Brahmamudi May 14th Episode: పుట్టింటికి అల్లుడిగా మారిన రాజ్.. షాక్‌‌లో కావ్య, అపర్ణకి షాకిచ్చిన రుద్రాణి

రుద్రాణి వేసిన ప్లాన్ మేరకు రాజ్‌ను తీసుకుని దుగ్గిరాల వారింటికి వస్తుంది యామిని. త్వరలో మేం పెళ్లి చేసుకోబోతున్నామని సీతారామయ్య- ఇందిరలకు పెళ్లి పత్రిక ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంతలో అపర్ణ మెట్లు దిగి రావడంతో రాజ్ ఆమెను చూస్తాడు. మీరు ఆ రోజు అన్నదానం చేయించినప్పుడు నేను కేక్ కట్ చేయించిన ఆంటీ కదా అని యామిని అంటుంది. మీరు ఇక్కడెందుకు ఉన్నారు? మీకు కళావతికి ఏంటీ సంబంధం అని నిలదీస్తుంది. వాళ్లిద్దరూ అత్తాకోడళ్లని అందుకే ఒకే ఇంట్లో ఉంటున్నారని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు.

ఆవిడ నిజంగా మీ అత్తగారా? అని కావ్యను అడగటంతో అవును అంటుంది కళావతి. దాంతో మీరు నన్ను మోసం చేశారంటూ ఆమెకు గుడ్ బై చెప్పి వెళ్లిపోతాడు రాజ్. నాతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని కావ్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది యామిని. రాజ్‌ను కావ్యని కలపడానికి కొత్త ప్లాన్ వేస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 14వ తేదీ ఎపిసోడ్‌ 721లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 14th 2025 Episode 721 Here is Today s full story

నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావని.. ముందు ముందు ఇంకా చాలా చేస్తానని కావ్యతో అంటుంది యామిని. ఇప్పటి వరకు మీ మధ్య ఉన్న కాస్త బంధాన్ని కూడా కత్తిరించేశానని, మా పెళ్లితో నీలో ఉన్న ఆశల్ని కూడా చంపేస్తానని అంటుంది. ఎప్పుడూ మాటకు మాట సమాధానం ఇచ్చే దానివి, ఈసారి మౌనంగా ఉండిపోయావని అంతకుమించి ఏం చేయలేవని చెబుతుంది యామిని. నువ్వు ఏ ఎక్స్‌ట్రాలు చేసినా రాజ్ ప్రాణాలకే ప్రమాదమని అంటుంది.

ఆ ఒక్క కారణంతోనే నువ్వు బతికి పోతున్నావని, రాజ్‌ను నీ సొంతం చేసుకోలేవని చెబుతుంది కావ్య. మీ ఇద్దరి పెళ్లి జరిగే చివరి నిమిషం వరకు నేను నమ్మకంగా ఉంటానని, ఆయన ఎప్పటికైనా నావైపే వస్తారని అంటుంది. ఓడిపోయినా నీలో పొగరు మాత్రం తగ్గలేదని.. నీ నమ్మకం నీది, నా ప్రేమ నాది.. నా రాజ్‌ను సొంతం చేసుకుని చూపిస్తానని సవాల్ విసురుతుంది యామిని.

ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచి మీరంతా ఇలాంటి సైలెంట్‌గా ఉన్నారేంటీ అని దుగ్గిరాల ఫ్యామిలీని అడుగుతాడు రాజ్. మీ బాధను నేను నిజమని నమ్మి, మీ కొడుకు స్థానంలో నిలబడి మీ పుట్టినరోజు కూడా చేశానని కానీ మీరు నన్ను చాలా బాధపెట్టారని అపర్ణతో అంటాడు రాజ్. వీళ్లు నీ దగ్గర నిజం దాచడం తప్పేనని, కానీ అలా దాచి నీతో తప్పు చేయించారా అని నిలదీస్తుంది ఇందిర. కావ్య మనసును అర్ధం చేసుకోమని చెబుతుంది కావ్య. నేను రిసార్ట్‌లో కళ్లు తిరిగి పడిపోతే కనీసం హాస్పిటల్‌కు కూడా రాలేదని బాధపడతాడు రాజ్. దాని గురించి మాట్లాడదామని ఇంటికొస్తే నన్ను తిట్టేసి పంపించిందని అంటాడు.

నాతో కలవడం ఇష్టం లేకపోతే అసలు ఎందుకు కలవాలి? ఎందుకు పరిచయం పెంచుకోవాలి? అని నిలదీస్తాడు. నా చెల్లెలు ఏనాడూ ఎవరితోనూ కలవడం కానీ, మాట్లాడటం కానీ చూడలేదని అంటుంది స్వప్న. అలాంటిది నీతోనే ఎందుకు కలిసింది? నువ్వు ఫోన్ చేయగానే ఎందుకు పరిగెత్తుకుని వచ్చింది? అని నిలదీస్తుంది. అసలు పార్టీకి ఎందుకు తీసుకెళ్లిందో? తర్వాత సంబంధం లేనట్లుగా ఎందుకు వ్యవహరిస్తుందో మీ చెల్లినే అడగండి అని చెబుతాడు రాజ్.

