Brahmamudi March 26h Episode: ఇందూపై దొంగతనం నేరం.. తప్పించుకున్న ఐశ్వర్య, భ్రమరాంబ
Photo Courtesy: JioHotstar
రాకేష్ దగ్గర చేసిన అప్పుని తీర్చడానికి రేఖ తనకు గిఫ్ట్‌గా కొన్న నెక్లెస్‌ని అమ్మాలని అనుకుంటుంది ఐశ్వర్య. రేఖ వెనకాలే వెళ్లి ఆ నెక్లెస్‌ని లాకర్‌లో నుంచి కొట్టేస్తుంది. ఇదంతా చూసిన భ్రమరాంబ కూడా మరో నెక్లెస్‌ని దొంగిలిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందూ అన్ని సర్టిఫికెట్స్ ఇచ్చినప్పటికీ డిగ్రీ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వడానికి హెచ్ఆర్ నిరాకరిస్తాడు. నేను డిగ్రీ పరీక్ష రాశానని, ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని ఇందూ చెప్పినా వినిపించుకోడు.
డబ్బున్న అమ్మాయిల్ని పట్టుకోవడానికి కారులో ఊరంతా చక్కర్లు కొడతారు లక్కీ, స్వరాజ్. కారు ఆగిపోవడంతో ఐశ్వర్య రోడ్డు మీద ఇబ్బందిపడుతుంది. దాంతో లక్కీ కారు ఆపించి ఐశ్వర్యని లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన ఇందూ.. ఆ కారును ఫాలో అవుతుండగా నందూ ఇద్దరు దొంగలను వెంటాడుతూ ఆటోకి అడ్డుపడుతుంది. నందూని దొంగలు రౌండప్ చేయడంతో ఇందూ కాపాడుతుంది. ఇద్దరూ కలిసి ఆ దొంగలు దొంగ బంగారం అమ్మిన షాప్ దగ్గరకి బయల్దేరతారు. ఐశ్వర్యకు తాను కొట్టేసిన నెక్లెస్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది. కారు దిగి కూల్‌డ్రింక్ తాగుతున్న లక్కీకి ఆ నెక్లెస్ కనిపించడంతో స్వరాజ్‌కి ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 26వ తేదీ ఎపిసోడ్ 990లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కారులో ఐశ్వర్య మరిచిపోయిన నెక్లెస్‌ని చూసి లక్కీ సంబరపడిపోతూ దానిని స్వరాజ్‌కి ఇస్తాడు. ఇది ఐశ్వర్యది అనుకుంటా.. దానికి తిరిగి ఇచ్చేస్తే నాలో ఉన్న నిజాయితీపరుడిని చూసి మెచ్చుకుని నన్ను లవ్ చేస్తుందని అంటాడు లక్కీ. నీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి.. ఈ నెక్లెస్ తీసుకెళ్లి తనకి ఇచ్చి తనని ఇంప్రెస్ చేయడం. దీని వల్ల ఐశ్వర్య ఇంప్రెస్ అవ్వొచ్చు, కాకపోవచ్చు. అప్పుడు నీతో పాటు నేను కూడా నష్టపోతానని అంటాడు స్వరాజ్. ఇదే నెక్లెస్ తీసుకెళ్లి అమ్మేస్తే గ్యారంటీగా ఇద్దరం లాభపడతాం. అలాగే నెక్లెస్ తీసుకెళ్లి అమ్మేస్తే ఆ డబ్బుతో గిఫ్ట్ కొనిస్తే ఐశ్వర్య ఇంప్రెస్ అవుతుందని చెప్పడంతో లక్కీ సరేనని అంటాడు.
లాకర్‌కి తాళం పెట్టి నెక్లెస్ కనిపించకపోవడంతో రేఖకి దొంగతనం జరిగినట్లు తెలుసుకుని భూషణ్‌ని పిలుస్తుంది. మనం లేనప్పుడు మన లాకర్స్‌ని ఎవరో ఓపెన్ చేశారు. అందులో ఉన్న నెక్లెస్‌లని ఎవరో దొంగతనం చేశారని చెప్పడంతో అప్పుడే ఇంటికి వచ్చిన ఐశ్వర్యకి చెమటలు పడతాయి. మీ అక్కని చూడు ఎలా కంగారు పడుతుందో? అలాంటి చేతివాటం అలవాటు నీకు కూడా ఉంది కదా అని భ్రమరాంబని ఇరికిస్తాడు శేషం.
