Brahmamudi May 14th Episode: అపర్ణ దగ్గర నిజం దాచిన చలపతి.. నందూ తన చెల్లెలని తెలుసుకున్న ఇందూ

Photo Courtesy: JioHotstar

రాజ్ ఇంటికి రాకపోవడంతో చలపతి- లక్ష్మీ కంగారుపడతారు. వీడు దుగ్గిరాల వారి వారసుడని తెలిసినప్పటి నుంచి వాడికి ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇద్దరూ భయపడతారు. వాటర్ తీసుకుంటూ కిందపడిపోతున్న సుభాష్‌ని రాజ్ పట్టుకుని మంచినీళ్లు తాగిస్తాడు. ఇదంతా చూసిన అపర్ణ మురిసిపోతుంది. ఖచ్చితంగా ఇతనికి మాతో ఏదో బంధం ఉందని అనుకుని రాజ్ ఇంటి అడ్రస్ ఇవ్వమని ఇందూని అడుగుతుంది అపర్ణ. దుగ్గిరాల కుటుంబం గురించి, మా పరిస్ధితి ఇలా ఎందుకు మారిపోయిందో రాజ్‌కు చెబుతాడు సుభాష్.

రాజ్- ఇందూలు కలిసిపోతే వాళ్లకి బిడ్డ పుడితే విడాకులు కష్టమని భావించిన రేఖ.. భ్రమరాంబ, శేషంలతో కలిసి రాజ్- ఇందూలు ఒకే గదిలో పడుకోకుండా ఆపుతుంది. ఇందూని భ్రమరాంబ గదిలో ఉంచి, రాజ్‌తో శేషం ఉండేలా చేస్తుంది. రాజ్‌ను వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తుంది అపర్ణ. నా పేరు దుగ్గిరాల అపర్ణా దేవి అని చెప్పగానే చలపతి - లక్ష్మీలు షాక్ అవుతారు. మీ అబ్బాయి అచ్చం మా అబ్బాయిలాగే ఉన్నాడు. ఒక ప్రమాదంలో నా కొడుకులు, కోడళ్లు, కుటుంబం మొత్తాన్ని పొగొట్టుకున్నాను. మీ అబ్బాయి నా కూతురి కొడుకులాగా అనిపిస్తున్నాడు అంటుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 14వ తేదీ ఎపిసోడ్ 1032లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 14th 2026 Episode 1032 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

శ్రీశైలంలో జరిగిన ప్రమాదంలో నా కూతురి కొడుకు మాత్రం కనిపించలేదు. వాడు బతికే ఉన్నాడని నా మనసు చెబుతోంది. మీ అబ్బాయిని రాజ్‌ని చూడగానే తను నా మనవడిలా అనిపించిందని చలపతి- లక్ష్మీలకు చెబుతుంది అపర్ణ. తన గురించి తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను... రాజ్ మీ కన్నకొడుకు కాదు కదా? తనను మీరు పెంచుకుంటున్నారు కదా? అని అడుగుతుంది అపర్ణ. అందరినీ పొగొట్టుకున్నాను.. అసలు జీవితంలో కన్నీళ్లు తప్పించి మాకేం మిగిలాయి, రాజ్‌ని చూడగానే మా మనవడని ఆశ కలిగిందని అంటుంది. వాడు మీ ఇంటి బిడ్డ కాదు కదా? దుగ్గిరాల వారసత్వం కదా? అని కంటతడి పెడుతుంది అపర్ణ.

మీలాంటి గొప్పవాళ్లు మా లాంటి వాళ్ల ఇంటి ముందు ఇలా చేయకూడదని అంటుంది లక్ష్మీ. చలపతి నిజం చెప్పబోతుండగా శృతి చెప్పిన మాటలు గుర్తొచ్చి తను మా కొడుకని అబద్ధం చెబుతాడు. వాడు మీ కొడుకైతే.. అచ్చుగుద్ధినట్లు నా కొడుకు లాగే ఉన్నాడు కదా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. మనుషుల్ని పోలిన వాళ్లు ఉన్నట్లే అలా మీ అబ్బాయితో పోలికలు కలిశాయని అంటాడు చలపతి. వాడిని నవమాసాలు మోసింది, పెంచింది మేమని అంటాడు చలపతి. మా బిడ్డని పట్టుకుని మీరు ఇలా మాట్లాడటం బాలేదని అంటుంది లక్ష్మీ. నేను మిమ్మల్ని బాధపెడితే నన్ను క్షమించండి అని ఏడుస్తూ వెళ్లిపోతుంది అపర్ణ.

ఆమెను చూడగానే నాకెందుకో బాధగా ఉంది.. నిజం దాచి మనం తప్పు చేశామేమోనని చలపతితో అంటుంది లక్ష్మీ. ఆ రేఖ చాలా దుర్మార్గురాలు.. రాజ్‌ బతికున్నాడని తెలిస్తే తనని చంపే వరకు వదిలిపెట్టదు. ఈ నిజం ఈ అపర్ణా దేవి గారికి చెబితే ఈవిడ ద్వారా రేఖకి తెలిస్తే రాజ్‌కి ప్రమాదం. ఈవిడ నిజంగా మంచివారో లేక మంచివారుగా నటిస్తున్నారో ఎవరికి తెలుసు. నేను ఎవ్వరికీ నిజం చెప్పను.. మనకి కావాల్సింది రాజ్ గాడు ప్రాణాలతో ఉండటం అంటాడు చలపతి.

