Brahmamudi March 3rd Episode: హద్దులు దాటిన రేఖ టార్చర్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన అప్పూ కూతురు, షాక్‌లో అపర్ణ
Photo Courtesy: JioHotstar
నిద్రలో ఉలిక్కిపడి లేచిన స్వరాజ్‌ను లక్ష్మీ హత్తుకుంటుంది. ఈ బిడ్డ పరిస్ధితి చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదమే జరిగినట్లుగా ఉంది.. బాబుకు గతం ఎప్పుడు గుర్తుకురావాలి? మనం వాళ్ల తల్లిదండ్రులకు ఎప్పుడు అప్పగించాలని భార్యను అడుగుతాడు భర్త. ఆ బాబుకు గతం గుర్తొచ్చే వరకు మనింట్లోనే పెరుగుతాడని చెబుతుంది లక్ష్మీ. రాజ్- కావ్యతో పాటు దుగ్గిరాల కుటుంబానికి చెందిన జ్ఞాపకాలు ఉండకూడదని ఫోటోలను కాల్చి బూడిద చేస్తుంది రేఖ. దాంతో అపర్ణ కంటతడి పెడుతుంది. తన పిల్లలకు, స్వప్న కూతురికి రేఖ అక్షరాభ్యాసం చేస్తుండగా తన మనవరాలికి కూడా అక్షరాభ్యాసం చేయాలని అడుగుతుంది అపర్ణ. వీళ్లు చదువుకోవడానికి వీల్లేదు.. రేపు ఇది పెరిగి పెద్దది అయిన తర్వాత సంతకం చేస్తే చాలని కసురుకుంటుంది రేఖ.
తన మనవరాలి పరిస్థితి ఇలా అయిపోయిందని అపర్ణ బాధపడుతుండగా.. కావ్య ఆత్మ ప్రత్యక్షమై అపర్ణకి హితబోధ చేస్తుంది. దాంతో తానే గురువుగా మారి పిల్లలిద్దరికీ చదువు చెబుతుంది అపర్ణ. అది చూసిన రేఖ.. వీళ్లు చదువుకోవడానికి వీల్లేదని చెప్పాను, ఈసారి రిపీట్ అయితే నీ మనవరాలి చేతుల్ని విరిచేస్తానని అంటుంది. అయినప్పటికీ ఒక బోర్డు, ముగ్గు సాయంతో పిల్లలిద్దరికీ చదువు చెబుతుంది అపర్ణ. అక్కడ స్వరాజ్ పెరిగి పెద్దవాడై తనను పెంచిన తల్లిదండ్రులకు అండగా నిలబడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 3వ తేదీ ఎపిసోడ్ 970లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఈ ఆస్తి మీ పేరు మీదా లేదు.. మా పేరు మీద లేదు. చిన్న వయసులోనే రేఖకి ఎన్నో కష్టాలు వచ్చాయి. వచ్చే కాస్త డబ్బుతోనే ఈ ఇంటిని నెట్టుకొస్తోందని చెబుతుంది రేఖ వదిన. ఇకపై ఈ ఇంట్లో ఏం వండాలో నేను డిసైడ్ చేస్తానని అపర్ణకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఉన్న కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి అపర్ణ పస్తులుంటుంది. నేను తినేశానని చెప్పగా.. కావ్య కూతురు మాత్రం నువ్వు అబద్ధం చెబుతున్నావని నోట్లో ముద్ద పెడుతుంది. ఆ మాటలతో అపర్ణ కంటతడి పెడుతుంది. మీ అమ్మలాగే అని మెచ్చుకుంటుంది.