లాకర్‌లో అన్ని నగలు ఉండగా.. ఒక్క నెక్లెస్ కొట్టేయడం ఏంటీ? అని ఐశ్వర్య అడగ్గా.. ఒక్క నెక్లెస్ అని ఎవరు చెప్పారు? దొంగతనం జరిగింది రెండు నెక్లెస్‌లని రేఖ చెబుతుంది. దాంతో నేను వెళ్లాక మరెవరో దొంగతనం చేశారని అనుకుంటుంది ఐశ్వర్య. నాకు నెక్లెస్‌లు ముఖ్యం కాదు.. దానిని దొంగిలించాలనే ధైర్యం వచ్చిన మనిషి కావాలని అంటుంది రేఖ. దీనిని ఇలాగే వదిలేస్తే ఈరోజు నెక్లెస్ పోయింది, నా మీద భయం పోతుందని అంటుంది రేఖ. ఆ నెక్లెస్‌ని దొంగిలించాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవరికి ఉంది? ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించాలని నిన్ను అడిగింది. నువ్వు లేవు అన్నావు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తునే ఉందని ఇందూని ఇరికిస్తుంది ఐశ్వర్య. రెండు నెక్లెస్‌లని అందుకే కొట్టేసిందని చెబుతుంది.
మీ కళ్లముందే ఇందూ అక్క శివరామ్ గారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాతే రేఖ ఆంటీ నగల్ని లాకర్‌లో పెట్టింది.. మరి ఆ నగల్ని తను ఎలా దొంగతనం చేయగలదని అంటుంది స్వాతి. ఈ ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు.. తిరిగొచ్చి దొంగతనం చేయొచ్చు కదా అని అంటుంది రేఖ. వెంటనే దానికి ఫోన్ చేసి పిలిపించమని చెబుతుంది భ్రమరాంబ. అది ఎక్కడికి వెళ్లినా ఈ గూటికే చేరుకోవాలి లేదంటే ఆ ముసలి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెబుతుంది.
ఐశ్వర్య నెక్లెస్ అమ్మడానికి ఓ సేట్ దగ్గరికి వెళ్తారు స్వరాజ్- లక్కీ. ఇది దొంగ బంగారం వీళ్ల దగ్గరి నుంచి కొట్టేయాలని సేట్ అనుకుంటాడు, స్వరాజ్ తెలివిగా వ్యవహరించడంతో సేట్ కంగారుపడతాడు. దీనికి 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంతో నెక్లెస్ ఇవ్వనని అంటాడు స్వరాజ్. దీని వాల్యూ పది లక్షలకు పైగా ఉంటుందని నాకు కూడా తెలుసు.. కానీ దీనిని అమ్మాలంటే బిల్లు కావాలి? మీ దగ్గర ఉందా అని సేట్ నిలదీయడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఫైనల్‌గా 5 లక్షలు ఇవ్వాలని స్వరాజ్ - లక్కీలు షాక్ అవుతారు. నేను అంత ఇవ్వలేను, 2 లక్షల రూపాయలే ఇస్తానని సేట్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.
ఇంతలో దొంగల్ని తీసుకుని ఇందూ- నందూలు సేట్ దగ్గరికి వస్తారు. ఇందూని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇద్దరూ గొడవపడి.. నువ్వు బంగారం అమ్మడానికి ఇక్కడికి వచ్చావని తెలుస్తూనే ఉంది అంటుంది. బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చామని చెప్పి స్వరాజ్ వెళ్లిపోతాడు. సేట్‌ని నందూ బెదిరించడంతో నేను నగలు కొంటాను కానీ, అమ్మవారి బంగారం మాత్రం ఎప్పుడూ కొనను, అది పాపం అని అంటాడు సేట్. నేను దొంగ బంగారం అన్నాను కానీ, అమ్మవారి బంగారం అని చెప్పలేదు కదా అని నందూ చెప్పడంతో సేట్ షాక్ అవుతాడు.
వీళ్లు ఇచ్చిన బంగారాన్ని తీసుకురాకపోతే జైళ్లో వేస్తానని అంటుంది . ఆ దెబ్బతో బంగారం ఇచ్చేస్తానని అంటాడు సేట్. రేఖ నగలు పోయిన విషయాన్ని ఇందూకి చెబుతుంది స్వాతి. ఆ నగలు తీసింది నువ్వేనని అంతా నీ మీద నిందలు వేస్తున్నారు, వీళ్లంతా కలిసి ఏదో పెద్ద ప్లానే వేశారని చెబుతుంది స్వాతి. కొట్టేసిన నెక్లెస్‌ని భ్రమరాంబ దాచుకుంటూ ఉండగా శేషం పట్టుకుంటాడు. ఐశ్వర్య ఒక నెక్లెస్ కొట్టేస్తే... నేను మరొక దానిని కొట్టేశానని జరిగింది చెబుతుంది భ్రమరాంబ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











