Brahmamudi March 7th Episode: బావా మరదళ్లని కలిపిన విధి.. ఇందూ దెబ్బకి స్వరాజ్‌‌కి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

పరీక్షకు టైం అవుతూ ఉండటంతో ఇంట్లో నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇందూ టెన్షన్ పడుతుంది. ఇంతలో రేఖ వచ్చి తనకు టిఫిన్ పెట్టమని అడుగుతుంది. ఇందూ వచ్చి దోశలు వేయడంతో తనకు బ్రెడ్ అమ్లేట్ వేయమని సీరియస్ అవుతుంది. భూషణ్‌ను పిలిచి నువ్వు చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి. ఆ చక్రీ గాడు విసిగిస్తున్నాడని మండిపడుతుంది రేఖ. ఎలాగైనా ఎగ్జామ్‌కి వెళ్లాలని అనుకున్న ఇందూ.. వెంటనే ఐశ్వర్య ఇంకా నిద్రలేవలేదని మీరే చూసుకోండి అని రేఖకి చెబుతుంది. దాంతో రేఖ వెళ్లి ఐశ్వర్యని నిద్రలేపుతుంది. ఇంత లేట్ అయితే ఎగ్జామ్ ఎలా రాస్తావు? అసలు ప్రిపేర్ అయ్యావా? లేదా అని అడుగుతుంది రేఖ.

మరోవైపు.. స్వరాజ్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చీటింగ్ చేస్తుంటాడు. పాత లాప్‌టాప్‌ని కొత్తదానిలా మార్చేసి దానిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడతాడు. కస్టమర్ ఫోన్ చేయగానే దానిని 50 వేలకు అమ్ముతానని చెబుతాడు. తమ్ముడు ఆఫీస్‌కి రెడీ అవుతుంటే రాజ్ అడ్డుపడతాడు. నీ తమ్ముడు కష్టపడి చదివి నాకు ఇంటి ఖర్చులలో సాయం చేస్తున్నాడు. నువ్వు గాలి తిరుగుళ్లు తిరగడమే సరిపోతుందని తండ్రి చీవాట్లు పెడతాడు. నన్ను ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వవా అని రాజ్ అలిగి వెళ్లిపోతాడు. ఇందూని ఎగ్జామ్‌కి తీసుకెళ్లడానికి స్వాతి ఓ ప్లాన్ వేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 7వ తేదీ ఎపిసోడ్ 974లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 7th 2026 Episode 974 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూనీ ఎగ్జామ్ సెంటర్‌కి పంపించడానికి గాను స్వాతి ప్లాన్ వేస్తుంది. తన బట్టలు తీసుకొచ్చి ఇందూ ముఖాన కొడుతుంది. ఈ బట్టలు నాకేనా అని ఇందూ అడగ్గా.. ఇవి రేఖ ఆంటీ నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. వీటిని తీసుకెళ్లి టైలర్ దగ్గర కుట్టించి తీసుకురమ్మని చెబుతుంది స్వాతి. ఆ మాటలతో భ్రమరాంబ సంతోస్తుంది. ఇన్ని రోజులు దీనిని అక్కా అక్కా అంటూ తిరుగుతుంటే నాకు చెడ్డ చిరాకు వచ్చేది. ఇన్నిరోజులకు నువ్వు నా దారిలోకి వచ్చావు, అయినా సడెన్‌గా నీలో ఈ మార్పు ఏంటీ అని భ్రమరాంబకు అనుమానం వస్తుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇప్పుడిప్పుడే నాకు అర్ధమవుతుందని అంటుంది స్వాతి. నేను బయటకు వెళ్లకూడదని రేఖ ఆంటీ కండీషన్ పెట్టిందని అంటుంది ఇందూ. ఆ మాటలతో భ్రమరాంబ ఆలోచనలో పడుతుంది.

అంటే నా బట్టలు నేను కుట్టించుకోవాలా? నా పనులు కూడా చేయరా? నాకంటే లేదు.. నీకు కూడా లేదా అని భ్రమరాంబని రెచ్చగొడుతుంది స్వాతి. నేను చెబుతున్నాను కదా వెళ్లు అని ఇందూతో చెబుతుంది భ్రమరాంబ. నువ్వు నడుచుకుంటూ వెళ్లొచ్చేసరికి తెల్లారి అయిపోతుంది.. డ్రైవర్‌ని తీసుకెళ్లమని అంటుంది. బయటకు వెళ్లే అవకాశం దొరికింది కదా అని అడ్డమైన తిరుగుళ్లు తిరగొద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా నటిస్తుంది స్వాతి. రాజ్ అదే దారిలో వస్తూ.. ఇందూ వస్తున్న కారుని ఢీకొట్టి డబ్బులు వసూలు చేయాలని అనుకుంటాడు. వెంటనే తన ప్లాన్ అమలు చేసి కారుని కావాలని ఢీ కొట్టి కిందపడిపోతాడు.

