Brahmamudi March 27h Episode: దుగ్గిరాల నిలయంలో అడుగుపెట్టిన స్వరాజ్‌.. షాక్‌లో రేఖ, నిర్దోషిగా ఇందూ

Photo Courtesy: JioHotstar

కారులో ఐశ్వర్య మరిచిపోయిన నెక్లెస్‌ని ఆమెకు తిరిగిచ్చేసి ఇంప్రెస్ చేయాలని లక్కీ అనుకుంటాడు. అయితే ఈ నెక్లెస్ అమ్మేసి ఆమెకు గిఫ్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అవుతుందని స్వరాజ్ చెప్పడంతో లక్కీ సరేనని అంటాడు. లాకర్‌కి తాళం వేలాడుతూ ఉండటంతో అనుమానం వచ్చిన రేఖ.. లోపల చెక్ చేయగా రెండు నెక్లెస్‌లు మిస్ అవుతాయి. దాంతో ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. ఇందూయే నెక్లెస్‌లను కొట్టేసి ఉంటుందని ఐశ్వర్య, భ్రమరాంబ ఆమెపై నిందలు వేస్తారు. అక్క.. మీ ముందే శివరామ్ గారింటికి వంట చేయడానికి వెళ్లింది. ఆ తర్వాతే ఆంటీ ఈ నెక్లెస్‌లను లాకర్‌లో పెట్టారు. అలాంటప్పుడు ఇందూ అక్క ఎలా దొంగతనం చేస్తుందని స్వాతి అడుగుతుంది.

బయటికి వెళ్లినట్లే వెళ్లి ఇంటికొచ్చి దొంగతనం చేసి ఉండొచ్చని భ్రమరాంబ, ఐశ్వర్యలు చెప్పడంతో రేఖ కూడా అదే నిజమని అనుకుంటుంది. నేనంటే భయం రావాలంటే దానికి మామూలు పనిష్మెంట్ ఉండదని అంటుంది రేఖ. ఐశ్వర్య నెక్లెస్‌ను అమ్మడానికి సేట్ దగ్గరికి వెళ్తారు లక్కీ, స్వరాజ్. అక్కడ బేరం మాట్లాడుకుంటూ ఉండగా నందూ- ఇందూలు దొంగల్ని తీసుకుని వస్తారు. స్వరాజ్- లక్కీలను చూసి దొంగలు ఇక్కడికి వచ్చారంటూ గొడవ పడుతుంది ఇందూ. దాంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దొంగలు అమ్మిన అమ్మవారి నగల్ని స్వాధీనం చేసుకుంటుంది నందూ. రేఖ లాకర్‌లో కొట్టేసిన నెక్లెస్‌ని చూసుకుని భ్రమరాంబ మురిసిపోతుండగా శేషం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 27వ తేదీ ఎపిసోడ్ 991లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 27th 2026 Episode 991 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఎంతసేపు దాని కోసం వెయిట్ చేయాలి.. ఫోన్ చేసి పిలిపించామని సీరియస్ అవుతుంది భ్రమరాంబ. దొంగిలించిన సొమ్ముని నీ దగ్గర పెట్టుకుని బలే నటిస్తున్నావుగా అని అనుకుంటాడు శేషం. ఇంతలో ఇందూ ఇంటికి రావడంతో రేఖ విరుచుకుపడుతుంది. నీ తిరుగుడులు అయ్యాయా? అని భ్రమరాంబ నిలదీయగా.. నేను వంట పని చేయడానికి వెళ్లాను కదా అని అంటుంది ఇందూ. ఎందుకు చేశావు ఈ పని? ఆ నెక్లెస్‌లు దొంగతనం చేసింది నువ్వేనని నాకు తెలుసు? అని రేఖ అనడంతో ఇందూ షాక్ అవుతుంది. అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? నేను ఏం చేయగలనో తెలిసి కూడా నా వస్తువును తాకావు అంటే నీకు శిక్ష పడాల్సిందేనని అంటుంది రేఖ. ఉదయం మీకు చెప్పేసి శివరామ్ గారింటికి వెళ్లా.. మళ్లీ ఇప్పుడే వస్తున్నానని చెబుతుంది ఇందూ.

