Brahmamudi May 11th episode: రుద్రాణి, అపర్ణను కడిగి పడేసిన కావ్య.. రాజ్ బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకొని..
కావ్యకు రాజ్ చేసిన ద్రోహం గురించి అపర్ణ బాధపడుతుంది. భార్య ఉండగానే మరో మహిళతో బిడ్డను కన్న వ్యక్తితో ఆమె ఎలా కాపురం చేస్తుందని అపర్ణ అంటుంది. ఆ బిడ్డ తల్లితోనే రాజ్ పెళ్లి జరిపించి ఉంటే.. కావ్యకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు అని అపర్ణ అంటుంటుంది. మరో వైపు రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోతాడని కలలు కన్నావు. కానీ నీవు అనుకొన్నది కాకుండా మరోటి జరిగింది. ఇక రేపు మళ్లీ కంపెనీలోకి బాధ్యతలు చేపట్టడనే గ్యారెంటీ ఉందా? అని రాహల్ అంటాడు.
అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూసి.. కావ్య ఆందోళన చెందుతుంది. ఇంట్లో నుంచి ఎవరు బయటకు పోతారొ తెలియని పరిస్థితి ఉందని కావ్య అనుకొంటున్నది. ఇదిలా ఉండగా, అత్తగారు సపోర్ట్ లేకపోతే నాకు అన్యాయం జరిగిపోతుందనే కంగారులో అనామిక పడిపోయింది. ఇదంతా ఏప్రిల్ 10 తేదీన జరిగిన కథ. బ్రహ్మముడి సీరియల్‌లో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన కథలోకి వెళితే...

నేను తప్పు చేస్తున్నాను. ఏదో జరుగుతుందని భావించి అపర్ణకు నిజం చెప్పకుండా దాయడం వల్ల చాలా పెద్ద చేస్తున్నాను. ఇప్పుడు అపర్ణ ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో, ఆఫీసులో చాలా సమస్యలు వస్తున్నాయి. నా వల్ల రాజ్, కావ్యలు అవమానాల పాలవుతున్నారు. నేను ఇంటికి పెద్ద అయి ఉండి.. ఇలా మౌనంగా ఉంటూ పెద్ద తప్పు చేస్తున్నాను. అపర్ణ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్దంమే.. అపర్ణ ఎలాంటి పెద్ద శిక్ష విధించినా దానిని అనుభవించడానికి రెడీ అని అన్నాడు.
స్వప్న కుళ్లపోడవడంతో ఆ దెబ్బల గురించి తలుచుకొని రుద్రాణి బాధపడుతుంటే. రాహుల్ వచ్చి.. నా కంటికి దెబ్బ తగిలింది. అది కొట్టిన దెబ్బలకు ఒళ్లు హూనం అయింది అని తల్లికొడుకులు ఒకరికొకరు బాధలు చెప్పుకొన్నారు. ఆ తర్వాత ఈ విషయం పక్కన పెట్టు.. ఈ రోజు నిజం చెప్పకపోతే.. వదిన ఇంటి నుంచి వెళ్లిపోతుందని చెప్పింది. వదినను ఎలాగైనా ఒప్పించి ఇంటి నుంచి బయటకు పోకుండా ఆపుదాం. రాజ్‌ను ఇంటి నుంచి వెళ్లేలా చేద్దాం అని రాహుల్‌కు రుద్రాణి చెప్పింది.