ఆడపిల్లలను ముందు అర్ధం చేసుకోవడం నేర్చుకోమని అంటుంది అప్పూ. మీరు ఇలా తిప్పి తిప్పి మాట్లాడితే నాకేమీ అర్ధం కావడం లేదని అంటాడు రాజ్. ఆడవాళ్ల ఆలోచనలు గురించి చూద్దాం కానీ ముందు వదిన గురించి ఆలోచించమని అంటాడు కళ్యాణ్. నువ్వు ఎలాగైతే కావ్యని కలవాలని అనుకుంటున్నావో? తను కూడా నిన్ను అలాగే కలవాలని అనుకుంటుందని చెబుతుంది అపర్ణ. వంట చేసి నీకు ఎందుకు పంపించిందో తెలుసా? నువ్వు ఇంటికొస్తే తను అంత రుచిగా వంట చేసి పెట్టగలనని చెప్పడానికే అంటుంది.

నువ్వు గుడికి వెళ్తుంటే అంత కష్టపడి షర్ట్ ఎందుకు కుడుతుంది అని అడుగుతుంది ఇందిర. నువ్వు చీర తీసుకొచ్చిన రోజున మా ఇంట్లో కళావతి ఒక్కటే ఉందనుకుంటున్నావా? అని నిలదీస్తుంది స్వప్న. మేమంతా ఆరోజు ఇంట్లోనే ఉన్నామని.. మేం కనిపించకుండా మా చెల్లెలు జాగ్రత్తగా మేనేజ్ చేసిందని అంటుంది. ఇవన్నీ చూస్తుంటే కళావతి నిన్ను ప్రేమిస్తున్న సంగతి అర్ధం కావడం లేదా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఆ మాటలతో రాజ్ సంతోషిస్తాడు. నేను కూడా తనను ఇష్టపడుతున్నానని చెప్పేస్తానని అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఆపుతుంది.

నువ్వు నేరుగా వెళ్లి చెబితే నిన్ను రిజెక్ట్ చేస్తుందని ఇందిర వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ సైలెంట్ అవుతాడు. యామినితో పెళ్లి కుదిరి ఇప్పుడు కళావతిని ప్రేమిస్తున్నానంటే తను ఎలా ఒప్పుకుంటుందని అడుగుతాడు కళ్యాణ్. యామినిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని, ముందు కళావతి గారి మనసులో ఏముందో తెలుసుకుందామని అనుకుంటున్నానని అంటాడు రాజ్. తన మనసుకు దగ్గరైతే యామిని అంటే ఇష్టం లేదని తను నమ్ముతుందని కళ్యాణ్ చెబుతాడు. అది నువ్వు అనుకున్నంత సులభం కాదని కానీ కష్టపడతానని అంటాడు రాజ్.

ఉదయాన్నే కావ్య రెడీ అవుతుండగా హడావుడి రాజ్ మాటలు వినిపిస్తాయి. ఆమె వచ్చి చూసేసరికి రాజ్‌కు డైనింగ్ టేబుల్ వద్ద టిఫిన్ వడ్డిస్తుంటారు. అది చూసిన కావ్య, రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. మీరు మీరూ ఒక్కటైపోయారా? రాజ్‌కు ఇంకా ఏమీ గుర్తురాలేదా? మీరంతా చెప్పేసి ఉంటారని అనుకున్నానని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో అంతా టెన్షన్ పడతారు. మమ్మీ చెప్పేది రాజ్ గురించి అని రాహుల్ చెబుతుండగా, వాడు నా కొడుకు అని చెబుతాడు సుభాష్. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని రాజ్ అడగ్గా అది నువ్వేనని అంటాడు ప్రకాశం. ఆ మాటలతో అంతా టెన్షన్ పడతారు.

కావ్యని చూసిన రాజ్ మీకోసం ఉదయాన్నే వస్తే ఇంత లేట్‌గా లేస్తారా అని మండిపడతాడు రాజ్. ఎందుకొచ్చారని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. టిఫిన్ చేయడానికి వచ్చానని రాజ్ చెప్పగా.. టిఫిన్ చేశారు కదా ఇక బయల్దేరమని అంటుంది. ఇంటికొచ్చిన అతిథితో అలాగేనా మాట్లాడేది అని ఇందిర ఫైర్ అవుతుంది. ఇంకా స్వీట్స్ తినలేదని సుభాష్ చెప్పగా.. స్వీట్స్ మీకు నచ్చదు కదా అని అంటుంది కావ్య. వాళ్లు ఫీల్ కాకుండా నేను చూసుకుంటానని, మీరు బయల్దేరండి అని చెబుతుంది కళావతి. రేపు మాత్రం రోజంతా ఇక్కడే ఉండాలని ఇందిర అంటుంది. అయినప్పటికీ రాజ్ కదలకపోవడంతో అతని చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తుంది కావ్య. మా ఇంటికి రావొద్దని చెప్పాను కాదా? ఎందుకు వచ్చారని నిలదీస్తుంది. ఇక నుంచి మీరు మా ఇంటికి రావొద్దని తేల్చిచెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X