నువ్వు ఏడుస్తూ నటిస్తున్నా నీ మాటల్ని నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని అంటుంది భ్రమరాంబ. ఇలా అడిగితే ఎందుకు నిజం చెబుతుంది.. అడగాల్సిన పద్ధతిలోనే అడగాలని అంటుంది ఐశ్వర్య. ఆ నెక్లెస్‌లు ఏం చేశావు.. ఇంకా నీ దగ్గరే ఉన్నాయా? లేకపోతే అమ్మేశావా అని మండిపడుతుంది రేఖ. అసలు దొంగతనం చేయాల్సిన అవసరం నాకెంటీ? అని అంటుంది ఇందూ. ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించాలని అనుకున్నావు కదా దాని కోసమే ఈ పని చేశావు. మర్యాదగా నిజం ఒప్పుకుని నెక్లెస్ ఇచ్చేస్తే నీకే మంచిదని అంటుంది ఐశ్వర్య. తాతయ్యకి ఆపరేషన్ చేయించాలనుకున్న మాట నిజమే.. కానీ దాని కోసం దొంగతనం ఎందుకు చేస్తాను? అయినా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు.

నేనెంటో నీకు తెలియదా అని అడుగుతుంది ఇందూ. నీ కోసం నువ్వు ఏం చేయకపోయినా.. నా నానమ్మ, తాతయ్య కోసం ఎంత దూరమైనా వెళ్తావు. నా నగలు అమ్మేసి ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించేసి నడిపించేద్దామని ప్లాన్ చేశావని అంటుంది రేఖ. ఈ దొంగతనం విషయం నాకు తెలిస్తే ఆ ముసలోడు ప్రాణాలతోనే ఉండడన్న విషయం ఎలా మరిచిపోయావు అని చెబుతుంది రేఖ. నువ్వు చేసిన ఈ పనికి వాళ్లకి శిక్ష వేస్తానని చెబుతుంది రేఖ. ఆ నెక్లెస్ దొంగతనం చేసింది ఐశ్వర్య అక్క అని నాకు తెలిసినా సాక్ష్యం లేక నేను నిజం చెప్పలేకపోతున్నానని బాధపడుతుంది స్వాతి. ఆ ముసలోడు లేచి నడవగలడన్న నీ కలల్ని ఇప్పుడే చంపేస్తానని అంటుంది రేఖ. ఆ ముసలోడు చస్తే ఇందులో ఉన్న ధైర్యం సగమే చస్తుంది.. అదే ఇద్దరినీ చంపేస్తే బెటర్ అని భూషణ్ అనడంతో ఇందూ షాక్ అవుతుంది.

ఆ నగలు కావాలో? మీ తాతయ్య నానమ్మల ప్రాణం కావాలో నువ్వే ఆలోచించుకో అని రేఖ చెప్పడంతో ఇందూ కంగారుపడుతుంది. రెండు నగల కోసం రెండు ప్రాణాలు పోయేలా ఉన్నాయని శేషం చెప్పగా.. ఆ ముసలోళ్లు చస్తే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదని నువ్వు సైలెంట్‌గా ఉండమని మండిపడుతుంది భ్రమరాంబ. ఇందు ఈరోజు కూడా ఇంటర్వ్యూకి చాలా టెన్షన్ పడుతూ వెళ్లింది.. దాని గురించే ఆలోచిస్తున్నాను అని సుభాష్‌తో చెబుతుంది అపర్ణ. ఆ దేవుడు తన తలరాతని ఎందుకు అలా రాశాడో, అప్పుడే బాధ్యతల్ని మోయాల్సిన పరిస్ధితి వచ్చిందని బాధపడతాడు. మనవాళ్లంతా ప్రాణాలతో ఉండి ఉంటే ఇందూ ఓ మహారాణిలా బతికేదని, తన కోసం ఒక మహారాజు లాంటి వాడిని వెతికి పెళ్లి చేసేవాళ్లమని చెబుతాడు సుభాష్. వేరే వెతకడం ఎందుకు? మన రాజ్ మేనల్లుడినే ఇచ్చి పెళ్లి చేసేవాళ్లమని అంటుంది అపర్ణ.

