Brahmamudi March 31st Episode: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న స్వరాజ్.. సొంత బావని వెంటాడుతోన్న నందూ
Photo Courtesy: JioHotstar
స్వరాజ్ ఎవరు? రాజ్ మేనల్లుడేనా? అని ఆలోచిస్తూ పీకలదాకా మందు తాగుతుంది రేఖ. ఇంతలో భ్రమరాంబ వచ్చి.. ఏం జరిగిందని అడుగుతుంది. ఈ ఇంటి వారసుడు రాజ్‌ని మా అమ్మ కొట్టి కొట్టి చంపింది. ఉదయం మన ఇంటికి వచ్చిన కుర్రాడు అచ్చం రాజ్ పోలికలతో ఉన్నాడని రేఖ చెప్పడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. రేపు అతను మన ఇంటికి వచ్చిన ఇందూకి బావగా తోడుగా నిలబడితే మనం చిక్కుల్లో పడాల్సి వస్తుందని చెబుతుంది. అయితే ఈ ఆస్తి మనకి దక్కనట్లేనా? 20 ఏళ్ల మన నిరీక్షణ వృథాయేనా అని భ్రమరాంబ బాధపడుతుంది.
తన కుటుంబం మొత్తం యాక్సిడెంట్‌లో చనిపోయిన కల రావడంతో రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. దాంతో రాజ్‌కి సంబంధించిన వాళ్లు ఎవరో మనింటికి వెతుక్కుంటూ రాబోతున్నారని లక్ష్మీ చెబుతుంది. స్వరాజ్ ఇంటి వద్దకు వచ్చిన రేఖ.. తన మనిషిని జనాభా లెక్కల అధికారిగా పంపించి వివరాలన్నీ తెలుసుకుంటుంది. చలపతి - లక్ష్మీ చెప్పినదానిని బట్టి రాజ్‌కి దుగ్గిరాల కుటుంబానికి సంబంధం లేదని తేల్చుకుంటుంది. నువ్వు తప్పులు మీద తప్పులు చేస్తున్నావు.. అంత డబ్బు నీకెందుకు? నెక్లెస్ ఎందుకు అమ్మాల్సి వచ్చిందని ఐశ్వర్యని నిలదీస్తుంది ఇందూ. దాంతో ఐశ్వర్య చాలా కోప్పడుతుంది. వెంకీని రోజాని కలపడానికి రెస్టారెంట్‌కి వస్తుంది నందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 31వ తేదీ ఎపిసోడ్ 994లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రోజాని, వెంకీని కలపడానికి నందూ సాయం చేస్తుంది. చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఆమె చెప్పే మాటలను వింటూ రోజాకు చెప్పి ప్రపోజ్ చేస్తాడు వెంకీ. ఇంతలో నందూకి ఓ స్మగ్లర్ కనిపించడంతో అతనిని చూస్తూ సీరియస్‌గా చెప్పిన మాటల్ని రోజాకు చెప్పడంతో ఆమె సీరియస్ అవుతుంది. స్మగ్లర్‌ను వెంటాడుతూ వెళ్లిపోవడంతో వెంకీ ఇరుక్కుపోతాడు. నందూని నమ్ముకున్నట్లు నన్ను నట్టేట ముంచేసిందని బాధపడతాడు వెంకీ.
ఇందూ మార్కెట్ నుంచి వస్తుండగా బైక్‌తో ఢీకొడతాడు స్వరాజ్. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటీ? దేవుడు మీ ఇద్దరి మధ్య ఏదో స్క్రిప్ట్ రాస్తున్నాడని అంటాడు లక్కీ. దేశంలో ఇన్ని బైక్‌లు ఉండగా నా బైకే దొరికిందా అంటూ ఇందూపై మండిపడతాడు. నువ్వు పెద్ద మైసూర్ మహారాజువా.. వెతుక్కుంటూ వచ్చి గుద్ధడానికి అంటూ సీరియస్ అవుతుంది ఇందూ. కళ్లు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. బుద్ది ఉన్నోడు ఎవరైనా మళ్లీ మీతో గొడవ పడాలని అనుకుంటాడా అంటూ లక్కీ సెటైర్లు వేస్తాడు. రోడ్డు మీద పడిన కూరగాయల్ని నేను ఎత్తిస్తానని ఇచ్చేస్తాడు లక్కీ.
కిందపడిన కూరగాయలు తీసుకుని నేను వంట చేసుకోవాలా? అంటూ ఇందూ సీరియస్ అవుతుంది. మీకు కావాల్సిన కూరగాయలు నేను కొనిస్తానని చెప్పి తీసుకెళ్తాడు లక్కీ. ఇందూ ఇచ్చిన కూరగాయల లిస్ట్ ప్రకారం ఆమెకు కూరగాయలు కొనిస్తాడు స్వరాజ్. సరిగా చూసి వేయండి.. ఒక్క పుచ్చు ఉన్నా నేను ఊరుకోనని మండిపడుతుంది ఇందూ. కూరగాయల బిల్లు 500 అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను తెల్ల ఉల్లిపాయలు కొంటే మీరు వెల్లుల్లి పాయలు వేశారు.. నాకు తెల్ల ఉల్లిపాయలు కావాల్సిందేనని ఫైర్ అవుతుంది ఇందూ. రెండింటికి తేడా ఏంటీ? రెండూ ఉల్లిపాయలే కదా అని సీరియస్ అవుతాడు రాజ్.
