Brahmamudi March 6th Episode: డబ్బు కోసం స్వరాజ్ చీటింగ్.. ఇందూని తప్పించడానికి స్వాతి స్కెచ్

Photo Courtesy: JioHotstar

నకిలీ 500 నోట్లతో వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్లని బురిడీ కొట్టించిన స్వరాజ్‌ని అంతా చితకబాదుతుండగా తెలివిగా తప్పించుకుంటాడు. ఇకపై నేను ఈ నీళ్లు తీసుకురాను అని తండ్రికి చెబుతాడు. నా కోసం ఎవరో ఒక మహారాణి ఎదురుచూస్తుంటుందని అంటాడు స్వరాజ్. ఉదయాన్నే రుద్రాణి, రాహుల్‌ ఫోటోలను తుడుస్తుంది ఇందూ, ఇంతలో స్వాతి వచ్చి తనకు సిలబస్‌లో డౌట్ ఉందని అర్ధమయ్యేలా చెప్పమని అడుగుతుంది. తర్వాత వస్తానని ఇందూ చెబుతున్నా వినిపించుకోకుండా స్వాతి లాగడంతో చేయి తగిలి రుద్రాణి ఫోటో కిందపడిపోతుంది. దాంతో స్వాతి, ఇందూలు వణికిపోతారు. ఇంతలో రేఖ వచ్చి.. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు.. అయినప్పటికీ జాగ్రత్త లేకుండా పనిచేస్తున్నావా? అని ఇందూని కొట్టబోతుండగా అపర్ణ సీరియస్ అవుతుంది.

అయినా కిందపడింది ఆఫ్ట్రాల్ రుద్రాణి ఫోటోయే.. దాని బతుకంతా కేరాఫ్ ఫ్లాట్‌ఫాం, జాలిపడి ఇంట్లోకి తీసుకొస్తే మా కుటుంబాన్ని నాకు దూరం చేసిందని నానామాటలు అంటుంది అపర్ణ. దాంతో రేఖ సీరియస్ అయి మీకు నేనంటే భయం పోయింది.. దానిని చంపేస్తానని చెబుతుంది. వెంటనే సుభాష్‌ని ఇంట్లో నుంచి తోసేస్తుంది. సుభాష్‌ కిందపడి దెబ్బలు పడటంతో ఇందూ క్షమాపణలు అడగటంతో రేఖ వదిలేస్తుంది. ఇకపై ఎవరు తప్పు చేసినా శిక్ష నీకేనని ఇందూకి వార్నింగ్ ఇస్తుంది. నా వల్ల రేఖ ఆంటీ చేతిలో మీరు అవమానాలు పడ్డారని ఇందూకి సారీ చెబుతుంది స్వాతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 6వ తేదీ ఎపిసోడ్ 973లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 6th 2026 Episode 973 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆఫీస్‌కి వెళ్తున్న తమ్ముడు రెడీ అవుతుండగా రాజ్ అడ్డుపడతాడు. నీ జీవితాన్ని ఉద్యోగానికి తాకట్టు పెట్టేశావని చెబుతాడు. నీ చిన్న కొడుకు ఉద్యోగం చేస్తూ తినడానికి కూడా టైం లేనంతగా కష్టపడుతున్నాడని అంటాడు.. నాకు మాత్రం ఆ కర్మ పట్టలేదని అంటాడు. ఉద్యోగం చేయడం బాధ్యతని చెబుతాడు. ఇంతలో స్వరాజ్‌కి టిఫిన్ వేసి పెడుతుంది తల్లి. ఆ వెంటనే నాకు కూడా రెండు దోశలు అని అతని ఫ్రెండ్ రావడంతో తండ్రి ఇద్దరినీ తిడతాడు. నువ్వు బిజినెస్ చేయడానికి డబ్బులు ఎవరిస్తారని స్వరాజ్‌ని అడుగుతాడు తండ్రి. నువ్వు బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదని తేల్చేస్తాడు తండ్రి. నీలాగా మిడిల్ క్లాస్ జీవితం నేను బతకలేనని చెబుతాడు స్వరాజ్. అయితే నా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ అందదని మండిపడతాడు తండ్రి. దాంతో కోప్పడిన స్వరాజ్.. ఇంట్లో నుంచి వచ్చేస్తాడు. పిల్లల్ని ప్రశాంతంగా కూడా తిననివ్వరా అంటూ భర్తపై కోప్పడుతుంది లక్ష్మీ. తినేటప్పుడు చెబితే బుర్రకి ఎక్కుతుందని అలా చెప్పానని అంటాడు తండ్రి.

మరోవైపు.. ఎగ్జామ్‌కి టైం అవుతూ ఉండటంతో ఎలా వెళ్లాలో అర్ధం కావాలో తెలియక ఇందూ టెన్షన్ పడుతుంది. మనం తీసుకున్న అప్పుని వెంటనే కట్టమని ఆ చక్రీ గొడవ చేస్తున్నాడని భూషణ్‌తో గొడవ పడుతుంది రేఖ. ఈరోజు నేను ఆఫీస్‌కి రాలేను.. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెబుతాడు భూషణ్. నీ ఇంపార్టెంట్ వర్క్ ఏంటో నాకు బాగా తెలుసు.. క్లబ్‌లో గేమ్స్ ఆడటానికే కదా వెళ్లేదని మండిపడుతుంది రేఖ. ఆ చక్రీ దగ్గర ఆఫీస్ కోసం చేసిన అప్పుల్లో నువ్వే క్లబ్‌లో ఆడటం కోసం చేసిన అప్పే సగం ఉందని ఫైర్ అవుతుంది. తనకు పెసరట్టు పెడుతున్న ఇందూపై ఫైర్ అవుతుంది రేఖ. నాకు అర్జెంట్‌గా బ్రెడ్ ఆమ్లెట్ కావాలని చెబుతుంది.