ఆ రోజు వ్యాన్ కాలిపోయినప్పుడు అందరూ కనిపించారు.. కానీ ఆ పిల్లాడి బాడీ మాత్రం కనిపించలేదు, పోలీసులేమో ఆ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి ఉండొచ్చని అన్నారు. కానీ నా మనసెందుకో నమ్మలేకపోతోంది. తను ఇంకా బతికే ఉన్నాడేమో అనిపిస్తోంది, ఏదో ఒక రోజు మనింటికి తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడని చెబుతుంది అపర్ణ. అలా వస్తే ఇందూకి ఒక తోడు దొరుకుతుందని అంటాడు సుభాష్. ఇంతలో స్వరాజ్ దుగ్గిరాల వారింటికి వచ్చి తనకు గతం గుర్తొచ్చినట్లుగా ఉంటుంది. ఈ ఇంటిని ఎక్కడో చూసినట్లుగా ఉందని లక్కీతో అంటాడు స్వరాజ్. దీని కళ్ల ముందే ఆ ముసలోడి నడుం విరగ్గొట్టాలని అంటుంది భ్రమరాంబ. ఆ మాటలతో ఇందూ సీరియస్ అవుతుంది. నేను ఎన్ని మాటలైనా భరిస్తాను, కానీ వాళ్ల జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోనని ఇందూ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

ఆ ముసలోళ్లని ఇప్పుడే లాక్కొస్తానని ఐశ్వర్య వెళ్తుండగా.. స్వరాజ్, లక్కీలు వస్తారు. స్వరాజ్‌ను చూడగానే రేఖ షాక్ అవుతుంది. వెంటనే రాజ్ అని పిలవడంతో నా పేరు మీకు ఎలా తెలుసు అని అంటాడు స్వరాజ్. మేం ఐశ్వర్య కోసం వచ్చామని లక్కీ చెప్పడంతో .. ఐశ్వర్య కంగారుపడుతుంది. మీ ముఖాలు చూస్తుంటేనే అర్ధమవుతుంది.. కేరాఫ్ బస్తీ అని భ్రమరాంబ అనడంతో స్వరాజ్ మండిపడతాడు. ఇతని పేరు లక్కీ.. నా ఫ్రెండ్ అని చెప్పి ఐశ్వర్య బయటకు తీసుకెళ్లాలని ట్రై చేస్తుంది. కానీ లక్కీ మాత్రం ఇక్కడే తేల్చుకుందామని అంటాడు. నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావో, అదే నీకు ఇవ్వాలని అనుకుంటున్నానని లక్కీ నెక్లెస్ బయటకు తీయడంతో అంతా షాక్ అవుతారు.

ఐశ్వర్యకి మేం లిఫ్ట్ ఇచ్చాం.. అప్పుడు ఈ నెక్లెస్ మా కారులో పడిపోయిందని, తిరిగి ఇవ్వడానికి వచ్చామని చెబుతాడు లక్కీ. ఆ నెక్లెస్ తీసింది నువ్వా అంటూ భ్రమరాంబ మండిపడుతుంది. అందరం కలిసి ఇందూని తిడుతున్నామని అంటుంది. ఇంకో నెక్లెస్ ఎక్కడ అని రేఖ అడగ్గా.. భ్రమరాంబకు చెమటలు పడతాయి. ఇంతలో స్వాతి వచ్చి నేను చెబుతానని తీసుకొస్తుంది. అది చూసి భ్రమరాంబ షాక్ అవుతుంది. ఈ నెక్లెస్ మీ రూమ్ ముందే పడిందని అంటుంది స్వాతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X