ఇక ఈ వ్యవహారాన్ని ముగింపు పలకాలంటే.. నేనే నిజం చెప్పాలి. అప్పడు ఇంట్లో వాళ్లు ధర్మపీఠం ఎక్కి తీర్పు చెబుతారు అని అపర్ణ ఆవేశంతో ఊగిపోయింది. నేను వెళ్లిపోతాను అంటూ అపర్ణ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో మమ్మీ అంటూ రాజ్ ముందుకు వచ్చి.. ఇలాంటి పరిస్థితి వస్తుందనే నేనే వెళ్లిపోదామని నిర్ణయం తీసుకొన్నాను అన్నాడు. అయితే నీవు వెళ్లిపోవడం కాదు నాకావాల్సింది.. నిజం రాబట్టాలనేది నా ఉద్దేశం. అందుకే నేను వెళ్లిపోతున్నాను అని అపర్ణ అంటే.. నీవు ఇంటిని వెళితే. ఎక్కడ సంతోషంగా ఉండలేవు అని రాజ్ ప్రాధేయపడ్డాడు. నన్ను వెళ్లనివ్వు అంటూ రాజ్ అంటే.. వద్దు నాయనా.. నీ త్యాగాలను భరించే శక్తి లేదు. త్యాగాలు ఇక వద్దు.. నీ జీవితాన్ని చిదిమేశాను. ఈ లోకంలో నాకు సంతోషం లేకపోతే.. వేరే లోకానికి వెళ్తాను. ఇక ఈ ఇంటికి నేను రాను అని అపర్ణ కోపంతో వెళ్లిపోవడానికి సిద్దమయ్యాడు.
అంతలోనే సీతారామయ్య ఆగు అపర్ణ అని అరిచి.. నిజం చెప్పడం లేదని అనుకొంటున్నావు. కానీ రాజ్ ఎందుకు నిజం చెప్పడం లేదనే విషయం నీకు తెలియదు అంటే.. ఆ నిజం నీకు తెలుసా? ఆ కారణం తెలుసా అని అపర్ణ ప్రశ్నించింది. దాంతో ఆ నిజం తెలియాల్సిందే.. రాజ్ ఎలాంటి వాడో అందరికి తెలిసిపోవాలి అని సీతారామయ్య అంటే.. మామయ్య ఆగండి అంటూ కావ్య అరిచింది. నేను అడగాల్సింది చాలా ఉన్నాయి అని కావ్య అంటే.. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి అన్నాడు.
నాకున్న ప్రశ్నలను మీ అబ్బాయిని, నా అత్తను అడగాలి.. నీ కొడుకు గుణవంతుడుని చెబుతారా? నీ కొడుకు భార్య నష్టపోయినా పర్వాలేదు. కానీ నీ భార్య వెళ్లిపోతుంటే.. నిజం చెప్పడానికి ముందుకొచ్చారా అని కావ్య అంటే.. నా ఉద్దేశం అంది కాదు అని అంటే.. నీ కొడుకు, నీ భార్య ఇంటిని దాటి పోవడానికి ఒక్క గడప మాత్రమే అడ్డు ఉంది. వారిద్దరితో తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాటిని తెల్చుకోవాలి అంని అంటే.. ఏం తేల్చుకొంటావు అని కావ్యను అపర్ణ ప్రశ్నించింది. నేనంటే లెక్కలేదు అని అపర్ణ అంటే.. అందుకు నేను సమాధానం చెబుతాను. మీరు ఏమైనా సాధించారని అనుకొంటున్నారు. కానీ మీరు ఓడిపోయి.. అవమానంతో బయటకు వెళ్లున్నారు అంటూ కావ్య ఫైర్ అయింది.
కావ్య ఆవేశంగా మాట్లాడుతుంటే.. రుద్రాణి మధ్యలో దూరి.. నీ అత్తను అవమానిస్తున్నావా? ఓటమి బాధతో ముఖం చాటేసిందని నువ్వు చెబుతున్నావా? అవమానం జరగకముందే.. అది జరిగిందని నువ్వు డిసైడ్ చేస్తావా అని రుద్రాణి అంటే.. కోపంతో ఊగిపోయిన కావ్య.. రుద్రాణి అంటూ ఏక వచనంతో పిలవడంతో అందరూ షాక్ తిన్నారు. నన్నే ఏక వచనంతో పిలుస్తావా అని రుద్రాణి ప్రశ్నిస్తే.. ఇది మా అత్త కోడళ్ల విషయం. నీవు మధ్యలోకి రాకు అని కావ్య అంటే.. మధ్యలో వస్తే.. ఏంటే అంటుంది అని స్వప్న మధ్యలోకి వచ్చింది. అంతలో రాహుల్ ఏంటి అంటే.. నిన్ను ఏరా అంటుంది, నీకు అవసరమా? నోర్మూసుకొని ఇంట్లో ఉండు. ఇది దుగ్గిరాల కుటుంబ సమస్య అని స్వప్ప ఫైర్ అయింది.
