Brahmamudi May 12th Episode : రాజ్ మనసు ముక్కలు.. యామినితో రుద్రాణి డీల్, కావ్యకి ఊహించని ప్రమాదం

కావ్య గురించి ఉన్నది లేనిది చెప్పి ఆమెపై రాజ్‌లో చెడు అభిప్రాయం కలగజేస్తుంది యామిని. నువ్వు ఇంత చేసినా నీ గురించి అన్నయ్యకి యామిని చెడుగా చెబుతోందని కావ్యతో కళ్యాణ్ అంటాడు. అది ఏమైనా చేసుకోని ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అది చాలని హాస్పిటల్ నుంచి ఇంటి వచ్చేస్తుంది కావ్య. ఇంటికొచ్చేసరికి ఎక్కడికి వెళ్లి వస్తున్నావని కావ్యను నిలదీస్తుంది రుద్రాణి. మీ కోడలు రాజ్‌లాగే ఉన్న మరో వ్యక్తితో తిరుగుతుందని చెప్పడంతో అపర్ణ మండిపడుతుంది.

రాజ్ వేరు రామ్ వేరు కాదని .. ఇద్దరూ ఒకటేనని, వాడికి గతం గుర్తులేదని మాకు తెలుసని అపర్ణ అంటుంది. అసలు కావ్యను రిసార్ట్‌కు పంపిందే మేం అని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో రుద్రాణి షాక్ తింటుంది. మమ్మల్ని పరాయివాళ్లని చేసేశారని రుద్రాణి బాధపడుతుంది. ఇకపై నేను ఆయనతో మాట్లాడి ప్రాణాల మీదకి తీసుకురానని కావ్య చెప్పడంతో కుటుంబం షాక్ అవుతుంది. తనకు ఆరోగ్యం బాగోకపోయినా కళావతి నా కోసం ఎందుకు ఆసుపత్రికి రాలేదని రాజ్ ఆలోచిస్తూ ఆమెకు పదే పదే ఫోన్ చేయగా కావ్య కట్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 12వ తేదీ ఎపిసోడ్‌ 719లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 12th 2025 Episode 719 Here is Today s full story

నేను ఆయన గురించి మీకు చెప్పకముందు జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చానని, ఎప్పుడైతే మీకు విషయం తెలిసి నన్ను తొందరపెట్టారో అప్పటి నుంచి నేను తప్పు చేశానని బాధపడుతుంది కావ్య . నేను ఆయనతో మళ్లీ మాట్లాడనని కళావతి తేల్చి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అలా ఎంతకాలం ఉంటావని కళ్యాణ్ ప్రశ్నించగా.. తనంతట తనకు గతం గుర్తొచ్చే వరకు వెయిట్ చేస్తానని చెబుతుంది. ఈలోగా ఆ యామిని ఊరుకుంటుందా? హాస్పిటల్‌లో ఎన్ని మాటలు చెప్పిందో చూశావు కదా అని అంటుంది అప్పూ. నువ్వు ఇలా దూరంగా ఉంటే తన పెళ్లి ప్రయత్నాలు మళ్లీ మొదలుపెడుతుందని చెబుతుంది.

అలా అని ఆయన ప్రాణాలతో ఆడుకోమంటావా? అని కావ్య నిలదీస్తుంది. ఒకసారి అలా జరిగిందని భయపడి దూరంగా వెళ్లిపోతామా? యాక్సిడెంట్ అయ్యింది కదా అని రోడ్డుపై నడవటమే మానేస్తామా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. మీకు ఎలా చెబితే అర్ధమవుతుంది? ఆయనతో కలిసి ఉండాలని నాకు మాత్రం లేదా? అని ప్రశ్నిస్తుంది కావ్య. తిరిగి ఆయన్ను ఇంటికి తీసుకురావాలని నాకు మాత్రం అనిపించదా? కానీ దాని కోసం ఆయన ప్రాణాలు పణంగా పెట్టాలా? నిజం చెప్పి ఆయనను శాశ్వతంగా దూరం చేసుకోవడం కంటే ఎక్కడో ఒకచోట ఆయన ప్రాణాలతో సంతోషంగా ఉండాలని అనుకోవడమే మంచిదని చెబుతుంది కావ్య.

ప్రాణాలతో ఉంటాడు కానీ సంతోషంగా ఉండడని, తను ప్రేమించి ఇష్టపడింది నిన్ను అని చెబుతుంది అప్పూ. జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నది నీతోనేనని అంటుంది. నిజంగానే వాళ్లిద్దరికి పెళ్లి జరిగి రేపు అన్నయ్యకి గతం గుర్తొచ్చాక తన జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించమని చెబుతాడు కళ్యాణ్. అలా జరిగినా కూడా వాడి జీవితం నాశనం అవుతుంది కదా అని అపర్ణ కూడా అంటుంది. వాడు ప్రాణాలతోనే ఉండాలి? అంతకంటే ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెబుతుంది అపర్ణ. అది నీతో కలిసుంటేనే జరుగుతుందని, మళ్లీ తప్పు జరగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని అంటుంది.

