Brahmamudi March 31st Episode: యాక్సిడెంట్ వెనుక కుట్ర.. కావ్యకి అనుమానం, యామిని గతం తవ్వుతోన్న యామిని

గుండెపోటుతో కుప్పకూలిన యామిని తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు రాజ్. డాక్టర్ వచ్చి ఆయనిని బాధపెట్టే విషయాలు చెప్పొద్దని, సంతోషంగా ఉండేలా చూసుకోమని చెబుతాడు. నేను పోయేలోపు యామినిని పెళ్లి చేసుకుంటే చూడాలని అడగటంతో తప్పకుండా పెళ్లి చేసుకుంటానని రాజ్ మాట ఇస్తాడు. దీంతో యామిని, వైదేహి సంతోషిస్తారు. రాజ్ బయటికి వెళ్లగానే మన ప్లాన్ సక్సెస్ అయ్యిందని తల్లితో అంటుంది యామిని. నువ్వు చేస్తుంది తప్పని పెళ్లి చేసుకున్నా రాజ్‌కి ఏదో ఒకరోజు గతం గుర్తొచ్చి నిన్ను అసహ్యించుకుంటాడని తండ్రి హెచ్చరిస్తాడు.

యామినితో మాట్లాడిన డాక్టర్‌ను వెతుక్కుంటూ వచ్చిన అప్పూ - కావ్యలకి అతను నర్స్‌తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అతనిని వీడియో పేరుతో బ్లాక్‌మెయిల్ చేసి యామిని డ్రామా గురించి తెలుసుకుంటారు. బయటికొచ్చిన కావ్యకు రాజ్ కనిపించడంతో అప్పూకి మీ బావగారు బతికే ఉన్నారని చూపిస్తుంది. రాజ్‌ని చూసిన అప్పూ చాలా సంతోషిస్తుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్‌ను గట్టిగా హగ్ చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది. దీంతో అప్పూ - కావ్యలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 31వ తేదీ ఎపిసోడ్ 683లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 31st 2025 Episode 683 Here is Today s full story

పెళ్లికి ఒప్పుకున్నందుకు రాజ్‌ను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది యామిని. నా మీద ఇష్టంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? అని అడుగుతుంది. ఒకవేళ నీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే చెప్పు డాడీతో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తానని యామిని వెళ్లబోతుండగా రాజ్ పట్టుకుని ఆపుతాడు. అంకుల్‌ని ఇబ్బంది పెట్టొద్దని రాజ్ చెప్పగా.. నువ్వు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు కదా అని అంటుంది యామిని. నువ్వు నా మీద ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నావా? లేదా? అనేది నాకేమీ అర్ధం కావడం లేదని అంటుంది. నీ మీదున్న ఇష్టంతోనే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నానని అంటుంది చెబుతాడు రాజ్.

ఆ మాటలు విన్న అప్పూ , కావ్యలు షాక్ అవుతారు. యాక్సిడెంట్‌కు ముందు రాజ్ అన్న మాటలు కావ్యకి గుర్తొస్తాయి. నిజమా? కాదా? ప్రామీస్ చేయ్ అని యామిని అడగ్గా.. రాజ్ ప్రామీస్ చేస్తాడు. ఈ క్షణం కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నానని సంబరపడిపోతుంది యామిని. ఆ మాటలు విన్న కావ్య పక్కనే ఉన్న వినాయకుడి ముందు ఏడుస్తుంది. ఆయన ప్రాణాల్ని కాపాడి, ఇలా దగ్గర చేస్తావు అనుకునేలోపు.. అందలేనంత దూరం పంపించేస్తావా? అని బాధపడుతుంది.

రాత్రి ఇంట్లో కావ్య- అప్పూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లంతా ఎవరు? అసలు బావతో ఎందుకున్నారు? అని అప్పూ అడుగుతుంది. తన పేరు యామిని అని తప్పించి , తన గురించి నాకేం తెలియదని చెబుతుంది కావ్య. అసలు ఆయన బావగారేనా? అని అప్పూ అడుగుతుంది. మన బావగారే అయినప్పుడు వాళ్ల మీద పోలీస్ కేసు పెట్టి సెల్‌లో పడేస్తే అన్ని నిజాలు బయటికొస్తాయని, కోర్టులో వాళ్లు చేసిన మోసాన్ని బయటిపెట్టి మన బావని మనం తీసుకొచ్చేద్దామని అంటుంది అప్పూ.