ఈ ఆస్తిని సొంతం చేసుకునే విషయంలో నాకు హెల్ప్ చేస్తావని నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను.. కానీ నువ్వేమో అప్పులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావని భూషణ్‌పై మండిపడుతుంది రేఖ. ఆ చక్రీ గాడికి నువ్వు మాట్లాడితేనే నచ్చుతుందని అంటుంది. ఐశ్వర్య ఇంకా పడుకునే ఉంది.. తనకు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయమంటారు అని అడుగుతుంది ఇందూ. ఆ మాటలతో వెంటనే రేఖ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఐశ్వర్య కోసం రేఖ త్వరగా వెళ్తుంది.. భ్రమరాంబ పిన్ని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది ఇందూ.

రేఖ వెళ్లేసరికి ఐశ్వర్య నిద్రలేచి చదువుకుంటున్నట్లు నటిస్తుంది. అయితే రాంగ్ బుక్ చదువుతూ రేఖకి దొరికిపోతుంది ఐశ్వర్య. నైట్ పార్టీ అయ్యే వరకు ఎంత టైం అయ్యిందని రేఖ అడగ్గా.. మార్నింగ్ 3 గంటలు అయ్యిందని చెబుతుంది ఐశ్వర్య. నువ్వు బాగా చదివే దానివి అయితే 10 బ్యాక్‌లాగ్స్ ఎందుకు పెడతావు. ఎప్పుడో ఫినిష్ చేయాల్సిన ఇంజనీరింగ్‌ని మళ్లీ మళ్లీ ఎందుకు చదువుతావని సెటైర్లు వేస్తుంది. నీకు మా రాహుల్ అన్నయ్య బుద్ధులే వస్తాయని చెబుతుంది. నిన్ను ఎగ్జామ్ హాల్‌లో దించి నేను వెళ్తానని అంటుంది రేఖ.

బయటికి వెళ్లడానికి తన బైక్‌ని క్లీన్ చేస్తాడు స్వరాజ్. ఇంతలో ఫ్రెండ్ రావడంతో లాప్‌లాప్‌ని రెడీ చేశావా? లేదా? అని అడుగుతాడు స్వరాజ్. దానిని అందంగా రెడీ చేశానని చెబుతాడు ఫ్రెండ్. ఆ లాప్‌టాప్‌ని 50 వేలకి అమ్మేస్తానని చెబుతాడు. ఇంతలో కస్టమర్‌ ఫోన్ చేసి వివరాలు అడగటంతో ఓ పెద్ద రెస్టారెంట్‌కి రమ్మని చెబుతాడు రాజ్. అక్కడ బిల్ కట్టాలంటే మన ఆస్తులు అమ్మాల్సిందేనని ఫ్రెండ్ హెచ్చరించినా రాజ్ వినిపించుకోడు. అలాంటి చోట అమ్మితేనే కస్టమర్లు మనల్ని నమ్ముతారు అని రాజ్ అంటాడు.

ఎగ్జామ్ రాసేందుకు కుదురకపోవడంతో కృష్ణుడి విగ్రహం ముందు ఇందూ బాధపడుతుంది. నన్ను, మా ఫ్యామిలీని చిన్నప్పటి నుంచి బాధపెడుతూనే ఉన్నావు.. ఎంతో కష్టపడి చదువుకుంటుంటే నాకు నువ్వు సాయం చేయడం లేదు. బయటికి వెళితే కాలు విరగ్గొడతానని రేఖ ఆంటీ, నేను కనిపిస్తే పనులు చేయించాలని భ్రమరాంబ పిన్ని రెడీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇందూ. మా ఐశ్వర్య అస్సలు చదవనే చదవదు, కానీ తనకి అవకాశం ఇస్తావు.. నాకు మాత్రం బయటకు వెళ్లే అవకాశం కూడా కల్పించవు.. ఎలాగైనా నేను బయటికి వెళ్లాలి, ఎగ్జామ్ రాయాలని వేడుకుంటుంది ఇందూ. ఇంతలో కృష్ణుడి విగ్రహం వెనుక నుంచి స్వాతి వచ్చి నువ్వు ఈరోజు ఎగ్జామ్ రాస్తావని చెప్పి ప్లాన్ చెబుతుంది.

భ్రమరాంబ పీకలదాకా తింటూ ఉండటంతో శేషం సెటైర్లు వేస్తాడు. ప్లాన్ ప్రకారం ఇందూ వచ్చి తుడుస్తూ ఉంటుంది. ఇందాక శుభ్రం చేశావు కదా.. మళ్లీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది. దుమ్ము కనిపిస్తుంది పిన్ని.. మళ్లీ రేఖ ఆంటీ చూస్తే కోప్పడుతుందని వచ్చానని అంటుంది ఇందూ. త్వరగా పూర్తి చూసి నాకు ప్రోటీన్ షేక్ తీసుకురమ్మని చెబుతుంది భ్రమరాంబ. ఇంతలో స్వాతి వచ్చి.. నిన్ను ఇందాకటి నుంచి పిలుస్తుంటే వినిపించడం లేదా అని ఇందూపై కోప్పడి బట్టలు ముఖాన వేస్తుంది. ఈ బట్టల్ని టైలర్ దగ్గరికి తీసుకెళ్లి కుట్టించమని చెబుతుంది స్వాతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X