అపర్ణ ఎందులో ఓడిపోయిందని రుద్రాణి ప్రశ్నిస్తే.. మీరు ఏ విషయంలోనైనా గెలిచారా? నీ కొడుకుకు తల్లిగా తప్పుకొని ఓడిపోయిందా? భర్తకు భార్య తప్పుకొని ఓడిపోయిందా? కోడలికి అత్తగా తప్పుకొని గెలిచారా? నీ కోడుకు నిజం చెప్పలేదనే కోపంతో వెళ్లిపోతున్నారు. నిజం చెప్పించలేదని బాధతో వెళ్లిపోతున్నారు. ఈ ఇంటికి వచ్చి ఏడాది అయింది. ఆయన మనస్తత్వం తెలుసుకొన్నాను. ఆయన తప్పు చేయలేదనే నమ్మకంతో నా భర్త నుంచి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు పాతికేళ్లు పెంచిన వాళ్లే.. నీ కొడుకు మీద నమ్మకం లేదు. నయానో.. భయానో అతడితో నిజం చెప్పిస్తే..అప్పడు గెలిచిపోయినట్టు. లేకపోతే ధైర్యం లేదని.. ఓటమి పాలై ఓడిపోయానని ఒప్పుకొన్నట్టు అని కావ్య అంది.. దాంతో నా తల్లినే తప్పు పడుతావా? అని రాజ్ అన్నాడు. నిన్ను కూడా దులిపేసే సమయం వస్తుంది అని కావ్య జవాబిచ్చింది.
నీవు మా తప్పులు లెక్కిస్తావా అని అపర్ణ అంటే.. నీవు ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ ఇంటిలో పిల్లి కూడా పులి అవుతుంది. ఈ రుద్రాణి.. రాజమాత అనుకొంటున్నది. ధాన్యలక్ష్మీ గారు ఏకచత్రాభిపత్యంగా ఇంటిని పాలించాలని చూస్తున్నది అని కావ్య అందరి విషయాలను బయటపెట్టింది. మీరు ఇంటి నుంచి వెళ్లిపోతే. నిజం బయటపడుతుందా? అబద్దమే రాజ్యం ఏలుతుంది. అసమర్ధులే పీఠం ఎక్కుతారు. ఒకతాటి మీద నడిపించిన మీ ఇల్లు ముక్కలవుతుంది. అంతకన్నా ఏం మారుతుంది.
ప్రపంచమంతా మీ మాదిరిగా స్వచ్చంగా ఉండాలని కోరుకోరు. అసలు ఈ ఇల్లు ఉండదు. మీరు వెళ్లిపోతే ఏం జరిగితే.. అబద్దం కూడా అలానే ఉంటుంది. నిజం నిద్రపోతూ ఉంటుంది. అడిగే వాళ్లు లేక ఎవరికి వారే అనే విధంగా ఉంటారు. అన్నింటికి మించి మీ మనవడు, దుగ్గిరాల వారసుడిగా ఆ బాబు ఇక్కడే ఉంటారు అని కావ్య అన్నారు. నీవు ఏం సాధించావని అడుగుతున్నావు కదా.. నేను ఇక్కడే ఉంటాను. నిజాన్ని బయటపెట్టే సత్తా ఉందా అని అని అపర్ణ సవాల్ విసిరింది. దాంతో అందరూ షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications










