Brahmamudi May 13th Episode: ఇందూ- రాజ్‌లను విడదీసిన రేఖ.. రాజ్ ఇంటికి వెళ్లిన అపర్ణ

Photo Courtesy: JioHotstar

నువ్వు నా దగ్గర ఎక్స్‌ట్రాలు చేసినందుకు, నన్ను టచ్ చేసినందుకు 2 వేల రూపాయలు కట్ చేస్తున్నానని ఇందూ అనడంతో రాజ్ మండిపడతాడు. ఇకపై జాగ్రత్తగానే ఉంటానని రాజ్ చెప్పడంతో ఇందూ సరేనని వెళ్లిపోతుంది. రాజ్ ఎక్కడున్నాడో తెలియక లక్కీ ఎంత ఫోన్ చేసిన స్విచ్ఛాఫ్ వస్తుంది. అటు చలపతి- లక్ష్మీలు కూడా కొడుకు కోసం బాధపడుతుంటారు. ఇంతలో లక్కీ కూడా రాజ్ గురించి అడుగుతూ ఫోన్ చేయడంతో చలపతి ఇంకా కంగారుపడతాడు. రాజ్‌ని పక్కకి లాక్కెళ్లిన ఐశ్వర్య.. నువ్వు పెద్ద ప్లాన్‌తోనే మా ఇంటికి వచ్చావని నాకు తెలుసు. మర్యాదగా నాకు రావాల్సిన 10 లక్షలు నాకు ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను.. ఆలోపు ఎక్స్‌ట్రాలు చేస్తే మీ ఆంటీకి అసలు నిజం చెప్పేస్తానని రాజ్ వార్నింగ్ ఇస్తాడు.

రేఖ దగ్గరికి వెళ్లిన ఇందూ.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మీరేం చేయమంటే అది చేస్తానని అంటుంది. దాంతో విడాకులు ఇచ్చేస్తావా? అని రేఖ అడగ్గా.. సరేనని చెబుతుంది ఇందూ. అయితే పక్కనే ఉన్న భ్రమరాంబ ఈ ప్లాన్ చెడగొట్టాలని.. ఏడాది వరకు విడాకులు తీసుకోవడం కుదరదని చెబుతుంది. విడాకులకు ఏడాది అయితే ఏంటీ? ఇందూకి పెళ్లి అవ్వగానే ఆస్తి మీద పూర్తి హక్కు వచ్చేసింది కాబట్టి తనతో వేలిముద్రలు వేయించుకోవాలని ప్లాన్ చేస్తుంది రేఖ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 13వ తేదీ ఎపిసోడ్ 1031లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 13th 2026 Episode 1031 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ ఇంటికి రాకపోవడంతో చలపతి కంగారుపడతాడు. ఇంతకుముందు చాలాసార్లు వాడు ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోతే తిట్టేవాడిని.. కానీ ఆ శృతిగారు వచ్చి దుగ్గిరాల వారసుడు, ఆ విషయం బయటికి తెలిస్తే వాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్పినప్పటి నుంచి నాకు కంగారుగా ఉందని అంటాడు. వాడికి ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని భయంగా ఉందని కంటతడి పెడతాడు. గార్డెన్‌లో కూర్చొన్న సుభాష్.. టాబ్లెట్స్ తీసుకోవడానికి ముందుకు పడిపోతుండగా రాజ్ వచ్చి పట్టుకుంటాడు. సుభాష్‌కి స్వయంగా నీరు తాగిస్తూ ఉండటంతో గుణంలో కూడా వీడు అచ్చం నా కొడుకులా ఉన్నాడని మురిసిపోతుంది అపర్ణ.

నేనెవరో తెలుసుకోవాలని వీళ్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ల దగ్గర కొంచెం ప్రేమ నటిస్తే మనం సేఫ్‌ అనుకుని సుభాష్‌ని గదిలోకి తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన ఇందూ.. ఏమైందని అడుగుతుంది. ఆ అబ్బాయిని చూస్తుంటే తను మనకి బాగా పరిచయమున్న వ్యక్తిలా అనిపిస్తున్నాడని అంటుంది. నేను వాళ్లింటిలో వాళ్లతో కూడా మాట్లాడాను. వాళ్లకి మనకి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది ఇందూ. వాళ్లు ఎక్కడుంటారో అడ్రస్ చెప్పమని అడుగుతుంది అపర్ణ. నేను వాళ్లతో మాట్లాడే వరకు నా మనసు కుదిటపడదని అంటుంది. మాకు పెళ్లి జరిగిందని తెలిస్తే వాళ్లు కంగారుపడతారని అంటుంది ఇందూ. మీ పెళ్లి విషయం వాళ్లకి చెప్పను.. తన గురించి మాత్రమే అడుగుతానని చెబుతుంది అపర్ణ. దాంతో నీ ఫోన్‌కి వాళ్లింటి లోకేషన్ పంపిస్తానని అంటుంది ఇందూ.