ఆడుకుంటున్న కావ్య, అప్పూల పిల్లల దగ్గరికి వచ్చి రేఖ వదిన కూతురు వచ్చి బొమ్మలు ఇస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న కూతురు.. ఆ బొమ్మలు లాక్కుంటుుంది. మీరు ఈ ఇంట్లో పనివాళ్లు, నేను ఈ ఇంటికి మహారాణిని అని అంటుంది. మనమంతా ఒక్కటే కదా అని కావ్య కూతురు అనగా.. మీ ముఖాలు, బట్టలు చూసుకోండి అని అంటుంది. ఇంతలో రేఖ వదిన వచ్చి మీరెంత? మీ బతుకులెంత? మా పిల్లలతో ఆడుకుంటే తోలు ఒలిచేస్తానని పక్కకి నెట్టేస్తుంది. ఆ వెంటనే అపర్ణ వచ్చి చిన్నప్పటి నుంచే పిల్లల మనసుల్లో విషాన్ని నాటుతున్నావా? ఆస్తులు.. అంతస్తులు అని పిల్లల్ని చెడగొడుతున్నావా అని మండిపడుతుంది. నేనేమీ చెడగొట్టడం లేదు.. ఎవరి హద్దులు ఏంటో నేర్పిస్తున్నాను అంటుంది భ్రమరాంభ.
ఆ వెంటనే రేఖ వచ్చి మా పిల్లలు అనుభవించడానికి పుట్టారు.. నీ పిల్లలు నేను చెప్పేది చేయడానికి పుట్టారు అని అంటుంది. పరిస్ధితులు నీకు అనుకూలంగా ఉన్నాయని విర్రవీగొద్దు.. గతంలో ఈ ఇంట్లో ఉండటానికి నా కాళ్లు పట్టుకున్న సంగతి మరిచిపోవద్దని అంటుంది. నేను చెప్పేది కూడా అదే.. రోజులు మారిపోయాయి. నీ స్థానం నాకొచ్చింది, నీ స్థాయి దిగజారిపోయిందని అంటుంది రేఖ. వాళ్లకు ఎంతలో ఉండాలో హద్దులు నేర్పించమని వార్నింగ్ ఇస్తుంది రేఖ.
మరోవైపు.. తమ్ముడితో కలిసి స్వరాజ్ ఆడుకుంటూ ఉండగా బంతి కోసం పిల్లాడు రోడ్డు మీదకి పరిగెత్తుతూ ఉండగా కారు వస్తుంది. దాంతో స్వరాజ్ వెళ్లి పిల్లాడిని పక్కకి లాగేసి కిందపడిపోతాడు. దెబ్బ తగిలి బాగా రక్తం వస్తుంది. నాకు ఏమైనా పర్లేదు.. తమ్ముడికి మాత్రం ఏం కాకూడదని అంటాడు స్వరాజ్. ఆ మాటలతో ఆ భార్యాభర్తలు సంతోషిస్తారు. వీడు నిజంగానే నా పెద్ద కొడుకు అని లక్ష్మీ మురిసిపోతుంది.
బొమ్మల కోసం జరిగిన గొడవతో నందూ ఏడుస్తుండగా ఇందూ ఓదారుస్తుంది. ఇంతలో స్వాతి వచ్చి మళ్లీ బొమ్మలు ఇస్తుంది. ఆ బొమ్మలు నువ్వే ఉంచుకో, మళ్లీ మీ అమ్మ వచ్చి గొడవ చేస్తుందని చెబుతుంది. నా పుట్టినరోజుకు మా ఫ్రెండ్స్ ఈ బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ బొమ్మ ఉందని మా అమ్మకి తెలియదని అంటుంది స్వాతి. తర్వాత ముగ్గురు కలిసి ఆడుకుంటారు. ఉదయాన్నే ఓ పెద్ద బిజినెస్‌మెన్ రాబోతుండటంతో ఇంట్లో ఏర్పాట్లు చేయిస్తుంది రేఖ. ఇంతలో నందూ అక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ మీదున్న చికెన్ పీస్ తీసుకుని తినబోతుండగా రేఖ అడ్డుపడుతుంది.