ఆ ఆలోచన నాక్కూడా ఉందని, అలా చేస్తే మనమే నష్టపోతామని అంటుంది కావ్య. ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత గతాన్ని మరిచిపోయారు కదా.. ఇప్పుడున్న పరిస్ధితుల్లో తన మీద ఎలాంటి ప్రెజర్ పడినా అది తన ప్రాణాలకే ప్రమాదమని చెబుతుంది కావ్య. బాగా ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం వెళితేనే మీ బావగారిని తిరిగి మనం దక్కించుకోగలమని అంటుంది. అసలు నీ ఆలోచన ఏంటి? ఏం చేద్దామని అనుకుంటున్నావ్? అని అప్పూ అడుగుతుంది.

ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని .. అసలు ఆ యామిని ఎవరు? ఆయనకు యామినికి ఉన్న సంబంధం ఏంటీ? మేం ఇద్దరం వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగితే మీ బావగారిని తన దగ్గరికి ఎలా తీసుకెళ్లింది? ఇంత పకడ్బందీగా ఎలా ప్లాన్ చేయగలిగింది? అసలు మీ బావని ఎలా నమ్మించగలిగింది? వాళ్లంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీ బావకి ఏదైనా ప్రమాదం తలపెట్టడానికే ఇదంతా చేస్తున్నారా? ఆయనను మన నుంచి దూరం చేయడానికే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తుంది కావ్య. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే వాళ్ల ప్లాన్ తిప్పికొట్టి మనం మీ బావని తిరిగి దక్కించుకోగలమని అంటుంది .

ఆ యామిని సంగతి నేను చూసుకుంటానని.. బావకి గతం గుర్తొచ్చే పని నువ్వు చూసుకోమ్మని చెబుతుంది అప్పూ. ఆయనికి గతం గుర్తుచేస్తే ఆ ప్రెజర్‌కి మీ బావ కోమాలోకి వెళ్లిపోచయే ప్రమాదం ఉందని చెబుతుంది కావ్య. బావకి గతం గుర్తుచేయకుండా ఈ సమస్య నుంచి ఎలా బయటపడతావని ప్రశ్నిస్తుంది అప్పూ. మా బంధమే ఆయనకి గతాన్ని గుర్తుచేయాలని, తనంతట తానే నన్ను గుర్తుపట్టాలని అంటుంది. అలా జరగాలంటే నేను ఆయనని పదే పదే కలవాలని చెబుతుంది. ఆయనని కొత్తగా పరిచయం చేసుకుని స్నేహం చేస్తానని అంటుంది కావ్య. నేను నోరు తెరిచి నిజం చెప్పేవరకు ఆ యామిని నాకు అడ్డురాదని చెబుతుంది. మీ బావగారు గతం మరిచిపోయిన విషయం కానీ, తన ఇంటి అడ్రస్ కానీ ఈ ఇంట్లో ఎవరికీ తెలియకూడదని తన మీద ఒట్టు వేయించుకుంటుంది కావ్య.

సడెన్‌గా మీకు అలా జరిగేసరికి చాలా టెన్షన్ పడిపోయానని యామిని తండ్రితో చెబుతాడు రాజ్. నా కాలేజ్ డేస్‌లో యామినిలా నన్ను ఎవరైనా ఇష్టపడ్డారా? అని ప్రశ్నిస్తాడు. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసిందని నేను నీకు గుర్తు లేనా అని అలిగి ఫోన్ పెట్టిందని చెబుతాడు రాజ్. వీరి మాటలు విన్న వైదేహి టెన్షన్ పడుతుంది. రాజ్‌కు ఎక్కడ నిజం చెప్పేస్తాడోనన్న భయంతో పరుగు పరుగున వెళ్తుంది. ఎంతమంది వెంటపడినా మీరు మాత్రం యామినినే నా భార్య అని చెప్పారని అంటుంది వైదేహి. దీంతో రాజ్ షాక్ అవుతాడు. నా జీవితంలో ఒక మంచి జరిగిందని అనుకునేలోపు ఈ కష్టాలేంటని కృష్ణుడి విగ్రహం ముందు కావ్య బాధపడుతుంది. ఇంతలో రాజ్ నుంచి ఆమెకు మెసేజ్ రావడంతో ఇద్దరూ ఛాటింగ్‌లో మునిగిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X