Brahmamudi March 29th Episode: యామిని హార్ట్ ఎటాక్ ప్లాన్ సక్సెస్, పెళ్లికి రాజ్ ఓకే .. కావ్య గుండె ముక్కలు
కావ్య చేతి వంటని రాజ్ మెచ్చుకుంటూ ఉండటంతో రగిలిపోతుంది యామిని. ఆ మాత్రం వంటలు నేను కూడా చేయగలనని, డాక్టర్ చెప్పారని నీకు ఉప్పు , కారం తగ్గించానని అంటుంది. రాజ్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్, మెసేజ్ రాకపోవడంతో కావ్య బాధపడుతుంది. డస్ట్ బిన్‌లో కావ్య పంపిన కార్డ్ ఆధారంగా ఆమె ఫోన్ నెంబర్‌ను కనిపెట్టి కావ్యతో ఛాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన రుద్రాణికి కావ్యకి దెయ్యం పట్టిందని అనుకుంటుంది.
అటు రాజ్ ఆనందంగా ఛాటింగ్‌లో బిజీగా ఉండటంతో రగిలిపోతుంది యామిని. నేను అనుకున్న దానికంటే ఆ కావ్య చాలా డేంజర్ అనుకుంటుంది. అటు కావ్య ఛాటింగ్ చేస్తూ ఉండగా అప్పూ వచ్చి నీ పనులేం బాలేదని మండిపడుతుంది. దాంతో యామిని - రాజ్‌ల గురించి చెబుతుంది కావ్య. ఉదయాన్నే జాగింగ్‌కు వెళ్లొచ్చిన యామిని తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 29వ తేదీ ఎపిసోడ్ 682లో ఏం జరిగిందంటే?

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన యామిని తండ్రి తనకు మళ్లీ ఏదైనా అయితే మీ నుంచి శాశ్వతంగా దూరమైపోతానని అంటాడు. ఈలోపు మీ ఇద్దరికీ పెళ్లి చేసి కొద్దిరోజులైనా నా మనవడు, మనవరాళ్లతో ఆడుకోవాలని ఆశగా ఉందని అంటాడు . మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని మీ అమ్మనాన్న , మేం ఎన్నోసార్లు అనుకున్నామని.. యామిని కూడా నీ మీద ప్రాణాలు పెట్టుకుందని కాకపోతే మీ అమ్మనాన్న నీ చిన్నప్పుడే చనిపోవడం వల్ల వాళ్లకి మీ పెళ్లి చూసే అదృష్టం లేకుండా పోయిందని చెబుతాడు యామిని తండ్రి. రేపు నా పరిస్ధితి కూడా అలా అయ్యేలోపు .. మీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందని, మీ అమ్మనాన్నల ఆత్మ కూడా శాంతిస్తుందని రాజ్‌తో చెబుతాడు.
నువ్వు కూడా యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మామూలు మనిషివి అవుతున్నావని.. ఇలాంటి పరిస్ధితుల్లో నిన్ను ఇలా అడగటం కూడా కరెక్ట్ కాదని అంటాడు. కానీ నేను పోయేలోపు మీ ఇద్దరినీ భార్యాభర్తలుగా చూడాలని, అది నా చివరి కోరిక అనుకుని యామినిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అంతలా అల్లుడుగారిని బతిమలాడాల్సిన అవసరం లేదని, యామినిని పెళ్లి చేసుకోవాలని తనకు మాత్రం లేదా అని ప్రశ్నిస్తుంది వైదేహి. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని ఎన్నిసార్లు అనుకున్నామని చెబుతుంది.
మూడు ముళ్లు , ఏడు అడుగులు వేస్తేనే ఆ బంధానికి అర్ధం ఉంటుందని.. నా కూతురికి పెళ్లి చేశానన్న ఆనందం నాకు మిగులుతుందని అంటాడు యామిని తండ్రి. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, మీ కోరిక నెరవేర్చే బాధ్యత మాదని అంటుంది యామిని. మీరు చెబితే ఇప్పటికప్పుడే బావ నా మెడలో తాళి కడతాడని అంటుంది . ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని నా కోరిక అని.. అలాగే చేస్తానని అంటాడు యామిని తండ్రి. ఇప్పుడు అల్లుడుగారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని, ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందామని అంటుంది వైదేహి.
ఇది నాకొచ్చిన మొదటి హెచ్చరిక అని.. గతంలో ఎక్కువ రోజులు బతుకుతానన్న నమ్మకం ఉండేదని అంటుంది . ఇంటి దగ్గరి నుంచి హాస్పిటల్‌కు వచ్చే దారిలో నా 50 ఏళ్ల జీవితం కళ్ల ముందు కనిపించిందని చెబుతాడు. మళ్లీ అలాంటి రోజు వస్తే నా కూతురు ఇంకా కృంగిపోతుందని అంటాడు యామిని తండ్రి. వీళ్లద్దరికీ పెళ్లి చేస్తే తనకు తోడుగా రామ్ ఉంటాడని, నా బాధ్యతని రామ్ తీసుకుంటాడని చెబుతాడు యామిని తండ్రి. వీలైనంత త్వరగా నా కూతురిని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు అని అడుగుతాడు . దాంతో ఏం డైలామాలో పడిన రామ్..