తోటి మనిషికి ఇంత అన్యాయం జరుగుతుంటే నిలదీయరా? నాకు న్యాయం చేయరా అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తాడు రాజ్. దాంతో జనం రెచ్చిపోయి డ్రైవర్‌ని కిందకి లాక్కొస్తారు. మర్యాదగా అడిగితే ఎందుకు చెబుతారంటూ డ్రైవర్‌తో జనం గొడవపడతారు. ఎగ్జామ్‌కి టైం అవుతుండటంతో ఇందూ కంగారు పడుతుంది. నేను కావాలని గుద్ధలేదు.. ఆయన వచ్చి నా కారును ఢీకొట్టాడని డ్రైవర్ ఎంత చెబుతున్నా వినిపించుకోకపోవడంతో ఇందూ రంగంలోకి దిగుతుంది. తమ్ముడికి బాగా దెబ్బలు తగిలాయి.. 20 వేల రూపాయలు పెనాల్టీ కట్టమని డ్రైవర్‌కి జనం వార్నింగ్ ఇస్తారు. నువ్వు కాకపోతే ఓనర్ కడుతుందని సీరియస్ అవుతారు. ఈ డబ్బు ఉన్నవాళ్లని ఇలాగే అడగాలని మండిపడతారు.

చిన్న యాక్సిడెంట్‌కి ఎంఆర్ఐ స్కానింగ్, బాడీ స్కానింగ్ అని గోల చేస్తున్నారంటూ ఇందూ ఫైర్ అవుతుంది. అసలు తప్పుగా డ్రైవ్ చేసుకొచ్చింది నువ్వు. రాంగ్ రూట్‌లో వచ్చి నా కారుని గుద్ధేశావు, దానికి పడిన డెంట్‌కి నువ్వే నాకు 20 వేలు కట్టాలని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. మర్యాదగా పెనాల్టీ కడతావా? లేకపోతే పోలీస్ స్టేషన్‌కి వెళ్దామా అని ఇందూ బెదిరించడంతో రాజ్‌కి ముచ్చెమటలు పడతాయి. అక్కడికి వెళితే ఇద్దరికీ టైం వేస్ట్ .. ఏదైనా ఉంటే ఇక్కడే తేల్చుకుందామని అంటాడు రాజ్. నేను పోలీస్ స్టేషన్‌కి వస్తే నేను గుద్ధినట్లు ఆధారాలు ఎలా చూపిస్తావని రాజ్ అడగ్గా.. కారు వైపు చూపిస్తుంది ఇందూ. 360 డిగ్రీ కెమెరాలో సేవ్ అయ్యింది.. నీ పర్ఫార్మెన్స్ మొత్తం పోలీసులకు చెబుతాను. అప్పుడు నువ్వే నాకు 20 వేలు కడతావని చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు.

తప్పు చేసినవాడికి మద్ధతుగా నిలబడినందుకు ఇతనితో పాటు మీ మీద కూడా కేసు పెడితే.. మీరంతా జైలుకు వెళ్తారని ఇందూ బెదిరించడంతో జనం పారిపోతారు. రాజ్ కిందపడిపోతుండగా ఇందూ పట్టుకుంటుంది. నార్మల్‌గా అయితే నీలాంటి వాడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి శిక్షపడే వరకు వదిలిపెట్టేదానిని కాదు.. కానీ నాకు ఎగ్జామ్‌కి టైం అవుతుంది కాబట్టి బతికిపోయావని చెబుతుంది ఇందూ. మీకు అర్జెంట్ పని ఉంది, నాకు కూడా అర్జెంట్ పని ఉంది ఇద్దరం వెళ్లిపోదామని పారిపోతాడు రాజ్. మన కారులో కెమెరా ఉంది కానీ అది రికార్డ్ అవ్వదు కదా అని డ్రైవర్ చెబుతాడు. మనల్ని మోసం చేద్దామని అనుకున్నారు.. కెమెరా అనగానే భయపడి పారిపోయాడని చెబుతుంది ఇందూ. నేను ఎగ్జామ్‌కి వెళ్తున్నట్లు రేఖ ఆంటీకి డ్రైవర్ ద్వారా తెలిసిపోతుందని ఇందూ ప్లాన్ చేస్తుంది. నేను డ్రెస్ కుట్టించుకుని డైరెక్ట్‌గా వచ్చేస్తానని అంటుంది.

ఎగ్జామ్‌లో కాపీలు పెట్టి పాస్ అవ్వాలని ఐశ్వర్య అనుకుంటుంది. అదే కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి ఇందూ కూడా వస్తుంది. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్తుండగా ఐశ్వర్య కనిపించడంతో ఇందూ షాక్ అవుతుంది. దాంతో ముఖానికి మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్తుంది ఇందూ. ఎగ్జామ్ హాల్‌లో మాస్క్ పెట్టుకున్నావేంటీ? ఇప్పుడు కోవిడ్ లేదు కదా అని ఇన్విజిలేటర్ అడగటంతో ఇందూ కంగారుపడుతుంది. మాస్క్ ఒకసారి తీయమని చెప్పడంతో ఇందూకి చెమటలు పడతాయి. ఐశ్వర్య జోకులు వేయడంతో ఆమెకు ఇన్విజిలేటర్ వార్నింగ్ ఇస్తాడు. ఐశ్వర్యకు కనిపించకుండా మాస్క్ తీసి చూపిస్తుంది. ఎవరైనా స్లిప్స్ తీసుకొస్తే ముందే ఇచ్చేయండి అని ఇన్విజిలేటర్ అడుగుతాడు. టైం చూసి స్లిప్స్‌ బయటకు తీసి రాసేస్తుంది ఐశ్వర్య. అది చూసిన ఇన్విజిలేటర్ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X