Brahmamudi May 13th Episode: అపర్ణని ఇరికించిన యామిని.. కావ్యను ఛీకొట్టిన రాజ్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్
నా భర్త విషయంలో మీరు జోక్యం చేసుకోనంత వరకు తాను చాలా జాగ్రత్తగా డీల్ చేశానని అపర్ణపై మండిపడుతుంది కావ్య. ఇకపై ఆయనతో మాట్లాడనని, రాజ్ ప్రాణాలతో ఎక్కడో ఒకచోట ఉంటే చాలని అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా దుగ్గిరాల వారి నిలయానికి వచ్చిన రాజ్ మనసును కావ్య ముక్కలు చేస్తుంది.
ఇదంతా చూసిన రాహుల్, రుద్రాణిలు వెంటనే యామినిని కలిసి ఆమెతో చేతులు కలుపుతారు. రాజ్‌తో కలిసి మా ఇంటికొచ్చి కావ్యకి షాకివ్వాలని యామినికి ప్లాన్ చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే రెడీ అవుతున్న రాజ్ దగ్గరికి వెళ్లి మన పెళ్లికి తొలి శుభలేఖ నీ బెస్ట్ ఫ్రెండ్ కావ్యకే ఇవ్వాలని అంటుంది యామిని. కావ్య మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని రాజ్ కూడా సరేనని అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 13వ తేదీ ఎపిసోడ్ 720లో ఏం జరిగిందంటే?

పెళ్లి శుభలేఖను ఇవ్వడానికి దుగ్గిరాల నిలయానికి వస్తారు రాజ్- యామిని. వాళ్లని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కళావతి షాక్ అవుతుంది అనుకుంటే మీరంతా షాక్ అవుతున్నారేంటీ అని యామిని అడుగుతుంది. నేను కళావతి గారి ఫ్రెండ్‌నని, నాకు కాబోయే హజ్బెండ్ రామ్ తనకు ఫ్రెండ్ అని చెబుతుంది. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని, అందుకే మా మొదటి పెళ్లి పత్రిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కళావతి గారికి ఇద్దామని తీసుకొచ్చానని అంటుంది. నేరుగా రాజ్ నానమ్మకి శుభలేఖను ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. అనంతరం సీతారామయ్య- ఇందిరల ఆశీర్వాదం తీసుకుంటారు యామిని - రాజ్.
ఇంటికొచ్చి మరి పిలిచావ్ కదా .. మేమంతా తప్పకుండా మీ పెళ్లికి వస్తామని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలు విన్న ఇందిర కోపంగా చూస్తుంది. ఇంతలో అపర్ణ కిందకి రావడంతో రాజ్ ఆమెను చూసి షాక్ అవుతాడు. ఆ రోజు గుడిలో అన్నదానం రోజున బర్త్ డే కేక్ తీసుకొచ్చి సెలబ్రెట్ చేశామని యామిని చెబుతుంది. మీకు, కళావతికి ఏంటి సంబంధం? మీరు ఈ ఇంట్లో ఎందుకున్నారు? అని యామిని ప్రశ్నించడంతో అపర్ణ, కావ్యలు ఉలిక్కిపడతారు. అపర్ణ ఈ ఇంటి పెద్ద కోడలని, తన ఇంట్లో తను ఉండగా ఇంక ఎక్కడ ఉంటుందని చెబుతుంది రుద్రాణి.
మరి కళావతికి, ఆవిడకి ఏంటి సంబంధమని యామిని ప్రశ్నిస్తుంది. వాళ్లిద్దరూ అత్తా కోడళ్లు కాబట్టి కలిసున్నారని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలు వినగానే రాజ్ షాక్ అవుతాడు.
మరి గుడిలో ఎవరూ సంబంధం లేనట్లు ఇద్దరూ ఎందుకలా ప్రవర్తించారని యామిని ప్రశ్నిస్తుంది. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకరికొకరు బాగా తెలుసని, కానీ ఎవరో తెలియనట్లు నీ ముందు నటించారు.. నిన్ను మోసం చేశారని యామిని చెబుతుంది. మోసం చేయాల్సిన అవసరం నా కోడలికి లేదని ఇందిర అంటుంది. అవసరం లేనప్పుడు ఎందుకు నటించాల్సి వచ్చిందని యామిని కూడా ప్రశ్నిస్తుంది. వయసులో పెద్దవారై ఉండి చిన్నపిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి వాళ్లని వెనకేసుకుని వస్తారా? అని మండిపడుతుంది. మనుషుల్ని మోసం చేస్తున్నా కూడా సపోర్ట్ చేస్తారా? అని ఫైర్ అవుతుంది.