ఇంతలో కావ్య , అప్పూలు ఆసుపత్రికి వస్తారు. ఆ యామిని, డాక్టర్ ఇద్దరూ కలిసి మీ బావగారిని భయపెట్టి కన్‌ఫ్యూజ్ చేశారని అంటుంది కావ్య. వీళ్లద్దరూ లోపలికి వెళ్లేసరికి నర్స్‌తో సరసాలు ఆడుతుంటాడు డాక్టర్. ఎవరు మీరు డోర్ కొట్టకుండా నేరుగా లోపలికి వచ్చేస్తే ఎలా అని మండిపడతాడు ఆ డాక్టర్. అంటే మీరు పేషెంట్స్‌తో బిజీగా ఉంటారని అనుకున్నామని.. కానీ నర్స్‌తో బిజీగా ఉంటారని అనుకోలేదని అంటుంది అప్పూ. మీరు రాజ్ అనే పేషెంట్‌కి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు కదా అని అడుగుతుంది కావ్య. రాజ్ ఎవరు అని అమాయకంగా అడుగుతాడు డాక్టర్. యామిని వాళ్ల బావ రామ్ అని గుర్తుచేస్తుంది కావ్య.. ఆ మాటలతో షాక్ అవుతాడు డాక్టర్.
మీరు , యామిని కలిసి రాజ్ అనే వ్యక్తిని రామ్‌గా మార్చి ఆయనకు లేనిపోనివి కల్పించి చెప్పి అయోమయంలో పడేశారు కదా దాని గురించి మాట్లాడుతున్నానని అంటుంది కావ్య. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడే యామినికి ఫోన్ చేస్తానని అంటాడు.. నువ్వు యామినికి ఫోన్ చేస్తే, నేను మీ ఆవిడ ఆమనికి ఫోన్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది అప్పూ. ముందు మీ గురించి తెలిసింది, తర్వాత ఆమని గురించి తెలుసుకున్నానని అంటుంది అప్పూ. నర్స్‌తో రొమాన్స్ చేసుకోవాలంటే పర్సనల్‌గా చేసుకోవాలి కానీ మీటింగ్ హాల్‌లో ముద్దులు పెడితే ఎలా అని అడుగుతుంది.
నువ్వు నర్స్‌తో చేసినదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని , అదంతా నా దగ్గర ఉందని భయపెడుతుంది అప్పూ. మా అక్క అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే మీ వైఫ్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెబుతుంది అప్పూ. తలుపు వేసి అప్పూ కాళ్ల మీద పడతాడు డాక్టర్. ఆయన 6 నెలల నుంచి కోమాలో ఉన్నారా అని కావ్య అడగ్గా.. 6 రోజుల క్రితమే వాళ్లు హాస్పిటల్‌కు వచ్చారని చెబుతాడు డాక్టర్. ఇదంతా యామిని ఆడిస్తున్న డ్రామా అని .. కాకపోతే ఆయన తలకి బలమైన గాయం కావడం వల్ల గతం మరిచిపోయారని చెబుతాడు.
మీ కోరిక ప్రకారం నేను యామినిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు రాజ్. దాంతో అంతా సంతోషిస్తారు. ఇంతలో డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో రాజ్ బయటికి వెళ్తాడు. నువ్వు యాక్టింగ్ ఇరగదీశావని, రామ్ దెబ్బకి ఒప్పుకున్నాడని సంబరాలు చేసుకుంటుంది యామిని. కానీ యామిని తండ్రి మాత్రం చేసిన పనికి బాధపడతాడు. ఇది నాటకమని తెలిస్తే జీవితాంతం బాధపడతావని హెచ్చరిస్తాడు. మరి ఆల్రెడీ రాజ్‌ను పెళ్లి చేసుకున్న కావ్య సంగతేంటని అడగ్గా.. ఆమెకు , రాజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అంటుంది యామిని.
ఆసుపత్రిలో కావ్యకి రాజ్ కనిపించడంతో చాలా సంతోషించి అప్పూకి కూడా చూపిస్తుంది . రాజ్‌ను చూసిన అప్పూ చాలా సంతోషిస్తుంది. వెంటనే బావకి జరిగినదంతా చెప్పి మనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోదామని అంటుంది అప్పూ. జరిగినదంతా చెప్పి బావని తీసుకొచ్చేయమని అప్పూ చెప్పడంతో రాజ్ దగ్గరికి వెళ్లబోతుండగా యామిని వచ్చి అతనిని గట్టిగా హత్తుకుంటుంది. మన పెళ్లికి ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదని యామిని అనడంతో కావ్య , అప్పూలు షాక్ అవుతారు. బావకి పెళ్లికి ఒప్పుకోవడం ఏంటీ? అని అడుగుతుంది అప్పూ. నీ ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకుని ఉంటే నేనే పెళ్లిని క్యాన్సిల్ చేయిస్తానని యామిని అనగా రాజ్ ఆమెను ఆపుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











