Brahmamudi March 28th Episode : కావ్యతో రాజ్ ఛాటింగ్.. పసిగట్టిన యామిని, రాజ్‌కి చుక్కలు చూపే ప్లాన్ రెడీ
మన ఇంటికొచ్చింది, ఇంతసేపు మీతో మాట్లాడింది ఆ రాజ్ భార్య కావ్య అని చెప్పడంతో యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఎదురుగా భర్తను పెట్టుకుని ఎలా మాట్లాడింది? ఏం చేయకుండా ఎలా తిరిగి వెళ్లిందని వాళ్లు యామినిని అడుగుతారు. కావ్య చాలా తెలివైనదని , ఆమెతో జాగ్రత్తగా ఉండాలని.. ముందే అప్రమత్తం కాకుంటే రాజ్‌కి గతం గుర్తుచేస్తుందని హెచ్చరిస్తుంది. రాజ్‌ని త్వరగా పెళ్లి చేసుకుని ఆమెకు చెక్ పెట్టాలని అంటుంది యామిని.
కావ్య గురించి ఆలోచిస్తుంటాడు రాజ్. ఇంతలో యామిని తల్లిదండ్రులు వచ్చి అతనితో మాట్లాడతారు. యామినితో త్వరగా పెళ్లి చేస్తే మంచిదని పంతులుగారిని కలిశామని రాజ్‌తో చెబుతాడు. ఇంతలో యామిని వచ్చి నేరుగా విషయం చెప్పేయమని అంటుంది. నాకు కొంచెం టైం కావాలని ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. ఆ మాటలతో యామిని, ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. రాజ్ కోసం కావ్య క్యారియర్ పంపిస్తుంది.. ఆ వంటలు రుచిచూసి కావ్యను మెచ్చుకోవడంతో యామిని రగిలిపోతుంది. కావ్య క్యారియర్ పంపించడం చూసిన రుద్రాణి.. అందరి ముందు నిజం బయటపెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 28వ తేదీ ఎపిసోడ్ 681లో ఏం జరిగిందంటే?

భోజనాల దగ్గర రాజ్‌కు క్యారియర్ పంపించిన విషయం బయటపడకపోవడంతో కావ్య ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతకీ నేను చేసిన వంట ఆయన తిన్నారో లేదోనని మనసులో అనుకుంటుంది. అటువైపు భోజనాల దగ్గర కావ్య వంటకాలను రాజ్ మెచ్చుకుంటూ ఉండటంతో యామిని రగిలిపోతుంది. ఇలాంటి వంట నేను చేయలేనని అనుకుంటున్నావా? డాక్టర్ నిన్ను కారం, ఆయిల్ ఉన్న ఫుడ్ తినొద్దని చెప్పారని అందుకే కాస్త తగ్గించి వండుతున్నానని అంటుంది యామిని. రేపటి నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వమని చెప్పి కోపంగా లేచి వెళ్లిపోతుంది. దాంతో రాజ్, యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు. మీ కూతురు రేపటి నుంచి తినొద్దని చెప్పింది..ఇలాంటి టేస్టీ ఫుడ్ మళ్లీ దొరకదు తినమని యామిని తండ్రికి చెబుతాడు రాజ్ . ఆ మాటలతో వైదేహి రగిలిపోతుంది.
చాలా రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తిన్నానని.. నేను చేసిన చిన్న హెల్ప్‌కి ఆవిడ ఇంత కష్టపడి టేస్టీ ఫుడ్ చేసి పంపించిందని అనుకుంటాడు రాజ్. ఇంతమంచి ఫుడ్ పంపించినందుకు తనకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటాడు. కానీ నా దగ్గర తన ఫోన్ నెంబర్ లేదు.. ఎలా థ్యాంక్స్ చెప్పాలని ఆలోచిస్తుంటుంది. అటు కావ్య కూడా ఇంత వరకు ఆయన నుంచి ఎలాంటి ఫోన్, మెసేజ్ రాలేదంటని బాధపడుతుంది. నా నెంబర్ కార్డ్ మీద రాశాను కదా.. తప్పకుండా ఆయన నాకు ఫోన్ చేస్తారని అనుకుంటుంది. కావ్య పంపించిన కార్డు మీద ఖచ్చితంగా తన ఫోన్ నెంబర్ ఉంటుందని అనుకున్న రాజ్.. డస్ట్ బిన్‌లో దాని ముక్కలు తీసి అతికిస్తాడు. కావ్యకి ఫోన్ చేస్తే బాగోదని మెసేజ్ చేస్తాడు రాజ్.
భర్త నుంచి మెసేజ్ రావడంతో కావ్య గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటుంది. దానికి ఉలిక్కిపడ్డ రుద్రాణి.. కావ్య ఏం చేస్తుందో దూరం నుంచి చూస్తుంది. కావ్యకి దెయ్యం పట్టినట్లుంది.. కొంపతీసి ఆ రాజ్ గాడే దెయ్యంగా దీని ఇంట్లో దూరలేదు కదా అనుకుని భయపడి వెళ్లిపోతుంది రుద్రాణి . రాజ్- కావ్యలు ఛాటింగ్ చేసుకుంటూ ఉంటారు. రాజ్‌లో మార్పుని, ఫోన్‌లో ఎవరితోనో ఛాటింగ్ చేస్తున్న విషయాన్ని దూరం నుంచి యామిని చూసి రగిలిపోతుంది. నేను వీడి కోసం వాడి ఫ్యామిలీని కూడా దూరం చేసి గతాన్ని సృష్టించి ఇంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు.. తిరిగి వాడి పెళ్లాం దగ్గరికే వెళ్లేలా ఉన్నాడని అనుకుంటుంది యామిని.
