Brahmamudi May 13th Episode: బిడ్డ తల్లిని తీసుకొస్తానంటున్న కావ్య.. అదిరిపోయే సలహా ఇచ్చిన చిట్టి!
గడువు రేపటితో ముగుస్తుంది ఇప్పటికైనా నిజం చెప్పు లేదంటే నేనే ఇంట్లోంచి వెళ్లిపోతానని కొడుకుని హెచ్చరిస్తుంది అపర్ణ. అప్పుడు నిజం చెప్పటానికి ప్రయత్నిస్తాడు సుభాష్, కానీ కావ్య అడ్డుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 13వ తేదీ ఎపిసోడ్ 408 లో ఏం జరిగిందంటే..
నేను బిడ్డ తల్లి ఎవరో తెలియక, రాజ్ చేత నిజం చెప్పించలేక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆ పని చేయగలవా, ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టగలవా అలా చేసినట్లయితే నేను ఇంట్లోంచి వెళ్ళను అంటుంది అపర్ణ. అలాగే బిడ్డ తల్లిని తీసుకొస్తాను అని అత్తకి మాట ఇస్తుంది కావ్య. శాంతించిన అపర్ణ గదిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో భార్యని మందలిస్తాడు రాజ్ అసలు నువ్వు ఏం మాటిచ్చావో తెలుసా..

అసలు బిడ్డ తల్లిని తీసుకువస్తానని ఏ ధైర్యంతో మాటిచ్చావు అని నిలదీస్తాడు. నాకు ఆ నిమిషానికి అత్తయ్య గారిని ఆపటానికి వేరే దారి తోచలేదు, అయినా ఆ బిడ్డ తల్లి ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది కదా,భూమ్మీదే ఉంటుంది కదా, అది ఎవరైనా సరే నేను వెతికి తీసుకు వస్తాను అంటుంది కావ్య.అయినా లగేజ్ పెట్టుకొని మీరు ఒక్కరే బయలుదేరిపోయారు నన్ను ఏం చేద్దామనుకున్నారు, మన ఇద్దరికీ బ్రహ్మముడి పడి సంవత్సరం అయింది.

నన్ను ఈ ఇంట్లో ఒంటరిగా పని మనిషిని చేసి వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారా ఈ విషయంలో నేను మిమ్మల్ని క్షమించలేను అంటుంది. నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు, ఇప్పుడు అమ్మకు మాటిచ్చేసావు సరే రేపు ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చే వరకు అమ్మ ఊరుకోదు అంటాడు రాజ్. ఎలాగైనా ఆ బిడ్డ తల్లిని తీసుకు వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఇది అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు అనుకుంటాడు రాజ్.
కావ్య బయటకు వెళ్లేసరికి అక్కడ సుభాష్ కనిపిస్తాడు. నేను నిజం చెప్పాలనుకుంటే నువ్వు ఎందుకు ఆపావు అని అడుగుతాడు. నిజం చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మావయ్య, మీరు చెప్పాలనుకున్న నిజం గురించి నాకు తెలుసు అందుకే మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు సుభాష్. ఒక మామగారు కోడలితో మాట్లాడకూడని సంభాషణ ఇది అంటాడు.

జరిగిపోయిన దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం, నాకు నిజం తెలుసు అనే విషయం మీ అబ్బాయికి తెలియదు మీరు కూడా చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు లగేజ్ సహా తల్లి దగ్గరికి వస్తాడు రాహుల్. ఏంటి ఇదంతా అంటుంది రుద్రాణి. మనం అనుకున్నది ఏదీ జరగటం లేదు, ఇప్పటివరకు ఆ రాజ్ కానీ అపర్ణ అత్తయ్య కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నాము కానీ అది జరగడం లేదు, అందుకే మనమే వెళ్ళిపోదాం గౌరవం అయినా మిగులుతుంది.
అదే ఆ కావ్య మనల్ని బయటకు గెంటేస్తే ఆ గౌరవం కూడా దక్కదు అంటాడు రాహుల్. అలా జరగదు ఈసారి మనం అనుకున్నట్లే జరుగుతుంది బిడ్డ తల్లిని తీసుకువస్తాను అని నాకు కావ్య మాటిచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఆమెకే ప్రమాదం, ఇచ్చిన మాట తప్పినా ఆమెకే ప్రమాదం. ఈ రెండిట్లో ఏది జరిగినా కావ్య బయటకు వెళ్ళిపోతుంది అంటుంది రుద్రాణి. ఆ మాటలకి ఆనందపడతాడు రాహుల్. మరోవైపు ఆలోచనలో ఉన్న కావ్య దగ్గరికి వస్తుంది చిట్టి.
మీ అత్తగారికి అలా ఎలా మాటిస్తావు, అలా చేస్తే కోడలుగా ఈ ఇంట్లో నీ స్థానం ఏమైపోతుంది అని కోప్పడుతుంది. ఆ నిమిషంలో నాకు వేరే దారి తోచలేదు అమ్మమ్మ గారు అంటుంది. ఈ మంచితనమే నీ కాపురాన్ని కూలదోసేలా ఉంది , అయినా అదేం తల్లి పాలు తాగే పిల్లాడిని వదిలేసి ఎక్కడో ఉంది, ఏ తల్లి అయినా అలా ఉండగలదా, 30 ఏళ్ల కొడుకుని వదిలి ఉండడానికే మీ అత్త అంత దిగులు పడిపోయింది.

ఆమె బయటపడకపోయినా కేవలం రాజ్ కోసమే ఆమె ఇంట్లో ఉండిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే అంటుంది చిట్టి. నిజమే కదా ఏ తల్లి పాలు తాగే పిల్లాడిని వదిలేసి ఉండలేదు ఈ తల్లి ఉంది అంటే ఇందులో ఏదో మతలబు ఉంది, మంచి సలహా ఇచ్చారు బామ్మ గారు అంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఇప్పుడు నేను ఈమెకి ఏమంత సలహా ఇచ్చాను అనుకుంటుంది చిట్టి. మరోవైపు భర్తకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది అనామిక. కానీ భార్యని దగ్గరికి రానివ్వడు కళ్యాణ్.
తరువాయి భాగంలో ఏ తల్లి పాలు తాగే పిల్లల్ని వదిలేసి ఉండలేదు అయినా ఈ పిల్లాడి తల్లి ఉంటుంది అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అసలు ఆమె ఏం ఆశిస్తుంది అని మామగారిని అడుగుతుంది కావ్య. డబ్బు అంటాడు సుభాష్. ఆమె అకౌంట్లో నిన్నే డబ్బు వేశాను అంటాడు. ఆ ఎకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అంటుంది కావ్య. ఆమెకి డీటెయిల్స్ సెండ్ చేస్తాడు సుభాష్. ఆ డీటెయిల్స్ తో ఆమెని వెతికే ప్రయత్నంలో ఉంటుంది కావ్య.


Click it and Unblock the Notifications











