Brahmamudi May 10th episode: మరొకరితో బిడ్డను కంటే.. రాజ్‌తో కావ్య సుఖపడుతుందా?
బిడ్డ తల్లి ఎవరో తెలిస్తే ఏం చేస్తావ్ అంటాడు సుభాష్. కోడలు స్థానంలో ఈ ఇంటికి తీసుకు వస్తాను, ఆ బిడ్డ తల్లితో వాడి పెళ్లి చేస్తాను వాడు సంతోషంగా ఉండేలాగా చూస్తాను అంటుంది అపర్ణ. ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంటాడు సుభాష్. నా మాటలు మీకు ఆశ్చర్యంగా ఉన్నాయా, కావ్య కోసం ఆలోచిస్తున్నారా తను మాత్రం ఇక్కడ ఏం సుఖపడింది, భర్త దూరం పెట్టాడు వేరే ఒక ఆమెతో బిడ్డను కని ఇంటికి తీసుకువచ్చాడు అలాంటి భర్తతో ఏ భార్య మాత్రం సుఖపడుతుంది అంటుంది అపర్ణ.
లగేజ్ తో సహా కిందికి వచ్చినా రాజ్ నువ్వు ఎవరితోనూ మాటలు పడక్కర్లేదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని తల్లితో చెప్తాడు. కోపంతో రగిలిపోయిన అపర్ణ ఆ బిడ్డ కోసం సర్వస్వం వదులుకుంటావని, ఇంట్లోంచి వెళ్లిపోతావని నాకు తెలుసు అందుకే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతున్న అపర్ణని ఆపిన సుభాష్ ఈరోజు నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి, ఈరోజు తో ఈ రహస్యం బద్దలై పోవాలి అంటాడు.

నిజం తెలిస్తే అత్తగారు భరించలేరని నిజం ఎప్పటికీ బయటపడకూడదని అంటుంది కావ్య. గడువు రేపటితో ముగుస్తుంది ఇప్పటికైనా నిజం చెప్పు లేదంటే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని కొడుకుని హెచ్చరిస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 10వ తేదీ ఎపిసోడ్ 406 లో ఏం జరిగిందంటే..
కావ్య మాత్రం ఏం సుఖపడింది, తన తల్లి తనకి బలవంతంగా పెళ్లి చేసింది, భర్త తనని దూరం పెట్టాడు వేరే ఆమెతో బిడ్డని కని ఇంటికి తీసుకువచ్చాడు, ఏ ఆడది అయినా అలాంటి వాడితో ఎలా సంసారం చేస్తుంది. నేనేమీ తనకి అన్యాయం చేయాలనుకోవడం లేదు అంటుంది అపర్ణ. రాజ్ కి ఆ బిడ్డ తల్లితో పెళ్లి చేస్తే వాడైనా సంతోషంగా ఉంటాడు దీనివల్ల కావ్య కొత్తగా కోల్పోయేది ఏమీ ఉండదు, కానీ రాజ్ ఎంతకీ నోరు విప్పి నిజం చెప్పడం లేదు రేపు పొద్దున్నే కల్లా వాడు నిజం చెప్పకపోతే నేను ఇంట్లోంచి వెళ్లిపోవడం ఖాయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.
ఆ మాటలు విన్న సుభాష్ నీ కొడుకు నీ ప్రాణం పోతుందని నోరు విప్పటం లేదు కానీ నువ్వు వాడికి కాపురాన్నే కూల్చేయాలని చూస్తున్నావు అనుకుంటాడు. మరోవైపు రాహుల్ రుద్రాణి తో మాట్లాడుతూ రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడని కలలు కన్నావు కానీ అత్తయ్య మాట మార్చేసి తనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అప్పుడు మళ్ళీ రాజ్ కంపెనీ లోకి వస్తాడు మన చేతికి చిప్ప మిగులుతుంది అంటాడు. అలా ఎప్పటికీ జరగనివ్వను.
నీ తల్లి మీద నీకున్న ప్రేమ ఇంతేనా అంటూ వాడి మనసు విరిగిపోయేలాగా మాట్లాడతాను, వాడి సంగతి నాకు బాగా తెలుసు. ఒక మాట పడటం కంటే ప్రాణం పోవడమే మంచిది అనుకునే రకం నువ్వే చూడు రేపొద్దున్న ఏం జరుగుతుందో అంటుంది రుద్రాణి. మరోవైపు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు రాజ్. అతనికి ధైర్యం చెప్తుంది కావ్య. ఎంత కష్టం వచ్చినా స్థిరంగా ఉండే మీరు ఇలాంటి ఇలా డీలా పడిపోవటం ఏమిటి అంటుంది. ఇన్నాళ్లు ఇల్లు ఇలా ఉందంటే అందుకు కారణం మా అమ్మ. ఇప్పుడు తనే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతే ఎవరికి వారే అయిపోతారు అనే బాధపడతాడు రాజ్.
ఏదో ఒకటి చేసి అత్తయ్యని ఇంట్లోంచి వెళ్లకుండా చూస్తాను అంటుంది కావ్య. మరోవైపు ఇంట్లో జరుగుతున్న గొడవలు కి ఎప్పుడు ఎవరు ఇంట్లోంచి వెళ్లిపోతారో తెలియటం లేదు, ఈ సమయంలో నాకు అత్తగారు సపోర్టు లేకపోతే ఒంటరిదాన్ని అయిపోతాను అనుకుంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అనామిక. ధాన్యలక్ష్మి కోడలి వైపు కోపంగా చూస్తుంది, ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడదు కానీ అనామిక అత్తగారితో మాట్లాడుతూ నేను తప్పు చేశాను.


Click it and Unblock the Notifications











