Brahmamudi March 2nd Episode: కావ్య పిల్లలకి రేఖ చిత్రహింసలు... అపర్ణకి దారి చూపిన కళావతి ఆత్మ
Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల వారింట్లో అడుగుపెడుతున్న రేఖ అతని భర్తను అడ్డుకుంటుంది అపర్ణ. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్క దానివే పాలించలేవు.. అందుకే ఆస్తిని నా పేరు రాసేయమని అంటుంది రేఖ. ఈ ఇంట్లో నీకు గడ్డిపరక కూడా దక్కనివ్వను అని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. దాంతో సుభాష్‌ని రేఖ వదిన చితకబాదుతుంది.. పాప మీద కత్తి పెట్టి చంపేస్తానని బెదిరిస్తుంది. ఇలాంటి పరిస్ధితి వస్తుందనే కావ్య- రాజ్‌లు తెలివిగా వ్యవహరించారు. ఈ ఆస్తి కావ్య పేరు మీద ఉంది.. కావ్య లేదు కాబట్టి లీగల్‌గా నా మనవరాలే ఈ ఆస్తికి వారసురాలు. మమ్మల్ని ఏమైనా చేస్తే ఆస్తి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కు వెళ్లిపోతుందని అపర్ణ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది.
అయితే కావ్య బిడ్డకు పాతికేళ్లు వచ్చే వరకు నేనే గార్డియన్‌గా ఉంటానని సంతకం పెట్టమని అడుగుతుంది రేఖ. అపర్ణ పెట్టకపోవడంతో సుభాష్‌ని చావబాదుతూ, పాపని చంపేస్తానని బెదిరిస్తుంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అపర్ణ సంతకం పెడుతుంది. మరోవైపు.. ఓ ఫ్యామిలీకి దొరికిన స్వరాజ్‌ను ఆ భార్యాభర్త కన్నబిడ్డలా చూసుకుంటూ ఉంటారు. నిద్రలో ఉలిక్కిపడిన బాబు ఆమెను గట్టిగా హత్తుకుని పడుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 2వ తేదీ ఎపిసోడ్ 969లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నిద్రలో ఉలిక్కిపడి లేచిన స్వరాజ్‌ను చూసి భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. ఏదో పెద్ద ప్రమాదమే జరిగినట్లుగా ఉంది.. అందుకే బిడ్డ అల్లాడిపోతున్నాడని అంటుంది లక్ష్మీ. మరి వీడికి గతం ఎప్పుడు గుర్తుకురావాలి? ఎప్పుడు వాళ్ల అమ్మనాన్నలకి అప్పగించాలని అడుగుతాడు భర్త. ఎప్పుడు గతం గుర్తొస్తే అప్పుడే చూసుకుందాం. అప్పటి వరకు మన కొడుకుగా, మనింట్లోనే పెరుగుతాడని అంటుంది లక్ష్మీ. కనీసం పోలీస్ కంప్లయంట్ అయినా ఇద్దామని చెబుతాడు భర్త. దానికి సరేనని చెబుతుంది లక్ష్మీ.
మరోవైపు.. దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఫోటోలను పెట్రోల్ పోసి తగలబెట్టాలని రేఖ ప్రయత్నిస్తుంది. ఇది చూసిన అపర్ణ షాక్ అవుతుంది. ఇవన్నీ నా వాళ్ల జ్ఞాపకాలు, వాటిని తగలబెట్టొద్దని బతిమలాడుతుంది. ఇక నుంచి దుగ్గిరాల వంశానికి సంబంధించిన జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని తగలబెట్టేస్తుంది రేఖ. నీ మవనరాలు పెరిగి పెద్దయిన తర్వాత తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తెలియకూడదు. తన మనసులో ఈ రేఖ అంటే భయం ఉండాలని అంటుంది. నేను ఏది చెబితే అది చేయాలన్న భయం మాత్రమే ఉండాలని చెబుతుంది. దాంతో అపర్ణ నేలపడి ఏడుస్తుంది.
ఇదంతా చూసిన రేఖ వదిన భర్త.. నీ రాక్షసత్వానికి అడ్డూ అదుపు లేదా? హనుమంతుడి తోక కాల్చి రాక్షసులు సంతోషపడినట్లు మీరంతా సంతోషిస్తున్నారు? ఏదో ఒకరోజు లంకా దహనం జరగక తప్పదని వార్నింగ్ ఇస్తాడు. చేసిన పాపాలకి కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని అంటాడు. ఇంతలో సిటీలో పిల్లాడు మిస్ అయినట్లు ఏ కేసు రాలేదని.. శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో కూడా ఏ కేసు రాలేదని లక్ష్మీతో చెబుతాడు భర్త. ఇన్నిరోజులు ఏ కేసు రాలేదంటే వాడి అమ్మనాన్నలు ఏదైనా ప్రమాదంలో పడ్డారా? అని లక్ష్మీ అడుగుతుంది. ఇంతలో స్వరాజ్ మమ్మీ అని రావడంతో ఇద్దరూ మురిసిపోతారు. వీడికి రాజు అని పేరు పెడదామని అంటారు.