కావాలంటే ఫారిన్ నుంచి డాక్టర్స్‌ని తీసుకొద్దామని, అన్నయ్య ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుందామని చెబుతాడు కళ్యాణ్. మీ అందరి మాటలు విని నేను పెద్ద తప్పు చేశానని, ఆ తప్పు మళ్లీ చేయలేనని ఆయన ప్రాణాలతో నేను ఆడుకోలేనని అంటుంది కావ్య. నన్ను ప్రశాంతంగా వదిలేయండి, ఇక్కడి నుంచి వెళ్లిపోండని మండిపడుతుంది. కావ్య మాటలతో అపర్ణ బాధపడుతుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాజ్ నేరుగా దుగ్గిరాల నిలయానికి వచ్చేస్తాడు. ఇంటి ముందు రాజ్ కారు చూసిన కావ్య షాక్ అవుతుంది.

మా ఇంటికి ఎందుకొచ్చారు? అని కావ్య నిలదీస్తుంది. ఎలా ఉన్నారు అని అడుగుతారు అనుకున్నానని రాజ్ అంటాడు. ఎలా ఉన్నా చూసుకోవడానికి మీ చుట్టూ ఉన్నవాళ్లు ఉన్నారు కదా అని కావ్య ఆన్సర్ ఇస్తుంది. మీరు ఆసుపత్రికి ఎందుకు రాలేదని రాజ్ ప్రశ్నిస్తాడు. రాజ్ ఇంటికి రావడం చూసిన రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. రాజ్ సంగతి తేల్చాలని రుద్రాణి వెళ్లబోతుండగా రాహుల్ ఆపుతాడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడతారో విందామని చెబుతాడు.

మీరు మీ మనస్తత్వం నాకు అర్ధం కావడం లేదని, అప్పటి వరకు మీతో ఉన్న మనిషి ఆసుపత్రి పాలైతే కనీసం చూడాలని కూడా అనిపించలేదా అని రాజ్ నిలదీస్తాడు. ఏం జరిగింది? యామిని మీకేమైనా వార్నింగ్ ఇచ్చిందా? అని ప్రశ్నిస్తాడు. మీరు హాస్పిటల్‌లో ఉంటే చూడటానికి నేనేందుకు రావాలి? మీరు ఫోన్ చేసినప్పుడల్లా నేనేందుకు లిఫ్ట్ చేయాలి? అని నిలదీస్తుంది కావ్య ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. మాది సాంప్రదాయమైన కుటుంబమని ఇలా మగాళ్లు అర్థరాత్రి వస్తూ పోతున్నారని చూస్తే నలుగురు ఏమనుకుంటారని కావ్య మండిపడుతుంది.

నేను పరాయివాడినా? మరి ఇంతకాలం నాతో ఎందుకంత క్లోజ్‌గా ఉన్నారని రాజ్ అడగ్గా.. మా ఇంట్లో పనిచేసే పనివాళ్లతో కూడా అంతే క్లోజ్‌గా ఉంటానని చెబుతుంది కావ్య. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుని నన్ను కలవాలని ప్రయత్నిస్తే ఊరుకోనని, ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో రాజ్ బాధపడుతూ వెళ్లిపోతాడు. రాజ్ ఆసుపత్రి పాలయ్యేసరికి కావ్యకి భయం పట్టుకుందని మనకి కావాల్సింది కూడా ఇదేనని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.

మేం ఇన్నాళ్లు కావ్యని అడ్డుకోలేకపోయామని, కానీ నువ్వు దానిని సాధించావని యామినిని మెచ్చుకుంటుంది రుద్రాణి. నేను కావ్యను గెలిచానని యామిని చెప్పగా.. నువ్వు ఆమెను అంత తేలిగ్గా తీసుకోవద్దని చెబుతుంది రుద్రాణి. రాజ్‌ను తీసుకుని మా ఇంటికి వస్తే అత్తా, కోడళ్లు డ్రామా ఆడుతున్నారని రాజ్‌కు తెలిసిపోతుందని ఐడియా ఇస్తుంది రుద్రాణి. వాడిని నువ్వు తీసుకెళ్లు, వాడి ఆస్తిని నేను తీసుకెళ్తానని అంటుంది. కావ్య నిజ స్వరూపం ఏంటో చూపిస్తానని ఉదయాన్నే రాజ్‌కి చెబుతుంది యామిని. దుగ్గిరాల ఇంట్లో యామిని కోసం రుద్రాణి, రాహుల్‌లు వెయిట్ చేస్తుంటారు. ఇంతలో యామిని, రాజ్‌లు రావడంతో అది చూసిన కావ్య షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X