Brahmamudi March 28h Episode: స్వరాజ్‌పై రేఖ నిఘా..ఐశ్వర్యకి రేఖ పనిష్మెంట్, స్వాతికి షాకిచ్చిన ఇందూ
Photo Courtesy: JioHotstar
నెక్లెస్‌ల దొంగతనం గురించి తేల్చాలని రేఖ ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. ఇంతలో ఇందూ రావడంతో ఆమెపై అందరూ విరుచుకుపడతారు. నీ తాత ఆపరేషన్‌కి డబ్బులు ఇవ్వలేదని నెక్లెస్‌లు కొట్టేశావా అని నిలదీస్తుంది రేఖ. నేను శివరామ్ గారి ఇంటిలో వంట చేసి ఇప్పుడే వస్తున్నాను, నాకేం తెలియదని ఇందూ చెప్పినా వినిపించుకోదు రేఖ. నేను ఏం చేయగలనో తెలిసి కూడా ఇంత ధైర్యం వచ్చిందా అని మండిపడుతుంది. నువ్వు చేసిన తప్పుకి ఆ ముసలివాళ్ల ప్రాణాలు తీస్తానని చెప్పడంతో ఇందూ కంగారుపడుతుంది.
ఆ రోజు బస్సు ప్రమాదంలో మన వాళ్లంతా చనిపోయినా రేఖ కొడుకు బాడీ మాత్రం దొరకలేదు. వాడు ప్రాణాలతోనే ఉన్నాడని అనిపిస్తోంది, ఎప్పటికైనా ఈ ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని అనిపిస్తోందని సుభాష్‌తో అంటుంది అపర్ణ. ఇంతలో ఐశ్వర్యని వెతుక్కుంటూ స్వరాజ్, లక్కీలు వస్తారు.. రాజ్‌ని చూడగానే రేఖ వణికిపోతుంది. మరోవైపు తన దొంగతనం ఎక్కడ బయటపడుతుందోనని ఐశ్వర్య కంగారుపడుతుంది. మీరంతా వెతుకుతున్నది, గొడవ పడుతున్నది ఈ నెక్లెస్ కోసమేనా అని లక్కీ ఆ నెక్లెస్ తీయగానే రేఖ షాక్ అవుతుంది. ఆ రెండో నెక్లెస్ ఎక్కడ అని అడగ్గా.. స్వాతి తీసుకొచ్చి ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 28వ తేదీ ఎపిసోడ్ 992లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రెండో నెక్లెస్ ఎక్కడ అని రేఖ నిలదీయగా... స్వాతి వచ్చి ఇస్తుంది. ఇది మీ రూమ్ బయటే పడిపోయింది, ఐశ్వర్య అక్క తన నెక్లెస్ తీసుకెళ్తుండగా కింద పడిపోయిందేమోనని అంటుంది స్వాతి. రాజ్ వెళ్లిపోతుండగా నీతో మాట్లాడాలని చెబుతుంది రేఖ.. ఇంతలో అపర్ణ బయటకు రావడం చూసి భూషణ్‌తో చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లమని అంటుంది. రాజ్‌ని పిలిచి నువ్వు ఎక్కడ ఉంటావు? ఎవరితో ఉంటావని అడుగుతుంది రేఖ. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు.. తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోతాడు రాజ్.
నెక్లెస్ దొంగతనం చేయడంతో ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది రేఖ. నువ్వు తప్పు చేసి నన్ను తలదించుకునేలా చేశావు.. నా పెంపకాన్ని అవమానించేలా చేశావు. ఎంత గొప్ప లైఫ్ ఇచ్చినా కుక్క తోక వంకర అని నువ్వు నిరూపించుకున్నావు, ఎంతైనా మీ నాన్న రక్తమే కదా నీలోనూ ఉందని రేఖ అనడంతో ఐశ్వర్య మండిపడుతుంది. వాడు కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇలాంటి చెత్త పనులు చేస్తూనే ఉండేవాడు. మీ అన్నయ్యకి ఏమాత్రం తీసిపోవని రుజువు చేసుకున్నావని మండిపడుతుంది రేఖ. ఇంకోసారి చెప్పాపెట్టకుండా బయటకు రావొద్దని అపర్ణ, సుభాష్‌లకు భూషణ్ వార్నింగ్ ఇస్తాడు.
ఇంతలో ఇందూ రావడంతో ఏం జరిగిందని అడుగుతుంది అపర్ణ. జరిగినది చెబితే నానమ్మ, తాతయ్యలు కంగారు పడతారని నిజం చెప్పకుండా దాచేస్తుంది ఇందూ. నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చిన స్వాతికి చీవాట్లు పెడుతుంది భ్రమరాంబ. నెక్లెస్ నీకు ఎక్కడ దొరికిందని స్వాతిని అడగ్గా.. రేఖ ఆంటీ గది బయట అని చెబుతుంది స్వాతి. అది అబద్ధం నిజం చెప్పమని స్వాతి అడగ్గా.. ఈ విషయం మీ అమ్మ చెప్పలేదు, చెబితే దొరికిపోతుందని అంటాడు శేషం.
