Brahmamudi March 27th Episode: పెళ్లికి రాజ్ నో.. యామినిలో బయటికొచ్చిన సైకో, రుద్రాణికి షాకిచ్చిన కావ్య
అప్పూ ఇచ్చిన అడ్రస్ తీసుకుని యామిని ఇంటికి వెళ్తుంది కావ్య. అక్కడ ఆమెను చూడగానే రాజ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఆమెను లోపలికి పిలిచి కబుర్లు చెబుతుంటాడు రాజ్. ఇంతలో యామిని తల్లిదండ్రులు రావడంతో ఆమెతోనూ మాట్లాడుతుంది. నేను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన అమ్మాయి అని అందరికీ చెబుతాడు రాజ్. కాసేపటికీ మెట్లు దిగుతూ రాజ్ పక్కన కావ్యని చూసి షాక్ అవుతుంది యామిని.
మీ పేరు ఏంటని రాజ్ అడగ్గా కళావతి అని చెబుతుంది కావ్య. ఈ కాలంలో ఇంత ట్రెడిషనల్ పేరు ఎవరు పెట్టారని రాజ్ అడగ్గా మీ అమ్మనాన్నలు పెట్టారా అని ప్రశ్నిస్తాడు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఆ పేరు పెట్టారని చెబుతుంది కావ్య. రాజ్ నా పేరు రామ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఈ స్పర్శ తనకు బాగా తెలిసింది లాగా ఉందని ఫీల్ అవుతాడు రాజ్. కావ్య ఇంటికి వెళ్తుండగా ఆమెను మేడపై నుంచి చూస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 27వ తేదీ ఎపిసోడ్ 680లో ఏం జరిగిందంటే?

ఇంటికొచ్చింది ఎవరో? ఏంటో తెలుసుకోకుండా నేరుగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి సేవలు చేస్తారా అంటూ తల్లిదండ్రులపై మండిపడుతుంది యామిని. ఇంటికొచ్చిన వాళ్లని టిఫిన్ తిని వెళ్లమని చెప్పడం కూడా తప్పేనా అని వైదేహి అడుగుతుంది. తనను అసలు ఇంట్లోకే రానివ్వకుండా ఉండాల్సింది అంటుంది యామిని. ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోతే అల్లుడుగారు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు దానికి కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చిందని అందుకే టిఫిన్ చేసి వెళ్లమని చెప్పానని అంటుంది వైదేహి. వాళ్లకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగా ముచ్చట్లు చెప్పుకుంటారని ఫైర్ అవుతుంది యామిని.
వచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి కాదు.. ముంచే అమ్మాయి అని చెబుతుంది యామిని. వచ్చింది రామ్ భార్య కావ్య అని యామిని చెప్పడంతో తల్లిదండ్రులిద్దరూ షాక్ అవుతారు. సొంత భర్త దగ్గరికి వచ్చి అలా మాట్లాడి వెళ్లిపోయిందెంటి అని అడుగుతుంది వైదేహి. గతం మరిచిపోయింది అల్లుడుగారే కానీ ఆ అమ్మాయి కాదు కదా అంటాడు వైదేహి తండ్రి. చాలా తెలివిగా మాట్లాడింది.. తను వెళ్లేటప్పుడు బాయ్ రాజ్ అని పలికి సరిచేసుకుంటూ రామ్ అని .. రాజ్‌కి తన గతాన్ని గుర్తుచేయడానికి ట్రై చేసిందని చెబుతుంది యామిని.
తను కావ్య అని తెలిసినప్పుడు నువ్వేందుకు సైలెంట్‌గా ఉన్నావని ప్రశ్నిస్తుంది వైదేహి. నేను ఏం మాట్లాడినా రామ్ గతం గురించి మాట్లాడాల్సి వస్తుందని చెబుతుంది యామిని. ఆ అమ్మాయి ఇక్కడిదాకా వచ్చింది కాబట్టి రేపు ఖచ్చితంగా సమస్య వస్తుందని భయపడుతుంది వైదేహి. ఆ దొంగ మొహంది ఏదో ప్లాన్ వేసుకుని ఇక్కడి దాకా వచ్చింది. అదేంటో తెలుసుకుని ఆ ప్లాన్‌ని మనం తిప్పికొట్టాలని చెబుతుంది. దాని నీడ, దాని చూపు రామ్ మీద పడటానికి కూడా వీల్లేదని అంటుంది యామిని. దాని ఊపిరి తగిలినా రామ్‌కి గతం గుర్తుచేస్తుందని.. ఆ కావ్య అంత తెలివైనదని అంటుంది .
ఎక్కువ రోజులు ఆగినా అది నాకే నష్టమని, వీలైనంత త్వరగా రామ్‌ని నేను పెళ్లి చేసుకోవాలని చెబుతుంది యామిని. రామ్ తన గతాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటే.. ఇప్పుడు నువ్వు పెళ్లి అంటే ఒప్పుకుంటాడా అని ప్రశ్నిస్తాడు యామిని తండ్రి. తన గతాన్ని నేనే సృష్టించాను కాబట్టి, తన భవిష్యత్తును కూడా నేనే సృష్టిస్తానని అంటుంది యామిని. ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసైనా సరే రామ్‌ని పెళ్లికి ఒప్పిస్తానని చెబుతుంది.
