Brahmamudi March 30th Episode: స్వరాజ్‌పై రేఖ నిఘా.. ఐశ్వర్య మాటలతో ఇందూ మనసు ముక్కలు
Photo Courtesy: JioHotstar
నెక్లెస్ ఇచ్చి వెళ్లిపోతున్న రాజ్‌ని పిలిచి నేను నీతో మాట్లాడాలని అంటుంది రేఖ. ఇంతలో అపర్ణ బయటకు వస్తుండటంతో ఆమెను పక్కకు తీసుకెళ్లమని భూషణ్‌కు చెబుతుంది రేఖ. నువ్వు ఉండేది ఎక్కడ? మీ అమ్మానాన్న ఎవరు? అని అడుగుతుంది రేఖ. రాజ్ సరిగా సమాధానం చెప్పకపోవడంతో టెన్షన్ పడుతుంది. నెక్లెస్ దొంగతనం చేసిన ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది. నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావని గడ్డి పెడుతుంది. వెంకీని రోజాతో కలపడానికి నందూ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు తెచ్చిపెడుతుంది.
వాటిని తీసుకెళ్లి ఐశ్వర్యకు ఇవ్వగా.. నేను, మా కజిన్ సినిమాకు వెళ్తామని రోజా చెప్పడంతో వెంకీ సరేనని అంటాడు. ఈ మాటలు విన్న నందూ.. అది నిన్ను మోసం చేస్తోందని వెంకీకి చెప్పినా అతను వినిపించుకోడు. తన ప్రేమను గెలిపించడానికి కొత్త ప్లాన్ చెప్పమని అడుగుతాడు. స్వాతి అన్నం తినిపించడంతో ఇందూ ఎమోషనల్ అవుతుంది. అసలు ఆ దొంగల్ని ఇక్కడికి పంపించి, నెక్లెస్‌ను కాపాడింది నేనే అని ఇందూ చెప్పడంతో స్వాతి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 30వ తేదీ ఎపిసోడ్ 993లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
స్వరాజ్ గురించి ఆలోచిస్తూ ఫుల్లుగా మందు తాగుతుంది రేఖ. ఇదంతా చూసిన భ్రమరాంబ షాకై.. ఏం జరిగిందని అడుగుతుంది. ఆ అబ్బాయి ఎవరో ఐశ్వర్యకి నెక్లెస్ ఇచ్చి వెళ్లినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చాలా కంగారుపడుతున్నావు, ఇన్నేళ్లలో నువ్విలా భయపడటం చూడలేదు. అసలు ఏం జరిగింది? ఆ అబ్బాయికి నీకు ఏంటీ సంబంధం? అని అడుగుతుంది భ్రమరాంబ. కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు అనుకున్నవాడు కళ్ల ముందుకు వస్తే భయపడకుండా ఉంటామా అని ప్రశ్నిస్తుంది రేఖ. దుగ్గిరాల ఇంటి వారసుడైన స్వరాజ్‌ని మా అమ్మ తన చేతులతోనే చంపింది. అది నా కళ్లారా చూశాను.. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే పోలికలతో వచ్చి నా కళ్ల ముందు నిలబడ్డాడు. అదే నమ్మలేకపోతున్నాను అంటుంది రేఖ.
రాజ్ మేనల్లుడు స్వరాజ్ వచ్చే అవకాశం ఉందని అంటుంది రేఖ. ఆ బాంబ్ బ్లాస్ట్‌లో ఆ పిల్లాడు చచ్చాడు కదా అని అంటుంది భ్రమరాంబ. ఒకవేళ చావకపోయుంటే అని రేఖ ప్రశ్నిస్తుంది. వాడు తిరిగొచ్చిన మనల్ని ఏం చేయలేడు కదా అని భ్రమరాంబ చెప్పగా.. రాజ్‌కి మేనల్లుడు అంటే ఈ ఇంటికి అఫీషియల్‌గా మరో వారసుడు. ఇప్పటి వరకు మన శత్రువు ఇందూ మాత్రమే.. ఒకవేళ వాడు కనుక బతికుంటే ఇందూకి బావగా ఈ ఇంట్లో అడుగుపెడతాడు. దానికి తోడుగా నిలబడతాడు, అప్పుడు మనం పోరాడాల్సింది ఒక్కరితో కాదు, ఇద్దరితో అంటుంది రేఖ. ఆ మాటలతో భ్రమరాంబ షాక్ అవుతుంది. ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నదంతా బూడిదలో పోసిన పన్నీరేనా అని అంటుంది.