ఒకపూట భోజనం పంపించేసరికి దాని ఫోన్ నెంబర్ వెతికి మరి దానికి మెసేజ్ చేస్తున్నాడని రగిలిపోతుంది యామిని. పెళ్లి చేసుకున్న ఏడాదికే గొడవలు పడి విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో కనీసం.. గతం కూడా గుర్తులేని వీడు మాత్రం తన భార్య చుట్టూనే తిరుగుతున్నాడని అంటుంది. నేను అనుకున్న దానికంటే కావ్య చాలా డేంజర్ అని.. దానికే కాదు రాజ్‌కు కూడా టైం ఇవ్వడం అస్సలు మంచిది కాదని అనుకుంటుంది. ఇప్పటి వరకు బతిమలాడిన యామినిని చూశావ్.. రేపటి నుంచి నా రెండో కోణం చూడబోతున్నావని అంటుంది. ఎవడినైనా మనం ఒప్పించాలంటే .. వాళ్లని నో చెప్పలేని పరిస్ధితుల్లో నిలబెట్టాలని అనుకుంటుంది. నిన్ను కూడా అలాంటి పరిస్థితుల్లోనే నిలబెడతానని అనుకుంటుంది. నాతో పెళ్లికి ఒప్పిస్తానని అంటుంది.
రాజ్ మెసేజ్‌లతో నవ్వుకుంటున్న కావ్యని అప్పూ చూసి షాక్ అవుతుంది. ఫోన్ చూసుకుంటూ మురిసిపోతున్నావేంటీ అని కావ్యని నిలదీస్తుంది. నువ్వు సడెన్‌గా అన్నదానం చేయడమేంటీ.. దానిని బావగారికే పంపావని రుద్రాణి చెప్పడం ఏంటని ప్రశ్నిస్తుంది. సమయానికి స్వప్న అక్క ఆపకపోతే.. నువ్వు చేస్తున్న పనులకు నీకు పిచ్చి పట్టిందని ఇంట్లో వాళ్లు అనుకునేవారని మండిపడుతుంది. అసలు ఆ క్యారియర్ ఎవరికి పంపించావ్ అని ప్రశ్నించగా.. మీ బావగారి కోసమే పంపించానని చెబుతుంది కావ్య. ఆ మాటలతో అప్పూ షాక్ అవుతుంది. నువ్విచ్చిన అడ్రస్‌తోనే ఓ ఇంటికి వెళ్లగా అక్కడ యామిని అనే అమ్మాయితో రాజ్ ఉన్నాడని.. ఆయన గతం మరిచిపోయాడని నన్ను గుర్తుపట్టలేదని చెబుతుంది కావ్య.
మీ బావ చుట్టూ ఆ యామిని ఓ కట్టుకథ అల్లిందని, లేని గతాన్ని సృష్టించిందని అంటుంది కావ్య. ఆ యామినిని ఎలా వదిలేస్తావని అప్పూ ప్రశ్నించగా.. అలా చేస్తే ఆ యామిని జాగ్రత్త పడుతుందని , మీ బావగారికి మన మీద కోపం నూరి పోస్తుందని చెబుతుంది కావ్య. అప్పుడు ఆయన నాకు ఇంకా దూరమైపోతారని అంటుంది. ఇదంతా ఆ డాక్టర్ నుంచే మొదలైందని కావ్య డౌట్ పడుతుంది. నువ్వు నాకు ఈ విషయం చెప్పుంటే ఎప్పుడో ఆ డాక్టర్ పని చెప్పేదాన్నని అంటుంది అప్పూ. అలా చేస్తే ఆ డాక్టర్ ఈ విషయం యామినికి చెబుతాడని భయపడుతుంది కావ్య. ఆ డాక్టర్ గురించి వివరాలు కనుక్కుంటానని చెబుతుంది అప్పూ.
జాగింగ్ గురించి రాజ్ - యామిని తండ్రి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వైదేహి వచ్చి సెటైర్లు వస్తుంది. ఇంతలో యామిని తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తారు. పేషెంట్‌కి మైల్డ్‌గా హార్ట్ ఎటాక్ వచ్చిందని, కంగారు పడాల్సిన అవసరం లేదని తన కండీషన్ బాగానే ఉందని చెబుతాడు. మళ్లీ కంగారు పడటం, బాగా టెన్షన్ పడటం లాంటివి చేస్తే మరోసారి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని అంటుంది. బెడ్‌పై ఉన్న యామిని తండ్రిని అంతా పరామర్శిస్తారు. నిన్ను చేసుకోవడానికి రామ్ ఉన్నాడు కాబట్టి ఎక్కువకాలం ఆలస్యం చేయలేనని.. నాకు మళ్లీ ఏమైనా జరిగేలోపు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు యామిని తండ్రి. అది నీ చేతుల్లోనే ఉందని, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నామని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