మీకు క్యారం బోర్డ్‌లో వైట్ కాయిన్, బ్లాక్ కాయిన్ ఉంటాయి. రెండూ కాయిన్సే అని చెప్పి రెండింటిని ఒకటిగా చూడలేం కదా అని అంటుంది ఇందూ. ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అలాగే దీనికి ఉండే ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది. మూసుకుని నా తెల్ల ఉల్లిపాయలే కావాలని సీరియస్ అవుతుంది ఇందూ. నేనే 200 రూపాయలు ఇస్తాను, మర్యాదగా వెళ్లి కొనుక్కుని రండి అంటుంది ఇందూ. ఆవిడతో గొడవెందుకు? ఆ డబ్బులు ఇస్తే నేనే పట్టుకొస్తానని అంటాడు లక్కీ. కావాలనే ఈగోతో మాట్లాడుతున్నావా అంటూ ఆమెపై మండిపడతాడు స్వరాజ్.
డ్రగ్స్ స్మగ్లర్‌ను వెంటాడుతూ వస్తుంది నందూ. దాంతో నేను దొరికినా పర్లేదు.. ఈ బ్యాగ్ కనుక పోలీసులకు దొరికితే మా బాస్ నన్ను చంపేస్తాడని స్మగ్లర్ భయపడతాడు. వెంటనే హార్ట్ అటాక్ డ్రామా ఆడతాడు. అది చూసిన రాజ్- లక్కీలు హాస్పిటల్‌కు వెళ్దామని చెబుతారు. హాస్పిటల్ పక్కనే అక్కడికి నేను ఎలాగోలా వెళ్లిపోతాను, ఈ బ్యాగ్‌లో మందులు ఉన్నాయి. బస్టాండ్ పక్కనే ఉన్న కాంప్లెక్స్ దగ్గర మా నాన్న ఉంటాడు. ఆయనకి అందజేయండి అని చెబుతాడు స్మగ్లర్. ఈ బ్యాగ్ అందజేయకపోతే చాలామంది ప్రాణాలు పోతాయి.. మీరే హెల్ప్ చేయండి, ఇప్పుడు వాళ్లందరీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయని బ్రతిమలాడతాడు.
అసలు మీ నాన్న ఎవరు? అక్కడ మందులు ఇవ్వకపోతే అక్కడ అంతమంది ప్రాణాలు ఎందుకు పోతాయని లక్కీ ప్రశ్నిస్తాడు. మీకు ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాం కానీ, అవతల చాలా పనులు ఉన్నాయని అంటాడు లక్కీ. అతను అంతలా బాధపడుతుంటే ఇంకా ప్రశ్నలు వేసి విసిగించొద్దని చెబుతాడు స్వరాజ్. మనకి ఈ ఫ్రీ సర్వీస్ అవసరమా? ఈయన వరకు ఓకే కానీ సమాజ సేవ అవసరమా అంటాడు లక్కీ. వీటిని సేఫ్‌గా మేం చెప్పిన చోట ఇస్తే మీకు 10 వేల రూపాయలు డబ్బులు కూడా ఇస్తామని ఆ వ్యక్తి చెప్పడంతో రాజ్- లక్కీలు షాక్ అవుతారు. పదివేల రూపాయలు తీసుకుని బ్యాగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు రాజ్- లక్కీ. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు ఆ స్మగ్లర్ సంబరపడిపోతాడు. వెంటనే తన బాస్‌కి ఫోన్ చేసి పోలీసులు నన్ను తరుముతుంటే డ్రగ్స్ ఉన్న బ్యాగ్‌ని ఒకతనుకి ఇచ్చి పంపించానని చెబుతాడు. వాడి నెంబర్, ఫోటో నీకు పంపించానని చెబుతాడు.
ఇంతలో నందూ వచ్చి అతనిని పట్టుకుంటుంది, ఆ వెంటనే పోలీసులు వచ్చి ఆ ప్యాకెట్స్ ఎక్కడ అని నిలదీస్తారు. వీడి చేతిలో ఉన్న బ్యాగ్‌ని ఎవరో ఇద్దరికి ఇవ్వడం నేను చూశానని.. రాజ్- లక్కీలను చూపిస్తుంది నందూ. వెంటనే వారిని ఫాలో అవుతూ పోలీసులు వెళ్తారు. అది చూసిన రాజ్- లక్కీలు షాక్ అవుతారు. చిన్న ప్యాకెట్‌కి పది వేలు ఇచ్చాడంటే .. అది ప్రాణాలు కాపాడే మందు కాదు, ఏదో తేడా కొడుతోందని భయపడతాడు లక్కీ. బండి స్పీడు పెంచు, దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానమేనని స్వరాజ్‌కి వార్నింగ్ ఇస్తాడు లక్కీ. గుండెపోటు వచ్చినవాడు పక్కనే హాస్పిటల్ ఉందని చెప్పినప్పుడే వినాల్సింది అనుకుంటాడు స్వరాజ్. పోలీసులకు దొరకకుండా వాళ్లిద్దరూ తప్పించుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











