Brahmamudi May 11th Episode: రాజ్ పుట్టుకపై అపర్ణ ఆరా... స్టోర్ రూమ్‌లో రాజ్- ఇందూ కొత్త కాపురం
Photo Courtesy: JioHotstar
మీ అమ్మాయి ఇందూని కిడ్నాప్ చేసింది.. మీ దగ్గర 20 లక్షల రూపాయలు కొట్టేసింది నేనే అని రాజ్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. కిడ్నాప్ తర్వాత నా దగ్గరే ఉన్న ఇందూపై నాకు ఇష్టం పెరిగిపోయింది. ఒక ఉరుము ఉరిమిన రాత్రి మేమిద్దరం ఒక్కటయ్యామని కట్టుకథ చెబుతాడు రాజ్. ఇందూని కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టానని ఫోటోలు చూపిస్తాడు. ఈ పెళ్లి చెల్లదు, దీనికి నేను ఒప్పుకోనని ఇందూ మెడలోని తాళిని రేఖ తెంచేస్తుండగా రాజ్ అడ్డుకుంటాడు.
నా భార్య జోలికి, నేను కట్టిన తాళి జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. చేసేదేం లేక రాజ్- ఇందూలను లోపలికి తీసుకురమ్మని చెబుతుంది రేఖ. మదన్‌తో ఇందూ పెళ్లి ఆగిపోవడంతో భ్రమరాంబ చాలా సంతోషించి.. రాజ్- ఇందూలకు హారతిచ్చి లోపలికి పిలుస్తుంది. అచ్చం తన కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ని చూసి అపర్ణ, సుభాష్‌లు మురిసిపోతారు. నువ్వెవరు? నీ తల్లిదండ్రులెవరు? అని ఆరా తీస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 11వ తేదీ ఎపిసోడ్ 1029లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? అని రాజ్‌ని అపర్ణ నిలదీయగా.. నాన్నపేరు చలపతి, తల్లి పేరు లక్ష్మీ, తమ్ముడి పేరు వెంకటేశ్వర్లు అని చెబుతుంది ఇందూ. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. నువ్వు ఎక్కడ ఉంటావని అపర్ణ అడగ్గా.. పక్కనే ఉన్న బస్తీలో ఉంటామని చెబుతాడు రాజ్. నువ్వు మాత్రం మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు.. మా అందరి మైండ్ బ్లాక్ అయిపోయిందని శేషం అంటాడు. మా ఆవిడనే తప్పించి ఇందూని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు గ్రేట్.. ఈ సిటీ మొత్తం గాలించినా నీలాంటి వాడు దొరకడని ప్రశంసిస్తాడు. కారులో అనుకోకుండా కొట్టాల్సి వచ్చిందని భ్రమరాంబకు సారీ చెబుతాడు రాజ్.
ఇప్పుడు హ్యాపీనా అని స్వాతిని అడగ్గా.. చాలా హ్యాపీగా ఉంది కానీ, ఈ పెళ్లి ట్విస్టే అర్ధం కావడం లేదని అంటుంది స్వాతి. ఇదంతా అలా సడెన్‌గా జరిగిపోయింది, నా మీద నీకు కోపంగా ఉందా అని అడుగుతుంది ఇందూ. ఆ రేఖ అనుకున్నట్లు జరగలేదని అంటుంది అపర్ణ. మీ ఇంటి పేరు ఏంటీ అని అపర్ణ అదే పనిగా అడుగుతుంది. ఈవిడ నా పుట్టుపూర్వోత్తరాలు అన్నీ అడుగుతుంది. అర్జెంట్‌గా జంప్ అవ్వాలని అనుకుంటాడు రాజ్. నేను మీ కోసం స్వీట్ ప్రిపేర్ చేస్తానని స్వాతి చెప్పగా.. దాంతో పాటు చికెన్, మటన్, ఫ్రాన్స్ కావాలని అడుగుతాడు రాజ్.
వాడిని చూస్తుంటే నా కొడుకుని చూస్తున్నట్లే ఉందని సుభాష్‌తో అంటుంది అపర్ణ. నా అనుమానం నిజమైతే వాడు మన మనవడు అయ్యే అవకాశం ఉందని అంటాడు సుభాష్. లేకపోతే అచ్చుగుద్ధినట్లుగా వాడు రాజ్‌లా ఎందుకుంటాడని ప్రశ్నిస్తాడు. వాడు ఖచ్చితంగా మన కూతురి కొడుకే అయ్యుంటాడు, అది తెలియాలంటే తన అమ్మానాన్నల్ని కలిసి మాట్లాడాలని అంటుంది అపర్ణ. తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో రేఖ పిచ్చిపిచ్చిగా చేస్తుంది. ఈ ఆస్తి మన సొంతం అవుతుందని ఎన్నో ప్లాన్లు వేశాం. మొన్న సరిగ్గా ఇందూ సంతకం పెట్టే సమయంలో కిడ్నాప్ జరిగింది. దానిని ఎలాగో విడిపించి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిస్తే ఆ సంతకాలు చెల్లవు, దానికి పెళ్లయితేనే ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుందని అన్నారు.
