Brahmamudi March 9th Episode: రేఖకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇందూ.. చీటింగ్‌తో డబ్బులు కొట్టేసిన స్వరాజ్

Photo Courtesy: JioHotstar

ఎలాగైనా అక్కని ఎగ్జామ్ రాయించని స్వాతి ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇందూ ముఖాన డ్రెస్ విసిరేసిన స్వాతి.. ఇది నాకు రేఖ ఆంటీ గిఫ్ట్‌గా ఇచ్చింది. దానిని అర్జెంట్‌గా కుట్టించుకుని రమ్మని చెబుతుంది. నువ్వు నా కూతురివేనా? ఎప్పుడు చూసినా అక్కా అక్కా అంటూ ఇందూ వెనుక తిరుగుతూ ఉంటావని భ్రమరాంబ ఆశ్చర్యపోతుంది. నేను బయటికి వెళ్తే రేఖ ఆంటీ ఊరుకోదని ఇందూ చెప్పగా భ్రమరాంబ కంగారుపడుతుంది. ఈ ఇంట్లో నీ పవర్ ఇంతేనా అని తల్లిని స్వాతి రెచ్చగొట్టడంతో ఏం జరిగినా నేను చూసుకుంటానని అంటుంది భ్రమరాంబ. వెంటనే డ్రైవర్‌ని పిలిచి ఇందూని బయటకు తీసుకెళ్లమని చెబుతుంది.

ఇంతలో అదే దారిలో వస్తూ ఇందూ కారుకు డ్యాష్ ఇచ్చిన స్వరాజ్.. ఎలాగైనా డబ్బు కొట్టేయాలని పెద్ద గొడవ చేస్తాడు. దాంతో ఇందూ కారులోంచి దిగి పోలీస్ కేసు పెడతానని వార్నింగ్ ఇవ్వడంతో రాజ్‌తో పాటు జనం పారిపోతారు. ఎగ్జామ్ హాల్‌కి వెళ్లిచూసేసరికి అక్కడ ఐశ్వర్య ఉండటంతో ఇందూ షాక్ అవుతుంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి మాస్క్ పెట్టుకుని లోపలికి వస్తుంది. అక్కడ ఇన్విజిలేటర్ మాస్క్ తీయమని చెప్పడంతో ఐశ్వర్యకు కనిపించకుండా తీస్తుంది. అనంతరం కాపీ కొడుతూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోతుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 9వ తేదీ ఎపిసోడ్ 975లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial March 9th 2026 Episode 975 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఎగ్జామ్ హాల్‌లో స్లిప్స్ తీసి కాపీ కొట్టాలని ప్రయత్నిస్తుంది ఐశ్వర్య. దానిని ఇన్విజిలేటర్ పసిగట్టడంతో ఆమె షాక్ అవుతుంది. ఆమెను ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోమనగా.. నాతో పాటు ఇంకా చాలామంది కాపీ కొడుతున్నారని ఫ్రెండ్స్‌ని ఇరికిస్తుంది ఐశ్వర్య. దాంతో అందరినీ బయటకు పంపేస్తాడు ఇన్విజిలేటర్. డబ్బులు పడేస్తే మార్కెట్లో ఎన్నో సర్టిఫికెట్స్ దొరుకుతాయని సీరియస్‌గా వెళ్లిపోతుంది ఐశ్వర్య. ఆమె వెళ్లిపోగానే ఫాస్ట్‌గా పరీక్ష రాస్తుంది ఇందూ.

అప్పుల వాళ్లు రేఖని, భూషణ్‌ని నానామాటలు అంటాడు. కంపెనీని డెవలప్‌ చేస్తానని 10 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నావు.. రెండేళ్లలో ఇస్తానని 5 ఏళ్లు వేస్ట్ చేశావని భూషణ్‌పై మండిపడతారు. వడ్డీ టైంకి కడుతున్నాం కదా అని భూషణ్ అంటాడు. వడ్డీ కడుతున్నాం కదా అని అసలు వదులుకోలేం కదా అని చెబుతాడు చక్రీ. నాకు తెలిసింది రెండే రెండు రూల్స్.. కంపెనీని ఫ్యూచర్ ఉందంటే.. ఇన్వెస్ట్ చేస్తాను. లేదంటే ఆ కంపెనీని క్యాప్చర్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు చక్రీ. నీ కంపెనీ విషయంలోనూ అది నమ్మే ఇన్వెస్ట్ చేస్తున్నాను.. ఇప్పుడు నీ కంపెనీకి ఫ్యూచర్ లేదు కాబట్టి నీ కంపెనీని నాకు రాసివ్వమని పేపర్స్ ఇస్తాడు చక్రీ.

దాంతో భూషణ్‌కి చెమటలు పడతాయి. ఇంత మంచి డీల్ వచ్చినప్పుడు సంతకం చేసేయమని చెబుతుంది రేఖ. రివర్స్ గేమ్ ఆడుతున్నావా? అని చక్రీ మండిపడతాడు. నేను ఏదైనా స్ట్రైట్‌గా ఫైట్ చేస్తాను. మా భూషణ్ కంపెనీ లాస్‌లో ఉంది.. నువ్వు దానిని కొంటే కంపెనీతో పాటు అప్పులు కూడా నీవే అవుతాయని రేఖ చెప్పడంతో చక్రీ షాక్ అవుతాడు. నీ అప్పు తీరిపోయి నీ నుంచి మాకు ఫ్రీడమ్ వస్తుందని అంటుంది రేఖ. నీకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి బాగా తెలుసు కదా అని చెబుతుంది.

ఆ కంపెనీ నీదా? నువ్వు జస్ట్ దానికి గార్డియన్‌వి మాత్రమే. అసలైన వారసురాలు ఇందూ కదా? తనకి సైన్ పవర్ రాలేదు కదా అని చెబుతాడు చక్రీ. కొన్నిరోజుల్లోనే ఆ పవర్ దానికి వస్తుంది.. ఆ పవర్ వచ్చిన మరుక్షణం ఆస్తి మొత్తం నాకు రాసిస్తున్నట్లుగా సంతకం చేయడానికి ఇందూ సిద్ధంగా ఉందని చెబుతుంది రేఖ. ఆ మాటలతో చక్రీ షాక్ అవుతాడు. 20 ఏళ్లుగా దానిని నా ఇంట్లో పెట్టుకుని మేపుతున్నది ఆరోజు కోసమే అని చెబుతుంది రేఖ. కొన్నిరోజుల్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నాది అవుతుంది.. అప్పుడు దాని నుంచి వచ్చే కాంట్రాక్ట్స్ నీకు ఇస్తాను.. అందులో వచ్చే లాభంతో పోలిస్తే ఈ పది కోట్లు చిల్లర అంటుంది రేఖ. మునిగిపోతున్న భూషణ్ కంపెనీ కావాలా? కోట్లు కుమ్మరించే కాంట్రాక్ట్స్ కావాలా అని ఆఫర్ చేస్తుంది.

దాంతో నేను నిన్ను నమ్ముతున్నాను అని చక్రీ చెప్పగా.. నమ్మితే సరిపోదు, ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయాలని అంటుంది రేఖ. ఆ మాటలతో చక్రీ షాక్ అవుతాడు. నేను అనుకున్నట్లుగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నా పేరు మీద రావడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు నువ్వే ఇవ్వాలని చెబుతుంది. ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్స్ వస్తాయని అంటుంది రేఖ. దాంతో ఆమె అడిగినట్లుగా 2 కోట్ల రూపాయల చెక్ రాసి ఇచ్చేస్తాడు చక్రీ.

ఓ హోటల్‌లో స్వరాజ్ కోసం అతని ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు. ఆ సూరిగాడు డబ్బులు ఇస్తాడనుకుంటే హ్యాండ్ ఇచ్చాడు.. ఇప్పుడు బిల్లు కట్టడానికి కూడా లేవని చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. మరి బిల్ ఎలా కడదామని అడుగుతాడు ఫ్రెండ్. ఇందాక నేను వేసిన ప్లాన్‌కి కనీసం పదివేలు అయినా వస్తాయని అనుకున్నా.. కానీ ఆ పాప ఎవరో కానీ భలే దెబ్బకొట్టిందని చెబుతాడు స్వరాజ్. లాప్‌టాప్ తీసుకోవడానికి వచ్చిన కస్టమర్ .. దానికి సంబంధించిన బిల్ అడగటంతో స్వరాజ్ షాక్ అవుతాడు. మా నాన్న దీనిని అమెరికా నుంచి తెప్పించాడని అంటాడు. లాప్‌టాప్ ఆన్ అయిన వెంటనే ఐదు నిమిషాలకు మించి ఉండదు.. మళ్లీ స్విచ్ఛాఫ్ అయిపోతుందని స్వరాజ్‌కి అతని ఫ్రెండ్ చెబుతాడు.

కస్టమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగటంతో నేను నీకు ఈ లాప్‌టాప్ అమ్మడం లేదు.. దీని వాల్యూ 2 లక్షల రూపాయలు, నా గర్ల్‌ఫ్రెండ్‌కి పార్టీ ఇవ్వడానికి దీనిని 50 వేల రూపాయలకే ఇస్తున్నానని చెబుతాడు స్వరాజ్. దాంతో కస్టమర్ డబ్బులు ఇచ్చేసి లాప్‌టాప్ తీసుకుంటాడు. ఆ వెంటనే స్వరాజ్, అతని ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోతారు. వాళ్లు వెళ్లిన వెంటనే లాప్‌టాప్ ఆన్ కాకపోవడంతో కస్టమర్ ఖంగుతింటాడు. వెంటనే స్వరాజ్‌కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. పనిచేయని లాప్‌టాప్‌ని నీకు అంటగట్టానని స్వరాజ్ చెప్పడంతో కస్టమర్ సీరియస్ అవుతాడు. ఇంతలో వెయిటర్ వచ్చి హోటల్ బిల్ ఇవ్వడంతో కస్టమర్ మరింత షాక్ అవుతాడు.

కారులో ఇంటికి వెళ్తున్న రేఖ- భూషణ్‌లకి ఎగ్జామ్ రాసి వస్తున్న ఇందూ రోడ్డుపై కనిపిస్తుంది. నా మాట లెక్కచేయకుండా కారు బయట పెడుతుందా? ఇంట్లో దాని సంగతి చెబుతానని రగిలిపోతుంది. ఇంటికొచ్చిన ఇందూని ఎక్కడికి వెళ్లావని రేఖ నిలదీస్తుంది. నేను ఆఫీస్ నుంచి తిరిగొస్తుండగా నువ్వు నాకు రోడ్డు మీద కనిపించావు.. ఆ ఏరియాలో నీకు పనేంటీ? ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అని రేఖ నిలదీయడంతో ఇందూకి ముచ్చెమటలు పడతాయి. గడప దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పాను కదా? మరి బయటకు ఎందుకు వెళ్లావని అడుగుతుంది. దాంతో స్వాతి తన డ్రెస్‌ని కుట్టించుకుని రమ్మని చెబితే వెళ్లానని చెబుతుంది ఇందూ. ఇదే విషయాన్ని భ్రమరాంబ కూడా చెబుతుంది. ఈ విషయాన్ని అనుమానించాల్సిందేనని అంటుంది రేఖ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X