తన లవర్‌తో కలిసి సినిమా చూడటానికి నందూని హెల్ప్ అడుగుతాడు వెంకీ. పవన్ కళ్యాణ్ సినిమాకు ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్లు సంపాదించి తెస్తుంది నందూ. ఈ టికెట్లు తీసుకెళ్లి నా రోజాకి ఇస్తే.. తను ఇంప్రెస్ అవుతుంది, ఇద్దరం కలిసి పక్కపక్క సీట్లలో సినిమా చూస్తామని అంటాడు. నాకు నీ మీద నమ్మకం లేదు, ముందు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలని అంటుంది నందూ. ఇంతలో రోజా బయటకు వచ్చి టికెట్స్ తీసుకొచ్చావా అని అడుగుతుంది. నువ్వు అడిగిన తర్వాత టికెట్స్ ఎందుకు తీసుకురాకుండా ఉంటానని అంటాడు వెంకీ. ఈ మూవీకి ఎక్కడ ఫస్ట్ డే, ఫస్ట్ షో మిస్ అవుతానేమో అనుకున్నాను అంటుంది రోజా. చిటికెస్తే టికెట్స్ వస్తాయి.. ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పు తీసుకొస్తానని చెబుతాడు వెంకీ.
మరి నన్ను ఏ టైంకి రమ్మంటావని వెంకీ అడగ్గా.. మేమిద్దరం వెళ్లిపోతామని చెబుతుంది రోజా. నా కోసం కష్టపడి టికెట్స్ తీసుకొచ్చావు, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టనని రోజా అనడంతో వెంకీ షాక్ అవుతాడు. వెళ్తూ వెళ్తూ ఒక్క హగ్ ఇవ్వడంతో వెంకీ పులకించిపోతాడు. ఇంతలో నందూ వచ్చి.. అది నీతో టికెట్లు తెప్పించుకుని వాడెవడితోనో సినిమాకు వెళ్తానంటే సిగ్గుపడుతున్నావని చీవాట్లు పెడుతుంది. అది నిన్ను మోసం చేస్తోంది, ఇక్కడితో వదిలేయమని నందూ చెబుతుంది. అయినా వినిపించుకోకపోవడంతో నిన్ను త్వరగా వదిలించుకుంటానని మరో ప్లాన్ చెబుతుంది.
నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావని పిన్ని తెగ ఫీలైపోతుందని స్వాతితో అంటుంది ఇందూ. ఇంతలో ఇందూకి అన్నం తినిపిస్తుండగా ఆమె ఏడుస్తుంది. నాకు నందూ గుర్తొచ్చింది.. అది కూడా ఉంటే మన ముగ్గురం ఇలాగే ఉండేవాళ్లమని చెబుతుంది ఇందూ. నందూ ఉన్నా నీలాగా సపోర్ట్ చేసేది కాదు, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని అంటుంది. ఐశ్వర్య అక్కకి దొరికిన నెక్లెస్‌ని వాళ్లు ఇంటికొచ్చి మరి ఇవ్వడం ఏంటీ అంటుంది స్వాతి. వాళ్లు పక్కా మోసగాళ్లు.. వాళ్లు ఇక్కడికి వచ్చేలా చేసేందే నేను అంటుంది ఇందూ.
నెక్లెస్‌ని ఎలా అమ్ముకోవాలో అర్ధంకాక రాజ్- లక్కీలు గొడవపడుతుండగా ఇందూ వచ్చి బాగానే పంచుకుంటున్నారు కదా అంటుంది. మీరు ఈ నెక్లెస్ ఎవరి దగ్గర కొట్టేశారో కూడా నాకు బాగా తెలుసని చెబుతుంది ఇందూ. ఐశ్వర్యకి లిఫ్ట్ ఇచ్చి తన దగ్గర ఈ నెక్లెస్ కొట్టేస్తారని అంటుంది. నా దగ్గర కథలు చెప్పండి కానీ నందూ దగ్గర మాత్రం కథలు చెప్పొద్దని చెబుతుంది ఇందూ. దొంగలు కనిపిస్తే చాలు మిమ్మల్ని వేటాడి జైళ్లో పడేస్తుందని హెచ్చరిస్తుంది. మీరు ఈ నెక్లెస్‌ని ఎలా కొట్టేశారో అలాగే ఐశ్వర్యకి ఇవ్వమని చెబుతుంది ఇందూ. ఐశ్వర్య అడ్రస్ మాకు తెలియదని అంటాడు లక్కీ. దాంతో ఇంటి అడ్రస్‌ని రాజ్‌కి ఇచ్చి వాళ్లని ఇంటికి వచ్చేలా చేశానని చెబుతుంది ఇందూ.
నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. బయటకు కూల్‌గా కనిపిస్తావు, నోట్లో నాలుక ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. అలాంటిది ఇద్దరు మగాళ్లను భయపెట్టి ఇంటి వరకు వచ్చేలా చేశావని అంటుంది స్వాతి. నిన్ను నమ్మి నా లైఫ్ నీ చేతుల్లో పెట్టేశాను, అది సేఫేనా అని అంటుంది స్వాతి. ఇంటికొచ్చిన రాజ్‌ను చూసి రేఖ కంగారు పడుతూ మందు తాగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