ఆ మాటలో కావ్య మండిపడుతుంది. తప్పు చేసింది నేను, నువ్వు ఏమైనా అడగాలంటే నన్ను అడుగు, అంతేకానీ మా ఇంటికొచ్చి మా అమ్మమ్మ గారిని అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. తప్పు చేసినట్లు తనే ఒప్పుకుందని, ఈ విషయం నీకు చెప్పాలనే ఇక్కడి దాకా తీసుకొచ్చానని రాజ్‌తో యామిని అంటుంది. రిసార్ట్‌కు నిన్ను కావాలనే తీసుకెళ్లారని, నువ్వు కోమా నుంచి బయటికి వచ్చిన విషయం తెలుసుకుని నీ మైండ్ కన్ఫ్యూజ్ చేయడానికి పిచ్చి నాటకాలు ఆడారని చెబుతుంది యామిని. నిన్ను వాళ్ల వైపుకు తిప్పుకోవాలని చూశారని, నువ్వు కళ్లు తిరిగి పడిపోయేసరికి భయపడి పారిపోయానని అంటుంది. అప్పుడు నేను నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడానని చెబుతుంది.
నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని వీళ్లంతా డ్రామాలాడారని అంటుంది. ఇప్పటికైనా ఎవరు నీవాళ్లు.. ఎవరు నిన్ను ప్రేమించే వాళ్లు తెలుసుకోమని చెబుతుంది యామిని. తన మాటలు నమ్మొద్దని, తను అన్ని అబద్ధాలు చెబుతుందుని అంటుంది కావ్య. అపర్ణ గారికి, మీకు ఇంతకు ముందే పరిచయం ఉందా అని రాజ్ ప్రశ్నించడంతో తెలుసని ఆన్సర్ ఇస్తుంది కావ్య. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారని కావ్య ముఖం మీద ఛీ కొట్టి వెళ్లిపోతాడు రాజ్.
నీకున్న దారులన్నీ మూసుకుపోయామని, ధర్మం నా వైపు ఉందని.. నా ప్రేమ నిజం కాబట్టే అన్ని నాకు అనుకూలంగా జరుగుతున్నాయని అంటుంది యామిని. నీ అంతట నువ్వు ఆయన్ని కలిస్తే తన ప్రాణాలకు ప్రమాదం కాబట్టి నువ్వు కలవవని నాకు తెలుసని చెబుతుంది యామిని. మా బావ నిన్ను కలవకుండా, నీ మీద తన మనసుని విరిచేశానని అంటుంది. మా ఇద్దరి మధ్య బ్రహ్మముడి పడింది అన్నావు కదా ఆ ముడిని చిక్కుముడిగా మార్చేశానని, దానిని నువ్వు విప్పలేవని కావ్యతో చెప్పి యామిని వెళ్లిపోతుంది. ఆ మాటలతో కావ్య సోఫాలో కుప్పకూలుతుంది.
ఆయన దృష్టిలో నేనొక మోసగత్తెలా మారిపోయాయని, ఇక ఎప్పటికీ ఆయన నా వైపు కన్నెత్తి కూడా చూడడని బాధపడుతుంది. తన ప్లాన్ సక్సెస్ కావడంతో రుద్రాణి, రాహుల్‌లు సంతోషిస్తారు. ఇక రాజ్ ఎప్పటికీ ఈ ఇంటికి రాడు, కావ్యతో మాట్లాడడు.. ఇక ఎప్పటికీ గతం గుర్తురాదని, త్వరలోనే నువ్వు ఈ ఇంటికి వారసుడివి కాబోతున్నావని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. యామిని - రాజ్ వచ్చే సమయంలో నేను ఇంట్లో లేకుంటే బాగుండేదని అపర్ణ బాధపడుతుంది. రాజ్‌ని, కావ్యని తిరిగి కలపాలని దుగ్గిరాల కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తారు. రాజ్‌కి కళ్యాణ్ ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని ఇంటికి వస్తారా అని అడుగుతాడు. కళావతి గారి గురించి ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతాడు కళ్యాణ్. దాంతో రాజ్ ఖచ్చితంగా వస్తానని అంటాడు. ఇంతలో కావ్యకి యామిని ఫోన్ చేసి సూటిపోటి మాటలతో మరింత బాధపెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