ఇదంతా నా ఊహ మాత్రమే.. నిజంగా వచ్చినవాడు కేవలం రాజ్ పోలికలతో మాత్రమే ఉన్నాడా? వాడు రాజ్ మేనల్లుడేనా అని మనం తేల్చుకోవాలని చెబుతుంది రేఖ. 20 ఏళ్ల మన నిరీక్షణ.. ఏ చిన్న తప్పు జరగడానికి కూడా వీల్లేదు? వాడు ఎవరు? వాడు పుట్టినప్పటి నుంచి ఏం చేశాడు అనేది తెలుసుకోవాలని అనుకుంటుంది రేఖ. స్వరాజ్‌కి మళ్లీ యాక్సిడెంట్ కల వచ్చి నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడు. కానీ తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోరు. వాడిని చూస్తుంటే భయంగా ఉంది.. ఒకే కలలో వారం రోజుల్లో మూడుసార్లు రావడం మామూలు విషయం కాదని అంటుంది లక్ష్మీ. వాడి చిన్నప్పటి విషయాలు వాడికి గుర్తొస్తున్నాయని చెబుతాడు. వాడు దొరికిన విషయాన్ని దాచిపెట్టడం కరెక్ట్ కాదని అంటుంది లక్ష్మీ. వాడి అమ్మానాన్నలు బతికుంటే వాళ్లని వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్లు చనిపోయారని తెలిస్తే ఆ బాధని వాడు జీవితాంతం మోయాలని అంటాడు భర్త. ఇంత ప్రేమ పెట్టుకుని వాడిపై ఎందుకు అరుస్తారని అడగ్గా.. మా ప్రేమ ఇలాగే ఉంటుందని చెబుతాడు. ఏదో ఒకరోజు వాడికి సంబంధించిన వాళ్లు వెతుక్కుంటూ వస్తారని అంటుంది లక్ష్మీ.
ఇంతలో అక్కడికి రేఖ వచ్చి తన మనిషిని జనాభా లెక్కల అధికారిగా పంపిస్తుంది. ఆ రాజ్ గాడు ఎవరు? వాళ్లు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నిజంగానే వాళ్లకు పుట్టినవాడేనా అని తెలుసుకోమని చెబుతుంది. అలాగే వాళ్ల మాటలు నేను వినాలని చెబుతుంది. రాజ్ పుట్టుపూర్వోత్తరాల గురించి అన్ని చెప్పడంతో రాజ్ గాడికి, దుగ్గిరాల కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని రేఖకి క్లారిటీ వస్తుంది. వీడికి ఆ స్వరాజ్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అనుకుంటుంది.
రాకేష్ అప్పులు కట్టేద్దామనే ప్లాన్ మొత్తం ఫెయిల్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక టెన్షన్ పడుతుంది. ఇంతలో రాకేష్ ఫోన్ చేయడంతో అతనికి జరిగినదంతా చెబుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వు.. నీ మనీని గ్యారంటీగా ఇచ్చేస్తానని చెబుతుంది. నీకు రెండు రోజులు టైం ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఇందూ రావడంతో నన్ను అడగకుండా నా రూమ్‌లోకి ఎందుకొస్తున్నావని మండిపడుతుంది. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటీ? అతనికి నువ్వు డబ్బులు ఇవ్వాలి? రేఖ ఆంటీ నీకు విచ్చలవిడిగా డబ్బులు ఇస్తుంది? అయినా నీకు అప్పులు చేయాల్సిన అవసరం ఏంటీ అని నిలదీస్తుంది ఇందూ.
నేను ఎవరికీ భయపడి బతకాల్సిన అవసరం లేదని అంటుంది ఐశ్వర్య. అంత ధైర్యం ఉంటే ఆ నెక్లెస్ తీసింది నేనే అని రేఖ ఆంటీకి చెప్పొచ్చు కదా? అందరి ముందు నన్ను ఎందుకు దోషిగా నిలబెట్టావు అని ప్రశ్నిస్తుంది ఇందూ. నా అవసరానికి నేను ఒకటే తీసుకున్నా.. రేఖ ఆంటీ ఇంకో నెక్లెస్ పోయిందని చెప్పేసరికి ఆ అవకాశం నీకు తప్ప ఇంకెవరికీ ఉండదని నీ పేరే చెప్పాను అంటుంది ఐశ్వర్య. అలాంటి పని నేను ఎప్పుడు చేయనని నీకు తెలుసు కదా అంటుంది ఇందూ. నువ్వు అమాయకురాలివి కాదు.. నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివే. ఆమె కూడా అమాయకురాలిలా నటిస్తూ ఆస్తి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుందట కదా అని నానామాటలు అంటుంది ఐశ్వర్య. ఆ రేఖ ఆంటీ నీ మనసులో నాటిన విషం వల్ల మంచి మాటలు కూడా నీకు చెడుగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక రోజు నువ్వు ఈ విషయంలో చాలా బాధపడతావని అంటుంది ఇందూ. అలాంటి రోజే వస్తే నేను చావనైనా చస్తాను కానీ నీ దగ్గరికి మాత్రం రానని మండిపడుతుంది ఐశ్వర్య. వెంకీని రోజాని కలపడానికి ఇద్దరినీ రెస్టారెంట్‌కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