సుభాష్‌ని గదిలోకి తీసుకొచ్చిన రాజ్.. మీరుండేది ఈ చిన్న గదిలోనా అని అడుగుతాడు. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. కానీ మీరుండే రూమ్స్ మాత్రమే ఇరుకుగా ఉన్నాయని అంటాడు. ఇందూ ఏమో మీరంతా చాలా కష్టపడి చిన్న బిజినెస్‌తో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారని, కోట్ల ఆస్తులని చాలా గొప్పగా చెప్పింది. కానీ మీ ఇంట్లో మీరు ఇలా ఉండటం ఏంటని అడుగుతాడు రాజ్. ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబం పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండేది. మా నాన్నగారు ఎంతో కష్టపడి ఉన్నతంగా తీర్చిదిద్దారు.

ఆ తర్వాత మేం, మా పిల్లలు ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతులు కాపాడుకుంటూ వచ్చాం. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చాం.. ట్రస్ట్‌ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ ఆ రోజు ఆ దారుణం జరగకుండా ఉండుంటే .. ఈరోజు మేం ఇలా ఉండేవాళ్లం కాదని చెబుతాడు సుభాష్. మా నాన్నకే చదస్తం అనుకున్నాను, కానీ ప్రతి ఇంట్లో ఇలాంటోళ్లు ఉంటారని అనుకుంటాడు రాజ్. సుభాష్ యాక్సిడెంట్ గురించి చెబుతుండగా ఈ నస నా వల్ల కాదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నువ్వు నిజంగానే మా మనవడివి అయితే ఎంత బాగుండో అనుకుంటాడు సుభాష్.

ఇందూకి రాజ్‌గాడికి విడాకులు ఇప్పించాలని రేఖ ప్లాన్ చేసింది.. కానీ నేను దానికి సంవత్సరం మెలిక పెట్టా. దాంతో రేఖ తన ప్లాన్ మార్చేసింది. ఈ సంవత్సరం లోపు.. ఆ రాజ్- ఇందూలు ఒక్కటైపోతారు. ఇక ఇందూని మదన్‌కిచ్చి పెళ్లి చేయడం అస్సలు కుదరదని శేషంతో అంటుంది ఇందూ. త్వరలో బిడ్డని కూడా ఇస్తారని భ్రమరాంబ చెబుతుండగా రేఖ వస్తుంది. ఆ రాజ్ గాడిని ఇందూ గదిలోంచి బయటికి పంపించాలి, వాళ్లిద్దరూ ఒకే గదిలో ఉండకూడదని అంటుంది రేఖ. ఆ మాటలతో భ్రమరాంబ షాక్ అవుతుంది.

ఇందూ ఇప్పుడిప్పుడే మనదారిలోకి వస్తుంది.. ఆ గదిలో వాడు ఇందూని మాయ చేస్తే ఎలా? ఇందూ మీద వాడి నీడ కూడా పడకూడదని అంటుంది రేఖ. ఇందూ చాప, దిండు సర్దుతుండగా రాజ్ వచ్చి మనిద్దరికీ ఇది సరిపోదని అంటాడు. ఇంతలో రేఖ, భ్రమరాంబ, శేషం వస్తారు. మీకు ఇప్పుడు పెళ్లయ్యింది కదా ఒకే గదిలో ఉండకూడదని అంటుంది రేఖ. ఫస్ట్ నైట్‌కి ఒక టైం ఉంటుంది.. ముహూర్తం చూసి జరిపించాలని చెబుతుంది. నువ్వు ఈ గదిలోనే పడుకో.. ఇందూ మా భ్రమరాంబ వదిన దగ్గర పడుకుంటుందని చెబుతుంది రేఖ. ఇంత పెద్ద గదిలో పడుకోవడం నా వల్ల కాదు.. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, మా తమ్ముడు ఎవరో ఒకరు నాకు తోడుగా పడుకునేవారని చెబుతాడు రాజ్. ఎలాగోలా ఇందూని, రాజ్‌ని విడదీస్తుంది రేఖ.

రాజ్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తుంది అపర్ణ.. ఆమెను చూడగానే చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. నా పేరు దుగ్గిరాల అపర్ణా దేవి అని చెప్పగానే.. మేం మీకు తెలుసా అని చలపతిని అడుగుతుంది అపర్ణ. దుగ్గిరాల కుటుంబానికి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా? వాటి గురించి పేపర్‌లో, టీవీలో చూసేవాడిని అని చెబుతాడు చలపతి. నేను మీ గురించి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చానని చెబుతుంది అపర్ణ. నేను మీ అబ్బాయి రాజ్‌ని చూశాను.. తను అచ్చం నా కొడుకు స్వరాజ్‌లాగే ఉన్నాడు. ఒకప్పుడు మా కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్తుంటే నా కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు అందరూ చనిపోయారు. కానీ నా కూతురి కొడుకు మాత్రం అక్కడ కనిపించలేదని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X