Brahmamudi March 4th Episode: అపర్ణకి ఇందూ ధైర్యం.. జులాయిలా స్వరాజ్, తండ్రి చేతుల్లో చీవాట్లు
Photo Courtesy: JioHotstar
పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టేది లేదని.. మేం ఎంత పెడితే అంత తినాల్సిందేనని అపర్ణకు భ్రమరాంభ వార్నింగ్ ఇస్తుంది. తాను పస్తులుండి.. పిల్లలకు భోజనం తినిపిస్తుంది అపర్ణ. అది చూసిన ఇందూ.. తన నాయనమ్మకు భోజనం తినిపిస్తుంది. ఇందూ- నందూలు ఆడుకుంటూ ఉండగా స్వాతి వచ్చి బొమ్మలు ఇస్తుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి ఇవి నా బొమ్మలు.. వీటిని ముట్టుకోవద్దని గొడవ పడుతుంది. భ్రమరాంభ వచ్చి పిల్లలపై కోప్పడుతుంది.
ఉదయాన్నే ఓ బిజినెస్‌మెన్ ఇంటికి వస్తుండటంతో అతని కోసం రేఖ మంచి వెరైటీలు చేయిస్తుంది. నందూకి ఆకలి వేసి డైనింగ్ టేబుల్ మీదున్న చికెన్ ముక్క తినబోతుండగా రేఖ వచ్చి అడ్డుకుంటుంది. వెంటనే కోపంతో నందూని కిచెన్‌లోకి తీసుకెళ్లి వాతలు పెడుతుంది. దాంతో రేఖపై అపర్ణ మండిపడుతుంది. అందరూ పడుకున్నాక.. ఇక నేను ఈ ఇంట్లో ఉండలేనని బాగా చదువుకుని వచ్చి రేఖ ఆంటీని కొట్టి మీ ఇద్దరినీ తీసుకెళ్లిపోతానని అనుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆకలి వేసి ఓ బ్యాగ్‌లో నుంచి బ్రెడ్ లాక్కొని తింటుండగా నందూని ఒకామె కొట్టబోతుండగా ఓ కానిస్టేబుల్ వచ్చి సేవ్ చేస్తాడు. దాంతో అతని వెంటే వెళ్లి అక్కడే పెరుగుతుంది నందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 4వ తేదీ ఎపిసోడ్ 971లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే లేచి ముగ్గులు పెట్టి అందరికీ కాఫీ పెడుతుంది ఇందూ. స్వాతి దగ్గరికి వెళ్లి కాఫీ ఇస్తుంది. ఇవాళ నీకు ఎగ్జామ్ ఉందని తెలుసా? మరి ఎలా చదువుకుంటున్నావు? అని అడుగుతుంది స్వాతి. నేను రాత్రే మొత్తం చదివేశా.. ఇప్పుడు దానిని రివెజన్ చేసుకుంటున్నా అని అంటుంది ఇందూ. నువ్వు ఇంత సీక్రెట్‌గా డిగ్రీ వరకు వచ్చేశావని రేఖ ఆంటీకి తెలిస్తే అని స్వాతి అడగ్గా.. తెలిస్తే నీ వల్లే తెలియాలని చెబుతుంది ఇందూ. ఇంతలో భ్రమరాంబ పిలిచి జ్యూస్ అడుగుతుంది. ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ చేస్తున్న భార్యను చూసి సెటైర్లు వేస్తాడు శేషం. ఒకప్పుడు తినడానికి కష్టపడేవాళ్లు.. ఇప్పుడు తిన్నది అరిగించుకోవడానికి కష్టపడుతున్నారు అంటాడు.
అనుభవించడానికి కూడా రాసిపెట్టుండాలని అంటుంది భ్రమరాంబ. అనుభవించడానికి కూడా ఆరోగ్యం ఉండాలని.. అందుకు పనిచేస్తున్నానని అంటాడు శేషం. దాని కోసం పనివాళ్లు చేయాల్సిన పనులు చేస్తూ నా పరువు తీయకపోతే నా లాగా మిషన్ సాయం తీసుకోవచ్చు కదా అని అంటుంది భ్రమరాంబ. ఒకప్పుడు మనం కేరాఫ్ ఫ్లాట్‌ఫాం అని మరిచిపోయి.. పరువు పరువు అని పెద్ద పెద్ద మాటలు వాడేస్తున్నావని సెటైర్లు వేస్తాడు శేషం. ఇప్పుడు మనం బాగా రిచ్.. రిచ్‌గా కనిపించాలి, రిచ్‌గా తినాలని అంటుంది భ్రమరాంబ.
ఇంతలో జ్యూస్‌లు తీసుకుని వస్తుంది ఇందూ. ఆకాశంలో రంగులా మాదిరిగా ఇన్ని రంగులు ఉన్నాయేంటీ? అని అడుగుతాడు శేషం. షుగర్ కంట్రోల్‌కి కాకరకాయ, కలర్ పెరగడానికి క్యారెట్, రక్తం పెంచుకోవడానికి బీట్‌రూట్ అంటుంది. కాకరకాయ జ్యూస్ తాగలేక షుగర్ వేయమంటుంది భ్రమరాంబ. చేదు తాగేది ఆరోగ్యం కోసం.. కాకరకాయ జ్యూస్‌లో షుగర్ ఏంటీ? అని సెటైర్లు వేస్తాడు. ఆ మాటలతో ఇందూ నవ్వగా.. టిఫిన్ అయ్యిందా అని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ. కిచెన్‌లోకి వెళ్లి అందరికీ టిఫిన్ చేస్తుంది ఇందూ. ఆ వెంటనే అపర్ణకి కాఫీ, సుభాష్‌కి టమోటా సూప్ చేసి తీసుకొస్తుంది.