ఈ డైనింగ్ టేబుల్ మీదున్న ఫుడ్ మాకు మాత్రమే.. నువ్వు తినడానికి వీల్లేదని చెప్పాను కదా అని కోప్పడుతుంది. ఆ వెంటనే అట్లకాడ కాల్చి వాతపెడుతుంది. నందూ ఏడుపుతో అపర్ణ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది కూడా నీ కొడుకంతా వయసే కదా.. జాలి కూడా లేదా అని మండిపడుతుంది. ఈ ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్లు వినాల్సిందేనని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఇదంతా మనదేనని చెప్పావు కదా.. చికెన్ కూడా తినకూడదా? అంత పాపం మనం ఏం చేశామని నందూ అడగటంతో అపర్ణ కంటతడి పెడుతుంది. రాత్రి అందరూ నిద్రపోతుండగా.. నందూ లేచి నేను ఇక్కడ ఉండలేను. బాగా చదువుకుని పెద్దయ్యాక తిరిగొచ్చి రేఖ ఆంటీని బాగా కొట్టి మిమ్మల్ని తీసుకెళ్లిపోతానని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
నందూకి బాగా ఆకలి వేసి ఒకావిడ సంచెలో ఉన్న బ్రెడ్‌ని తీసుకుని తినబోతుండగా ఆమె పట్టుకుంటుంది. ఇంతలో ఒకతను వచ్చి నందూని కాపడతాడు. నువ్వు ఎవరు? నీ పేరు ఏంటీ? అని అడుగుతాడు. నందూ ఏం చెప్పకుండా అతనినే ఫాలో అవుతుంది. నందూ కనిపించకపోవడంతో అపర్ణ అటు ఇటూ వెతుకుతుంది. పాప కనిపించడం లేదని పోలీసులకు కంప్లయంట్ చేద్దామని రేఖతో చెబుతుంది. నేను పెట్టిన టార్చర్‌కి అలిగి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని అంటుంది రేఖ. వస్తే అదే తిరిగొస్తుంది.. లేకపోతే లేదని తేల్చేస్తుంది. ఆ మాటలతో అపర్ణ బాధపడుతుంది. నందూ కనిపించకపోవడంతో ఇందూ ఏడుస్తుంది. ఇంతలో స్వాతి వచ్చి పాయసం ఇచ్చి ఓదారుస్తుంది.
తన ఇంట్లోనే నందూ పడుకుని ఉండటంతో కానిస్టేబుల్ షాక్ అవుతాడు. మీ వాళ్ల దగ్గరికి వెళ్లిపోమని చెబితే.. నా దగ్గరికి ఎందుకొచ్చావు అని అడుగుతాడు. నేను ఇంటి నుంచి ఎందుకు వచ్చేశానో నాకు తెలుసు కానీ మీకు చెప్పను అంటుంది. నేను బాగా చదువుకుని పోలీస్ అవ్వడానికి అని చెబుతుంది. పోలీస్ అవ్వగానే రేఖ ఆంటీ బాక్స్ బద్ధలు కొడతా, అక్కని బాగా చూసుకుంటానని అంటుంది నందూ. మీ ఆంటీ గురించి చెప్పావు కానీ.. మీ అమ్మనాన్న గురించి చెప్పలేదని అడగ్గా.. వాళ్లిద్దరూ చచ్చిపోయారని చెబుతుంది నందూ. దాంతో కానిస్టేబుల్ బాధపడతాడు.
ఉదయాన్నే లెక్కలు వేసుకుంటూ కనిపిస్తున్న తండ్రిని చూసి ఎందుకిలా చేస్తున్నావని అడుగుతాడు స్వరాజ్. మధ్యతరగతి వాడి జీవితం ఇంతేనని అంటాడు తండ్రి. అయితే నేను అద్భుతం చేసి చూపిస్తానని అంటాడు స్వరాజ్. అటు నందూ బాగా కష్టపడి చదువుతుంది. ఉదయాన్నే ఇందూ లేచి ముగ్గు వేయడానికి వెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