ఇంట్లో రేఖ కొడుక్కి, ఆమె వదిన కూతురికి అక్షరాభ్యాసం జరుగుతుండగా అపర్ణ వచ్చి నా మనవరాళ్లకి కూడా అక్షరాభ్యాసం చేయించమని అడుగుతుంది. వాస్తవానికి ఎప్పుడో చేయించాలి.. ఇప్పటికే బాగా ఆలస్యమైందని అంటాడు శేషం. ఇప్పుడు వాళ్ల చేత గొప్ప గొప్ప చదువులు చదివించేసి ఏం సాధిద్దామని అడుగుతుంది రేఖ. నా మనవరాళ్లు చదవకూడదా? అని అపర్ణ అంటుంది. చదవకూడదు.. వాళ్లిద్దరికి కావాల్సింది లోక జ్ఞానమో, నేను ఏది చెబితే అది చేసే భయం ఉంటే చాలని అంటుంది రేఖ. చేసిన రాద్ధాంతం చాలు.. పిల్లల్ని తీసుకుని లోపలికి పొమ్మని బెదిరిస్తుంది. నీ మనవరాళ్లను చదివించుకోవాలన్న ఆలోచన వస్తే నిన్ను కూడా చంపేస్తానని అంటుంది రేఖ.
రేఖ మాటలతో కుమిలిపోతుంది అపర్ణ. ఈ పసివాళ్లకు కూడా అన్యాయం చేయాలని అనుకుంటున్నావా? వీళ్ల భవిష్యత్‌ని తీర్చిదిద్దుతానిన నా కోడలికి మాట ఇచ్చాను. కానీ ఇప్పుడేమో కనీసం చదివించే అవకాశం కూడా లేకుండా చేశావని దేవుడితో చెప్పుకుంటుంది. ఆ రేఖ ముందు తలవంచాల్సి వచ్చింది.. నేను వీళ్లను ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దగలను అని అనుకుంటుంది. ఇంతలో కావ్య ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో? మన పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుందని అంటుంది. కొన్నిసార్లు మనకు పరిస్ధితులు అనుకూలంగా లేనప్పుడు కొత్తదారులు వెతుక్కోవాలని అంటుంది. స్కూల్‌కి వెళితేనే చదువుకోవాలా? గురువు చెబితేనే చదువుకోవాలా? అని అంటుంది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న అపర్ణ... నేనే వీళ్లకి గురువుని అయి చదువు చెబుతా, కుళ్లు కుతంత్రాలతో నిండిన ఈ సమాజంతో ఎలా పోరాడాలో నేర్పిస్తానని అంటుంది. నేను మీ మనసులోనే ఉంటూ మీకు దగ్గరగానే ఉంటానని చెబుతుంది కావ్య ఆత్మ.
ఈ రోజు నుంచి నేనే మీకు చదువు నేర్పిస్తానని పిల్లలతో చెబుతుంది అపర్ణ. ఆ వెంటనే పిల్లలతో బియ్యంలో అక్షరాలు దిద్దిస్తుంది. లైట్ వేసుకుని పాఠాలు నేర్చుకుంటామని పిల్లలు చెబుతుండగా.. వద్దని అపర్ణ వారిస్తుంది. లైట్ ఆన్‌లో ఉంటే ఎవరికైనా అనుమానం రావొచ్చు, మీరు ఇలా చదువుకుంటున్నారని తెలియకూడదని అంటుంది. మనం చదువుకోవడం తప్పా అని పిల్లలు ప్రశ్నిస్తుంది. ఐశ్వర్య అక్క లాగా మేం స్కూల్‌కి వెళ్లకూడదు? మేం ఏం తప్పు చేశామని రేఖ ఆంటీ మమ్మల్ని చదువుకోనివ్వడం లేదని అడుగుతారు. ఈ మాటలన్నీ విన్న రేఖ వదిన కోపంతో ఈ విషయాలన్నీ రేఖకి చెబుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా మాటను కాదని వీళ్లకు చదువు చెప్పించాలని చూస్తావని పలకలు విసిరి కొడుతుంది రేఖ.
వీళ్లకు అక్షరం ముక్క కూడా రావడానికి వీల్లేదు.. వీళ్లు కేవలం నేను చెప్పే మాటలు వినే రోబోల్లాగా ఉండాలని అంటుంది. మరోసారి నువ్వు చదివించడం నేను చూస్తే వీళ్ల చేతుల్ని విరిచేస్తానని రేఖ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చెప్పిన మాట వినం.. మేం చదువుకుంటామని పిల్లలు చెబుతుండగా వాళ్లని కొట్టబోతుంది రేఖ. నువ్వు ఆశపడ్డట్లు మేం చదువుకోలేం కదా నానమ్మ అంటారు పిల్లలు. అలా అని ఎవరన్నారు. మనం గెలవాలని డిసైడ్ అయితే ఈ ప్రకృతే మనకు దారి చూపిస్తుంది.. ఒక్క అవకాశం పోతే.. మరొక అవకాశం దొరుకుతూనే ఉంటుందని బ్లాక్‌బోర్డ్ లాంటిది చేయించి ముగ్గుతోనే పాఠాలు నేర్పిస్తుంది. అక్కడ స్వరాజ్ పెద్దవాడై స్కూల్‌కి వెళ్తాడు. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మీ చెప్పగా.. వాడిని నా ప్రాణంలా చూసుకుంటానని చెబుతాడు స్వరాజ్. నేను కష్టపడకుండానే ఆ దేవుడు నాకు పెద్దకొడుకుని ఇచ్చాడని అంటుంది. భోజనం చేసేందుకు వంటగదిలోకి వెళ్లగా.. రైస్ తక్కువ ఉండటంతో బాధపడుతుంది అపర్ణ. నువ్వు ఆ ముసలోడు, పిల్లలు ఆ కాస్తతో సర్దుకోలేరా అని మండిపడుతుంది రేఖ వదిన. ఆ మాటలతో అపర్ణ ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