రుద్రాణి - రాహుల్‌లు బయటి నుంచి వచ్చేసరికి కావ్య కిచెన్‌లో వంట చేస్తుంటుంది అది చూసి వాళ్లిద్దరూ షాక్ అవుతారు. కావ్య ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నానని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. చాలా వంటలు వండేశావ్ ఎవరి కోసం అని అడుగుతుంది . కావ్య మా వారి కోసం అని చెబుతుంది. ఆయన ఎక్కడున్నారో తెలిసిందా అని రుద్రాణి అడగ్గా.. మీ వారు ఎక్కడున్నారో తెలిసిందా అని కావ్య ఎదురు ప్రశ్నిస్తుంది. మా వారు ఎక్కడున్నారో నాకు బాగా తెలుసు అందుకే క్యారేజ్ కట్టి పంపిస్తున్నానని అంటుంది కావ్య. దీనికి పూర్తిగా చిప్ దొబ్బినట్లుంది.. నా మొగుడి గురించే మాట్లాడతావా? అందరి ముందు నీ మొగుడి గురించి మాట్లాడి ఇరికిస్తానని అనుకుంటుంది రుద్రాణి.
రాజ్ హాల్‌లో ఉండగా యామిని తల్లిదండ్రులు వస్తారు . నీ ఆరోగ్యం కుదుటపడింది కదా? అని అడగ్గా.. ఫిజికల్‌గా ఓకే కానీ , మెంటల్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని చెబుతాడు రాజ్. యామిని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని , నీ కోసం తన లైఫ్ త్యాగం చేసిందని చెబుతారు యామిని తల్లిదండ్రులు. మీ పెళ్లి గురించి పంతులుగారితో మాట్లాడామని ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతారు. ఇంతలో యామిని వచ్చి రామ్ ఎంగేజ్‌మెంట్ జరిగేటప్పుడే నా మెడలో తాళి కట్టేస్తానని చెప్పాడని అంటుంది.
యాక్సిడెంట్ జరగకపోయుంటే ఎప్పుడో మా పెళ్లి జరిగిపోయేదని చెబుతుంది యామిని. పెళ్లికి నాకు కొంచెం టైం కావాలని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పెళ్లంటే నా మనసెందుకో అంగీకరించడం లేదని , మా యామిని నీకు నచ్చలేదా అని వైదేహి అడుగుతుంది. కట్నం ఏమైనా కావాలా అని అడగ్గా.. డబ్బు గురించి నేను ఆలోచించనని చెబుతాడు రాజ్. మరెందుకు పెళ్లి వద్దు అంటున్నావ్ అని యామిని ప్రశ్నిస్తుంది. మానసికంగా నేను డిస్ట్రబ్‌గా ఉన్నానని.. ఇలాంటి పరిస్ధితుల్లో పెళ్లి చేసుకోలేనని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. తొందరపడి రాజ్‌ను చిరాకు పెట్టొద్దని.. తన మనసును నొప్పించకుండా పెళ్లికి ఒప్పించమని యామినికి తల్లిదండ్రులు సలహా ఇస్తారు.
రాజ్ కోసం క్యారియర్ సిద్ధం చేసి యామిని ఇంటికి మనిషితో పంపిస్తుంది కావ్య. కళావతి మేడం ఫుడ్ పంపించారని ఆ మనిషి చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. ఇంతలో రాజ్ వచ్చి ఫుడ్ తీసుకుంటాడు. అభిమానంతో పంపించినప్పుడు తినకుండా ఉంటే బాగోదని యామినితో చెబుతాడు. క్యారియర్ తీస్తూ కావ్య పంపించిన కార్డ్ చదువుతాడు .. దానిని లాక్కొన్న యామిని నలిపి పక్కనపడేస్తుంది. భోజనం తింటూ కళావతి వంటను మెచ్చుకుంటాడు రాజ్. అదే వంటలు దుగ్గిరాల ఫ్యామిలీకి కూడా వడ్డిస్తుంది కావ్య. ఆమె ప్రవర్తన చూసి అందరికీ షాక్ తగులుతుంది.
రాజ్ కోసం క్యారియర్ పంపించావ్ కదా ఆ విషయం అందరికీ చెప్పు అంటుంది రుద్రాణి. ఎవరికో వంటలు చేసి పంపించావా అని అంతా అడుగుతారు. ఆయన త్వరగా తిరిగి రావాలని అనాథాశ్రమంలో పిల్లలకి క్యారియర్ పంపించానని చెబుతుంది కావ్య . ఇందాక నేను అడిగితే రాజ్ కోసమని చెప్పిందని, ఇప్పుడు మాట మార్చేసిందని మండిపడుతుంది రుద్రాణి. నీలాగా నా చెల్లికి అబద్ధాలు ఆడటం రాదని అంటుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