ఆ ఆస్తిని దక్కించుకోవడం కోసం నా కొడుక్కి, నాకు ఇష్టం లేకపోయినా ఆ ఇందూని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నా. చివరి నిమిషంలో వాడెవడో వచ్చి దానిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మా అమ్మ కోరిక, నా కోరిక ఈ ఆస్తి మా సొంతం కావడం... రెండు తరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం, ప్రతిసారి చివరి నిమిషంలో అందకుండా పోతోందని భూషణ్‌తో అంటుంది రేఖ. వాడు ఆ పెళ్లి రిజిస్టర్ చేయించాడని అంటున్నాడు, పెళ్లి ఫోటోలు చూపించి మీడియాకు వెళ్తానని చెబుతున్నాడు. ఒక్కసారి ఈ టాపిక్ మీడియా ముందుకు వెళ్లిందంటే మనమే ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నామని అందరికీ తెలిసిపోతుంది. మన అప్పులవాళ్లు మన మీద పడతారు.. అందుకే వాడిని ఏం చేయలేక సైలెంట్‌గా ఉంటున్నా అని చెబుతుంది రేఖ. ఇప్పుడు మనం ఊహల్లో బతకడం తప్ప.. ఆ ఆస్తి మన సొంతం అవుతుందన్న గ్యారంటీ కనిపించడం లేదని చెబుతాడు భూషణ్. ఆ ఆస్తి మన సొంతం అవుతుంది, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయించి ఇందూకి మన అబ్బాయితో పెళ్లి చేయించాలని అంటుంది రేఖ.
ఇల్లంతా చూపించావు కానీ ఈ స్టోర్ రూమ్‌లోకి ఎందుకు తీసుకొచ్చావు, ఈ రూమ్ మొత్తం క్లీన్ చేయాలా అని ఇందూని అడుగుతాడు రాజ్. నువ్వు వచ్చింది నాకు భర్తగా యాక్ట్ చేయడానికి కాదు, నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికా అంటుంది ఇందూ. ఇది స్టోర్ రూమ్ కాదు.. ఇదే నా బెడ్ రూమ్ అంటుంది. నువ్వు ఈ ప్యాలెస్‌కి యువరాణివి.. ఈ స్టోర్ రూమ్‌లో నువ్వు ఉంటావా అని రాజ్ కంగారుపడతాడు. నువ్వు నా కన్నా బికారిలా ఉన్నావు.. నువ్వు నాకేం డబ్బులిస్తావని బాధపడతాడు రాజ్. నువ్వు వద్దు.. నీ అద్దె మొగుడు క్యారెక్టర్ వద్దు అంటాడు. నేను నీలాగా మోసం చేయను.. ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది, నీ డబ్బులు నీకు ఇస్తానని చెబుతుంది ఇందూ.
నువ్వు చాలా ఓవరాక్షన్ చేశావు.. నేను నీకు చెప్పిన కండీషన్స్ గుర్తుచేసుకోమని చెబుతుంది ఇందూ. నా పెళ్లి ఆగాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఇందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నా చేత మూడు ముళ్లు వేయించుకుని నన్ను కాల్చుకుని తిందామనేనా? సోలో బతుకే సో బెటర్ అంటాడు రాజ్. కొన్నిరోజులు నాకు భర్తగా నటించాలని ఇందూ చెప్పడంతో రాజ్ ఉలిక్కిపడతాడు. దీనికి ఒప్పుకుంటే నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తానని ఇందూ చెప్పడంతో రాజ్ సరేనని చెబుతాడు. రాజ్ బేరాలు ఆడటంతో చివరికి రోజుకు 10 వేలు చొప్పున ఇవ్వడానికి ఇందూ ఒప్పుకుంటుంది. నువ్వు ఏ నమ్మకంతో నాకు ఈ జాబ్ ఇస్తున్నావు.. కిడ్నాప్ చేసి మీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని అప్పగించేశాను కదా అని అంటాడు రాజ్.
నువ్వు మోసం చేసినా, నువ్వు చేసినా నిజాయితీ ఉంటుంది.. మధ్యలో ఏం జరిగినా నీ పని పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తావని అంటుంది రాజ్. నేను అనుకున్న పని పూర్తయ్యే వరకు నువ్వు నా మొగుడిగా నటించాలి. కానీ కొన్ని కండీషన్స్ ఉన్నాయి.. నువ్వు నిజమైన భర్తలా ఓవరాక్షన్ చేయొద్దు. నీ పర్సనల్ పనులు ఏం పెట్టుకోకూడదు, నీ చేతులు కాళ్లు నీ చూపులు కూడా హద్దుల్లో ఉండాలి. లేదంటే నీ శాలరీ కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. నాకు డైలీ పేమెంట్ కావాలి, ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇవ్వాలని రాజ్ కండీషన్ పెడతాడు. ఇవన్నీ గుర్తొచ్చి రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications