Brahmamudi May 12th Episode: ఓవరాక్షన్‌తో రేఖకి దొరికిపోయిన ఇందూ- రాజ్.. తెరపైకి విడాకులు

Photo Courtesy: JioHotstar

నువ్వు ఎవరు? మీ అమ్మానాన్న పేర్లు ఏంటని రాజ్‌ను అడుగుతుంది అపర్ణ. దాంతో ఏదో ఒక పేరు చెప్పాలని అనుకుంటాడు రాజ్. అయితే ఇందూ మాత్రం ఇతని తల్లిదండ్రుల పేర్లు చలపతి- లక్ష్మీ అని తమ్ముడు వెంకటేశ్వర్లు అని చెబుతుంది. ఈ దుగ్గిరాల ఆస్తిని సంపాదించాలన్నది మా అమ్మ కల.. ఆమె తర్వాత నేను ఎన్నో పావులు కదుపుతున్నా, చివరి క్షణంలో ఆస్తి చేజారిపోతోందని భూషణ్‌తో చెబుతూ రగిలిపోతుంది రేఖ. ఏం చేసైనా సరే ఇందూ- రాజ్‌లను వీడగొట్టి మదన్‌తో ఇందూకి పెళ్లి చేసి ఆస్తిని దక్కించుకోవాలని అనుకుంటుంది రేఖ.

కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ని చూసి అపర్ణ- సుభాష్‌లు సంతోషిస్తారు. వీడు ఖచ్చితంగా మన మనవడు.. మన కూతురి కొడుకే అయ్యుంటాడని అనుకుంటారు. ఇల్లంతా తిరిగి చూసిన రాజ్‌ను స్టోర్ రూమ్‌లోకి తీసుకొస్తుంది ఇందూ. ఇకపై మనం ఉండాల్సింది ఇక్కడేనని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. అలాగే పెళ్లి ఆపడానికి ఇద్దరి మధ్య జరిగిన డీల్ గురించి కూడా రాజ్‌కు గుర్తుచేస్తుంది. భర్త పేరుతో హద్దులు దాటితే శాలరీ కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. ఈ దెబ్బంతో రాజ్‌ సరేనని అంగీకరిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 12వ తేదీ ఎపిసోడ్ 1030లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 12th 2026 Episode 1030 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేను పెట్టిన కండీషన్స్ మరిచిపోయి నాతో ఓవరాక్షన్ ఎందుకు చేశావని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. ఫ్లోలో ఏ కథ వస్తే అది చెప్పేస్తావా? అని ఫైర్ అవుతుంది. నువ్వు ఓవరాక్షన్ చేసినందుకు 2 వేల రూపాయలు కట్ అంటుంది. వాళ్లందరినీ నమ్మించడానికి నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తావా అని ఫైర్ అవుతుంది. అయినా పౌర్ణమి వెన్నెలలో, ఉరుములు, మెరుపులు నిన్ను హగ్ చేసుకోవడం ఊహించుకోవడానికే కొత్త ఫీలింగ్‌లా ఉందని అంటుంది ఇందూ. అసలే నువ్వు గీకి గీకి 10 వేలు ఇస్తానని అన్నావు.. అందులో 2 వేల రూపాయలు కట్ చేస్తే నాకేం మిగులుతుంది అంటుంది ఇందూ.

ఇది నువ్వు కిడ్నాప్ చేసిన ప్లేస్ కాదు.. నువ్వు ఇష్టమొచ్చినట్లు ఉండటానికి అంటుంది ఇందూ. అక్కడ కూడా నీకు ఇష్టం వచ్చినట్లు ఉన్నావు, నన్ను బెదిరించి నీ పిచ్చి కోరికలు తీర్చుకున్నావని అంటాడు రాజ్. నేను అక్కడే అలా ఉంటే... ఇది నా ఇల్లు అంటుంది ఇందూ. నాకు తెలియకుండా ఫోటోలు తీసినందుకు ఇంకో 2 వేలు కట్ చేస్తున్నా అని బెదిరించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక నుంచి మీ లిమిట్స్‌లో మీరు ఉండండని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. నాకు డబ్బు చాలా అవసరం.. అందుకే నీ టైం నడుస్తుందని అనుకుంటాడు రాజ్.

భ్రమరాంబ కోపంతో ఏదో ఒకటి తింటూ ఉండటంతో శేషం సెటైర్లు వేస్తాడు. నువ్వు ఆకలి మీద ఉన్నప్పుడూ తింటావు.. కోపంగా ఉన్నప్పుడు కూడా తింటావని అంటాడు శేషం. ఇందూ - మదన్‌ల పెళ్లి ఎలా ఆపాలో తెలియక నేను కంగారుపడుతుంటే ఆ దేవుడు నా మొర ఆలకించి రాజ్ గాడిని ఇందూకి మొగుడిని చేశాడని అంటుంది భ్రమరాంబ. అయినా నా టెన్షన్ రేఖ గురించి.. ఇప్పుడు తను ఇందూ- రాజ్‌ల పెళ్లిని ఒప్పుకుంది కానీ, ఈ విషయాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టదని చెబుతుంది. ఇప్పుడు తిమ్మిని బొమ్మిని చేసైనాసరే ఈ పెళ్లి చెల్లదని నిరూపించే వరకు రేఖ నిద్రపోదని అంటాడు శేషం.

