెట్టడంతో లక్కీ, స్వరాజ్‌లు వెళ్లిపోతారు.
నెక్లెస్ అమ్మేద్దామని అనుకుంటూ బ్యాగ్ చెక్ చేయగా అందులో నెక్లెస్ ఉండకపోవడంతో ఐశ్వర్య కంగారుపడుతుంది. ఇంట్లో దొంగని అయ్యానని.. ఇప్పుడు ఈ రోడ్డున పడ్డానని అనుకుంటుంది. ఐశ్వర్య కోసం నేను అంత ఫీల్ అవుతుంటే నా ఫీలింగ్స్ పట్టించుకోవా అంటూ మండిపడతాడు లక్కీ. బాగా దాహం వేసి లక్కీ, స్వరాజ్‌లు కూల్‌డ్రింక్ తాగుతుంటారు. ఇంతలో కారులో ఐశ్వర్య పొగొట్టుకున్న నెక్లెస్ లక్కీకి కనిపిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