ఆ పనులన్నీ నేను చేస్తానని చెప్పినా వినిపించుకోకుండా నువ్వే చేశావు.. ఈరోజు నీకు పరీక్షలు ఉన్నాయని అంటుంది అపర్ణ. ఆ సంగతి నేను చేసుకుంటానని చెబుతుంది, తర్వాత సుభాష్‌కి సూప్ తాగిస్తుంది. చదువుకుంటున్నానని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని.. ఇలా దొంగతనంగా దాచాల్సిన కర్మ పట్టింది. ఈ విషయంలో ఈ తాతయ్య నీకు ఏ సాయం చేయలేకపోతున్నాడని బాధపడతాడు సుభాష్. ఇప్పుడు నేను అంతలా ఏం బాధపడుతున్నానని అడుగుతుంది ఇందూ. నీ ఇంట్లోనే నువ్వు బానిసలా బతుకుతున్నావు.. అది నీకు బాధగా లేదని అంటుంది అపర్ణ. మా అమ్మనాన్నలు వాళ్ల ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది.. ఏడుస్తూ కూర్చోవడానికి కాదు, జీవితంలో గెలవడానికి అంటుంది ఇందూ.
ఏదో ఒక రోజు మా అమ్మనాన్నల ఆశయాల్ని నిలబెడతానని అంటుంది ఇందూ. అవసరమైతే దాని కోసం ఈ ప్రపంచంతోనే యుద్దం చేస్తాను.. ఆ రేఖను ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటుంది ఇందూ. కాలంలో కరిగిపోయిన బంధాన్ని తిరిగి తీసుకురాకపోవచ్చు.. కానీ దూరమైన సంతోషాన్ని నేను తిరిగి తీసుకొస్తానని అంటుంది ఇందూ. దూరమైన దుగ్గిరాల ఇంటిపేరుని తిరిగి సంపాదిస్తాను. అజ్ఞాతవాసంలో పాండవులు విరాట కొలువులో అవమానాల పాలైనా.. ఆ రోజు నా కృష్ణయ్యే కురుక్షేత్రం నడిపించినట్లుగా త్వరలోనే ఈ యుద్ధాన్ని కూడా గెలిపిస్తాడని అంటుంది ఇందూ.
నువ్వు అచ్చం మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు.. అది కూడా ఇలాగే ధైర్యం చెప్పేదని అపర్ణ గుర్తుచేసుకుంటుంది. ఆ రోజు ఆ దారుణం జరగకపోతే ఈపాటికి నా కొడుకు కోడలు ఆశపడినట్లుగా రాజ్- ఇందూల పెళ్లి చేసేవాళ్లమని అనుకునేది అపర్ణ. ఆరోజు నేను నా మనవడిని కాపాడి ఉంటే వాడు ఇందూకి అండగా నిలబడేవాడని సుభాష్ బాధపడతాడు. అక్కడ ధనలక్ష్మీ తలుపు కొడుతున్నట్లుగా కలగంటుండగా రాజ్‌ని ఎగిరి తంతాడు తండ్రి. ఏదో ఒకరోజు నేను కింగ్ అంటాడు స్వరాజ్. అర్ధరాత్రి వరకు బలాదూర్‌లు తిరగడం, మధ్యాహ్నం వరకు పడుకోవడం అని నానామాటలు అంటాడు.
కలాం గారు కలలు కనమని చెప్పారు.. మన కోరిక ఎంత బలంగా ఉంటే అంత మంచిదని అంటాడు స్వరాజ్. వాటర్ ట్యాంక్ వచ్చింది నీళ్లు తీసుకురమ్మని చెబుతాడు తండ్రి. ప్రతిరోజూ నేనే వెళ్లాలా? అని అడుగుతాడు రాజ్. ఇంతలో లక్ష్మీ వచ్చి త్వరలోనే నీకు రాజయోగం పట్టబోతుందని పంతులుగారు చెప్పారని అంటుంది. నీ పేరు మీద లక్షవత్తుల నోము చేస్తున్నానని అంటుంది లక్ష్మీ. త్వరలోనే నేనే సక్సెస్ అయి చూపిస్తానని అంటాడు రాజ్. వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లేసరికి ఆడవాళ్లు కొట్టుకుంటూ ఉంటారు. దాంతో నకిలీ 500 నోట్లు గాల్లోకి విసిరి జనాన్ని అటు వైపు తరిమేస్తుండగా ఈలోగా రాజ్ వచ్చి నీళ్లు పట్టుకుంటాడు. అవన్నీ దొంగనోట్లు అని తెలుసుకున్న ఆడవాళ్లు స్వరాజ్ మీద మండిపడతారు. అందరూ కలిసి రాజ్‌ని చితకబాదుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