ఇందూ- రాజ్‌లను విడగొట్టేందుకు రేఖ ఏ ప్లాన్ చేసినా నేను దానిని తిప్పికొట్టి ఇందూ- రాజ్‌లు ఒక్కటయ్యేలా చేస్తానని చెబుతుంది భ్రమరాంబ. ఆస్తి గురించి రేఖ చూసుకుంటుంది.. నేను మాత్రం మన కూతురిని మదన్‌కిచ్చి పెళ్లి చేయడం గురించే ఆలోచిస్తానని అంటుంది. మనతో సంబంధం కుదుర్చుకుంటే బూడిద మిగలదని అంటుందా? స్వాతితో మదన్ పెళ్లయ్యే వరకు నేను ఎక్కడా తగ్గనని చెబుతుంది భ్రమరాంబ. అంతా ఓకే గానీ.. ఆ రాజ్ గాడు మీ అందరికీ మొగుడై కూర్చునేలా ఉన్నాడని వార్నింగ్ ఇస్తాడు శేషం.

రాజ్ నడుచుకుంటూ వెళ్తుండగా ఐశ్వర్య అతనిని లోపలికి లాగేస్తుంది. నా డబ్బులు ఎక్కడ? ముందు 20 లక్షలు కొట్టేశావు.. ఇప్పుడు ఈ ఆస్తి కొట్టేయడానికి వచ్చావా అని ఫైర్ అవుతుంది. నువ్వు డబ్బుకు తప్పించి, ఏ ఎమోషన్‌కి వాల్యూ ఇవ్వవు, మర్యాదగా నిజం చెప్పమని నిలదీస్తుంది ఐశ్వర్య. 25 ఏళ్లుగా మా రేఖ ఆంటీ ఈ ఆస్తి కోసం కాచుకుని కూర్చొంది.. నువ్వు అడ్డొస్తే నిన్ను చంపేస్తుందని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలని తేల్చేస్తుంది. కిడ్నాప్ చేసింది నేనే అని అందరికీ తెలుసు.. ఇదంతా ఆవిడ దగ్గరే తేల్చుకుంటానని వార్నింగ్ ఇస్తాడు రాజ్. నాకు కొంచెం టైమిస్తే నీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తానని చెబుతాడు.

రేఖ దగ్గరికి వెళ్లి ఇందూ క్షమాపణలు అడుగుతుంది. మీరు చెప్పినట్లుగానే మదన్‌ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ ఈలోపే ఇలా జరిగిందని నటిస్తుంది. హ్యాపీగా ఉన్న మన జీవితాల్లోకి ఆ రాజ్‌గాడు వచ్చాడు.. నన్ను ఇలా బెదిరించి పెళ్లి చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. కేవలం మనింటి పరువు కోసమే ఆలోచించి వాడితో తాళి కట్టించుకున్నానని చెబుతుంది ఇందూ. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు, మీ మాటకి ఎప్పుడూ ఎదురుచెప్పలేదు.. ఇప్పుడు కూడా మీరు ఏది చెబితే అదే చేస్తానని అంటుంది. దాంతో ఇప్పుడు కూడా నేను చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతుంది రేఖ. మీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానని చెబుతుంది ఇందూ.

నాకు నీ ప్రాణాలు వద్దు.. నా కాళ్ల కింద చెప్పులా పడుండాలని అనుకుంటుంది రేఖ. అతను నిన్ను బలవంతంగా పెళ్లిచేసుకున్నాడు.. విడిపోవడానికి ఓకేనా? అయితే విడాకులు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అని అడుగుతుంది రేఖ. ఇష్టం లేని పెళ్లి జరిగినప్పుడు విడాకులు ఇవ్వడం ఎంతసేపు.. మీరు ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడే ఇచ్చేస్తానని చెబుతుంది ఇందూ. మన కుటుంబం పరువు పోకుండా ఏదైనా చేస్తానని అంటుంది ఇందూ. ఇక ఏం చేయాలో? ఎలా నడిపించాలో నేను చూసుకుంటానని చెబుతుంది రేఖ. ఇందూకి వాడితో విడాకులు ఇప్పించి నా కొడుకుతో పెళ్లి చేస్తానని భ్రమరాంబతో అంటుంది రేఖ.

వాళ్లు విడాకులు తీసుకోవాలంటే కనీసం సంవత్సరం ఆగాలని భ్రమరాంబ అనడంతో రేఖ షాక్ అవుతుంది. జరిగిపోయిన పెళ్లిని ఆపకపోవచ్చు.. కానీ ఇందూకి అధికారికంగా పెళ్లి జరిగింది కాబట్టి.. ఆస్తి మొత్తం దాని పేరు మీదకి వస్తుంది. దాని చేత వేలిముద్రలు వేయించుకుని ఆస్తి మొత్తం మన సొంతం చేసుకుందామని చెబుతుంది రేఖ. నేను అనుకున్నట్లు ఇందూ- రాజ్‌ల విడాకులు ఆపేశాను, ఆస్తి మా చేతికి వచ్చేస్తుంది.. ఇక స్వాతి- మదన్‌ల పెళ్లి ఎలాగైనా చేయాలని మనసులో అనుకుంటుంది భ్రమరాంబ. రాజ్‌ కనిపించకపోవడంతో లక్కీ, చలపతి కంగారుపడతారు. రాజ్ ఉన్నాడా? అని చలపతికి లక్కీ ఫోన్ చేయడంతో చలపతి ఇంకా టెన్షన్ పడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X