చలపతి ఇంటి నుంచి వెళ్తుండగా అపర్ణా దేవిని చూసిన పీఏ శృతి తనను తాను పరిచయం చేసుకుంటుంది. మేడంకి రాజు బతికే ఉన్నాడన్న విషయం చెప్పాలా? వద్దా? అనేది ఆలోచిస్తుంది. ఆఫీసులో ఏ ఇబ్బంది లేదు కదా? టైంకి వర్క్ ఫినిష్ అవుతుందా అని అడుగుతుంది అపర్ణ. ఒకప్పుడు రాజ్ సర్, కావ్య మేడం ఉన్నప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఒక బ్రాండ్ ఉండేది. ఒక్క నిమిషం కూడా వర్క్ విషయంలో డీలే అయ్యేది కాదు.

ఎప్పుడైతే కంపెనీ బాధ్యతల్ని రేఖ మేడం తీసుకున్నారో అప్పటి నుంచి రోజు రోజుకు డౌన్‌ఫాల్ అవుతున్నామని శృతి చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. వర్క్ విషయంలో కానీ, ఎంప్లాయిస్ విషయాన్ని కానీ పట్టించుకోవడం లేదు.. ఎంప్లాయిస్‌కి ఈ నెల శాలరీ ఇవ్వలేదని చెబుతుంది శృతి. ఎంప్లాయిస్‌కి ఇవ్వాల్సిన 20 లక్షలు రేఖ మేడం తన పర్సనల్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుందని చెబుతుంది. యాక్సిడెంట్‌లో మీ ఫ్యామిలీ అంతా చనిపోయారు.. కానీ మీ మనవడు బతికే ఉన్నాడని తెలిస్తే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసు. కానీ నిజం తెలిస్తే మీ మనవడిని ఆ రేఖ ఏమైనా చేస్తుందని భయంగా ఉందని అనుకుంటుంది శృతి.

ఉదయాన్నే ఇందూకి నందూకి ఫోన్ చేయగా అది రాజ్ లిఫ్ట్ చేస్తాడు. మా అక్క దగ్గర నువ్వు ఎందుకు ఉన్నావని నందూ అడుగుతుంది. మీ అక్కని నేనే పెళ్లి చేసుకున్నానని చెబుతాడు రాజ్. నందూ నమ్మకపోవడంతో దుగ్గిరాల ఇంటిని వీడియో తీసి చూపిస్తాడు. ఆ మాటలకు షాకైన నందూ.. వెంటనే అక్కడికి బయల్దేరుతుంది. మరోవైపు.. జైళ్లో నుంచి లక్కీ తండ్రి ఆంటోనీ విడుదలవుతాడు. వాడికి మందు, బిర్యానీ ఇచ్చి తన తల్లి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు లక్కీ.

ఇంటికొచ్చి చూసేసరికి ఇందూ మెడలో తాళి ఉండటంతో నందూ షాక్ అవుతుంది. నువ్వు ఏదో డ్రామా ఆడుతున్నావు.. నిజంగానే రాజ్‌గాడిని పెళ్లి చేసుకున్నావా అని నిలదీస్తుంది నందూ. నేనేం డ్రామా ఆడటం లేదు.. ఈ తాళి చూడమని అంటుంది ఇందూ. వాడెంత ఫ్రాడో చూశావుగా.. డబ్బు కోసం నిన్నే కిడ్నాప్ చేశాడు, అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని అంటుంది నందూ. తెలిసి తెలిసి నీ జీవితం నాశనం అయిపోతుంటే చూడలేను.. ఆ తాళి తీశాయమని చెబుతుంది. నేను నీకు గొప్ప సంబంధం చూస్తాను.. నీ స్థాయికి తగ్గట్లు చూస్తాను, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చెబుతుంది నందూ.

ఏ హక్కుతో నన్ను దబాయిస్తున్నావు.. అక్కా అక్కా అంటే హక్కు వస్తుందా అని ఇందూ సీరియస్ అవుతుంది. సొంత చెల్లెల్ని కాబట్టే ఫీల్ అవుతున్నానని నందూ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. నేను నందూని అని చెప్పడంతో చెల్లెల్ని ఇందూ హత్తుకుంటుంది. ఇన్నిరోజులు ఎక్కడికి వెళ్లావు? నీకు ఈ అక్క గుర్తుకురాలేదా? అని అడుగుతుంది ఇందూ. ప్రతిక్షణం, ప్రతిరోజూ నిన్ను తలచుకుంటూనే ఉంటానని చెబుతుంది నందూ. ప్రతిరోజూ ఆ దేవుడిని మొక్కుకున్నా, నీ కోసమే వెతికానని చెబుతుంది ఇందూ. నీ అక్కని అని తెలిసి కూడా నా దగ్గర నిజం దాచావా అని ప్రశ్నిస్తుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X